Nadim Ahmad
-
‘టీడీపీ పాలనలో ప్రజాధనం లూటీ’
సాక్షి, అనంతపురం: అవినీతికి చిరునామా చంద్రబాబు నాయుడని వైఎస్సార్సీపీ హిందూపురం పార్లమెంట్ సమన్వయకర్త నదీం అహ్మద్‌అన్నారు. ఆయన సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబు రెండు ఎకరాల భూమి నుంచి రూ.రెండు లక్షల కోట్లు అక్రమంగా సంపాధించిన ఘనుడని ఆయన మండిపడ్డారు. ఐటీ దాడుల్లో చంద్రబాబుకు చెందిన రూ.రెండు వేల కోట్ల బినామీ లావాదేవీలు వెలుగు చూశాయని ఆయన తెలిపారు. (మౌనంగా ఉంటే నేరాన్ని అంగీకరించినట్లేగా) చంద్రబాబు పీఏ ఇంట్లో విలువైన డైరీ, కీలక పత్రాలను ఐటీ అధికారులు స్వాధీనం చేసుకున్నారని నదీం అహ్మద్ పేర్కొన్నారు. అదేవిధంగా 2.63 లక్షల పంచనామా పత్రాన్ని చూపి తప్పించుకోవాలని టీడీపీ నేతలు భ్రమపడుతున్నారని ఎద్దేవా చేశారు. టీడీపీ పాలనలో ప్రజాధనం లూటీ అయిందనన్నారు. వేల కోట్ల సోమ్మును టీడీపీ నేతలు జేబుల్లో నింపుకున్నారని నదీం మండిపడ్డారు. చంద్రబాబు, లోకేష్‌లపై సీబీఐ, ఈడీ విచారణ చేపట్టాలన్నారు. చంద్రబాబును వెంటనే అరెస్టు చేయాలని నదీం అహ్మద్ డిమాండ్ చేశారు. (చంద్రబాబు, లోకేష్‌లపై సీబీఐ విచారణ చేపట్టాలి) -
టీడీపీ మాజీ మంత్రిపై ఎస్పీకి ఫిర్యాదు!
సాక్షి, అనంతపురం: టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు పాలనలో... మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డి రైతుల నుంచి బలవంతంగా భూములను లాక్కున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా పార్లమెంటు అధ్యక్షుడు నదీం అహ్మద్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. రఘునాథరెడ్డి భూ అక్రమాలపై సమగ్ర విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు. ఈ క్రమంలో రఘునాథరెడ్డిపై విత్తనాల వ్యాపారి ఆదినారాయణ యాదవ్, అలమూరు రైతులు ఎస్పీకి ఫిర్యాదు చేశారు. ఆలమూరులో 29 ఎకరాల అసైన్డ్ భూములను ఆయన ఆక్రమించారని రైతులు ఫిర్యాదులో పేర్కొన్నారు. అదే విధంగా ఆయన నుంచి తమకు ప్రాణహాని ఉందని రైతులు ఫిర్యాదు చేశారు. తమ భూములను పల్లె రఘునాథరెడ్డి అక్రమంగా ఆక్రమించారని మీడియా ఎదుట రైతులు వాపోయారు. -
‘చంద్రబాబు నిర్వాకం వల్లే వలసలు’
సాక్షి, అనంతపురం : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిర్వాకం వల్లే వలసలు పెరిగాయని వైఎస్సార్సీపీ నేతలు తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి, శంకర్ నారాయణ, నదీం అహ్మద్ విమర్శించారు. ఆదివారం బెంగళూరు వలస కూలీలతో వైఎస్సార్సీపీ నేతలు ముఖాముఖి నిర్వహించారు. అనంతపురం జిల్లానుంచి బెంగళూరుకు వలస వెళ్లిన వారి స్థితిగతులను వారు ఆరా తీశారు. వైఎస్సార్సీపీ నేతలు మాట్లాడుతూ.. వలసలు పెరగటం వల్ల రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కర్నాటక, కేరళ వంటి రాష్ట్రాలకు వేలాదిగా వలస వెళ్లారన్నారు. ఉపాది పనులు కల్పించనందుకే ఈ దుస్థితి వచ్చిందన్నారు. వైఎస్ జగన్ ముఖ్యమంత్రి అయిన వెంటనే వలస కూలీలంతా సొంత గ్రామాలకు తిరిగిరావాలని కోరారు. ఉపాధి అవకాశాలు కల్పిస్తామని బరోసా ఇచ్చారు. వ్యవసాయాన్ని పండుగ చేస్తామని హామీ ఇచ్చారు. -
ఫ్యాను గాలికి సైకిల్ కొట్టుకుపోవడం ఖాయం
ఓడీ చెరువు: ఫ్యాను గాలికి సైకిల్ కొట్టుకుపోవడం ఖాయం.. రాబోవు ఎన్నికల్లో వైఎస్సార్సీపీ అత్యధిక స్థానాలు కైవసం చేసుకుని, ఏపీలో వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రి అవడం ఖాయం అని ఆ పార్టీ హిందూపురం పార్లమెంట్ సమన్వయకర్త నదీం, పుట్టపర్తి, కదిరి నియోజకవర్గ సమన్వయకర్తలు దుద్దుకుంట శ్రీధర్‌రెడ్డి, డాక్టర్ సిద్దారెడ్డి అన్నారు. ఆదివారం ఓడీ చెరువు మండలం కొండకమర్లలో ముస్లిం మైనార్టీ నాయకులు పొగాకు నిషార్, పొగాకు సుల్తాన్, పొగాకు మైనుద్దీన్, పొగాకు చాంద్‌బాషా ఆధ్వర్యంలో భారీ ఎత్తున టీడీపీ నుంచి ఎస్సీ, బీసీ,మైనారిటీ వర్గాల ప్రజలు వైఎస్సార్సీపీలో చేరారు. నవరత్నాలుతో బడుగులకు సంక్షేమ పథకాలు : ఈసందర్భంగా ఏర్పాటు చేసిన సభలో నదీం అహమ్మద్ మాట్లాడుతూ ముస్లిం సంక్షేమానికి పాటుపడింది ఒక్క వైఎస్సార్ మాత్రమే అన్నారు.ముస్లింలకు నాలుగుశాతం రిజర్వేషన్ ఇచ్చిన ఘనత దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డిదేనన్నారు. రిజర్వేషన్ ఇవ్వడం వల్లే ముస్లింలకు ఉద్యోగాలు వస్తున్నాయన్నారు. రాజన్న అడుగుజాడల్లో ఆయన తనయుడు జగనన్న నడుస్తూ గత అసెంబ్లీ ఎన్నికల్లో నలుగురు ముస్లిం ఎమ్మెల్యేలను అసెంబ్లీకి పంపారన్నారు. పుట్టపర్తి ఎమ్మెల్యే పల్లె రఘునాథరెడ్డి వక్ఫ్‌బోర్డు మంత్రిగా ఉన్నా ఒక్క అభివృద్ధి పనీ చేసిందిలేదన్నారు. పుట్టపర్తి, కదిరి సమన్వయకర్తలు దుద్దుకుంట శ్రీధర్‌రెడ్డి, డాక్టర్ సిద్దారెడ్డి మాట్లాడుతూ వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రవేశపెట్టనున్న నవరత్నాలతో అట్టడుగు స్థాయి ప్రజలకు సంక్షేమ ఫలాలు అందుతాయన్నారు. జగన్మోహన్రెడ్డికి వస్తున్న ప్రజాదరణతో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు మతి భ్రమించిందన్నారు. అనంతరం కొండకమర్ల పంచాయతీ పరిధిలోని డబురువారిపల్లి, మల్లోల్లపల్లి, మారుతీ తండా, గజ్జిబండతండా, బత్తినపల్లి, దిగువపల్లి, నాయనాకోట, చెరువు వాండ్లపల్లి నుంచి భారీగా చేరారు. పార్టీలో చేరిన వారికి నేతలు కండువాలు వేసి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ముస్లిం మైనార్టీ నాయకులు పొగాకు నిషార్, పొగాకు సుల్తాన్, పొగాకు మైనుద్దీన్, పొగాకు చాంద్‌బాషా మాట్లాడుతూ మాట్లాడుతూ టీడీపీ నాయకులు చేస్తున్న అరాచకాలను చూసి సహించలేకే టీడీపీని వీడి వైఎస్సార్సీపీలో చేరుతున్నట్లు తెలిపారు. -
మైనార్టీ ఓట్ల కోసమే బాబు కపటనాటకం
వైఎస్సార్సీపీ మైనార్టీ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు నదీంఅహమ్మద్ అనంతపురం: కర్నూలు జిల్లా నంద్యాల ఉప ఎన్నిక నేపథ్యంలో మైనార్టీ ఓటర్లను ఆకట్టుకునేందుకు సీఎం చంద్రబాబు కపటనాటకం ఆడుతున్నారని వైఎస్సార్సీపీ మైనార్టీ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు నదీంఅహమ్మద్ అన్నారు. మంగళవారం సాయంత్రం అనంతపురంలోని పార్టీ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. నంద్యాలలో 75వేల ముస్లిం మైనార్టీల ఓట్లు ఉన్నాయని, ఇన్ని రోజులుగా వీరిని ఏమాత్రం పట్టించుకోని బాబు ఇప్పుడు ఎక్కడ లేని ప్రేమ చూపడం వెనుక ఆంతర్యం ప్రజలకు తెలియనిది కాదన్నారు. తెలుగుదేశం పార్టీ పార్లమెంటరీ సమావేశం నాలుగు గంటల పాటు జరిగితే అందులో మూడు గంటలు వైఎస్ జగన్ ఇచ్చిన హామీలపైనే చర్చించారంటే వారిలో ఎంత భయం ఉందో అర్థమవుతోందన్నారు. దివంగత వైఎస్ కులమతాలకు అతీతంగా సంక్షేమ పథకాలు అమలు చేశారన్నారు. అదే స్ఫూర్తితో వైఎస్ జగన్ హామీలు ఇచ్చారన్నారు. పలు సర్వేలు చేయించి గెలిచే వారికే టికెట్లు ఇస్తామని చంద్రబాబు అంటున్నారని, ఆయన సర్వేలో కుమారుడు లోకేష్ గెలవలేడని తేలడంతోనే అడ్డదారిలో ఎమ్మెల్సీని చేసి మంత్రిని చేసినట్లున్నారని ఎద్దేవా చేశారు. గత ఎన్నికల్లో ముస్లిం మైనార్టీలకు ఒకే ఒక్క సీటు ఇచ్చారని.. అది కూడా ఓడిపోయే స్థానాన్ని కేటాయించారన్నారు. పశ్చిమ రాయలసీమ పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ వెన్నపూస గోపాల్‌రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలను ప్రభుత్వం అంచెలంచెలుగా నిర్వీర్యం చేస్తోందని.. మంత్రి నారాయణకు వీటిని ధారాదత్తం చేసేందుకు కుట్ర జరుగుతోందన్నారు. తమ పార్టీ అధికారంలోకి వస్తే అమ్మవొడి పథకం ద్వారా ప్రభుత్వ పాఠశాలలను కచ్చితంగా బలోపేతం చేస్తామన్నారు. చంద్రబాబు ఎన్ని గిమ్మిక్కులు చేసినా మైనార్టీలు నంద్యాలలో తగిన గుణపాఠం చెబుతారన్నారు. జన్మభూమి కమిటీలు రాజ్యాంగేతర శక్తిగా మారాయని.. విద్యుత్ ప్రమాదంలో రెండు చేతులు కోల్పోయిన వ్యక్తికి పింఛను ఇవ్వలేని స్థితిలో జన్మభూమి కమిటీలు ఉన్నాయన్నారు.