
సాక్షి, విశాఖపట్నం: రాష్ట్రంలో రైతాంగాన్ని సీఎం చంద్రబాబు ప్రభుత్వం గాలికి వదిలేసిందని ధ్వజమెత్తారు మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు. రైతులకు గిట్టుబాటు ధర ఎలా కల్పించాలి అనే దాన్ని మర్చిపోయారని మండిపడ్డారు. రైతులకు ఇస్తామన్న రూ. 20 వేలు ఇవ్వలేదని విమర్శలు గుప్పించారు. ఈ మేరకు విశాఖపట్నంలో మంగళవారం కారుమూరి మాట్లాడుతూ.. కూటమి పాలనలో దళారి వ్యవస్థ పెరిగిపోయిదని దుయ్యబట్టారు. కూటమి సర్కార్‌లో దళారి రొక్కం, రైతుకు దుఃఖం మిగిలిందని అన్నారు.
చంద్రబాబు పాలనలో రైలతులు బస్తాకు మూడు నుంచి నాలుగు వందలు నష్టపోతున్నారని విమర్శించారు. కూటమి ప్రభుత్వాన్ని నమ్మి రైతులు మోసపోయారని అన్నారు. తుఫాన్ వస్తుందని తెలిసి కూడా ప్రభుత్వం రైతులను అప్రమత్తం చేయలేదని మండిపడ్డారు. అదే గత వైఎస్ జగన్ పాలనలో నేరుగా రైతుల ఖాలలో డబ్బులు పడేవని గుర్తు చేశారు.

Comments
Please login to add a commentAdd a comment