సాక్షి, చిత్తూరు/కృష్ణా: వైఎస్సార్‌సీపీ సామాజిక సాధికార యాత్ర అయిదో రోజు కొనసాగుతోంది. ఉత్తరాంధ్రలో అనకాపల్లి జిల్లా మాడుగుల, కోస్తాలో అవనిగడ్డ, రాయలసీమలో చిత్తూరు జిల్లాల్లో బస్సుయాత్ర సాగుతోంది.
కృష్ణాజిల్లా అవనిగడ్డలో బస్సు యాత్ర
ఓటు వేసిన వారికి, వేయని వారికి సంక్షేమ పథకాలు అందించామని మంత్రి కారుమూరి నాగేశ్వరరావు పేర్కొన్నారు. సీఎం జగన్ పాలనలోనే సామాజిక న్యాయం జరిగింది. 56 కార్పొరేషన్లు ఇచ్చిన ఘనత సీఎం జగన్‌దేనని ప్రశింసించారు. రావాలి జగన్.. కావాలి జగన్ అని ప్రజలు కోరుకుంటున్నారన్నారు. టీడీపీ హయాంలో 36 వేల కోట్లతో కత్తెరలు,ఇస్త్రీ పెట్టెలు ఇచ్చి తిరిగి డబ్బు కట్టించుకున్నారని విమర్శించారు. లక్ష కోట్లతో తిరిగి చెల్లించే అవసరం లేకుండానే సీఎం సాయం చేశారని ప్రస్తావించారు.
► 65 వేల కోట్లతో నాడు-నేడు పనులతో ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు మార్చారు: మంత్రి కారుమూరి
►పేద పిల్లల నుంచి ఐఏఎస్ లు, ఐపీఎస్‌లు రావాలని ఆకాంక్షించిన వ్యక్తి సీఎం జగన్.
►పేదరికాన్ని 6%కి తగ్గించిన మహానేత వైఎస్ జగన్
►పోషకాహార లోపాన్ని అధిగమించేలా పిల్లలకు పౌష్టికాహారం అందించిన మనసున్న నేత
►చంద్రబాబు జీవిమంతా స్కాములే
►జగన్ మోహన్ రెడ్డి పాలనలో స్కీములు
►చంద్రబాబు కలెక్టర్ల మీటింగ్‌లలో మా వాళ్లకే చేయమని చెప్పాడు.
►సీఎం జగన్ పార్టీలు, కులాలను చూడకుండా మేలు చేయాలని చెప్పారు.
►సీఎంకు రెడ్డికి వ్యతిరేక ఓటనేదే లేదు
►మా నినాదం వై నాట్ 175
►చంద్రబాబు, పవన్‌కు ఈ ఎన్నికల్లో చరమగీతమే
ఎమ్మెల్సీ,మర్రి రాజశేఖర్
►మ్యానిఫెస్టోలో చెప్పివన్నీ అమలు చేసిన వ్యక్తి సీఎం జగన్.
►రైతులను ఆదుకున్న ప్రభుత్వం ఇది.
►అన్ని వర్గాలకు మేలు చేసిన ప్రభుత్వం ఇది.
►చంద్రబాబు ఇచ్చిన ఏ ఒక్క హామీ నెరవేర్చలేదు.
►డ్వాక్రా మహిళలు, రైతులను మోసం చేసిన వ్యక్తి చంద్రబాబు.
►ధైర్యంగా ప్రతీ ఇంటికీ ఓటు అడిగే హక్కు సీఎం జగన్ మాకు కల్పించారు.
►ప్రతీ ఇంటికీ లబ్ధి చేకూర్చిన ప్రభుత్వం ఇది.
►గత 75 ఏళ్లలో సచివాలయాలు, వెల్ నెల్ సెంటర్లు ఏ గ్రామంలోనూ చూడలేదు.
►ప్రజలు సామాజికంగా,ఆర్ధికంగా వృద్ధి చెందాలన్నదే సీఎం ఆలోచన
మోపిదేవి వెంకట రమణ
►గత ప్రభుత్వంలో బీసీ వర్గాలు ఓటు బ్యాంకు రాజకీయాలకే పరిమితమయ్యారు.
► సీఎం జగన్ పాలనలో బీసీలకు ఎంతో మేలు జరిగింది.
►బీసీ, ఎస్సీ,ఎస్టీ,మైనార్టీ వర్గాలు తలెత్తుకు తిరిగేలా చేసిన వ్యక్తి సీఎం జగన్.
► 2 లక్షల 38కోట్లతో నేరుగా లబ్ధిదారులకు మేలు జరిగింది.
►భూతద్ధం పెట్టి వెతికినా సంక్షేమం అందలేదనే వ్యక్తి కనిపించడం లేదు.
►గత ప్రభుత్వంలో బిసిలకు రాజ్యసభ సీటు ఇచ్చిన పరిస్థితి లేదు.
►చరిత్రలో బీసీలకు పెద్ద పీట వేసిన ఒకే ఒక్క నేత జగన్ మోహన్ రెడ్డి .
►జగన్ మోహన్ రెడ్డి బీసీ,ఎస్సీ, ఎస్టీ,మైనార్టీ వర్గాలకు ఆర్ధికంగా, రాజకీయంగా సాధికారత కల్పించారు.
మంత్రిమేరుగ నాగార్జున
►సామాజిక సాధికార యాత్ర ఎందుకు అవసరమో మనం తెలుసుకోవాలి.
►అనేక మంది ఉద్ధండులు సామాజిక రుగ్మతలు పోవాలని ఉద్యమాలు చేశారు.
►ఏపీ చరిత్రలో సామాజిక విప్లవానికి తెరతీసిన వైఎస్ జగన్.
►చంద్రబాబు ఎస్సీలను ఘోరంగా అవమానించాడు.
►మాకు జరిగిన అవమానాన్ని మేం ఎన్నటికీ మర్చిపోం.
►పేదలకు ఇళ్లు ఇస్తుంటే సామాజిక అసమానతలు వస్తాయన్న మాట మర్చిపోం.
►దళితుల వెలివేతలు మర్చిపోం.
►పేదలకు కార్పొరేట్ వైద్యం అందిస్తున్న వ్యక్తి సీఎం జగన్.
►చంద్రబాబు 14 ఏళ్లలో ఏనాడైనా వైఎస్ జగన్ సంక్షేమం చేశాడా?
►చంద్రబాబు ఎందుకు వద్దో.. జగన్ఎందుకు కావాలో చెప్పేందుకే ఈ సాధికార యాత్ర
►చంద్రబాబు రాష్ట్ర రాజకీయాలను కలుషితం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు.
►జగన్ మోహన్ రెడ్డిని కాపాడుకోవాల్సిన బాధ్యత మనపై ఉంది.
►బీసీ, ఎస్సీ,ఎస్టీ,మైనార్టీ వర్గాలు ఐక్యతగా ఉండాల్సిన అవసరం ఉంది.
►మనమంతా కలిసి చంద్రబాబు రధ చక్రాలు ఊడగొడదాం.
►చంద్రబాబు ఆరోగ్యం బాలేదని...బయటికి వచ్చి రాజకీయ వ్యాపారం చేస్తున్నాడు.
►రాజకీయ వ్యాపారం చేస్తున్న చంద్రబాబు అంతు చూడాల్సిన బాధ్యత మనపై ఉంది.
►జగన్ మోహన్ రెడ్డికి మనమంతా అండగా నిలవాలి.
►అవననిగడ్డలో సింహాద్రి రమేష్ బాబును.. రాష్ట్రంలో జగన్‌ను గెలిపించుకోవాల్సిన అవసరం మనపై ఉంది.
చిత్తూరులో సామాజిక సాధికార బస్సు యాత్ర
చిత్తూరులో ఎమ్మెల్యే ఆరని శ్రీనివాసులు ఆధ్వర్యంలో బస్సు యాత్ర సాగింది. మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, నారాయణస్వామి, అంజాద్ భాషా తదితరులు పాల్గొన్నారు. మధ్యాహ్నం 2:45 గంటలకు విలేకర్ల సమావేశంలో నేతలు పాల్గొన్నారు. సూర్య ప్రతాప కళ్యాణమండపం నుంచి బైక్, ఆటో ర్యాలీ చేశారు. అనంతరం 4 గంటలకు నాగయ్య కళాక్షేత్రం వద్ద బహిరంగ సభలో నేతలు ప్రసంగించారు.
డిప్యూటీ సీఎం నారాయణ స్వామి
►సీఎం జగన్ పాలన సంక్షేమానికి చిరునామా.
► అన్ని వర్గాలకూ న్యాయం చేసిన నాయకుడు సీఎం జగన్
► బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు అండగా నిలిచిన నాయకుడు వైఎస్ జగన్
►పేదల తలరాత మార్చాలంటే సామాజిక న్యాయంతోనే సాధ్యం
►చంద్రబాబు ఏ రోజూ వెనుకబడిన వర్గాలను పట్టించుకోలేదు
►దళితులను అవమానించిన నీచుడు చంద్రబాబు
►ఎస్సీల్లో ఎవరైనా పుట్టాలనుకుంటారా అన్నది ఎవరు?
►దళితులను అవమానించిన నీచుడు చంద్రబాబు
►ఎస్సీల్లో ఎవరైనా పుట్టాలనుకుంటారా అని అన్నది ఎవరు?
►బీసీలను చంద్రబాబు ఎప్పుడైనా పట్టించుకున్నారా
►సామాజిక న్యాయం నినాదాన్ని గత ప్రభుత్వం ఓటు బ్యాంకుగానే వాడుకుంది.
►ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చిన నాయకుడు సీఎం జగన్.
Comments
Please login to add a commentAdd a comment