
గంటా శ్రీనివాసరావుతో మాట్లాడుతున్న విద్యార్థిని తల్లి
సాక్షి, విశాఖపట్నం: రాష్ట్ర విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావుకు ఊహించని షాక్ తగిలింది. ఓ విద్యార్థిని తల్లి నేరుగా ప్రభుత్వాన్ని విమర్శిస్తూ చురకలు అంటించడంతో ఆయన బిత్తర పోయారు. వివరాలు.. భీమిలిలోని ఆంధ్రప్రదేశ్ రెసిడెన్షియల్‌ను మంత్రి గంటా శనివారం సందర్శించారు. ఇటీవల చోటుచేసుకున్న కలుషితాహార ఘటనపై స్కూల్ యాజమాన్యంతో ఆయన మాట్లాడుతుండగా.. కాలం చెల్లిన పప్పుల ప్యాకెట్‌ను మంత్రి ముందు ఉంచిన ఓ విద్యార్థిని తల్లి ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. ‘చూడండి సార్, మంచి పప్పులు పందికొక్కులు తింటున్నాయ్. ఇలాంటి కాలం చెల్లిన పప్పులను పిల్లలకు పెడుతున్నార’ని ఆమె కడిగిపారేశారు. ఈ పప్పులు తింటే పిల్లలు రేపటి పౌరులు కాదు.. రోగులు అవుతారని వ్యాఖ్యానించారు. అనుకోని సంఘటనతో మంత్రి గంటా కంగుతిన్నారు.
Comments
Please login to add a commentAdd a comment