thopudurthy prakash reddy
-
సీఎం జగన్ సిద్ధం సభకు లక్షల సంఖ్యలో కార్యకర్తలు
-
సామాజిక సాధికార యాత్రకు పోటెత్తిన జనం
-
చంద్రబాబు అరెస్ట్ అక్రమం కాదు.. అనివార్యం: మంత్రి అంబటి
సాక్షి, అమరావతి: చంద్రబాబుది అక్రమ అరెస్టుకాదని, అనివార్యమైన అరెస్టు మంత్రి అంబటి రాంబాబు తెలిపారు. అరెస్టు చేయటం వలన సింపతి వస్తుందని టీడీపీ, ఎల్లోమీడియా చూసిందని, దీన్ని కక్షసాధింపుగా ప్రజలు చూస్తారని భావించారు కానీ అవేవీ జరగలేదని అన్నారు. భారీగా అక్రమాలు చేసినా చంద్రబాబును అరెస్టు చేయకపోతే రాజ్యాంగానికి విలువ ఏముంటుందని పేర్కొన్నారు. సీఐడీవారికి ఫ్రీ హ్యాండ్ ఇవ్వటం వలన కేసుకు అనుగుణంగా వారు వ్యవహరించారని చెప్పారు,. అధికారంలో ఉన్నప్పుడు అడ్డగోలుగా చేసినందునే చంద్రబాబు అరెస్టు అయ్యారని మంత్రి అంబటి అన్నారు. స్కిల్ కేసులో ఇప్పుడు అరెస్టు అయ్యారని.. ఇంకా రింగు రోడ్డు, ఫైబర్ నెట్ కేసుల్లోనూ విచారణ జరుగుతుందని తెలిపారు. చంద్రబాబు అరెస్టుకు ముందు చాలా లోతైన విచారణ జరిగిందన్నారు. షెల్ కంపెనీలకు డబ్బు తరలించి, తర్వాత తన ఖాతాలోకి వేసుకున్నట్టు తేలిందని పేర్కొనఆనరు. సీమెన్స్ కంపెనీతో సంబంధం లేకుండానే వ్యవహారం నడిపారన్నారు. ఆ కంపెనీ కూడా ఈ విషయం చెప్పిందని, రూ.330 కోట్ల ప్రజాధనాన్ని దోచుకొని లూటీ చేశారని విమర్శించారు. చట్టానికి వ్యతిరేకంగా ఎవరూ ఏమీ చేయలేరు మంత్రి అంబటి మాట్లాడుతూ.. అన్యాయంగా అరెస్టు చేయాల్సిన అవసరం ప్రభుత్వానికి ఏంటి? ఎన్నికలకు ముందు అరెస్టు చేస్తే చంద్రబాబుకు సింపతీ పెరుగుతుందని మాకు తెలీదా? కానీ వ్యవస్థలు సక్రమంగా పని తమపని తాము చేసుకునేలా మేము ఫ్రీహ్యాండ్ ఇచ్చాం. చట్టానికి వ్యతిరేకంగా ఎవరూ ఏమీ చేయలేరు. సీమెన్స్ కంపెనీ ఒక్క పైసా కూడా పెట్టుబడి పెట్టలేదు. రూ.330 కోట్లు ఇవ్వటానికి వీల్లేదని సీఎస్ కృష్ణారావుతో సహా ఫైనాన్స్ అధికారులు నోట్ ఫైల్ రాశారు. కానీ చంద్రబాబు ఒత్తిడి చేసి నిధులు విడుదల చేయించారు. అంతదారుణంగా అక్రమాలు చేస్తే అరెస్టు చేయకూడదా?. చట్టబద్దంగానే సీఐడీ అరెస్టు చేసింది. చంద్రబాబు పిఎస్ పెండ్యాల శ్రీనివాస్, మనోజ్ వాసుదేవ్ పరారయ్యారు. చంద్రబాబు సహకారంతోనే వారిద్దరూ పరారయ్యారు. ఫైబర్ నెట్, రింగ్ రోడ్ విచారణ కూడా జరుగుతుంది. ఎంతటి వారైనా తప్పు చేస్తే చట్టం, న్యాయం సహించదు. రోడ్డుమీదకు వచ్చి గొడవలు చేస్తే సహించేదిలేదు. ప్రజలకు ఇబ్బందులు కల్హిస్తే అణచివేస్తాం. ప్రజల నుండి దూరం చేయలేరంటూ పొలిటికల్ డైలాగులు కుదరవు. కోర్టులో వాస్తవాలు చెప్పుకుంటే మంచిది. ప్రభుత్వ సొమ్ము కాజేసిన సంగతిని పవన్ కల్యాణ్ తెలుసుకుని మాట్లాడాలి. వాసస్తవాలు తెలియాలంటే ఆ వివరాలు మేము పవన్‌కు పంఇస్తాం. పవన్ వత్తాసు పలకటం ఏంటి షూటింగ్ వదిలి బయటకు రాలేని పవన్, ప్రజలను రోడ్డు మీదకు రమ్మనటం ఏంటి?. గావుకేకలు షూటింగ్లో పెట్టటం కాదు, బయటకు వచ్చి మాట్లాడాలి. ఒక దోపిడీ దారునికి పవన్ కల్యాణ్ వత్తాసు పలకటం ఏంటి?. చంద్రబాబు, పవన్.. ఇద్దరూ ఎవరికి ఆపద వచ్చినా పూలబొకేలు ఇచ్చుకుంటుంటారు. ఇప్పుడు చంద్రబాబు వద్దకు వచ్చి ఒక పూలబొకేని పవన్ ఇస్తే మంచిది. చంద్రబాబు, పవన్ అవినీతి గోదావరిలో దిగాలనుకుంటే మాకేమీ అభ్యంతరం లేదు. బీజేపీ అధ్యక్షురాలు కూడా మా బావ అవినీతి చేయలేదని చెప్పటం లేదు. అరెస్టు ప్రొసీజర్ గురించే ఆమె మాట్లాడుతున్నారు. అంతేకానీ మా బావ నీతిమంతుడని చెప్పలేదంటేనే అర్థం చేసుకోవచ్చు. లోకేష్ పాత్ర కూడా ఉందని తేలితే ఆయన్ని కూడా అరెస్టు చేస్తారు. చదవండి: చంద్రబాబు పాపం పండింది: మంత్రి అమర్నాథ్ తప్పు చేశానని చంద్రబాబుకు తెలుసు రాజకీయ కక్షతో బాబును అరెస్ట్ చేయించాల్సిన అవసరం మాకు లేదని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్ తెలిపారు. రాజకీయమే చేయాలంటే 4 ఏళ్లుగా బాబు, లోకేష్ బయట తిరేవారు కాదని అన్నారు. రాష్ట్ర ఖజానాను దోచుకున్న బాబుకు కచ్చితంగా శిక్ష పడాల్సిందేనని వ్యాఖ్యనించారు. తప్పు చేశానని చంద్రబాబుకు తెలుసని పేర్కొన్నారు. బాబు స్కిల్ డెవలప్మెంట్ స్కాంపై 2018లో జీఎస్టీ కేసు పెట్టిందని డొల్ల కంపెనీల ద్వారా లావాదేవీలు జరిగాయని తేలిందన్నారు. చంద్రబాబు ఒత్తిడి మేరకు చేశామని సెక్రటరీనే ఒప్పుకున్నాడని పేర్కొన్నారు. ఇప్పుడు MOU అని సిమెన్స్ కంపెనీ కోర్టులో వాంగ్మూలం ఇచ్చిందని గుర్తు చేశారు. యువతను చంద్రబాబు మోసం చేశాడని విమర్శించారు. యువతకు స్కిల్స్ నేర్చించలేదు కానీ.. తన స్కిల్స్‌తో వ్యవస్థను మేనేజ్ చేశాడని దుయ్యబట్టారు. స్కిల్ డెవెలప్మెంట్ స్కామ్ శాంపిల్ మాత్రమే.. ఇలాంటి స్కామ్‌లు చాలా చేశాడని అన్నారు. అన్నీ కేసుల్లో స్టేలపైనే ఎవరి పాపాలు పండుతాయో ఎవరికి శిక్ష వెయ్యాలో ఆ దేవుడికి బాగా తెలుసు. దివంగత ఎన్టార్ ఆత్మ క్షోభ , బాధ కూడా గతంలో వినిపించారు.. అది ఇప్పటికి పాపం పండింది. చంద్రబాబు చేసిన అక్రమాలు ఒక్కటి కాదు. ఏలేటి స్కామ్, లిక్కర్ స్కామ్‌లో అన్ని కేసులలో స్టేలపైనే జీవిస్తున్నాడు. పాపలన్నీ బద్దలైనాయిఅన్నింటికి శిక్ష తప్పదు. -మంత్రి కారుమూరి నాగేశ్వరరావు చట్టానికి ఎవరూ అతీతులు కాదు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు అరెస్టు సక్రమమే. చట్టానికి ఎవరు అతీతులు కాదు.. గతంలోనూ ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తుల అరెస్టులు జరిగాయి. స్కిల్ డెవలప్మెంట్ స్కీమ్‌లో వేల కోట్ల అక్రమాలకు చంద్రబాబు పాత్ర ఉంది కనుకనే అరెస్ట్ చేశారు. - నెల్లూరు పార్లమెంట్ సభ్యులు ఆదాల ప్రభాకర్ రెడ్డి చంద్రబాబు అరెస్టుకు రాజకీయ సంబంధం లేదు చంద్రబాబు అరెస్టును స్వాగతిస్తున్నాం. ఆయన అరెస్టుకు రాజకీయానికి సంబంధం లేదు. స్కిల్ డెవలప్ మెంట్లో ఏం జరిగింది అనేది అసెంబ్లీ సాక్షిగా పూర్తిగా చర్చించాం. అసలు సంబంధంలేని సీమెన్ కంపెనీ పేరుతో చంద్రబాబు అవినీతికి పాల్పడ్డాడు. సీమెన్ కంపెనీలో పనిచేసే ఒక వ్యక్తితో మాట్లాడి ఈ విధంగా అవినీతికి పాల్పడిన సంగతి అందరికీ తెలిసిందే. ఆ కంపెనీ కూడా ఎంక్వయిరీ చేసి దీనికి మాకు సంబంధం లేదని తేల్చేసింది. పూర్తిస్థాయిలో చర్చించి రూ. 370 కోట్లు ఏ విధంగా అవినీతి జరిగింది అని ప్రభుత్వ సంస్థలు పూర్తి స్థాయిలో దర్యాప్తు చేసిన తర్వాతే చంద్రబాబును అరెస్టు చేశారు. దీనిలో ఏ విధమైన రాజకీయ కోణం గానీ కక్ష సాధింపులు గాని లేవు. దొరికిపోయాడు కాబట్టే నన్ను ఏ క్షణమైనా అరెస్టు చేస్తారంటూ మూడు రోజుల నుంచి చంద్రబాబు చెబుతున్నాడు. -నందిగామ ఎమ్మెల్యే,మొండితోక జగన్ మోహన్ రావు చంద్రబాబు అరెస్టు సమంజసమే మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు అవినీతిలో కూరుకు పోయారు. సీఐడీ పూర్తిస్థాయిలో విచారణ జరిపింది. 2018లో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే స్కిల్ డెవలప్మెంట్ కేసులో నిధులు దారిమళ్లాయి. హవాలా రూపంలో చంద్రబాబు స్కాంకు పాల్పడ్డాడు. చంద్రబాబు అరెస్టు సమంజసమే. అవినీతికి పాల్పడిన వ్యక్తిని అరెస్టు చేస్తే రాజకీయం చేయడం తగదు. -అనకాపల్లి జిల్లా ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ చంద్రబాబు నాయుడు అవినీతి సామ్రాట్ చంద్రబాబు నాయుడు అవినీతి సామ్రాట్. స్కిల్ డెవలప్మెంట్ స్కాం సూత్రధారి చంద్రబాబే. 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు నాయుడు అనేక కుంభకోణాల్లో భాగస్వామి. చంద్రబాబు వేల కోట్ల అక్రమాల్లో స్కిల్ డెవలప్మెంట్ స్కాం చాలా చిన్నది. చంద్రబాబు పాపం పండింది.. చంద్రబాబు ను జైలుకు పంపాలి. -రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి పూర్తి ఆధారాలతో అరెస్ట్ చంద్రబాబు నాయుడు అరెస్టుపై తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు. పూర్తి ఆధారాలతోనే ఆయన్ను అరెస్ట్ చేశారు. కక్ష సాధింపు చర్యలు తీసుకోవాలనుకుంటే 2021లోనే అరెస్టు చేయొచ్చు. స్కిల్ డెవలప్మెంట్ పేరిట ప్రజల సొమ్ము రూ. 360 కోట్లు దోచేసశాడు. జీఎస్టీ,ఇంటెలిజెన్స్, ఐటీ, ఈడీ, సెబ్ ఇలా అన్ని కూడా మూడు సంవత్సరాల నుంచి దర్యాప్తు చేస్తూ పూర్తి ఆధారాలతో అరెస్టు చేశారు. - ఎమ్మెల్యే తలారి వెంకట్రావు -
‘రాయలసీమ ద్రోహి చంద్రబాబు’
సాక్షి, కర్నూలు: రాష్ట్రాభివృద్ధిపై టీడీపీ అధినేత చంద్రబాబుకు చిత్తశుద్ధి లేదు. చంద్రబాబును ప్రజలు ఇప్పటికే తిరస్కరించారని మంత్రి గుమ్మనూరు జయరాం అన్నారు. కాగా, మంత్రి జయరాం మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబు సానుభూతి మాటలను ప్రజలు నమ్మే పరిస్థితి లేదు. చంద్రబాబుకు ఇప్పటికే చివరి ఎన్నికలు అయిపోయాయి. 2024 ఎన్నికల్లో చంద్రబాబు పోటీ చేయరు. చంద్రబాబును ఇప్పటికే ప్రజలు తిరస్కరించారు అని అన్నారు. ప్రజలను మోసం చేయడమే చంద్రబాబు నైజం.. సాక్షి, అనంతపురం: తన రాజకీయ భవిష్యత్తుపై చంద్రబాబు ఫ్రస్ట్రేషన్లో ఉన్నారని రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి అన్నారు. ప్రజలను నిత్యం మోసం చేయడమే చంద్రబాబు నైజం. కర్నూలులో హైకోర్టు ఏర్పాటు చేయాలంటే దుర్భాషలాడతారా?. వికేంద్రీకరణవాదులపై అనుచిత వ్యాఖ్యలు చేసి నిజస్వరూపాన్ని చూపించారు. ఏపీ ప్రతిపక్ష నేతగా చంద్రబాబు ఉండటం ప్రజల దురదృష్టం. రాష్ట్ర ప్రయోజనాలతో చంద్రబాబు, పవన్ చెలగాటం ఆడుతున్నారు. అమరావతిపై చంద్రబాబుకు చిత్తశుద్ధి ఉంటే ఎందుకు రాజధాని నిర్మించలేకపోయారు. రాయలసీమ ద్రోహి చంద్రబాబు.. సాక్షి, విజయవాడ: అభివృద్ధిని, సంక్షేమాన్ని చూడలేక చంద్రబాబు అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారని మల్లాది విష్ణు ఆగ్రహం వ్యక్తంచేశారు. అమరావతి నా నినాదం అని చంద్రబాబు రాయలసీమలో చెప్పలేకపోయాడు. చంద్రబాబు వ్యాఖ్యల్ని తీవ్రంగా ఖండిస్తున్నాము. రాయలసీమ ద్రోహి చంద్రబాబు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి గురించి మాట్లాడే నైతిక హక్కు చంద్రబాబుకు లేదు. ఇకనైనా మీ భాషను మార్చుకోకపొతే రాబోయే రోజుల్లో ప్రజలే బుద్ధి చెబుతారు. -
తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి పెద్దమనసు.. ఆ రైతులకు 5వేల ఉచిత బోర్లు
సాక్షి, అనంతపురం(రాప్తాడు): నియోజకవర్గంలో 5 వేల మంది రైతులకు తోపుదుర్తి చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఉచితంగా బోరుబావులు తవ్వించి వారి కలను సాకారం చేస్తున్నట్లు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి పేర్కొన్నారు. బుధవారం రాప్తాడుకు వచ్చిన ఆయన స్థానిక ఎంపీడీఓ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. రూ.10 కోట్లతో బోర్ల ఏర్పాటు తోపుదుర్తి చారిటబుల్ ట్రస్ట్ ద్వారా గతంలో రాప్తాడు నియోజకవర్గంలో రెండు వేల మంది రైతులకు ఉచితంగా బోరు బావులు తవ్వించినట్లు ప్రకాష్‌రెడ్డి గుర్తు చేశారు. స్ఫూర్తిదాయకమైన ఈ కార్యక్రమాన్ని సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ‘వైఎస్సార్ జలకళ’ కార్యక్రమం కింద తీసుకురావడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమం కింద నియోజకవర్గంలో ఇప్పటి వరకూ 600 మంది రైతులకు బోర్లు వేయించామన్నారు. బోర్లు వేయించాలంటూ ప్రభుత్వ లక్ష్యానికి మించి 10,600 దరఖాస్తులు అందడంతో తోపుదుర్తి కుటుంబం చర్చించి ట్రస్ట్ ద్వారా ఉచిత బోర్లు వేయించాలని నిర్ణయించినట్లు తెలిపారు. ఇందులో భాగంగా రూ.10 కోట్ల వ్యయంతో రాప్తాడు, కనగానపల్లి, చెన్నేకొత్తపల్లి, రామగిరి మండలాలకు సంబంధించి ప్రతి మండలానికి వెయ్యి బోర్లు, ఆత్మకూరు, అనంతపురం రూరల్ మండలాలకు కలపి వెయ్యి బోర్లు వేయించాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ఇందుకు సంబంధించి తొలి విడతగా కనగానపల్లి మండలంలో 150, రాప్తాడులో 150, రామగిరిలో 100, చెన్నేకొత్తపల్లి మండలాల్లో 100 బోర్లు వేయిస్తామన్నారు. ఇవి పూర్తి కాగానే రెండో విడతలో మరో 500 బోర్లు వేయిస్తామన్నారు. ఇలా ప్రతి విడతలోనూ 500 బోర్లు వేయించేలా చర్యలు తీసుకుంటామన్నారు. అర్హులు వీరే.. పేద రైతులు, ఇప్పటి దాకా బోర్లు వేయని రైతులు, ఎన్నిమార్లు బోర్లు వేసినా నీళ్లు పడని రైతులు మాత్రమే ఈ పథకం కింద అర్హులని ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి పేర్కొన్నారు. గత రెండేళ్లుగా పేరూరు డ్యాం మరువ పారుతోందని, ఈ సారి దాదాపు 12 టీఎంసీల నీటిని పేరూరు డ్యాం నుంచి దిగువన పెన్నాలోకి వదిలినట్లు తెలిపారు. సీఎం వైఎస్ జగన్ ఆశీర్వాదంతో పీఏబీఆర్ కుడికాలువ ద్వారా ప్రతి చెరువునూ నింపడం జరిగిందన్నారు. నియోజకవర్గంలో భూగర్భజలాలు భారీగా పెరిగాయని, 200 అడుగుల్లోపే నీళ్లు పడే పరిస్థితి నెలకొందన్నారు. ప్రతి కార్యకర్త గడప గడపకూ వెళ్లాలి ప్రతి గడపకూ వెళ్లి సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి అమలు చేస్తున్న సంక్షేమ పథకాలపై ఈ మూడేళ్లలో ఒనగూరిన లబ్ధిని వివరించాలని కార్యకర్తలకు సూచించారు. గత ప్రభుత్వం ఖజానాను కొల్లగొట్టి వెళ్లిపోయినా ఎన్నో కష్టాలను ఎదుర్కొని నిధులు సమకూర్చుకుంటూ పేద, బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. ఇప్పటికే నియోజకవర్గంలో 8,900 ఇళ్లు మంజూరయ్యాయని, మరో 8,500 ఇళ్ల నిర్మాణాలకు ఆమోదం కోసం ప్రతిపాదనలు పంపినట్లు తెలిపారు. నియోజకవర్గంలోని పేదలు ఎవరైతే ఆప్షన్–3లో ఇళ్ల నిర్మాణాలు చేసుకుంటారో వారందరికీ రూ.35 వేల రుణాన్ని ఎన్నికల లోపు కాంట్రాక్టింగ్ సంస్థకు తామే చెల్లించి, ఆ రుణాన్ని మాఫీ చేయిస్తామన్నారు. సమావేశంలో వైస్ ఎంపీపీ బోయ రామాంజినేయులు, వైఎస్సార్ సీపీ మండల కన్వీనర్ జూటూరు శేఖర్, యూత్ మండల కన్వీనర్ చిట్రెడ్డి సత్యనారాయణరెడ్డి, బీసీ సెల్ నాయకుడు పసుపుల ఆది పాల్గొన్నారు. -
బాబుది దోపిడీ బాట.. జగన్‌ది సంక్షేమ పాలన
సాక్షి,కనగానపల్లి(అనంతపురం): నాడు జన్మభూమి కమిటీల పేరుతో చంద్రబాబు దోపిడీ పాలన సాగిస్తే, నేడు వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో వలంటీర్ల ద్వారా సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రజా సంక్షేమ పాలన అందిస్తున్నారని రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి అన్నారు. ఆరు గ్రామ పంచాయతీల్లోని 75 మంది ఉత్తమ గ్రామ వలంటీర్లకు కనగానపల్లి ఎంపీడీఓ కార్యాలయం వద్ద శనివారం సాయంత్రం ఆయన పురస్కారాలు అందజేసి సత్కరించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడారు. ప్రతి సంక్షేమ పథకం ప్రతి ఇంటికీ నేరుగా చేరాలన్న ఉద్దేశంతో సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి దేశంలో తొలిసారిగా వలంటీర్ల వ్యవస్థను తీసుకొచ్చారన్నారు. ప్రభుత్వ పాలనను ప్రజల ముంగిటకు తీసుకొచ్చేందుకు సచివాలయ వ్యవస్థను ప్రవేశపెట్టారన్నారు. వలంటీర్లు, సచివాలయ వ్యవస్థ సీఎం జగన్‌కు రెండు కళ్లులాంటివని అన్నారు. టీడీపీ ప్రభుత్వంలో చంద్రబాబు తన పార్టీ నాయకులతో జన్మభూమి కమిటీలు ఏర్పాటు చేసి ప్రజాధనాన్ని దోచిపెట్టారని ఆరోపించారు. ఫ్యాక్షన్, వర్గ రాజకీయాలకు పరిటాల కుటుంబం పుట్టినిల్లు: రాప్తాడు నియోజక వర్గంలో ఫ్యాక్షన్, వర్గ రాజకీయాలకు పరిటాల కుటుంబం çపుట్టినిల్లని ఎమ్మెల్యే ప్రకా‹Ùరెడ్డి విమర్శించారు. నియోజకవర్గంలో 25 ఏళ్లలో జరగని అభివృద్ధి పనులను తాము చేస్తున్నామన్నారు. పేరూరు డ్యాంను నీటితో నింపడంతోపాటు రామగిరి బంగారు గనులు తెరిపిస్తున్నారు. తాము చేస్తున్న అభివృద్ధిని చూసి ఓర్వలేక టీడీపీ నాయకులు తమపై అసత్య ఆరోపణలు చేస్తున్నారన్నారు. పరిటాల కుటుంబం గ్రామాల్లో వర్గ రాజకీయాలను ప్రేరేపిస్తోందన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ కుంపటీ భాగ్యమ్మ, జెడ్పీటీసీ సభ్యుడు మారుతీప్రసాద్, వైస్ ఎంపీపీలు నరసింహారెడ్డి, పద్మావతి, తహసీల్దార్ మురళీ, ఎంపీడీఓ విజయభాస్కర్, సొసైటీ అధ్యక్షుడు భాస్కర్, డైరెక్టర్ ప్రభాకర్, అగ్రి బోర్డు చైర్మన్ వెంకటరాముడు, నియోజకవర్గ వైఎస్సార్సీపీ నాయకుడు తోపుదుర్తి రాజశేఖర్‌రెడ్డి, కన్వీనర్ అమరనాథ్‌రెడ్డి, పలువురు ఎంపీటీసీలు, సర్పంచ్‌లు పాల్గొన్నారు. రాప్తాడు: స్థానిక ఎంపీడీఓ కార్యాలయంలో ఎంపీపీ చిట్రెడ్డి జయలక్ష్మి అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకా‹Ùరెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని మండలంలోని 8 గ్రామ సచివాలయాలకు చెందిన వలంటీర్లను సన్మానించి సేవా వజ్ర, సేవా రత్న, సేవా మిత్ర అవార్డులు ప్రదానం చేసి ప్రశంసా పత్రాలు అందజేశారు. వలంటీర్లు, సచివాలయ వ్యవస్థ దేశానికే ఆదర్శమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభినందించారని గుర్తు చేశారు. సేవా దృక్పథంతో పని చేస్తున్న వలంటీర్లను టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అవహేళనగా మాట్లాడడం సిగ్గుచేటన్నారు. జెడ్పీటీసీ సభ్యురాలు పసుపుల హేమావతి, వైస్ ఎంపీపీలు బోయ రామాంజినేయులు, మన్నల వరలక్షి్మ, ఎంపీడీఓ సాల్మన్, తహసీల్దార్ ఈరమ్మ, ఈఓఆర్డీ మాధవి, యూత్ విభాగం మండల కన్వీనర్ చిట్రెడ్డి సత్యనారాయణ రెడ్డి, నాయకులు పసుపుల ఆది, యర్రగుంట కేశవ రెడ్డి, సర్పంచులు, ఎంపీటీసీలు, సచివాలయ ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు. -
పరిటాల సునీతకు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి సవాల్
సాక్షి, అనంతపురం: టీడీపీ పాలనలో అవినీతి, దౌర్జన్యాలు చేసింది పరిటాల కుటుంబీకులేనని రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి ధ్వజమెత్తారు. ఈ మేరకు ఆయన శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. పరిటాల సునీత, శ్రీరామ్ వంటి వ్యక్తులు అవినీతి గురించి మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందన్నారు. తోపుదుర్తి మహిళా డైరీలో ఒక్క రూపాయి దుర్వినియోగం కాలేదని పేర్కొన్నారు. అక్రమాలు జరిగినట్లు నిరూపిస్తే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసేందుకు సిద్ధమని పరిటాల సునీత, శ్రీరామ్‌కు సవాల్ విసిరారు. చదవండి: (ఫిట్మెంట్తో పాటు ఉద్యోగులకు సీఎం జగన్ మరో గుడ్‌న్యూస్) -
శ్రీరాం.. నీ బండారం బయటపెడతా!
సాక్షి, అనంతపురం : ‘‘టీడీపీ పాలనలో జిల్లాకు, ముఖ్యంగా రాప్తాడు నియోజకవర్గానికి జరిగిన ప్రయోజనమేమీ లేదు. మేము సాగునీరిచ్చామంటున్నావు.. ఏ నియోజకవర్గానికిచ్చావో చెప్పు. దోపిడీ తప్ప మీ కుటుంబం చేసిందేమీ లేదు. గతంలో మీకున్న ఆస్తులెన్ని.. ఇప్పుడున్న ఆస్తులెన్ని..? ఎక్కడి నుంచి వచ్చాయో చెప్పగలవా? పరిటాల రవీంద్ర పేరు చెప్పి ఇష్టారాజ్యంగా భూములను లాక్కున్న ఘనత మీది. ప్రజాసేవే పరమావధిగా పనిచేసే మనస్తత్వం మాది. జిల్లాలో కియా ఫ్యాక్టరీ పరిసరాల్లో, రాజధాని అమరావతి ప్రాంతంలో బినామీల పేర్లతో మీరు భూములు కొనుగోలు చేయలేదా?’’ అని ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి పరిటాల శ్రీరాంను ప్రశ్నించారు. వీటన్నింటికీ సంబంధించిన పూర్తి వివరాలతో పరిటాల శ్రీరాం బండారం బయటపెడతానన్నారు. మంగళవారం ఆయన వైఎస్సార్ సీపీ రాప్తాడు నియోజకవర్గ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. పరిటాల కుటుంబం లాగా కక్షలతో దిగజారుడు రాజకీయాలను చేయాల్సిన అవసరం తమకు లేదన్నారు. చదవండి: విద్యార్ధినులపై వేధింపులు.. గురువుకు 49 ఏళ్ల జైలు శిక్ష జిల్లాలో చేసిన అభివృద్ధి ఏమిటో చూపించు టీడీపీ హయాంలో అభివృద్ధి జరిగిందని చెబుతున్న శ్రీరాం కుటుంబమే రాప్తాడు, పెనుకొండ ప్రాంతాల్లో ఏళ్ల తరబడి ఎమ్మెల్యేలుగా ఉన్నారని, నిజంగా వారు అభివృద్ధి చేసి ఉంటే.. ఒకసారి ప్రజలకూ చుపించగలరా? అని ఎమ్మెల్యే ప్రకాష్‌రెడ్డి సవాల్ విసిరారు. తాము ఏదో సాధించామని చెబుతున్న శ్రీరాం పేరూరు డ్యాంకు నీరు ఎందుకు తీసుకురాలేకపోయారో వివరించాలన్నారు. రూ.800 కోట్ల కాంట్రాక్టు పనులు మంజూరైతే వాటిలో పరిటాల కుటుంబం వాటా రూ.300 కోట్లు ఉందని ఎమ్మెల్యే ప్రకాష్‌రెడ్డి మండిపడ్డారు. టీడీపీ హయాంలో అభివృద్ధే జరిగి ఉంటే.. రాప్తాడు నియోజకవర్గాన్ని ఎందుకని ‘అహుడా’ పరిధిలోకి చేర్చలేదో చెప్పాలన్నారు. రాప్తాడులో జరుగుతున్న అభివృద్ధితో ఇక్కడ తమకు దిక్కు లేదని తెలిసిన పరిటాల శ్రీరాం.. ఇప్పుడు ధర్మవరానికి చేరుకుని ఇష్టారాజ్యంగా మాట్లాడుతున్నాడన్నారు. ప్రజా శ్రేయస్సుపై దృష్టి సారించాం తాము అధికారంలోకి వచ్చి 18 నెలలు పూర్తి కాగా.. ప్రతి క్షణం నియోజకవర్గ అభివృద్ధికి పనిచేశామన్నారు. పరిటాల కుటుంబీకులు మాత్రం మండలానికో ఇన్చార్జ్ని నియమించుకొని దోచుకుతిన్నారన్నారు. పేదల ఇండ్ల కోసం ఇష్టారాజ్యంగా వసూలు చేసిన ఘనత మీ మహేంద్రదనే విషయాన్ని శ్రీరాంకు ఎమ్మెల్యే ప్రకాష్‌రెడ్డి గుర్తుచేశారు. జాకీ పరిశ్రమతో కేవలం వెయ్యి కుటుంబాలకు లబ్ధి చేకూర్చాలని గత ప్రభుత్వం ప్రయత్నించిందన్నారు. కానీ తాము మాత్రం 15వేల కుటుంబాలకు ఉపాధి కల్పించాలని చూస్తున్నామన్నారు. పాల డెయిరీ ద్వారా మహిళలకు అండగా నిలవాలని వారి కుటుంబాల్లో వెలుగులు నింపాలనే లక్ష్యంతో పనిచేస్తున్నామన్నారు. -
మీ నాన్న బాటలో నడిస్తే ఊరుకోం
అనంతపురం సెంట్రల్: ‘‘మీ నాన్న పరిటాల రవి వందల మందిని చంపి హీరో అయ్యాడనుకుంటున్నావ్. దేశంలోనే క్రిమినల్ చరిత్రలో మొదటి స్థానం సంపాదించుకున్నాడు. మీ నాన్న చేసినట్లు నువ్వూ చేస్తానంటే ఊరుకునేది లేదు. ఆ కాలం ఎప్పుడో పోయింది. ఇప్పుడు మా మంచితనాన్ని చేతగాని తనంగా తీసుకోవద్దు’’ అని మాజీ మంత్రి పరిటాల సునీత కుమారుడు శ్రీరామ్‌ను రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి హెచ్చరించారు. సోమవారం ఆయన అనంతపురంలోని తన స్వగృహంలో హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్‌తో కలిసి విలేకరులతో మాట్లాడారు. అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రాప్తాడు నియోజకవర్గ అభివృద్ధిని ఒక యజ్ఞంలా చేపడుతున్నామన్నారు. టీడీపీ హయాంలో కందుకూరు గోదాము మూసివేయడం వల్ల 500 కుటుంబాలు రోడ్డుపడ్డాయని, తాము అధికారంలోకి వచ్చిన 8 నెలల్లో గోదాము తెరిపించామన్నారు. పరిటాల కుటుంబం పాతిక సంవత్సరాలుగా నసనకోట ముత్యాలమ్మ దేవాలయానికి భక్తులు, దాతలు ఇచ్చిన సొమ్మును బొక్కుతూ దేవునికే శఠగోపం పెట్టిందన్నారు. తాము అధికారంలోకి వచ్చిన వెంటనే ఆలయాన్ని దేవాదాయశాఖ పరిధిలోకి తీసుకువచ్చామ్నారు. నియోజకవర్గంలో 60 వేల జనాభాకు తాగునీరు అందించేందుకు అనుమతులు తీసుకొచ్చామని, ఆ పనులను కూడా త్వరలోనే ప్రారంభిస్తున్నామన్నారు. నియోజకవర్గాన్ని ఆహుడా పరిధిలోకి తీసుకొచ్చి 20వేల ఇళ్లను మంజూరు చేయించామన్నారు. పేరూరు డ్యాం, గంగులకుంట, బోగినేపల్లి చెరువులకు నీటిని తీసుకొస్తుస్తున్నామన్నారు. నియోజకవర్గంలో పది వేల మంది మహిళలకు లబ్ధి కలిగించేందుకు ప్రత్యేకంగా డెయిరీని తీసుకొస్తున్నట్లు వివరించారు. రాప్తాడు నియోజకవర్గం అభివృద్ధి కోసం తాము పనిచేస్తుంటే.. గ్రామాల్లో ఫ్యాక్షన్ రెచ్చగొట్టే కార్యక్రమాలకు పరిటాల శ్రీరామ్ ప్రయత్నిస్తున్నాడన్నారు. దౌర్జన్య పద్ధతుల్లో ప్రజలను, అధికారులను బెదిరిస్తున్నాడన్నారు. గత ప్రభుత్వ హయాంలో వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహాలను ధ్వంసం చేసి ఈడ్చుకెళ్లినట్లు స్వయంగా శ్రీరామ్ ప్రకటించాడన్నారు. రాప్తాడు నియోజకవర్గంలో స్థానిక సంస్థలకు టీడీపీ తరఫున నిలబడేందుకు అభ్యర్థులు దొరకడం లేదని, వంద మందిని వెంట వేసుకొని అరాచకం సృష్టించాలని చూస్తున్నారన్నారు. ప్రస్తుతం రామగిరిలో జరిగిన ఘటనతో పాటు గతంలో జరిగిన దాడులు, హత్యలపై విచారణ చేసి బాధిత కుటుంబ సభ్యులు కోరిన విధంగా పరిటాల శ్రీరామ్, వారి కుటుంబ సభ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ అంశంపై ఎస్పీకి ఫిర్యాదు చేస్తున్నట్లు ప్రకటించారు. ప్రజాస్వామ్యవాదులారా ఏకంకండి ప్రజాస్వామ్య వాదులందరూ ఏకమై ఒక తాటిపైకి రావాల్సిన సమయం ఆసన్నమైందని హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్ పిలుపునిచ్చారు. లోటు బడ్జెట్లోనూ సంక్షేమ కార్యక్రమాలతో రాష్ట్రాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ముందుకు తీసుకెళ్తున్నారని తెలిపారు. 14వ ఆర్థిక సంఘం నిధులు రూ.5 వేల కోట్లు రావాల్సి ఉండడంతో యుద్ధ ప్రాతిపదికన ఎన్నికలు నిర్వహణకు ప్రభుత్వం శ్రీకారం చుట్టిందన్నారు. అయితే రాష్ట్రాభివృద్ధికి విఘాతం కలిగించేందుకు అతిపెద్ద కరోనా వైరస్ అయిన చంద్రబాబు కుట్రలు పన్నుతున్నాడని మండిపడ్డారు. కదిరి బ్రహ్మోత్సవాల్లో లక్షలాది ప్రజలు పాల్గొన్నా.. ఎవరికీ ఎలాంటి జబ్బు రాలేదన్నారు. అలాంటిది ఎన్నికలు నిర్వహించడం వల్ల కరోనా వైరస్ వ్యాప్తి చెందుతుందని ఎన్నికల కమిషనర్ దుష్ప్రచారం చేయడం దుర్మార్గమని మండిపడ్డారు. సమావేశంలో వైఎస్సార్సీపీ రూరల్ మండల కన్వీనర్ గోపాల్‌రెడ్డి, రాప్తాడు మార్కెట్‌యార్డు చైర్మన్ నాగేశ్వరరెడ్డి తదితరులు పాల్గొన్నారు. పరిటాల శ్రీరామ్‌పై కేసు నమోదు రామగిరి: మాజీ మంత్రి పరిటాల సునీత కుమారుడు పరిటాల శ్రీరామ్‌పై ఐపీసీ 153ఏ సెక్షన్ కింద కేసు నమోదు చేసినట్లు రామగిరి ఎస్ఐ నాగస్వామి తెలిపారు. సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ, ఈనెల 15వ తేదీ (ఆదివారం) రామగిరి టీడీపీ కార్యాలయ ఆవరణలో కార్యకర్తలనుద్దేశించి పరిటాల శ్రీరావ్‌ు చేసిన ప్రసం మతం, వర్గం, పార్టీలను ప్రభావితం చేస్తుండటంతో కేసు నమోదు చేశామన్నారు. ఎన్నికల నిబంధనల ప్రకారం ప్రజలను, ఇతర పార్టీల వర్గీయులను రెచ్చగొట్టే విధంగా వ్యవహరిస్తే తగిన చర్యలు తీసుకుంటామన్నారు. ఇదిలాఉండగా పరిటాల శ్రీరామ్ గతంలో రామగిరిలోని వైఎస్సార్ విగ్రహాన్ని కూల్చేశామని, తాము అధికారంలోకి వస్తే 15 నిమిషాల్లోనే ప్రస్తుతం ఉన్న విగ్రహాన్ని కూల్చేస్తామని బాహాటంగా చెప్పడం విమర్శలకు తావిస్తోంది. -
'బినామి ఆస్తులు కాపాడాలనేది బాబు తాపత్రయం'
సాక్షి, అనంతపురం : అధికార వికేంద్రీకరణ సదస్సు ఎస్కే యునివర్సిటీలోని భువనవిజయం ఆడిటోరియంలో బుధవారం ఘనంగా జరిగింది. ఈ సెమినార్‌కు విద్యార్థి,విద్యార్థినులు భారీగా హాజరై అధికార వికేంద్రీకరణకు జైకొట్టారు. అధికార వికేంద్రీకరణ ద్వారానే అభివృద్ధి సాధ్యమవుతుందని పలువురు ప్రొఫెసర్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి హాజరైన ఏపీ కార్పొరేషన్ చైర్మన్,ఎమ్మెల్యే జక్కంపూడి రాజా మాట్లాడుతూ... రాష్ట్ర విభజన వల్ల ఏపీ చాలా నష్టపోయిందని పేర్కొన్నారు. బినామి ఆస్తులు కాపాడుకునేందుకు చంద్రబాబు తాపత్రయమని దుయ్యబట్టారు. అమరావతిలో మాత్రమే లక్షల కోట్ల పెట్టుబడులు పెట్టి, అభివృద్ధి ఒకే చోట జరగాలంటే ఎలా అని విమర్శించారు. ప్రస్తుతం ఉన్న దృష్యా ఏపీకి మూడు రాజధారుల అవసరం ఎంతో ఉందని, అధికార వికేంద్రీకరణ ద్వారా సమగ్ర అభివృద్ధి జరగుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. అమ్మ ఒడి,రైతు భరోసా పథకాలు చారిత్రాత్మకం అని తెలిపారు.(చంద్రబాబు ఇప్పటికైనా కళ్లు తెరవాలి..) ఏపీలోని 13 జిల్లాలను అభివృద్ధి చేయాలన్నదే ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సంకల్పమని రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్‌రెడ్డి పేర్కొన్నారు. లక్షకోట్ల రూపాయలతో అమరావతి నిర్మాణం అవసరమా అని, అభివృద్ధి ఒకచోట జరిగితే మిగిలిన ప్రాంతాలు ఏంకావాలని ఆయన ప్రశ్నించారు. పరిపాలన వికేంద్రీకరణ ద్వారానే అభివృద్ధి సాధ్యం అవుతుందని ప్రకాశ్ రెడ్డి పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ వెన్నపూస గోపాల్ రెడ్డి, ఏపీ పాఠశాల విద్య కమిషన్ సీఈఓ ఆలూరు సాంబశివారెడ్డి, వైఎస్సార్ సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మహాలక్ష్మి శ్రీనివాస్, విద్యార్థి సంఘాల నేతలు లింగారెడ్డి, రాధాకృష్ణ తదితరులు పాల్గొన్నారు. -
ఫలించిన తోపుదుర్తి కృషి
అనంతపురం రూరల్: అనంతపురం రూరల్ మండల పరిధిలోని పాపంపేట, విద్యానగర్, ఎంఎన్ఆర్ కాలనీ, కక్కలపల్లి కాలనీ పంచాయతీలోని నీటి సమస్య తీరనుంది. ఆయా గ్రామాలకు పీఏబీఆర్ పైపులైన్ ద్వారా నీటిని అందించడానికి గురువారం ప్రభుత్వం జీవో జారీ చేసింది. ఫలించిన ఎమ్మెల్యే ప్రకాష్‌రెడ్డి కృషి గత ఎన్నికల్లో తాము అధికారంలోకి వస్తే పీఏబీఆర్ పైపులైను ద్వారా అక్కంపల్లి, పాపంపేట, విద్యారణ్య నగర్, కక్కలపల్లి కాలనీ పంచాయతీలోని పలు కాలనీలకు పీఏబీఆర్ ద్వారా నీళ్లను తీసుకొచ్చి ప్రతి ఇంటికి తాగునీరు అందిస్తామని తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి హామీ ఇచ్చారు. ఇందులో భాగంగా ఆయా గ్రామాలకు రోజుకు 22 లక్షల లీటర్ల నీరు అందించే విధంగా ప్రభుత్వం జీవో జారీ చేసింది. దీంతో తమ గ్రామాల్లో నెలకొన్న నీటి సమస్య తీరిందని, ఆయా గ్రామాల ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. -
చంద్రబాబు జాతీయ నాయకుడు కాదు..
సాక్షి, అనంతపురం : లక్ష కోట్ల రాజధాని వద్దు-ఇరిగేషన్ ప్రాజెక్టులు ముద్దు పేరుతో జిల్లాలో వైఎస్సార్ కాంగ్రెస్ నేతలు భారీ ర్యాలీ నిర్వహించారు. నగరంలోని క్లాక్ టవర్ నుంచి సప్తగిరి సర్కిల్ దాకా ఈ ర్యాలీ కొనసాగింది. ఈ ర్యాలీలో అనంతపురం ఎమ్మెల్యే అనంతవెంకట్రామిరెడ్డి, రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి, ఎమ్మెల్సీ ఇక్బాల్, పుట్టపర్తి ఎమ్మెల్యే దుద్దుకుంట శ్రీధర్ రెడ్డి, కదిరి ఎమ్మెల్యే డాక్టర్ సిద్ధారెడ్డి, మడకశిర ఎమ్మెల్యే డాక్టర్ తిప్పేస్వామి, ఎమ్మెల్సీ ఇక్భాల్, డీసీసీబీ ఛైర్మన్ పామిడి వీరాంజనేయులు, మాజీ ఎమ్మెల్యే వై.విశ్వేశ్వరరెడ్డి, పార్టీ నేతలు నదీం అహ్మద్, గంగుల భానుమతి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి మాట్లాడుతూ ఏపీలో అధికార, అభివృద్ధి వికేంద్రీకరణ దిశగా వైఎస్ జగన్ ప్రభుత్వం అడుగులు వేస్తుంటే. అమరావతి కోసం చంద్రబాబు జోలె పట్టడం హాస్యాస్పదంగా ఉందని విమర్శించారు. రాయలసీమలో ఆకలి చావులు జరిగినప్పుడు చంద్రబాబు ఎందుకు జోలి పట్టలేదని ప్రశ్నించారు. సీమ వెనుకబాటుకు చంద్రబాబే కారణమని విమర్శించారు. చంద్రబాబు జాతీయ నాయకుడు కాదని, ఒక జాతి నాయకుడని వ్యాఖ్యానించారు. వైఎస్సార్ ప్రారంభించిన ఇరిగేషన్‌ప్రాజెక్టులపై చంద్రబాబు నిర్లక్ష్యం వహించారని మండిపడ్డారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రాయలసీమ కరువుపై మానవతా దృక్పథంతో స్పందించి.. సీమ ప్రాజెక్టులకు పెద్దపీట వేస్తున్నారని అన్నారు. ముఖ్యమంత్రి అధికార వికేంద్రీకరణ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని ఏపీలోని 13 జిల్లాలు అభివృద్ధి చెందాలని తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి తెలిపారు. చంద్రబాబు జోలె పట్టడం హాస్యాస్పదం అవినీతిని కప్పిపుచ్చుకునేందుకే చంద్రబాబు డ్రామాలు అడుతున్నాడని ఎమ్మెల్సీ ఇక్బాల్ దుయ్యబట్టారు. అమరావతిలో చంద్రబాబు అవినీతికి పాల్పడ్డారని, ఇన్ సైడర్ ట్రెడింగ్ ద్వారా 4000 ఎకరాలు టీడీపీ నేతలు కొన్నారని పేర్కొన్నారు. బినామీ ఆస్తులను కాపాడుకునేందుకు చంద్రబాబు పాకులాడటం విడ్డూరంగా ఉందన్నారు. చంద్రబాబు జోలె పట్టడం హాస్యాస్పదమని, ఏపీ లోని 13 జిల్లాల అభివృద్ధికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కట్టుబడి ఉన్నారన్నారు. అన్ని ప్రాంతాలూ అభివృద్ధి చెందితే చంద్రబాబుకు ఎందుకు బాధ అని నిలదీశారు. రాయలసీమలో హైకోర్టు ఏర్పాటుకు చంద్రబాబు అనుకూలమా.. కాదో చెప్పాలని ఎమ్మెల్సీ ఇక్బాల్ డిమాండ్ చేశారు. రాయలసీమ కష్టాలు బాబుకు కనిపించవా సొంత ప్రయోజనాల కోసమే చంద్రబాబు అమరావతి పోరాటం చేస్తున్నారని పుట్టపర్తి ఎమ్మెల్యే దుద్దుకుంట శ్రీధర్ రెడ్డి విమర్శించారు. అమరావతిలో చంద్రబాబు గ్రాఫిక్స్ మమాజాలం సృష్టించిందని, నాలుగు లక్షల కోట్ల రూపాయలు ఖర్చు చేసినా అమరావతిలో రాజధాని కట్టలేమని పేర్కొన్నారు. రాయలసీమ కష్టాలు చంద్రబాబుకు కనిపించవా అని ప్రశ్నించారు. వైఎస్సార్ కృషి ఫలితమే హంద్రీనీవా ప్రాజెక్టు అని తెలిపారు. చంద్రబాబు 3 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేశారని, కనీసం రూ. 25000 కోట్లు సీమ కోసం ఎందుకు ఖర్చు పెట్టలేదని నిలదీశారు. తమకు లక్షల కోట్ల రూపాయల రాజధాని అక్కర్లేదని.. పుష్కలంగా తాగు, సాగు నీరు అందింతే చాలన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌కు అండగా నిలుస్తామని, రాయలసీమలో జ్యూడిషియల్ క్యాపిటల్ ను స్వాగతిస్తున్నామని అన్నారు. -
వెనుకబడిన ప్రాంత ప్రజల కష్టాలు గుర్తుకురాలేదా?
-
చంద్రబాబు ఆ పని చేసుంటే..
సాక్షి, తాడేపల్లి : రాజధాని విషయంలో టీడీపీ నాయకులు పెయిడ్ ఆర్టిస్ట్‌లను తీసుకొచ్చి ఉద్యయం చేయిస్తున్నారని రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి ధ్వజమెత్తారు. రాజధాని విషయంలో టీడీపీ మీడియా అతిగా చూపిస్తోందని, రాజధానిలో రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఉద్యమాలు చేయిస్తున్నారని విమర్శించారు. మంగళవారం మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. అద్భుతమైన రాజధానిని నిర్మిస్తానని చెప్పి చంద్రబాబు రైతులను మోసం చేశారని మండిపడ్డారు. రాజధానిలో టీడీపీ నేతలు ఇన్సైడర్ ట్రేడింగ్‌కు పాల్పడ్డారని, తన బినామీలు కొన్న భూములకు రేట్లు పలకడం కోసం ప్రపంచ స్థాయి రాజధాని నిర్మిస్తామని చంద్రబాబు నమ్మబలికారని దుయ్యబట్టారు. రాజధాని ప్రజలను బాబు రెచ్చగొడుతున్నారు చంద్రబాబు రాజధాని పూర్తి చేసి ఉంటే రాజధాని తరలించే పరిస్థితి వచ్చేది కాదని, ఢిల్లీని తలదన్నే విధంగా రాజధాని నిర్మిస్తామని బాబు గ్రాఫిక్స్ చూపించారని మండిపడ్డారు. రాజధాని ప్రజలను చంద్రబాబు రెచ్చగొడుతున్నారని, శ్రీబాగ్ ఒడంబడిక ప్రకారం హైకోర్టు రాయలసీమలో ఏర్పాటు చేయాలని స్పష్టం చేశారు. రూ. లక్షా 70 వేల కోట్లు అప్పు తెచ్చి కేవలం అయిదు వేల కోట్లు రాజధానికి చంద్రబాబు ఖర్చు చేశారని విమర్శించారు. ఢిల్లీ, ముంబై, చెన్నై, హైదరాబాద్ లాంటి రాజధాని ఆంధ్రప్రదేశ్‌కు అవసరం లేదా అని ప్రశ్నించారు. ప్రపంచ స్థాయి రాజధాని నిర్మిస్తామని అంటేనే సీఎం జగన్ అమరావతికి మద్దతు తెలిపారని స్పష్టం చేశారు. రియల్ ఎస్టేట్ వ్యాపారులు చందాలు వసూళ్లు చేసి రాజధానిలో ఉద్యమాన్ని అమరావతిలో నడిపిస్తున్నారని దుయ్యబట్టారు. అదే విధంగా.. మూడు లక్షల కోట్ల అప్పుతో మరొక లక్ష కోట్లు అప్పు చేస్తే రాజధాని నిర్మిస్తే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఏం కావాలని నిలదీశారు. ఇప్పటికే అభివృద్ధి చెందిన వైజాగ్‌ను రాజధానిగా చేసుకుంటే ఆర్థికంగా ఎలాంటి ఇబ్బంది ఉండదని, సీఎం జగన్ ప్రజా ఆకాంక్షకు అనుగుణంగానే నిర్ణయాలు తీసుకుంటున్నారని పేర్కొన్నారు. గత పాలకులు రెండు లక్షల కోట్లు అప్పు తెచ్చి కమిషన్లు దండుకున్నారని విమర్శించారు. పార్టీలకు అతీతంగా ప్రజలు మూడు రాజధానులను స్వాగతిస్తున్నారని.. చిరంజీవి, జీవీఎల్, కేఈ, గంటా వంటి వారు జీఎస్ రావు కమిటీని స్వాగతిస్తున్నారని తెలిపారు. ప్రజలు అందరికీ ఆమోదయోగ్యమైన నిర్ణయం కేబినేట్ భేటీ తరువాత వస్తుందని పేర్కొన్నారు. -
బాబు పాలనలో టెండర్ల పేరుతో 46 వేల కోట్లు దుర్వినియోగం
-
రైతు సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం: మంత్రి శంకరనారాయణ
వైఎస్ జగన్మోహన్రెడ్డి నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం రైతు సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తోందని మంత్రి శంకరనారాయణ, రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి అన్నారు. వైఎస్సార్ జయంతిని పురస్కరించుకుని సోమవారం చెన్నేకొత్తపల్లిలో జరిగిన రైతు దినోత్సవంలో కలెక్టర్ సత్యనారాయణతో కలిసి వారు పాల్గొన్నారు. సంక్షేమం, అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం అధిక ప్రాధాన్యతనిస్తోందన్నారు. అన్ని వర్గాల అభ్యున్నతే ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం ముందుకు సాగుతోందన్నారు. రాజకీయాలకు అతీతంగా సంక్షేమ పథకాలు అందిస్తామన్నారు. అంతకుముందు వైఎస్సార్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించడంతో పాటు కేక్‌కట్ చేసి పంచిపెట్టారు. సాక్షి, కనగానపల్లి: దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ఆశయాలకు అనుగుణంగా రైతు సంక్షేమమే ధ్యేయంగా వైఎస్సార్సీపీ ప్రభుత్వం పనిచేస్తుందని బీసీ సంక్షేమశాఖ మంత్రి శంకరనారాయణ పేర్కొన్నారు. వైఎస్సార్ జయంతిని పురస్కరించుకుని సోమవారం మండల కేంద్రంలో రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి ఆధ్వర్యంలో రైతు దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. మంత్రితో పాటు జిల్లా కలెక్టర్ సత్యనారాయణ, రాష్ట్ర వ్యవసాయశాఖ మిషన్ సభ్యులు బోయ నరేంద్ర హాజరయ్యారు. జలయజ్ఞం పేరుతో ఎన్నో సాగునీటి ప్రాజెక్టులను నిర్మించిన వైఎస్సార్ రైతు బాంధవుడయ్యారని మంత్రి గుర్తు చేశారు. అందుకే వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఆయన జయంతిని రైతు దినోత్సవంగా నిర్వహిస్తోందన్నారు. వైఎస్సార్ ఆశయాలకు అనుగుణంగా సీఎం వైఎస్ జగన్‌మెహన్‌రెడ్డి రైతుల సంక్షేమం అనేక పథకాలను ప్రకటించారన్నారు. ‘రైతు భరోసా’ కింద పంట పెట్టుబడి కోసం ఏటా రూ.12,500, వడ్డీ లేని పంట రుణాలు, ఉచిత పంటల బీమా సౌకర్యాన్ని కల్పిస్తామన్నారు. వీటితో పాటు సాగునీటి ప్రాజెక్టులన్నీ పూర్తి చేసి అన్ని ప్రాంతాలకు సాగు, తాగునీరు అందించేందుకు ప్రణాళికలు సిద్ధం చేశారన్నారు. వైఎస్సార్ కలలను సాకారం చేస్తాం ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి మాట్లాడుతూ రాజన్న రాజ్యం తిరిగి రావాలని ప్రజలంతా వైఎస్సార్సీపీకి ఓటు వేసి గెలిపించారన్నారు. ప్రజల నమ్మకాన్ని వమ్ము చేయకుండా ఆయన కలలను సాకారం చేసేందుకు పాటుపడతామన్నారు. వైఎస్ రాజశేఖరరెడ్డి ఆశయాల సాధనే లక్ష్యంగా సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి కూడా రాప్తాడు నియోజక వర్గానికి లక్ష ఎకరాలకు సాగునీరు అందిస్తామని హామీ ఇచ్చారన్నారు. నిత్యం కరువుతో అల్లాడుతున్న చెన్నేకొత్తపల్లి, రామగిరి, కనగానపల్లి మండలాల్లో కొత్తగా సాగునీటి రిజర్వాయర్లు నిర్మించటంతో పాటు, త్వరలోనే పేరూరు డ్యాంను కృష్ణా జలాలతో నింపుతామన్నారు. అంతేకాకుండా ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీ మేరకు మహిళల డ్వాక్రా రుణాలను మాఫీ చేయటంతో పాటు ‘అమ్మఒడి’ పథకం ద్వారా విద్యాభివృద్ధి కృషి చేస్తామన్నారు. ఇల్లు లేని నిరుపేదలందరికి ఇళ్లు మంజూరు చేయిస్తామన్నారు. వ్యవసాయ, వాటి అనుబంధ శాఖలు ఏర్పాటు చేసిన స్టాల్స్ ఆకట్టుకున్నాయి. డీఆర్డీఏ పీడీ నాగేశ్వరరావు, జేడీఏ హబీబ్‌బాషా, వైఎస్సార్సీపీ నాయకులు తోపుదుర్తి రాజశేఖరరెడ్డి, బిల్లే ఈశ్వరయ్య, గంగుల భానుమతి, సానే ఉమాదేవి, రాజారెడ్డి, పలు శాఖల అధికారులు పాల్గొన్నారు. -
రాప్తాడులో టీడీపీ ఏజెంట్లుగా రౌడీ షీటర్ల నియామకం
-
ఓటు వేయకపోతే చంపేస్తాం: పరిటాల వర్గీయుల బెదిరింపులు
-
పరిటాల వర్గీయుల బెదిరింపులు
సాక్షి, అనంతపురం: సార్వత్రిక ఎన్నికల ప్రచారం గడువు ముగిసినప్పటికీ అధికార పార్టీ అండతో టీడీపీ నేతలు బుధవారం కూడా ఎన్నికల ప్రచారం చేస్తున్నారు. ఎన్నికల కోడ్‌ను ఉల్లంఘిస్తూ.. ఓటర్లను ప్రలోభాలకు గురిచేస్తున్నారు. అనంతపురం జిల్లా రాప్తాడు టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పరిటాల శ్రీరామ్.. రామగిరి, చెర్లోపల్లిలో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తూ.. కోడ్‌ను ఉల్లంగిస్తున్నారు. శ్రీరామ్‌కు ఓటు వేయకపోతే చంపుతామని ఆయన వర్గీయులు బహిరంగ బెదిరింపులకు పాల్పడుతున్నారు. అంతేకాకుండా వైఎస్సార్సీపీ నేతలపై దాడులకు పాల్పడుతున్నారు. టీడీపీకి సహరించకపోతే అంతుచూస్తామని స్థానిక నేత ముత్యాలుపై పరిటాల అనుచరులు దాడికి దిగారు. పరిటాల దౌర్జన్యాలపై పోలీసులు ప్రేక్షకపాత్ర పోషించడంపై ప్రజలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. సునీత వర్గీయులను చెర్లోపల్లి గ్రామస్తులు అడ్డుకుని.. పోలీసులు సమాచారం ఇచ్చినా.. అధికారులు చూసీచూడనట్టు వదిలేశారు. ఓటర్లకు బెదిరింపులు, పోలీసుల తీరును వైఎస్సార్సీపీ రాప్తాడు అభ్యర్థి తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డి తీవ్రంగా తప్పుపట్టారు. మంత్రి సునీతలకు పోలీసులు తొత్తులుగా వ్యవహరిస్తున్నారని ఆగ్రహం చేశారు. ఎన్నికలు నిష్పక్షపాతంగా నిర్వహించాలని, ఓటర్లను బెదిరిస్తున్నా పరిటాల వర్గీయులపై చర్యలు తీసుకోవాలని ఆయన డిమాడ్ చేశారు. -
నీళ్ల కోసం కాదు..నిధుల దోపిడికే! పేరూరు
రాప్తాడు నియోజకవర్గ రైతుల కల పేరూరు ప్రాజెక్టు. 70 ఏళ్ల క్రితం నిర్మితమైన ఆ ప్రాజెక్టుకు నీళ్లొస్తే ఈ ప్రాంతాల ముందు కోనసీమ దిగదుడుపే. ఎటు చూసినా పచ్చని పంట చేలతో వ్యవసాయాన్ని పండుగలా చేసేవారు. అలాంటి పేరూరు ప్రాజెక్ట్‌కు నీటి వనరులు లేకుండా పోయాయి. సాగునీళ్లు అందుతాయని, బీడు భూముల్లో పంటలు పండి తమ బతుకులు మారుతాయని వేల కుటుంబాలు ఏళ్ల తరబడి నిరీక్షిస్తూ వచ్చాయి. ప్రతి ఎన్నికల్లోనూ పేరూరు ప్రాజెక్ట్‌ను నీటితో నింపుతామంటూ నాయకులు లబ్ధి పొందుతూ వచ్చారు. రాప్తాడు నియోజకవర్గం ఏర్పడిన తర్వాత జరిగిన రెండు ఎన్నికల్లోనూ పరిటాల సునీతనే ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఈ రెండు ఎన్నికల్లోనూ పేరూరు ప్రస్తావనే ఆమెకు ఓట్లు పడేలా చేశాయి. కానీ నీళ్లవ్వలేదు. తాజా ఎన్నికల్లో సునీత తనయుడు శ్రీరాం బరిలో నిలిచారు. ఇప్పుడు కూడా ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు పేరూరు ప్రస్తావనే తెరపైకి తీసుకువచ్చారు. అసలు ప్రాజెక్ట్‌ను తామే తెచ్చామని, దానికి నీళ్లు రావాలంటే తిరిగి తనను గెలిపించాలని ఓటర్లను మభ్య పెట్టే ప్రయత్నాలకు తెరలేపారు. వాస్తవానికి ప్రాజెక్టు నిర్మాణంలో పరిటాల కుటుంబానికి రాజకీయ కోణం మినహా మానవీయ కోణం లేదనేది అక్షర సత్యం. ప్రకాష్‌రెడ్డి పోరాటాలు.. పేరూరు ప్రాజెక్టుకు నీళ్లివ్వాలని వైఎస్సార్ సీపీ రాప్తాడు సమన్వయకర్త, ప్రస్తుత ఆ పార్టీ అభ్యర్థి తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి పలు పోరాటాలు చేశారు. వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో చొరవ తీసుకుని ప్రకాష్‌రెడ్డి అందించిన ఫీజుబులిటీ రిపోర్టు ఆధారంగా రూ.119కోట్లతో ప్రాజెక్టుకు నీళ్లిచ్చేందుకు అధికారులు ప్రణాళిక రూపొందించారు. హంద్రీ–నీవాలో భాగంగా ‘పేరూరు బ్రాంచ్‌కెనాల్’ ఏర్పాటు చేసి నీళ్లు ఇవ్వాలని భావించారు. వైఎస్సార్ మరణానంతరం ఈ ప్రణాళికను చెత్తబుట్టలో పడేశారు. తర్వాత మడకశిర బ్రాంచ్ కెనాల్ ద్వారా తురకలాపట్నం నుంచి నీళ్లిస్తే పైసా ఖర్చు లేకుండా పేరూరుకు నీళ్లివ్వొచ్చని విపక్షపార్టీల నేతలను కలుపుకుని ప్రకాష్‌రెడ్డి పలుమార్లు ప్రభుత్వానికి విన్నవించారు. అయినా నాలుగేళ్లుగా పేరూరు ప్రాజెక్టును మంత్రి సునీత పట్టించుకోలేదు. ప్రణాళిక ప్రకారమే నిధుల దోపిడీ పేరూరు ప్రాజెక్ట్‌కు నీరు ఇవ్వాలనే అంశాన్ని ఎన్నికలకు ముందు మంత్రి సునీత తెరపైకి తెచ్చారు. గత ప్రభుత్వం డీపీఆర్ ప్రకారం బోరంపల్లి లిప్ట్ నుంచి రూ.119 కోట్లతో ఈ ప్రాజెక్టుకు నీళ్వివ్వొచ్చు. ఈ అంచనా వ్యయాన్ని రూ.803కోట్లకు పెంచేలా సునీత పావులు కదిపారు. కేవలం అడ్డగోలు గా నిధులు దోచుకోవడంలో భాగం గానే అంచనా వ్యయాన్ని పెంచినట్లు తెలుస్తోంది. ప్రాజెక్టు పరిధిలో పుట్టకనుమ, సోమరవాండ్లపల్లి వద్ద రెండు రిజర్వాయర్లు నిర్మించనున్నారు. ఇందులో 0.6 టీఎంసీలతో 26లక్షల క్యూబిక్ మీటర్ల విస్తీర్ణంలో పుట్టకనుమ రిజర్వాయర్ నిర్మించి నీళ్లివ్వాలని అప్పటి ఎమ్మెల్యే బి.నారాయణరెడ్డి ప్రభుత్వానికి లేఖ కూడా రాశారు. ఇప్పుడు ప్రభుత్వం నిర్మిస్తున్న పుట్టకనుమ సామర్థ్యం కూడా 0.6టీఎంసీలే! అయితే విస్తీర్ణం మాత్రం 26లక్షల నుంచి 76లక్షలకు పెంచారు. అంటే 50లక్షల క్యూబిక్ మీటర్ల పనిని పెంచారు. నిల్వ సామర్థ్యం పెరగనప్పుడు ప్రాజెక్టు విస్తీర్ణం పెరగడం దోపిడీకి అద్దం పట్టింది. దోపిడీపై న్యాయ పోరాటం.. పేరూరుకు నీళ్లిచ్చేందుకు ప్రత్యామ్నాయాలు ఉన్నా, తక్కువ ఖర్చుతో పనులు పూర్తి చేసే మార్గాలు ఉన్నా,కేవలం ప్రజాధనాన్ని దోపిడీ చేసేందుకు రూ.803కోట్లతో ప్రభుత్వం పాలన అనుమతులు ఇవ్వడంపై ఆయకట్టు రైతులు జెడ్పీటీసీ రవీంద్రారెడ్డి, పి.నల్లపురెడ్డి తదితరులు లోకాయుక్తను ఆశ్రయించారు. ప్రభుత్వం జారీ చేసిన జీవో 59లోని లోపాలు, నిపుణుల కమిటీ వ్యవహరించిన తీరు, ప్రభుత్వం ఆమోదించిన డీపీఆర్‌లోని లోపాలు, ఆయకట్టు పరిస్థితి తదితర అంశాలను ససాక్ష్యాలతో వివరించారు. పేరూరుకు నీళ్లిచ్చే పేరుతో సోమరవాండ్లపల్లి, పుట్టకనుమ రిజర్వాయర్లను పొందుపరిచారని, నిజానికి ఆ రిజర్వాయర్ల పరిధిలో ఆయకట్టు లేదని, కేవలం కాస్ట్బెనిఫిట్ రేషియో ప్రకారం పాలన అనుమతులు వచ్చేందుకే వాటిని పొందుపరిచారని పిటీషన్లో పేర్కొన్నారు. ఆ రిజర్వాయర్ల పరిధిలో పేర్కొన్న గ్రామాలకు హంద్రీ–నీవా, పీఏబీఆర్ డిస్ట్రిబ్యూటరీల ద్వారా నీరు ఇచ్చే అవకాశం ఉందని వివరించారు. కేవలం పెంచిన అంచనాలకు ఆమోద ముద్ర వేయించుకుని, ప్రజాధనాన్ని దోచుకునేందుకే ఈ రిజర్వాయర్లను డీపీఆర్‌లో పొందుపరిచారని అభ్యంతరం వ్యక్తం చేశారు. అయినప్పటికీ ప్రభుత్వం స్పందించలేదు. ఇదీ ప్రాజెక్టు చరిత్ర స్వాతంత్య్రం వచ్చిన తర్వాత పేరూరు ప్రాజెక్టును 1950–58లో నిర్మించారు. 1.82 టీఎంసీల సామర్థ్యం ఉన్న ఈ ప్రాజెక్టు నిర్మాణానికి అప్పట్లో రూ.1.69 కోట్లు ఖర్చు చేశారు. 3.5 కిలో మీటర్లున్న ప్రాజెక్టు పరిధిలో 10,048 ఎకరాల ఆయకట్టును స్థిరీకరించారు. కుడికాలవ పరిధిలో 9,448, ఎడమకాలవ పరిధిలో 600 ఎకరాల ఆయకట్టుకు నీరివ్వాలి. గత 60 ఏళ్లలో ఈ ప్రాజెక్ట్‌కు పూర్తిస్థాయిలో 14 సార్లు నీళ్లు వచ్చాయి. 75 శాతం ఒకసారి, 25 శాతం ఒకసారి వచ్చాయి. దాదాపు 34 ఏళ్లు ఈ ప్రాజెక్ట్‌కు చుక్కనీరు చేరలేదు. 25 సంవత్సరాల పాటు ఈ ప్రాంతానికి ఎమ్మెల్యేలుగా ఎన్నికవుతూ వచ్చిన పరిటాల కుటుంబీకులు ఈ పాతికేళ్లలో ఏనాడూ ప్రాజెక్ట్ గురించి పట్టించుకోకపోవడం గమనార్హం. ఫలితంగా ప్రాజెక్టుపై ఆధారపడిన భూములన్నీ బీళ్లుగా మారాయి. బతికే మార్గం లేక రైతులు వలసబాట పట్టారు. గుడ్‌విల్ కింద రూ.47 కోట్లు? పేరూరుకు నీటిని తరలించే పనులను మెయిల్ అనే నిర్మాణసంస్థ దక్కించుకుంది. ఈ సంస్థకు టెండర్ దక్కేలా సునీత ముందే పథకం రచించారు. దీంతో ‘గుడ్‌విల్’ కింద రూ.47కోట్లను మంత్రి కుటుంబీకులకు ఆ సంస్థ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ డబ్బులే ఇప్పుడు ఎన్నికల్లో పరిటాల కుబీంకులు విచ్చలవిడిగా ఖర్చు చేస్తున్నారు. ఈ క్రమంలో అసలు రాప్తాడు ఎమ్మెల్యేగా ఇన్నేళ్లుగా ఎవరు కొనసాగుతున్నారు? ఎందుకు ఈ ప్రాజెక్టుకు నీరు రాలేదు? ఇందులో ఎవరి వైఫల్యం ఉంది? పేరూరు ప్రాజెక్టు పేరుతో దోపిడీ ఎలా జరిగింది? రైతులకు ఏతీరున అన్యాయం జరిగింది? అనే అంశాలపై నియోజకవర్గంలో ఎక్కడ చూసినా చర్చ నడుస్తోంది. పొలాన్ని బలవంతంగా లాక్కొన్నారు కేఎన్ పాళ్యం రెవెన్యూ పరిధిలోని సర్వే నంబర్ 336–1లో ఐదు ఎకరాల భూమికి 1976లో నా భర్త మంగల ముత్యాలప్ప పేరున ప్రభుత్వం డి–పట్టా ఇచ్చిం ది. 4 నెలల క్రితం పేరూరు డ్యాంకు కాలువ పనులకంటూ మా భూమిని ఇతరుల పేరుమీద మార్చి బలవంతంగా లాక్కొన్నారు. ఈ విషయంపై జిల్లా అధికారులు సైతం మాకు న్యాయం చేయలేదు. – మంగల నరసమ్మ, మద్దెలచెరువు, కనగానపల్లి మం‘‘ -
ఓటమి భయంతోనే సునీత ఆరోపణలు
సాక్షి, అనంతపురం సెంట్రల్: ఓటమి భయం వెంటాడటం వల్లే రాప్తాడు టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి, మంత్రి పరిటాల సునీత తమపై అసత్య ఆరోపణలు చేస్తున్నారని వైఎస్సార్సీపీ అభ్యర్థి తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి మండిపడ్డారు. రాప్తాడులో పాతిక వేల ఓట్ల మెజార్టీతో వైఎస్సార్సీపీ గెలవబోతోందనే విషయాన్ని మంత్రి జీర్ణించుకోలేకపోతున్నారన్నారు. నియోజకవర్గంలో టీడీపీ నేతలు సాగిస్తున్న అరాచకాల గురించి ఆదివారం సాయంత్రం అనంతపురంలో ఎస్పీ అశోక్‌కుమార్‌ను క్యాంపు కార్యాలయంలో కలిసి వివరించారు. తాము రెచ్చగొట్టే పనులు చేస్తున్నామని, కక్షలకు ఆజ్యం పోస్తున్నామని ఎటువంటి ఆధారం లేకుండానే మంత్రి ఫిర్యాదు చేయడం హాస్యాస్పదంగా ఉందన్నారు. ఆత్మకూరు మండలం తోపుదుర్తిలో గొర్రెల కాపరులను తమ పొలాల్లోకి రాకుండా అడ్డుకుంటున్నామని చెబుతుండడం బాధాకరమన్నారు. తమ గ్రామంలో 600 మంది గొర్రెల కాపరులుంటే అన్ని ఓట్లూ తమకే పడుతాయని, టీడీపీ నేతలు సైతం మా భూముల్లో వ్యవసాయం చేసుకుంటున్నారని చెప్పారు. రెండు రోజుల క్రితం తమ ప్రచార కార్యక్రమంలో పాల్గొనేందుకు వ చ్చిన తమ పార్టీ నాయకుడు నరేందర్‌రెడ్డి వాహనంలో జెండా కర్రలు దొరికాయని కేసులు నమోదు చేయించారన్నారు. దీన్ని టీడీపీ నాయకుడు సోషల్‌మీడియాలో షేర్ చేయడం, ఇదే విషయాన్ని బలపరుస్తూ మంత్రి పరిటాల సునీత ఎస్పీకి ఫిర్యాదు చేశారన్నారు. ముఖ్య నాయకులను పొట్టనపెట్టుకున్నారు! రాప్తాడు నియోజకవర్గంలో కనీసం ప్రతిపక్ష పార్టీ జెండా కర్రలు కూడా పట్టుకొని తిరిగే పరిస్థితి కల్పించకుండా టీడీపీ నాయకులు గత ఐదేళ్ల కాలంలో వైఎస్సార్సీపీ ముఖ్యమైన నాయకులను పొట్టన పెట్టుకున్నారని ప్రకాష్‌రెడ్డి ఆరోపించారు. నిరాధాయుడైన రాప్తాడు మండల కన్వీనర్ ప్రసాద్‌రెడ్డిని తహసీల్దార్ కార్యాలయంలో దారుణంగా హత్య చేశారన్నారు. కందుకూరు శివారెడ్డి, ఆత్మకూరు కేశవరెడ్డిలను వేటకొడవళ్లతో నరికి చంపారన్నారు. ఆ సమయంలో వారి వద్ద వైఎస్సార్సీపీ జెండా కర్రలున్నా ప్రాణాలతో బయటపడేవారని అన్నారు. సదరు హత్య కేసుల్లో నిందితులకు పరిటాల శ్రీరామ్ ఆశ్రయం కల్పిస్తున్నాడని, తమ వద్ద సాక్షాలున్నాయని స్పష్టం చేశారు. సదరు కేసుల్లో బాధిత కుటుంబాలు రాతపూర్వకంగా పరిటాల శ్రీరామ్, బాలాజీ, పరిటాల కుటుంబ సభ్యులపై ఫిర్యాదులు చేసినా పోలీసులు పట్టించుకోలేదన్నారు. గతంలో పరిటాల రవి పీపుల్స్ వార్, ఆర్వోసీ సంస్థలు ఏర్పరుచుకొని హిట్‌లిస్టులు ప్రకటించి మరీ కాంగ్రెస్ నేతలను హత్య చేసిన చరిత్ర వారిదని తెలిపారు. రక్త చరిత్ర సినిమాలో కూడా ఇదే చూపించారన్నారు. ప్రస్తుతం ఓటమి అంగీకరించలేక రక్త చరిత్ర–3 ద్వారా ప్రత్యర్థులను హత్య చేయడానికి పన్నాగం పన్నుతున్నారన్నారు. సాగునీరు ఇవ్వకపోవడంతో పంటలు పండక 20వేల మంది వలసలు పోయారన్నారు. ఫిర్యాదు చేసినా స్పందించని పోలీసులు వైఎస్సార్సీపీ కార్యకర్త వడ్డే రాజయ్యను పార్టీ మారాలని ఒత్తిడి తెచ్చారని, ప్రకాష్‌రెడ్డిని పదిరోజుల్లో చంపుతామని శ్రీరామ్ హెచ్చరించినా, సునీత తమ్ముడు మురళి మహిళలపై రాళ్లు రువ్వినా, ముకుందనాయుడు అనే వ్యక్తి పరిటాల సునీత సమక్షంలోనే ఎస్సీ, బీసీలకు వార్నింగ్‌లు ఇచ్చినా, హత్య కేసుల్లో బాధిత కుటుంబాలు రాతపూర్వకంగా ఫిర్యాదు చేసినా పోలీసులు చర్యలు లేకపోవడం బాధాకరమన్నారు. తెల్లకాగితంలా బతుకుతున్న తమపై బురుదజల్లే కార్యక్రమాలు పరిటాల సునీత ఇకనైనా మానుకోవాలని హితవు పలికారు. కార్యక్రమంలో రాప్తాడు జెడ్పీటీసీ వెన్నపూస రవీంద్రారెడ్డి, రైతు సంఘం జిల్లా అధ్యక్షులు రాజారాం, నాయకులు ప్రసాద్‌రెడ్డి, నరేంద్రరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
ప్రకాష్‌రెడ్డి ప్రచారానికి పోలీసుల అడ్డంకులు
సాక్షి, కనగానపల్లి: రాప్తాడు నియోజక వర్గంలోని రామగిరి మండలంలో వైఎస్సార్సీపీ అభ్యర్థి తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి గురువారం నిర్వహించిన ఎన్నికల ప్రచారానికి పోలీసులు అడుగడుగునా అడ్డంకుల వేశారు. టీడీపీ ప్రభుత్వ ఐదాళ్ల కాలంలో శాంతిభద్రతల పేరుతో ప్ర కాష్రెడ్డిని రామగిరి మండలంలోకి రాకుండా అడ్డుకొన్న పోలీసులు సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో కూడా అదేతంతు కొనసాగిస్తున్నారు. ఎన్నికల అధికారుల నిబంధనల ప్రకారం అభ్యర్థులు ఎక్కడికైనా వెళ్లి స్వేచ్ఛగా ప్రచారం చేసుకొనే హక్కు ఉంది. ఒకవైపున నియోజకవర్గంలో టీడీపీ అభ్యర్థి ప్రచారానికి ఎటువంటి నిబంధనలు పాటించని పోలీస్ అధికారులు తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి ప్రచారానికి మాత్రం అడ్డంకులు చెపుతున్నారు. రామగిరి మండలంలో కలికివాండ్లపల్లి, గంత్రిమర్రి, పోలేపల్లి, చెర్లోపల్లి, కుంటిమద్ది జరిగిన ఎన్నికల ప్రచారంలో స్థానిక వైఎస్సార్సీపీ నాయకులు కూడా రాకుండా పోలీస్ అధికారులు అడ్డుకట్టలు వేశారు. అయినప్పటికీ మంత్రి పరిటాల సునీత సొంత మండలంలో ప్రజలు తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డికి బ్రహ్మరథం పట్టారు. కలికివాండ్ల, గంతిమర్రి గ్రామాల్లో ప్రచారంలో పాల్గొనేందుకు వెళ్తున్న వైఎస్సార్సీపీ నియోజకవర్గ నాయకులు వేపకుంట రాజన్న, రామగిరి, చెన్నేకొత్తపల్లి మండలాల కన్వీనర్లు గోవిందరెడ్డి, నాగరాజులతో పాటు పలువురు వైఎస్సార్సీపీ నాయకులు జాతీయ రహదారి వద్దనే పోలీసులు అడ్డుకొన్నారు. ఎన్నికల అధికారి అనుమతులు ఉన్న వాహనాలు తప్ప ద్విచక్ర వాహనాలు కూడా వెళ్లకూడదని పోలీసులు అడ్డుచెప్పారు. దీంతో పాటు కుంటమద్ది, పోలేపల్లికి వెళ్లే ఎన్ఎస్ గేట్ వద్ద కూడా పోలీసులు కాపుకాచి వైఎస్సార్సీపీ నాయకులను అడ్డుకొన్నారు.పోలీసులు అడ్డంకులతో వాహనాలకు పక్కన పెట్టి చివరకు పొలాల మీదుగా నడుచుకొని వెళ్తున్న కార్యకర్తలను పోలీసులు పోలేపల్లి వద్ద ఆపి వారిపై లాఠీ చార్జీ చేశారు. రామగిరి ఎస్ఐ హేమంత్‌కుమార్‌తో పాటు స్పెషల్ పార్టీ పోలీసులు చేసిన లాఠీ చార్జీలో పలువురు పార్టీ కార్యకర్తలకు గాయపడినట్లు వైఎస్సార్సీపీ నాయకులు తెలిపారు. దీంతో పాటు ధర్మవరం రూరల్ పోలీస్ స్టేషన్‌కు చెందిన పోలీస్ అధికారి ప్రచారంలో పార్టీ నాయకుల పట్ల దురుసుగా ప్రవర్తించటంతో పాటు అనుమతి ఉన్న వాహనాలను కూడా అడ్డంకులు చెప్పారని వారు తెలిపారు. -
పోలీసులను అడ్డుపెట్టుకుని రాజకీయాలా?
అనంతపురం: రాజ్యాంగాన్ని పరిరక్షించాల్సిన మంత్రి పరిటాల సునీతనే.. చట్టాన్ని ఉల్లంఘించేలా వ్యవహరించడం చూస్తే మనం ప్రజాస్వామ్యంలో ఉన్నామా...? అన్న అనుమానం కలుగుతోందని వైఎస్సార్ సీపీ రాప్తాడు సమన్వయకర్త తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి అన్నారు. సోమవారం ఆయన నగరంలోని తన స్వగృహంలో విలేకరులతో మాట్లాడారు. పోలీసులను అడ్డుపెట్టుకుని రాజకీయం చేయడం మానుకోవాలని మంత్రికి హితవు పలికారు. డ్వాక్రా మహిళలకు ‘పసుపు–కుంకుమ’ కింద ఇస్తున్న డబ్బు కంటే ప్రభుత్వ ప్రచారమే ఎక్కువగా ఉందన్నారు. డ్వాక్రా రుణాలన్నీ మాఫీ చేస్తామని హామీ ఇచ్చి మోసం చేసిన మంత్రి సునీత..తమ గ్రామం వస్తుందని తెలుసుకునే తోపుదుర్తి మహిళలు ఆమెను నిలదీయాలని రెండు రోజుల కిందటే నిర్ణయించుకున్నారన్నారు. ఇది గ్రహించిన మంత్రి పోలీసులను అడ్డుపెట్టుకుని రాజకీయం చేయాలని చూస్తున్నారన్నారు. పోలీసులను అడ్డుపెట్టుకుని గ్రామాల్లోకి రానివ్వకుండా రాజకీయాలు చేసేది ఆడమగ కానివారేననీ, అదీ గతంలో ఎవరు... ఎక్కడ.... చేశారో వారికే తెలుసన్నారు. పదేళ్లలో మంత్రి సునీతను ఎన్నోమార్లు అడ్డుకున్నామనీ, నేడు సమస్య వచ్చింది కాబట్టే మహిళలు తిరగబడ్డారన్నారు. దీన్ని కూడా రాజకీయం చేస్తారా..?ప్రకాష్‌రెడ్డికి పోయేకాలం వచ్చిందని మాట్లాడతారా...? అని ప్రశ్నించారు. తాము ఎంతో సంస్కారవంతంగా మాట్లాడతామనీ, తమ కుటుంబం చాలా బాధ్యతాయుతంగా వ్యవహరిస్తుందన్నారు. ఈ సందర్భంగా ప్రకాష్‌రెడ్డి మంత్రి సునీతకు పలు ప్రశ్నలు సంధించారు. ♦ స్వచ్ఛభారత్ కింద మరుగుదొడ్ల నిర్మాణాల్లో రాప్తాడు నియోజకవర్గంలోనే రూ. వందల కోట్ల అవినీతి జరిగలేదా...? ఈ విషయంలో మహిళలను ఇబ్బంది పెట్టలేదా..? నిధులను మీ కార్యకర్తలు స్వాహా చేయలేదా..? కాణిపాకం వినాయకుడి మీద లేదంటే నీ భర్త పరిటాల రవి మీద ప్రమాణం చేసి అవినీతి జరగలేదని చెబుతారా...? ♦ రూ.వేల కోట్ల నిధులు ఉపాధి హామీ నిధులు నియోజకవర్గానికి వస్తే అందులో ఫారంపాండ్లకు నిధులు మళ్లించి జేసీబీలతో తవ్వించి, పాత వాటికి బిల్లులు చేసుకోలేదా..? నియోజకవర్గంలో 82 వేల మంది ఉపాధి కూలీల కడుపు కొట్టలేదా..? దీనిపై శ్వేతపత్రం విడుదల చేయండి. విచారణకు ఆదేశించండి. ♦ మహిళలకు జరిగిన అన్యాయంపై కనీసం గొంతెత్తలేని మంత్రి ఈరోజు దమ్ముధైర్యం గురించి మాట్లాడతారా..? దమ్ము అనేది ప్రజలకు అండగా నిలబడడంలో ఉండాలి. వారు కష్టాల్లో ఉంటే నేనున్నానంటూ ఆదుకునే విషయంలో దమ్ముండాలి. ఇచ్చిన మాట నిలుపుకునే దానిలో దమ్ముండాలి. అలాంటి దమ్మున్న నాయకుడు వైఎస్ రాజశేఖరరెడ్డి మాత్రమేనని ప్రకాష్‌రెడ్డి స్పష్టం చేశారు. ♦ ఊసరవెళ్లిలా రంగులు మారుస్తూ ప్రజలను మభ్యపెట్టి అధికారంలోకి రావాలి.. వచ్చిన తర్వాత దోచుకోవాలని ఆలోచించేది మీరు. రాజకీయాల పట్ల అవగాహన లేకపోతే పాఠాలు చెప్పించుకోండని మంత్రికి సూచించారు. ♦ ఐదేళ్ల కరువుతో రైతులు విలవిల్లాడుతున్నా.. ఇన్సూరెన్స్ గురించి ఆలోచించారా..? ఇన్పుట్ సబ్సిడీ ఏమైంది..? జిల్లాలో 300 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకుంటే మీ మనసు కరగలేదా..? ♦ మంత్రిగా ఉంటూ కియా పరిశ్రమలో స్థానికులకు ఉపాధి కల్పించే విషయమై మాట్లాడారా...? 3 వేలమంది ఉద్యోగులుంటే జిల్లాకు చెందిన వారికి 300 మందికైనా అవకాశం ఇప్పించారా...? జేజేలు పలికించుకోవాలంటే ముందుగా ప్రజల మన్నలు పొందాలని ప్రకాష్‌రెడ్డి హితవు పలికారు. ఈ విషయం మీ కుమారుడికి తెలియజెప్పండని సూచించారు. ♦ 25 ఏళ్లుగా మీ క్షుద్ర రాజకీయాలు చూసి ప్రజలు అలిసిపోయారనీ, అందుకే మార్పు కోసం ఎదురు చూస్తున్నారని ప్రకాష్‌రెడ్డి అన్నారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రజలకు అండగా నిలుస్తున్నారనీ, రాప్తాడు నియోజకవర్గంలో లక్ష ఎకరాలకు సాగునీరిస్తామని భరోసా ఇచ్చారన్నారు. డ్వాక్రా మహిళలు, రైతులు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీకు అండగా ఉంటామంటున్నామన్నారు. అందుకే ప్రజలు వైఎస్ జగన్ వెంట నడుస్తున్నారన్నారు. సమావేశంలో రైతు విభాగం జిల్లా అధ్యక్షుడు బోయ రాజారాం పాల్గొన్నారు. -
సాక్షి కార్యాలయం ఎదుట పరిటాల శ్రీరామ్ వీరంగం
-
సాక్షి కార్యాలయం ఎదుట పరిటాల శ్రీరామ్ వీరంగం
సాక్షి, అనంతపురం : అనంతపురంలో మంత్రి పరిటాల సునీత వర్గీయులు వీరంగం సృష్టించారు. తమకు వ్యతిరేకంగా వార్తలు రాస్తున్నారంటూ అనంతపురం కమలానగర్‌లోని సాక్షి ప్రాంతీయ కార్యాలయం ఎదుట మంత్రి పరిటాల వర్గీయులు ధర్నా చేశారు. ఈ ధర్నాకు నేతృత్వం వహించిన మంత్రి సునీత తనయుడు పరిటాల శ్రీరామ్.. సాక్షి మీడియా పై తన అక్కసు వెళ్లగక్కారు. సాక్షి కార్యాలయం వద్ద మంత్రి పరిటాల సునీత వర్గీయుల ధర్నాను వైఎస్సార్ సీపీ రాప్తాడు సమన్వయకర్త తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. నిజాలు నిర్భయంగా తెలియజేసే సాక్షి మీడియాపై అనవసర రాద్ధాంతం చేయటం మంత్రి పరిటాల సునీతకు తగదన్నారు. రాప్తాడు నియోజకవర్గంలో మంత్రి పరిటాల సునీత, ఆమె కుటుంబ సభ్యులు వందల కోట్ల అవినీతికి, అక్రమాలకు పాల్పడ్డారని ధ్వజమెత్తారు. వాటిని ప్రజలకు ఆధారాలతో సహా వివరిస్తున్న సాక్షి మీడియా పై అక్కసు వెళ్లగక్కటం మంత్రి పదవిలో ఉన్న పరిటాల సునీతకు తగదని తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి మండిపడ్డారు. వైఎస్సార్ సీపీ రాప్తాడు సమన్వయకర్త తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి