
సాక్షి, అనంతపురం: అవినీతికి చిరునామా చంద్రబాబు నాయుడని వైఎస్సార్‌సీపీ హిందూపురం పార్లమెంట్ సమన్వయకర్త నదీం అహ్మద్‌అన్నారు. ఆయన సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబు రెండు ఎకరాల భూమి నుంచి రూ.రెండు లక్షల కోట్లు అక్రమంగా సంపాధించిన ఘనుడని ఆయన మండిపడ్డారు. ఐటీ దాడుల్లో చంద్రబాబుకు చెందిన రూ.రెండు వేల కోట్ల బినామీ లావాదేవీలు వెలుగు చూశాయని ఆయన తెలిపారు. (మౌనంగా ఉంటే నేరాన్ని అంగీకరించినట్లేగా)
చంద్రబాబు పీఏ ఇంట్లో విలువైన డైరీ, కీలక పత్రాలను ఐటీ అధికారులు స్వాధీనం చేసుకున్నారని నదీం అహ్మద్ పేర్కొన్నారు. అదేవిధంగా 2.63 లక్షల పంచనామా పత్రాన్ని చూపి తప్పించుకోవాలని టీడీపీ నేతలు భ్రమపడుతున్నారని ఎద్దేవా చేశారు. టీడీపీ పాలనలో ప్రజాధనం లూటీ అయిందనన్నారు. వేల కోట్ల సోమ్మును టీడీపీ నేతలు జేబుల్లో నింపుకున్నారని నదీం మండిపడ్డారు. చంద్రబాబు, లోకేష్‌లపై సీబీఐ, ఈడీ విచారణ చేపట్టాలన్నారు. చంద్రబాబును వెంటనే అరెస్టు చేయాలని నదీం అహ్మద్ డిమాండ్ చేశారు. (చంద్రబాబు, లోకేష్‌లపై సీబీఐ విచారణ చేపట్టాలి)
Comments
Please login to add a commentAdd a comment