
సాక్షి, భీమిలి : వైఎస్సార్‌సీపీలోకి టీడీపీ నేతల వలసలు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా భీమిలికి చెందిన రెండు వేల మంది తెలుగుదేశం నాయకులు గురువారం మంత్రి అవంతి శ్రీనివాస్ సమక్షంలో వైఎస్సార్‌సీపీలో చేరారు. చేరిన వారిలో జిల్లా పశుగణాభివృద్ధి సంస్థ మాజీ చైర్మన్ గాడు వెంకటప్పడు, ఆనందపురం నేతలు మణి శంకర నాయుడు, కాకర వెంకట రమణ, బిఆర్‌బి నాయుడు, తాతు నాయుడు, మాజీ సర్పంచ్‌లు జోగి నాయుడు, వెంకన్న, బాలా కుమారి, మీసాల రాము, నీలాపు సూర్యనారాయణ, జిల్లా టీడీపీ మహిళా కార్యదర్శి సరోజిని, తదితరులు ఉన్నారు. ఈ కార్యక్రమంలో భీమిలి వైఎస్సార్‌సీపీ అధ్యక్షులు ముతం శెట్టి మహేశ్, నాయకులు పోతిన శ్రీనివాస్, సూరిబాబు, బొట్ట అప్పలరాజు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment