మంత్రిగారూ.. ఇటో లుక్కేయరూ ! | water tank works were copleted but water not released | Sakshi
Sakshi News home page

మంత్రిగారూ.. ఇటో లుక్కేయరూ !

Published Sat, Dec 14 2013 3:55 AM | Last Updated on Sat, Sep 2 2017 1:34 AM

water tank works were copleted but water not released

(పెనుగొండ), న్యూస్‌లైన్ : పెనుగొండ మండలం వెంకట్రామపురం గ్రామస్తులకు మంచినీటిని సరఫరా చేసేందుకు రూ.23.20 లక్షలతో వాటర్ ట్యాంక్ నిర్మించారు. పనులు పూర్తరుు 4 నెలలు గడిచినా దానిని ప్రారంభించలేదు. దీంతో గ్రామస్తులు మంచినీటి కోసం చేతి పంపులపైనే ఆధారపడుతున్నారు. గ్రామంలో రక్షిత మంచి నీటి  సరఫరా పథకం లేకపోవడంతో ఆరేళ్ల క్రితం ఈ విషయూన్ని అప్పటి పెనుగొండ ఎమ్మెల్యే, ప్రస్తుత మంత్రి  పితాని సత్యనారాయణ దృష్టికి గ్రామస్తులు తీసుకెళ్లారు.

స్పందించిన ఆయన రూ.15 లక్షలను మంజూరు చేరుుంచారు. 2008 నవంబరు 20న అప్పటి జెడ్పీ చైర్మన్, ప్రస్తుత తణుకు ఎమ్మెల్యే కారుమూరి నాగేశ్వరరావు దీని నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. 2012లో ఓహెచ్‌ఎస్‌ఆర్ పనులు పూర్తయ్యా యి. పైపులైన్ విస్తరణ పనులు చేపట్టకపోవడం, మోటార్, విద్యుత్ సౌకర్యం లేకపోవడంతో ఓహెచ్‌ఎస్‌ఆర్ అలంకారం ప్రాయంగా మిగిలిపోరుుంది. ఎట్టకేలకు 2013 మార్చిలో పైపులైన్ విస్తరణ, ఇతర పనుల కోసం రూ.8.20 లక్షలను మంత్రి మంజూరు చేయిం చారు. మొత్తానికి నాలుగు నెల క్రితం పనులన్నీ పూర్తయ్యూరుు. దీనిని ప్రారంభించే తీరిక ప్రజాప్రతినిధులకు లేకపోవడంతో ఈ పథకం నేటికీ ప్రజలకు అక్కరకు రావడం లేదు. దీనిని మంత్రి పితాని సత్యనారాయణ చేతుల మీదుగా ప్రారంభించాలనే ఉద్దేశంతో అధికారులు జాప్యం చేస్తున్నారని గ్రామస్తులు చెబుతున్నారు. మంత్రి పితాని, అధికారులు స్పందించి తక్షణం వాటర్ ట్యాంక్ ప్రారంభోత్సవం జరిపించాలని, తమకు రక్షిత మంచినీటిని అందించే ఏర్పాటు చేయూలని గ్రామస్తులు కోరుతున్నారు.
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement