pitani satya narayana
-
‘పితాని’పై తమ్ముళ్ల ఆగ్రహం
-
మంత్రి ‘పితాని’పై తమ్ముళ్ల ఆగ్రహం
సాక్షి ప్రతినిధి, ఏలూరు/చింతలపూడి : పశ్చిమ గోదావరి జిల్లా చింతలపూడి నియోజకవర్గ టీడీపీలో కొద్ది నెలలుగా రగులుతున్న అసమ్మతి భగ్గుమంది. ఏలూరు జెడ్పీ గెస్ట్‌హౌస్ వేదికగా ఎంపీ మాగంటి బాబు వర్గీయులు మంత్రులను నిలదీశారు. దీంతో సహనం కోల్పోయిన మంత్రి పితాని సత్యనారాయణ.. ‘మీకు చేతనైంది చేసుకోండి’ అని చెప్పడంతో వారిలో ఆగ్రహం రెట్టింపైంది. వివరాల్లోకి వెళ్తే.. చింతలపూడి ఏఎంసీ ఛైర్మన్ వ్యవహారంలో మాజీమంత్రి పీతల సుజాత వర్గానికి, ఎంపీ మాగంటి బాబు వర్గానికి గత మూడేళ్లుగా వివాదం నడుస్తోంది. శుక్రవారం చింతలపూడిలో సమన్వయ కమిటీ సమావేశం జరగనున్న నేపథ్యంలో ఇరువర్గాలతో మాట్లాడి సమస్య పరిష్కరించాలని నిర్ణయించారు. ఇన్చార్జి మంత్రి పత్తిపాటి పుల్లారావు ఈ బాధ్యతను జిల్లా మంత్రి పితాని సత్యనారాయణకు అప్పగించారు. బాబు వర్గీయులు సమస్యను ఇప్పటికిప్పుడు పరిష్కరించకపోతే రాజీనామాలు చేస్తామని హెచ్చరించడంతో పితాని ‘మీ ఇష్టమైంది చేసుకోండి’ అంటూ అసహనం వ్యక్తంచేశారు. దీంతో తెలుగు తమ్ముళ్లు మీరు నిన్నకాక మొన్న పార్టీలోకి వచ్చి మమ్మల్ని రాజీనామా చేసుకోమంటారా అంటూ మంత్రిపై విరుచుకుపడ్డారు. పేకాడుతున్నా మావాళ్లను అరెస్టు చెయ్యొద్దు ఈ సమావేశంలో ఏలూరు ఎంపీ మాగంటి బాబు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఆయన మాట్లాడుతూ, తమ పార్టీ కార్యకర్తలు పేకాట ఆడుతున్నా అడ్డుకోవద్దని పోలీసులకు సూచించారు. ఒకవేళ మీరు కార్యకర్తలను అరెస్టుచేస్తే మళ్లీ మేమే స్టేషన్‌కు రావాల్సి ఉంటుంది.. గుర్తుంచుకోండని చెప్పడంతో మంత్రులు, పోలీసులు అవాక్కయ్యారు. అనంతరం రాజ్యసభ సభ్యురాలు, పార్టీ జిల్లా అధ్యక్షురాలు తోట సీతారామలక్ష్మి మాగంటి బాబు వ్యాఖ్యలను పట్టించుకోవద్దని కార్యకర్తలకు సూచించారు. -
మా అండతో గెలిచి మమ్మల్నే విస్మరిస్తారా?
ఆచంట : టీడీపీ మద్దతుతో గెలుపొంది ఎంపీ, మంత్రి పదవులు పొందిన గోకరాజు గంగరాజు, పైడికొండల మాణిక్యాలరావులు స్థానిక ఎమ్మెల్యే పితాని సత్యనారాయణకు తెలియకుండా నియోజకవర్గంలో పర్యటించడం తగదని పలువురు టీడీపీ నేతలు, ప్రజాప్రతినిధులు ధ్వజమెత్తారు. ఈ మేరకు సోమవారం స్థానిక రామేశ్వరస్వామి వారి సత్రంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. పుష్కరాల ఏర్పాట్లకు సంబంధించి మంత్రి, ఎంపీ పర్యటన విషయం నియోజకవర్గంలోని గ్రామ సర్పంచ్‌లు, ఎంపీపీలు, జెడ్పీటీసీలకు సమాచారం ఇవ్వలేదని నిరసన వ్యక్తం చేశారు. ఇటువంటి చర్యలు మరోసారి పునరావృతమైతే సహించేదిలేదని హెచ్చరించారు. ఎమ్మెల్యే పితాని సత్యనారాయణపై కొందరు దుష్ర్పచారం చేస్తున్నారని, ఇటువంటి చర్యలను ప్రజలు సహించరన్నారు. సమావేశంలో ఆచంట, పోడూ రు జెడ్పీటీసీలు బండి రామారావు, బొక్కా నాగేశ్వరరావు, ఆచంట మండల పార్టీ అధ్యక్షుడు మేకా జానకిరామయ్య, డీసీఎంఎస్ ఉపాధ్యక్షుడు కండిబోయిన సత్యనారాయణ పాల్గొన్నారు. -
కిరణ్‌కు ‘పితాని’ షాక్
సాక్షి, ఏలూరు,/పోడూరు, న్యూస్‌లైన్ : రాజకీయాల్లో శాశ్వత మిత్రులు, శాశ్వత శత్రువులు ఉండరనే నానుడికి అనేక నిదర్శనాలు కనిపిస్తుంటాయి. ప్రస్తుత ఎన్నికల సీజన్లో ఊహకందని మలుపులు, క్షణానికోలా మారుతున్న సమీకరణలు పార్టీల అధ్యక్షులకు దడ పుట్టిస్తున్నాయి. తాజాగా జై సమైక్యాంధ్ర పార్టీ రాష్ర్ట్ర ఉపాధ్యక్షుడు, మాజీ మంత్రి పితాని సత్యనారాయణ ఆ పార్టీ అధ్యక్షుడు నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డికి షాక్ ఇవ్వటానికి సిద్ధమవుతున్నారు. కిరణ్ జిల్లాలో రోడ్‌షో నిర్వహించటానికి ఆదివారం వస్తుండగా, నిన్నటి వరకూ ఆయనకు నీడలా ఉన్న పితాని పంధా మార్చుకుంటున్నారనే వార్తలు చర్చనీయాంశమయ్యాయి. జై సమైక్యాంధ్ర పార్టీ స్థాపన నుంచి రాజమండ్రి సభ వరకు పితాని కిరణ్ వెంటే ఉన్నారు. ఆ పార్టీ విధివిధానాలు రూపొందించడంలో కీలక పాత్ర పోషిస్తున్నారని వినిపించింది. ఇంతలోనే ఆయన టర్న్ తీసుకుంటున్నారని తెలుస్తోంది. పెనుగొండ నియోజకవర్గం నుంచి రెండుసార్లు పోటీ చేసి ఓడిపోయిన పితాని వైఎస్ ప్రభంజనంలో 2004 ఎన్నికల్లో మొదటి సారి అసెంబ్లీ మెట్టు ఎక్కారు. 2009లో ఆచంట నియోజకవర్గం నుంచి గెలుపొందారు. రాష్ట్ర విభజన జరిగిన తర్వాత తాయితీగా కిరణ్‌తోపాటు కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చారు. జై సమైక్యాంధ్ర పార్టీలో భాగమయ్యారు. ఆ పార్టీని జిల్లా ప్రజలు కనీసం పరిగణనలోకి తీసుకునే పరిస్థితి లేదని గ్రహించిన ఆయన, ఆ పార్టీలో ఉంటే తనకు రాజకీయ భవిష్యత్ ఉండదని గ్రహించి జారుకోవటానికి మార్గం వేసుకుంటున్నారని విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ నేపధ్యంలో టీడీపీ నేత యర్రా నారాయణస్వామిని పితాని అనుచరులు కలిసి, ఆ పార్టీలోకి పితాని రాకను వ్యతిరేకించే వారికి సర్దిచెప్పాల్సిందిగా కోరినట్టు సమాచారం. ఆచంట నియోజకవర్గం టీడీపీ ఇన్చార్జ్ గుబ్బల తమ్మయ్య, పితాని స్వయానా బావా బావమరుదులు. పితాని కావాలనే ముందు జాగ్రత్త చర్యగా తమ్మయ్యను ఆచంట పంపించారనే వాదనలు వినిపిస్తున్నాయి. ఆచంట అసెంబ్లీ లేదా నరసాపురం లోక్‌సభ స్థానాల్లో ఏదో ఓ చోట నుంచి పోటీ చేయాలనే ఆలోచనలో పితాని ఉన్నట్లు తెలుస్తోంది. ఈ పరిణామాలకు బలం చేకూర్చే దిశగా శనివారం కొమ్ము చిక్కాలలో పితాని ఇంటి ముందు ఆయన అనుచరులు బైఠాయించి పార్టీ మారాలంటూ ఒత్తిడి చేశారు. జై సమైక్యాంధ్ర ఉపాధ్యక్షుడిగా ఉన్న ఆయన కార్యకర్తల ఎదుట పార్టీ మారనని చెప్పలేకపోయారు. రెండు రోజుల్లో నిర్ణయం చెబుతానని ప్రకటించారు. ఆయన ఏ పార్టీలో చేరతారనే దానిపై రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి. వాటన్నిటికీ రెండ్రోజుల్లో ఆయన తెరదించే అవకాశం ఉంది. పార్టీ స్థాపించిన కొద్ది రోజులకే ఆ పార్టీ ఉపాధ్యక్షుడు బయటకు వెళ్లిపోతే పార్టీ వ్యవస్థాపకుడైన కిరణ్ కుమార్ రెడ్డి పెద్ద షాకే. -
రాజీనామాపై కిరణ్ ఇంకా తర్జనభర్జన
* నేడు సీఎం నిర్ణయం * ఏకాంతంగా టీవీ చూస్తూ రోజంతా ఇంట్లోనే కిరణ్ * సీఎంగా ‘సుప్రీం’ను ఆశ్రయించాలని యోచన సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ బిల్లు లోక్‌సభలో ఆమోదం పొందిన తరువాత కూడా సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి తన పదవికి రాజీనామాపై తర్జనభర్జన పడుతూనే ఉన్నారు. మంగళవారం మధ్యాహ్నం మూడు గంటలకు రాజీనామా చేయవచ్చని సోమవారం నుంచే లీకులు ఇప్పించినా.. మళ్లీ బుధవారానికి వాయిదా వేశారు. బుధవారం ఉదయం సీఎం కిరణ్ రాష్ట్ర గవర్నర్‌ను కలిసి తన రాజీనామా లే ఖను అందిస్తారని సీఎం సన్నిహిత మంత్రి పితాని సత్యనారాయణ మీడియాకు తెలిపారు. మంగళవారం నాడంతా సీఎం కిరణ్ తన నివాసానికే పరిమితమయ్యారు. క్యాంపు కార్యాలయానికి ముఖం కూడా చూపించలేదు. తెలంగాణ బిల్లుపై పార్లమెంటులో నెలకొన్న పరిణామాలపై ఆయన రోజంతా టీవీ చూస్తూ గడిపారు. పార్లమెంటులో తెలంగాణ బిల్లుపై చర్చ, బిల్లు ఆమోదం పొందిన తీరుపై వచ్చిన కథనాలను వీక్షించారు. మంత్రులు పితాని సత్యనారాయణ, పార్థసారథి, విప్‌లు జగ్గారెడ్డి, రెడ్డపరెడ్డి, మరో ఇద్దరు ఎమ్మెల్యేలు మాత్రమే సీఎం కిరణ్‌ను కలవటానికి వచ్చారు. క్యాంపు కార్యాలయానికి సీఎం వస్తారేమోనని వారు చాలాసేపు నిరీక్షించినా ఆయన రాకపోవటంతో చివరకు వారే వెనుకనున్న కిరణ్ నివాసానికి వెళ్లారు. సీఎం కిందకు వచ్చి పది నిమిషాల పాటు వారితో మాట్లాడారు. పార్లమెంటులో బిల్లుపై చర్చ, తదనంతర పరిణామాలు, తన రాజీనామా గురించి కిరణ్ వారితో చర్చించినట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. బిల్లు ఆగుతుందేమోనని ఎదురుచూశామని, ఇప్పుడు ఆమోదం పొందింది కనుక రాజీనామా చేయటమే మంచిదన్న అభిప్రాయం కొందరు వ్యక్తంచేసినట్లు తెలిసింది. సీఎంగా ఉండి న్యాయపోరాటం చేస్తా..! అయితే.. ఈ సందర్భంగా న్యాయపరమైన అంశాలను సీఎం ప్రస్తావనకు తీసుకువచ్చారు. బిల్లు తప్పుల తడకగా ఉందని, అసెంబ్లీ తిరస్కరించిన బిల్లును పార్లమెంటులో పెట్టటమే రాజ్యాంగ విరుద్ధం కనుక దానిపై న్యాయపోరాటం చేయాల్సిన అవసరముందని చెప్పారు. హైకోర్టు, సుప్రీంకోర్టుల్లో ఇప్పటివరకు రాష్ట్ర విభజనపై వేసిన కేసులను అపరిపక్వమని కొట్టివేశాయని.. పార్లమెంటులో బిల్లు పాసయ్యాక కోర్టులు దాన్ని విచారించే అవకాశమున్నందున ఇప్పుడు న్యాయపోరాటం చేయడానికి సరైన సమయమని సీఎం అభిప్రాయపడ్డారు. రాష్ట్ర విభజన బిల్లును పార్లమెంటు ఆమోదించటంపై సీఎంగా తానే సుప్రీంకోర్టును ఆశ్రయిస్తే ఎలా ఉంటుందంటూ మంతనాలు జరిపారు. సీఎంగా సుప్రీంకోర్టును ఆశ్రయించాలంటే రాజీనామా చేయకుండా పదవిలో కొనసాగితేనే అది సాధ్యమన్న అభిప్రాయానికి కిరణ్ వచ్చారు. రాజీనామా చేస్తే విభజన బిల్లును రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఎదుర్కొనేందుకు ఆస్కారం ఉండకపోవచ్చన్న భావనకు వచ్చారు. ఒకవేళ న్యాయపరమైన పోరాటానికి సీఎంగా ఆస్కారం ఉండదనుకుంటే ఇపుడే రాజీనామా చేయటం మంచిదని కొందరు మంత్రులు సీఎంకు సూచించారు. కేసు వేస్తే.. అది తేలాకే రాజీనామా! కానీ.. తనతో పాటు మూకుమ్మడిగా రాజీనామా చేసేందుకు మంత్రులు, ఎమ్మెల్యేలు ఎవరూ కనిపించకపోవటంతో సీఎం కిరణ్ రాజీనామాను బుధవారానికి వాయిదా వేశారు. మంత్రులు ఎమ్మెల్యేలతో మాట్లాడి బుధవారం నాటికి సాధ్యమైనంత ఎక్కువమందిని తనతోపాటు రాజీనామాకు వచ్చేలా చూడాలని తనను కలసిన మంత్రులకు బాధ్యతలు అప్పగించారు. బుధవారం మీడియా సమావేశం, ఆ తరువాత 11.50 నిమిషాలకు గవర్నర్‌ను కలసి రాజీనామా లేఖను అందించాలని నిర్ణయించారు. అనంతరం పితాని సత్యనారాయణ మీడియాతో మాట్లాడుతూ బుధవారం సీఎం తన రాజీనామా లేఖను గవర్నర్‌కు అందిస్తారని వివరించారు. ఇదిలావుంటే.. రాష్ట్ర విభజనపై సీఎం న్యాయపోరాటం చేయాలని నిర్ణయిస్తే కనుక బుధవారం రాజీనామా ఉండకపోవచ్చని, సుప్రీంకోర్టులో కేసు తేలాకనే ఆయన పద వి నుంచి వైదొలగవచ్చని కిరణ్ సన్నిహితవర్గాలు వివరించాయి. నేటితో సీఎం పేషీ ఖాళీ! ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి పేషీ బుధవారంతో ఖాళీ కానుంది. లోక్‌సభలో తెలంగాణ బిల్లు ఆమోదం పొందడంతో బుధవారం ఉదయం ఆయన తన పదవికి రాజీనామా చేయనున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పటి వరకు సీఎం ముఖ్య కార్యదర్శిగా ఉన్న అజయ్ కల్లంను ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శిగాను, సీఎం కార్యదర్శిగా ఉన్న శంషేర్‌సింగ్ రావత్‌ను జెన్కో ఎండీగాను బదిలీ చేస్తూ ప్రభుత్వప్రధాన కార్యదర్శి మహంతి మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. మరోపక్క, మంగళవారం కూడా సీఎం పలు ఫైళ్లపై సంతకాలు చేశారు. ‘4వ ఎమ్మెల్సీ’పై గవర్నర్‌కు వివరణ గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ నియామకాలకు సంబంధించి ముఖ్యమంత్రి కిరణ్ మంగళవారం గవర్నర్‌కు వివరణ పంపిస్తూ నాలుగో అభ్యర్థి నియామకం పూర్తి చేయాలని కోరారు. ఎమ్మెల్సీలుగా కంతేటి సత్యనారాయణరాజు, నంది ఎల్లయ్య, రత్నాబాయి, రఘురామిరెడ్డిలను నియమించాలని విన్నవించారు. అయితే తొలి మూడు పేర్లను మాత్రమే గవర్నర్ ఆమోదించగా, కిరణ్‌కు సన్నిహితుడైన రఘురామిరెడ్డి నియామకాన్ని గవర్నర్ తిరస్కరించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో నాలుగో అభ్యర్థి పేరునూ ఖరారు చేయాలని సీఎం కోరారు. -
తెలంగాణ ప్రతినిధుల్లా ఢిల్లీ పెద్దలు: గంటా
హైదరాబాద్: ఢిల్లీ పెద్దలు తెలంగాణ ప్రతినిధుల్లా వ్యవహరిస్తున్నారని రాష్ట్ర మంత్రి గంటా శ్రీనివాసరావు విమర్శించారు. సమైక్య రాష్ట్రం కావాలంటే సస్పెండ్ చేస్తారా అని ఆయన ప్రశ్నించారు. తమ ప్రాంత ప్రజల మనోభావాలను తెలపడమే సీమాంధ్ర ఎంపీలు చేసిన తప్పా అని అడిగారు. తెలంగాణ ఎంపీలు గతంలో పలుమార్లు పార్లమెంట్ సమావేశాలను అడ్డుకున్నారని, వారిని ఎందుకు సస్పెండ్ చేయలేదని ప్రశ్నించారు. సీమాంధ్ర ఎంపీలను సస్పెండ్ చేస్తూ కాంగ్రెస్ తీసుకున్న ఏకపక్ష నిర్ణయాన్ని తాము వ్యతిరేకిస్తున్నామని మంత్రి ఎస్. శైలజానాథ్ అనంతపురంలో అన్నారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలనుకోవడమే వారు చేసిన తప్పా అని ప్రశ్నించారు. సీమాంధ్ర ఎంపీల బహిష్కరణ బాధాకరమని మరో మంత్రి పితాని సత్యనారాయణ అన్నారు. పార్లమెంట్ విభజన బిల్లు పెడితే సీఎం కిరణ్ రాజీనామా చేస్తారని చెప్పారు. -
మంత్రిగారూ.. ఇటో లుక్కేయరూ !
(పెనుగొండ), న్యూస్‌లైన్ : పెనుగొండ మండలం వెంకట్రామపురం గ్రామస్తులకు మంచినీటిని సరఫరా చేసేందుకు రూ.23.20 లక్షలతో వాటర్ ట్యాంక్ నిర్మించారు. పనులు పూర్తరుు 4 నెలలు గడిచినా దానిని ప్రారంభించలేదు. దీంతో గ్రామస్తులు మంచినీటి కోసం చేతి పంపులపైనే ఆధారపడుతున్నారు. గ్రామంలో రక్షిత మంచి నీటి సరఫరా పథకం లేకపోవడంతో ఆరేళ్ల క్రితం ఈ విషయూన్ని అప్పటి పెనుగొండ ఎమ్మెల్యే, ప్రస్తుత మంత్రి పితాని సత్యనారాయణ దృష్టికి గ్రామస్తులు తీసుకెళ్లారు. స్పందించిన ఆయన రూ.15 లక్షలను మంజూరు చేరుుంచారు. 2008 నవంబరు 20న అప్పటి జెడ్పీ చైర్మన్, ప్రస్తుత తణుకు ఎమ్మెల్యే కారుమూరి నాగేశ్వరరావు దీని నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. 2012లో ఓహెచ్ఎస్ఆర్ పనులు పూర్తయ్యా యి. పైపులైన్ విస్తరణ పనులు చేపట్టకపోవడం, మోటార్, విద్యుత్ సౌకర్యం లేకపోవడంతో ఓహెచ్ఎస్ఆర్ అలంకారం ప్రాయంగా మిగిలిపోరుుంది. ఎట్టకేలకు 2013 మార్చిలో పైపులైన్ విస్తరణ, ఇతర పనుల కోసం రూ.8.20 లక్షలను మంత్రి మంజూరు చేయిం చారు. మొత్తానికి నాలుగు నెల క్రితం పనులన్నీ పూర్తయ్యూరుు. దీనిని ప్రారంభించే తీరిక ప్రజాప్రతినిధులకు లేకపోవడంతో ఈ పథకం నేటికీ ప్రజలకు అక్కరకు రావడం లేదు. దీనిని మంత్రి పితాని సత్యనారాయణ చేతుల మీదుగా ప్రారంభించాలనే ఉద్దేశంతో అధికారులు జాప్యం చేస్తున్నారని గ్రామస్తులు చెబుతున్నారు. మంత్రి పితాని, అధికారులు స్పందించి తక్షణం వాటర్ ట్యాంక్ ప్రారంభోత్సవం జరిపించాలని, తమకు రక్షిత మంచినీటిని అందించే ఏర్పాటు చేయూలని గ్రామస్తులు కోరుతున్నారు.