కనగానపల్లిలో వలంటీర్లకు పురస్కార పత్రాలు అందజేస్తున్న ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి
సాక్షి,కనగానపల్లి(అనంతపురం): నాడు జన్మభూమి కమిటీల పేరుతో చంద్రబాబు దోపిడీ పాలన సాగిస్తే, నేడు వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో వలంటీర్ల ద్వారా సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రజా సంక్షేమ పాలన అందిస్తున్నారని రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి అన్నారు. ఆరు గ్రామ పంచాయతీల్లోని 75 మంది ఉత్తమ గ్రామ వలంటీర్లకు కనగానపల్లి ఎంపీడీఓ కార్యాలయం వద్ద శనివారం సాయంత్రం ఆయన పురస్కారాలు అందజేసి సత్కరించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడారు.
ప్రతి సంక్షేమ పథకం ప్రతి ఇంటికీ నేరుగా చేరాలన్న ఉద్దేశంతో సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి దేశంలో తొలిసారిగా వలంటీర్ల వ్యవస్థను తీసుకొచ్చారన్నారు. ప్రభుత్వ పాలనను ప్రజల ముంగిటకు తీసుకొచ్చేందుకు సచివాలయ వ్యవస్థను ప్రవేశపెట్టారన్నారు. వలంటీర్లు, సచివాలయ వ్యవస్థ సీఎం జగన్‌కు రెండు కళ్లులాంటివని అన్నారు. టీడీపీ ప్రభుత్వంలో చంద్రబాబు తన పార్టీ నాయకులతో జన్మభూమి కమిటీలు ఏర్పాటు చేసి ప్రజాధనాన్ని దోచిపెట్టారని ఆరోపించారు.
ఫ్యాక్షన్, వర్గ రాజకీయాలకు పరిటాల కుటుంబం పుట్టినిల్లు:
రాప్తాడు నియోజక వర్గంలో ఫ్యాక్షన్, వర్గ రాజకీయాలకు పరిటాల కుటుంబం çపుట్టినిల్లని ఎమ్మెల్యే ప్రకా‹Ùరెడ్డి విమర్శించారు. నియోజకవర్గంలో 25 ఏళ్లలో జరగని అభివృద్ధి పనులను తాము చేస్తున్నామన్నారు. పేరూరు డ్యాంను నీటితో నింపడంతోపాటు రామగిరి బంగారు గనులు తెరిపిస్తున్నారు. తాము చేస్తున్న అభివృద్ధిని చూసి ఓర్వలేక టీడీపీ నాయకులు తమపై అసత్య ఆరోపణలు చేస్తున్నారన్నారు.
పరిటాల కుటుంబం గ్రామాల్లో వర్గ రాజకీయాలను ప్రేరేపిస్తోందన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ కుంపటీ భాగ్యమ్మ, జెడ్పీటీసీ సభ్యుడు మారుతీప్రసాద్, వైస్ ఎంపీపీలు నరసింహారెడ్డి, పద్మావతి, తహసీల్దార్ మురళీ, ఎంపీడీఓ విజయభాస్కర్, సొసైటీ అధ్యక్షుడు భాస్కర్, డైరెక్టర్ ప్రభాకర్, అగ్రి బోర్డు చైర్మన్ వెంకటరాముడు, నియోజకవర్గ వైఎస్సార్‌సీపీ నాయకుడు తోపుదుర్తి రాజశేఖర్‌రెడ్డి, కన్వీనర్ అమరనాథ్‌రెడ్డి, పలువురు ఎంపీటీసీలు, సర్పంచ్‌లు పాల్గొన్నారు.
రాప్తాడు: స్థానిక ఎంపీడీఓ కార్యాలయంలో ఎంపీపీ చిట్రెడ్డి జయలక్ష్మి అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకా‹Ùరెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని మండలంలోని 8 గ్రామ సచివాలయాలకు చెందిన వలంటీర్లను సన్మానించి సేవా వజ్ర, సేవా రత్న, సేవా మిత్ర అవార్డులు ప్రదానం చేసి ప్రశంసా పత్రాలు అందజేశారు. వలంటీర్లు, సచివాలయ వ్యవస్థ దేశానికే ఆదర్శమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభినందించారని గుర్తు చేశారు.
సేవా దృక్పథంతో పని చేస్తున్న వలంటీర్లను టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అవహేళనగా మాట్లాడడం సిగ్గుచేటన్నారు. జెడ్పీటీసీ సభ్యురాలు పసుపుల హేమావతి, వైస్ ఎంపీపీలు బోయ రామాంజినేయులు, మన్నల వరలక్షి్మ, ఎంపీడీఓ సాల్మన్, తహసీల్దార్ ఈరమ్మ, ఈఓఆర్డీ మాధవి, యూత్ విభాగం మండల కన్వీనర్ చిట్రెడ్డి సత్యనారాయణ రెడ్డి, నాయకులు పసుపుల ఆది, యర్రగుంట కేశవ రెడ్డి, సర్పంచులు, ఎంపీటీసీలు, సచివాలయ ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment