చంద్రబాబు అరెస్ట్‌ అక్రమం కాదు.. అనివార్యం: మంత్రి అంబటి | YSRCP MLAs And MP's Leaders' Comments On Chandrababu Naidu Arrest Over AP Skill Development Corruption Case - Sakshi
Sakshi News home page

చంద్రబాబు అరెస్ట్‌ అక్రమం కాదు.. అనివార్యం: మంత్రి అంబటి

Published Sat, Sep 9 2023 12:34 PM | Last Updated on Sat, Sep 9 2023 1:48 PM

YSRCP MLAs MPS Leaders Comment On Chandrbabau Arrest - Sakshi

సాక్షి, అమరావతి: చంద్రబాబుది అక్రమ అరెస్టు‌కాదని, అనివార్యమైన అరెస్టు మంత్రి అంబటి రాంబాబు తెలిపారు. అరెస్టు చేయటం వలన సింపతి వస్తుందని టీడీపీ, ఎల్లోమీడియా చూసిందని, దీన్ని కక్షసాధింపుగా ప్రజలు చూస్తారని భావించారు కానీ అవేవీ జరగలేదని అన్నారు. భారీగా అక్రమాలు చేసినా చంద్రబాబును అరెస్టు చేయకపోతే రాజ్యాంగానికి విలువ ఏముంటుందని పేర్కొన్నారు. సీఐడీవారికి ఫ్రీ హ్యాండ్ ఇవ్వటం వలన కేసుకు అనుగుణంగా వారు వ్యవహరించారని చెప్పారు,.

అధికారంలో ఉన్నప్పుడు అడ్డగోలుగా చేసినందునే చంద్రబాబు అరెస్టు అయ్యారని మంత్రి అంబటి అన్నారు. స్కిల్ కేసులో ఇప్పుడు అరెస్టు అయ్యారని.. ఇంకా రింగు రోడ్డు, ఫైబర్ నెట్ కేసుల్లోనూ విచారణ జరుగుతుందని తెలిపారు. చంద్రబాబు అరెస్టుకు ముందు చాలా లోతైన విచారణ జరిగిందన్నారు. షెల్ కంపెనీలకు డబ్బు తరలించి, తర్వాత తన ఖాతాలోకి వేసుకున్నట్టు తేలిందని పేర్కొన​ఆనరు. సీమెన్స్ కంపెనీతో సంబంధం లేకుండానే వ్యవహారం నడిపారన్నారు. ఆ కంపెనీ కూడా ఈ విషయం చెప్పిందని, రూ.330 కోట్ల ప్రజాధనాన్ని దోచుకొని లూటీ చేశారని విమర్శించారు. 

చట్టానికి వ్యతిరేకంగా ఎవరూ ఏమీ చేయలేరు
మంత్రి అంబటి మాట్లాడుతూ.. అన్యాయంగా అరెస్టు చేయాల్సిన అవసరం ప్రభుత్వానికి ఏంటి? ఎన్నికలకు ముందు అరెస్టు చేస్తే చంద్రబాబుకు సింపతీ పెరుగుతుందని మాకు తెలీదా? కానీ వ్యవస్థలు సక్రమంగా పని తమపని తాము చేసుకునేలా మేము ఫ్రీహ్యాండ్ ఇచ్చాం. చట్టానికి వ్యతిరేకంగా ఎవరూ ఏమీ చేయలేరు. సీమెన్స్ కంపెనీ ఒక్క పైసా కూడా పెట్టుబడి పెట్టలేదు. రూ.330 కోట్లు ఇవ్వటానికి వీల్లేదని సీఎస్ కృష్ణారావుతో సహా ఫైనాన్స్ అధికారులు నోట్ ఫైల్ రాశారు. కానీ చంద్రబాబు ఒత్తిడి చేసి నిధులు విడుదల చేయించారు. అంతదారుణంగా అక్రమాలు చేస్తే అరెస్టు చేయకూడదా?.

చట్టబద్దంగానే సీఐడీ అరెస్టు చేసింది. చంద్రబాబు పిఎస్ పెండ్యాల శ్రీనివాస్, మనోజ్ వాసుదేవ్ పరారయ్యారు. చంద్రబాబు సహకారంతోనే వారిద్దరూ పరారయ్యారు. ఫైబర్ నెట్, రింగ్ రోడ్ విచారణ కూడా జరుగుతుంది. ఎంతటి వారైనా తప్పు చేస్తే చట్టం, న్యాయం సహించదు. రోడ్డుమీదకు వచ్చి గొడవలు చేస్తే సహించేదిలేదు. ప్రజలకు ఇబ్బందులు కల్హిస్తే అణచివేస్తాం. ప్రజల నుండి దూరం చేయలేరంటూ పొలిటికల్ డైలాగులు కుదరవు. కోర్టులో వాస్తవాలు చెప్పుకుంటే మంచిది. ప్రభుత్వ సొమ్ము కాజేసిన సంగతిని పవన్ కల్యాణ్‌ తెలుసుకుని మాట్లాడాలి. వాసస్తవాలు తెలియాలంటే ఆ వివరాలు మేము పవన్‌కు పంఇస్తాం. 

పవన్ వత్తాసు పలకటం ఏంటి
షూటింగ్ వదిలి బయటకు రాలేని పవన్, ప్రజలను రోడ్డు మీదకు రమ్మనటం ఏంటి?. గావుకేకలు షూటింగ్‌లో పెట్టటం కాదు, బయటకు వచ్చి మాట్లాడాలి. ఒక దోపిడీ దారునికి పవన్ కల్యాణ్‌ వత్తాసు పలకటం ఏంటి?. చంద్రబాబు, పవన్.. ఇద్దరూ ఎవరికి ఆపద వచ్చినా పూలబొకేలు ఇచ్చుకుంటుంటారు. ఇప్పుడు చంద్రబాబు వద్దకు వచ్చి ఒక పూలబొకేని పవన్ ఇస్తే మంచిది. 

చంద్రబాబు, పవన్ అవినీతి గోదావరిలో దిగాలనుకుంటే మాకేమీ అభ్యంతరం లేదు. బీజేపీ అధ్యక్షురాలు కూడా మా బావ అవినీతి చేయలేదని చెప్పటం లేదు. అరెస్టు ప్రొసీజర్ గురించే ఆమె మాట్లాడుతున్నారు. అంతేకానీ మా బావ నీతిమంతుడని చెప్పలేదంటేనే అర్థం చేసుకోవచ్చు. లోకేష్ పాత్ర కూడా ఉందని తేలితే ఆయన్ని కూడా అరెస్టు చేస్తారు. 
చదవండి: చంద్రబాబు పాపం పండింది: మంత్రి అమర్నాథ్‌

తప్పు చేశానని చంద్రబాబుకు తెలుసు
రాజకీయ కక్షతో బాబును అరెస్ట్‌ చేయించాల్సిన అవసరం మాకు లేదని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్‌ తెలిపారు. రాజకీయమే చేయాలంటే 4 ఏళ్లుగా బాబు, లోకేష్‌ బయట తిరేవారు కాదని అన్నారు. రాష్ట్ర ఖజానాను దోచుకున్న బాబుకు కచ్చితంగా శిక్ష పడాల్సిందేనని వ్యాఖ్యనించారు. తప్పు చేశానని చంద్రబాబుకు తెలుసని పేర్కొన్నారు.

బాబు స్కిల్‌ డెవలప్‌మెంట్‌ స్కాంపై 2018లో జీఎస్టీ కేసు పెట్టిందని డొల్ల కంపెనీల ద్వారా లావాదేవీలు జరిగాయని తేలిందన్నారు. చంద్రబాబు ఒత్తిడి మేరకు చేశామని సెక్రటరీనే ఒప్పుకున్నాడని పేర్కొన్నారు. ఇప్పుడు MOU అని సిమెన్స్‌ కంపెనీ కోర్టులో వాంగ్మూలం ఇచ్చిందని గుర్తు చేశారు. యువతను చంద్రబాబు మోసం చేశాడని విమర్శించారు. యువతకు స్కిల్స్‌ నేర్చించలేదు కానీ.. తన స్కిల్స్‌తో వ్యవస్థను మేనేజ్‌ చేశాడని దుయ్యబట్టారు. స్కిల్‌ డెవెలప్‌మెంట్‌ స్కామ్‌ శాంపిల్‌ మాత్రమే.. ఇలాంటి స్కామ్‌లు చాలా చేశాడని అన్నారు.

అన్నీ కేసుల్లో స్టేలపైనే
ఎవరి పాపాలు పండుతాయో ఎవరికి శిక్ష వెయ్యాలో ఆ దేవుడికి బాగా తెలుసు.  దివంగత ఎన్టార్‌ ఆత్మ క్షోభ , బాధ కూడా గతంలో వినిపించారు.. అది ఇప్పటికి పాపం పండింది. చంద్రబాబు చేసిన అక్రమాలు ఒక్కటి కాదు. ఏలేటి స్కామ్, లిక్కర్ స్కామ్‌లో అన్ని కేసులలో స్టేలపైనే జీవిస్తున్నాడు. పాపలన్నీ బద్దలైనాయిఅన్నింటికి శిక్ష తప్పదు.
-మంత్రి కారుమూరి నాగేశ్వరరావు

చట్టానికి ఎవరూ అతీతులు కాదు
మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు అరెస్టు సక్రమమే. చట్టానికి ఎవరు అతీతులు కాదు.. గతంలోనూ ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తుల అరెస్టులు జరిగాయి. స్కిల్ డెవలప్మెంట్ స్కీమ్‌లో వేల కోట్ల అక్రమాలకు చంద్రబాబు పాత్ర ఉంది కనుకనే అరెస్ట్ చేశారు.
- నెల్లూరు పార్లమెంట్ సభ్యులు ఆదాల ప్రభాకర్ రెడ్డి

చంద్రబాబు అరెస్టుకు రాజకీయ సంబంధం లేదు
చంద్రబాబు అరెస్టును స్వాగతిస్తున్నాం. ఆయన అరెస్టుకు రాజకీయానికి సంబంధం లేదు.  స్కిల్ డెవలప్ మెంట్‌లో ఏం జరిగింది అనేది అసెంబ్లీ సాక్షిగా పూర్తిగా చర్చించాం. అసలు సంబంధంలేని సీమెన్ కంపెనీ పేరుతో చంద్రబాబు అవినీతికి పాల్పడ్డాడు. సీమెన్ కంపెనీలో పనిచేసే ఒక వ్యక్తితో మాట్లాడి ఈ విధంగా అవినీతికి పాల్పడిన సంగతి అందరికీ తెలిసిందే. ఆ కంపెనీ కూడా ఎంక్వయిరీ చేసి దీనికి మాకు సంబంధం లేదని తేల్చేసింది.

పూర్తిస్థాయిలో చర్చించి రూ. 370 కోట్లు ఏ విధంగా అవినీతి జరిగింది అని ప్రభుత్వ సంస్థలు పూర్తి స్థాయిలో దర్యాప్తు చేసిన తర్వాతే చంద్రబాబును అరెస్టు చేశారు. దీనిలో ఏ విధమైన రాజకీయ కోణం గానీ కక్ష సాధింపులు గాని లేవు. దొరికిపోయాడు కాబట్టే నన్ను ఏ క్షణమైనా అరెస్టు చేస్తారంటూ మూడు రోజుల నుంచి చంద్రబాబు చెబుతున్నాడు.
-నందిగామ ఎమ్మెల్యే,మొండితోక జగన్ మోహన్ రావు

చంద్రబాబు అరెస్టు సమంజసమే
మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు అవినీతిలో కూరుకు పోయారు. సీఐడీ పూర్తిస్థాయిలో విచారణ జరిపింది. 2018లో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే స్కిల్ డెవలప్‌మెంట్‌ కేసులో నిధులు దారిమళ్లాయి. హవాలా రూపంలో చంద్రబాబు స్కాంకు పాల్పడ్డాడు. చంద్రబాబు అరెస్టు సమంజసమే. అవినీతికి పాల్పడిన వ్యక్తిని అరెస్టు చేస్తే రాజకీయం చేయడం తగదు.
-అనకాపల్లి జిల్లా ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ 

చంద్రబాబు నాయుడు అవినీతి సామ్రాట్
చంద్రబాబు నాయుడు అవినీతి సామ్రాట్. స్కిల్ డెవలప్మెంట్ స్కాం సూత్రధారి చంద్రబాబే. 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు నాయుడు అనేక కుంభకోణాల్లో భాగస్వామి. చంద్రబాబు వేల కోట్ల అక్రమాల్లో స్కిల్ డెవలప్మెంట్ స్కాం చాలా చిన్నది. చంద్రబాబు పాపం పండింది.. చంద్రబాబు ను జైలుకు పంపాలి.
-రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి

పూర్తి ఆధారాలతో అరెస్ట్‌
 చంద్రబాబు నాయుడు అరెస్టుపై తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు. పూర్తి ఆధారాలతోనే ఆయన్ను అరెస్ట్ చేశారు. కక్ష సాధింపు చర్యలు తీసుకోవాలనుకుంటే 2021లోనే అరెస్టు చేయొచ్చు. స్కిల్ డెవలప్మెంట్ పేరిట ప్రజల సొమ్ము రూ. 360 కోట్లు దోచేసశాడు. జీఎస్టీ,ఇంటెలిజెన్స్, ఐటీ, ఈడీ, సెబ్ ఇలా అన్ని కూడా మూడు సంవత్సరాల నుంచి దర్యాప్తు చేస్తూ పూర్తి ఆధారాలతో అరెస్టు చేశారు.
- ఎమ్మెల్యే తలారి వెంకట్రావు

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement