
సాక్షి, అనంతపురం: టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు పాలనలో... మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డి రైతుల నుంచి బలవంతంగా భూములను లాక్కున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా పార్లమెంటు అధ్యక్షుడు నదీం అహ్మద్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. రఘునాథరెడ్డి భూ అక్రమాలపై సమగ్ర విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు. ఈ క్రమంలో రఘునాథరెడ్డిపై విత్తనాల వ్యాపారి ఆదినారాయణ యాదవ్, అలమూరు రైతులు ఎస్పీకి ఫిర్యాదు చేశారు. ఆలమూరులో 29 ఎకరాల అసైన్డ్ భూములను ఆయన ఆక్రమించారని రైతులు ఫిర్యాదులో పేర్కొన్నారు. అదే విధంగా ఆయన నుంచి తమకు ప్రాణహాని ఉందని రైతులు ఫిర్యాదు చేశారు. తమ భూములను పల్లె రఘునాథరెడ్డి అక్రమంగా ఆక్రమించారని మీడియా ఎదుట రైతులు వాపోయారు.
Comments
Please login to add a commentAdd a comment