
తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి
సాక్షి, అనంతపురం : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిర్వాకం వల్లే వలసలు పెరిగాయని వైఎస్సార్‌సీపీ నేతలు తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి, శంకర్ నారాయణ, నదీం అహ్మద్ విమర్శించారు. ఆదివారం బెంగళూరు వలస కూలీలతో వైఎస్సార్‌సీపీ నేతలు ముఖాముఖి నిర్వహించారు. అనంతపురం జిల్లానుంచి బెంగళూరుకు వలస వెళ్లిన వారి స్థితిగతులను వారు ఆరా తీశారు. వైఎస్సార్‌సీపీ నేతలు మాట్లాడుతూ.. వలసలు పెరగటం వల్ల రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
కర్నాటక, కేరళ వంటి రాష్ట్రాలకు వేలాదిగా వలస వెళ్లారన్నారు. ఉపాది పనులు కల్పించనందుకే ఈ దుస్థితి వచ్చిందన్నారు. వైఎస్ జగన్ ముఖ్యమంత్రి అయిన వెంటనే వలస కూలీలంతా సొంత గ్రామాలకు తిరిగిరావాలని కోరారు. ఉపాధి అవకాశాలు కల్పిస్తామని బరోసా ఇచ్చారు. వ్యవసాయాన్ని పండుగ చేస్తామని హామీ ఇచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment