వీడని మిస్టరీ
వీడని మిస్టరీ
Published Mon, Oct 10 2016 12:04 AM | Last Updated on Mon, Sep 4 2017 4:48 PM
కోమాలోనే మహిళ
ముమ్మరంగా పోలీసుల దర్యాప్తు
రాజమహేంద్రవరం క్రైం : అపస్మారకస్థితిలో ఉన్న మహిళ సంఘటనకు సంబంధించిన మిస్టరీ వీడలేదు. ఆలమూరు మండలం పెద్దపళ్ల గ్రామానికి చెందిన చిలుకూరి భవాని గత నెల 30న బాకీలు వసూలు చేసుకువస్తానని చెప్పి మండపేట Ðð ళ్లినట్టు బంధువులు చెబుతున్నారు. ఆమెను మండపేట నుంచి కిడ్నాప్ చేసి రాజమహేంద్రవరం తీసుకువచ్చి ఉంటారని, ఆమెకు సన్నిహితులే ఈ సంఘటనకు పాల్పడి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. రైల్వే క్వార్టర్స్ గురించి పూర్తిగా తెలిసిన వారే ఈ సంఘటన కు పాల్పడి ఉంటారన్నారు. ఆ క్వార్టర్లలో ఖాళీగా ఉన్న పోర్షన్ గురించి బయట వారికి తెలిసే అవకాశం లేదన్నారు.
ముమ్మరంగా దర్యాప్తు
ఈ కేసులో మిస్టరీని ఛేదించేందుకు పోలీసులు ముమ్మరంగా దర్యాప్తు చేపట్టారు. దీనికి ఒక ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసినట్లు పోలీస్ ఉన్నతాధికారి తెలిపారు. బంధువులను, ఆమె వద్ద అప్పులు తీసుకున్న వారిని, గతంలో ఆమె పని చేసిన జ్యోతిషుడిని కూడా ప్రశ్నించేందుకు ప్రయత్నిస్తున్నారు. అయితే జ్యోతిషుడు ఇప్పటికే సెల్‌ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి పరారీలో ఉన్నట్లు తెలుస్తోంది.
కోమా నుంచి బయటకు వస్తేనే..
పోలీసులు ఇప్పటి వరకూ ఈ కేసులో ఎవరినీ అరెస్టు చేసిన దాఖలాలు లేవు. మహిళను మండపేట నుంచి కిడ్నాప్ చేసి తీసుకువచ్చి ఉంటారా? లేక రాజమహేంద్రవరం వచ్చిన తరువాత ఇక్కడే కిడ్నాప్ చేసి రైల్వే క్వార్టర్స్‌కు తీసుకువెళ్లారా అనేది ప్రశ్నార్థకంగా మారింది. ఎక్కువరోజులు కాళ్లూ చేతులూ కట్టేయడంతో ఆమె అవయవాల పనితీరు క్షిణించిందని వైద్యులు చెబుతున్నారు. దాని కారణంగా బ్రెయి¯Œæలో నరాలు దెబ్బతిని ఆ మహిళ కోమాలోనే ఉందన్నారు. కోమా నుంచి బయటకు వస్తేనే వివరాలు తెలుస్తాయన్నారు.
Advertisement
Advertisement