
సాక్షి, అమరావతి: ఏపీలో టీడీపీకి మరో ఎదురుదెబ్బ తగిలింది. ఇప్పటికే టీడీపీకి చెందిన పలువురు నేతలు వైఎస్సార్‌సీపీలో చేరిన విషయం తెలిసిందే. తాజాగా మరో ఇద్దరు టీడీపీ కీలక నేతలు ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సమక్షంలో వైఎస్సార్‌సీపీలో చేరారు.
కాగా, తాడేపల్లిలోకి సీఎం క్యాంప్ ఆఫీసులో సీఎం వైఎస్ జగన్ సమక్షంలో టీడీపీ రాష్ట్ర కార్యదర్శి, మాజీ చేనేత ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ వావిలాల సరళాదేవి, ఆమె భర్త వావిలాల వెంకట రమేష్ వైఎస్సార్‌సీపీలో చేరారు. ఈ సందర్భంగా వారి వెంట పౌరసరఫరాల శాఖ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు కూడా ఉన్నారు.