పేదల భూములు కొల్లగొడుతున్న పరిటాల వర్గీయులు | Thopudurthi Prakash Reddy Fires On Paritala Followers | Sakshi
Sakshi News home page

పేదల భూములను పరిటాల వర్గీయులు ఆక్రమిస్తున్నారు

Published Sun, Apr 15 2018 3:57 PM | Last Updated on Thu, Sep 13 2018 5:25 PM

Thopudurthi Prakash Reddy Fires On Paritala Followers - Sakshi

వైఎస్సార్ సీపీ రాప్తాడు సమన్వయకర్త తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి (ఫైల్‌)

సాక్షి, అనంతపురం : గతంలో పేద రైతులకు పంపణీ చేసిన భూములను పరిటాల వర్గీయులు ఆక్రమిస్తున్నారని, అధికారులపై పెత్తనం చెలాయిస్తూ రైతుల భూములను తమ పేరిట మార్చుకుంటున్నారని వైఎస్సార్ సీపీ రాప్తాడు సమన్వయకర్త తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి ఆరోపించారు. టీడీపీ కార్యకర్తల నిర్వాకంతో మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకున్న రైతు కేశవనాయక్ కుటుంబాన్ని ఆయన ఆదివారం పరామర్శించారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ... కేశవనాయక్ ఆత్మహత్యకు మంత్రి పరిటాల సునీత బాధ్యత వహించాలని ఆయన డిమాండ్‌ చేశారు. జిల్లా రెవెన్యూ అధికారులు ఆత్మకూరు మండలం వేపచర్ల రైతు కేశవనాయక్‌కు చెందిన భూమి పట్టాను రద్దు చేసి అదే భూమిని టీడీపీ కార్యకర్తలకు కేటాయించడంతో మనస్తాపానికి గురైన  కేశవనాయక్ ఆత్మహత్యకు పాల్పడిన విషయం తెలిసిందే.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement