
పీఎంపాలెం(భీమిలి): పనిప్రదేశంలో ప్రమాదవశాత్తు యంత్రంలో చిక్కుకొని మహిళ దుర్మణం చెందింది. మారికవలస వైఎస్సార్‌నగర్‌లో శనివారం చోటుచేసుకున్న ఈ ప్రమాదానికి సంబంధించి స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. వైఎస్సార్‌నగర్‌కు చెందిన చెల్లిబోయిన లక్ష్మి (38) స్థానికంగా ఉన్న ఓ స్టేషనరీ ఉత్పత్తుల కంపెనీలో పనిచేస్తోంది. శనివారం ఉదయం 9 గంటల సమయంలో ఎప్పటిలాగే పనిలోకి వెళ్లింది.
పనిచేస్తుండగా ప్రమాదవశాత్తు ఆమె చీర పేపరు బిల్లులు తయారు చేసే యంత్రంలో చిక్కుకుంది. దానితో కంగారు పడిన ఆమె చీర లాగడానికి ప్రయత్నించగా తల వెంట్రుకలు యంత్రంలో చిక్కుకున్నాయి. యంత్రం ఆమెను లాగేయడంతో అక్కడికక్కడే మరణించింది. మృతురాలి భర్త కృష్ణ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని సీఐ కె.లక్ష్మణమూర్తి తెలిపారు. ఆమెకు బాబు, పాప ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment