koma
-
ఒక్క ఫైట్ సీన్.. ఆ హీరో జీవితాన్నే ముగించింది!
కోలీవుడ్ సినీ ఇండస్ట్రీలో విషాదం నెలకొంది. దాదాపు 30 ఏళ్ల పాటు మంచానికే పరిమితమైన హీరో కన్నుమూశారు. షూటింగ్లో జరిగిన ప్రమాదంతో కోమాలోకి వెళ్లిన తమిళ హీరో బాబు చెన్నైలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో తుదిశ్వాస విడిచారు. ప్రముఖ దర్శకులు భారతీరాజా దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేసిన ఆయన 1990లో వచ్చిన 'ఎన్ ఉయిర్ తోజన్' అనే సినిమాతో అరంగేట్రం చేశారు. కాగా, ఈ సినిమాను తమిళ ప్రేక్షకులు ఎంతగానో ఆదరించారు. ఆయన మరణం పట్ల తమిళ సినీ ప్రముఖులు సంతాపం తెలిపారు. బాబు సినీ ప్రస్థానం! 1990ల్లో 'ఎన్ ఉయిర్ తోజన్' అనే సినిమాతో అరంగేట్రం తమిళ చిత్ర పరిశ్రమల్లో అగ్ర కథానాయకుడిగా ఎదిగారు. ఆ తర్వాత 'పెరుంపుల్లి', 'తాయమ్మ', 'పొన్నుకు చేతి వందచు' చిత్రాల్లో హీరోగా నటించారు. పల్లెటూరి కథలు తనకు బాగా వర్కవుట్ అవుతాయని కోలీవుడ్‌లో చెప్పుకుంటున్న తరుణంలో తన ఐదవ చిత్రం ‘మనసారా పరిహితంగానే’ చిత్రంలో నటించారు. ఆ సినిమానే బాబు జీవితాన్ని ఒక్కసారిగా మలుపుతిప్పింది. షూటింగ్ సమయంలోనే ఆయనకు తీవ్ర గాయాలయ్యాయి. ఆ ఫైట్ సీన్ వల్లే! ఈ సినిమా షూటింగ్ ప్రారంభమైన కొద్ది రోజులకే ఓ ఫైట్ సీన్ చిత్రీకరించారు. సన్నివేశంలో హీరో నేలపై నుంచి దూకాలి. నిజంగానే జంపింగ్ చేస్తానని బాబు చెప్పడంతో యూనిట్ అందుకు అంగీకరించలేదు. డూప్ పెట్టుకోవచ్చు కదా అని దర్శకుడు చెప్పినా వినకుండా రియలిస్టిక్‌గా ఉంటుందని.. అంటూ బాబు నిజంగానే జంప్ చేశాడు. ఆ తర్వాత అనుకోకుండా బాబు ప్రమాదవశాత్తు మరో చోట పడిపోవడంతో వీపుపై బలంగా తగిలి ఎముకలు విరిగిపోయాయి. వెన్నెముకకు శస్త్ర చికిత్స చేయించుకున్నప్పటికీ బాబు నిటారుగా కూర్చోలేని పరిస్థితి నెలకొంది. అతని కుటుంబం చాలా మంది వైద్యులను సంప్రదించి చికిత్స అందించింది. కానీ అవేమీ పని చేయలేదు. భారతీరాజా సంతాపం సెట్లో జరిగిన ప్రమాదంలో గాయపడి 30 ఏళ్లుగా మంచానికే పరిమితమైన బాబు మరణించాడనే వార్త నన్ను తీవ్రంగా కలిచివేసింది. ఆయన ఆత్మకు శాంతి చేకురాలని నేను ఆ భగవంతుడిని ప్రార్థిస్తున్నా. అంటూ సంతాపం ప్రకటించారు. కొన్ని నెలల క్రితమే దర్శకుడు భారతీరాజా బాబును స్వయంగా సందర్శించి వెళ్లిపోయారు. అయితే ఆ షూటింగ్ సమయంలో బాబు దెబ్బలు తిన్న తర్వాత మరో హీరోతో ‘మనసారా పరిహితంగానే’ సినిమా తీసినట్లు తెలుస్తోంది. బలమైన కోరికతో సినిమాల్లోకి వచ్చిన వ్యక్తి జీవితాన్ని ఫైట్ సీన్ ముగించింది. బాబుకు రాజకీయ నేపథ్యం కూడా ఉంది. ఎంజీఆర్, జయలలిత కాలంలో ఎమ్మెల్యేగా, ఎంపీగా స్పీకర్‌గా అనేక పదవులను నిర్వహించిన కె. రాజారాం అతని మామ అవుతారు. -
ఉన్నఫళంగా కోమాలోకి.. వైఎస్సార్సీపీ యువనాయకుడు మృతి
అగళి(అనంతపురం): మండలంలోని హుల్లేకెర గ్రామానికి చెందిన మాజీ సర్పంచు దేవన్న తనయుడు, వైఎస్సార్సీపీ యువనాయకుడు డీ శ్రీనివాస్ (38) అనారోగ్యంతో ఆదివారం మృతి చెందాడు. బెంగళూరులో చికిత్స పొంది ఇంట్లో విశ్రాంతి తీసుకుంటున్నాడు. ఆదివారం ఉన్నఫళంగా కోమాలోకి వెళ్లిపోయాడు. వెంటనే శిర ప్రభుత్వసుపత్రికి తీసుకెళ్లారు.అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. పార్టీలో చురుకుగా పనిచేసేవాడని స్థానిక ప్రజాప్రతినిధులు అన్నారు. బాధిత కుటుంబానికి సంతాపం తెలిపారు. -
కరోనా తెలియని కుర్రోడు!
ప్రపంచంలో ఏ మూలన ఉన్న వ్యక్తినైనా కరోనా అంటే ఏంటీ అని అడిగితే.. వెంటనే కరోనా కారణంగా వారు పడ్డ కష్టాలను ఏకరువు పెడతారు. అటువంటిది 19 ఏళ్ల ఓ టీనేజర్‌కు మాత్రం కరోనా ఊసే తెలియదు. అవును మీరు చదివింది నిజమే. యూకేకు చెందిన 19 జోసెఫ్ ఫ్లావిల్ 11 నెలలపాటు కోమాలో ఉండడంవల్ల అతనికి కోవిడ్ సంగతులు ఏవీ తెలియదు. రెండు రోజుల క్రితం జోసెఫ్ కళ్లు తెరవడం తో వార్తల్లోకెక్కాడు. కాగా ప్రపంచంలో కరోనా అంతగా వ్యాప్తిచెందక ముందు మార్చి 1న జోసెఫ్ రోడ్డు మీద నడిచి వెళ్తుంటే ఒక కారు గుద్దింది. తలకు దెబ్బతగలడంతో మెదడుకు తీవ్ర గాయం అయింది. దీంతో అతను అప్పటి నుంచి ఇప్పటిదాకా అంటే 11 నెలలపాటు కోమాలోనే ఉండిపోయాడు. ఆ తరువాత ప్రపంచదేశాల్లో అనేక మార్పులు చోటుచేసుకున్నాయి. స్పృహలో ఉన్న ప్రతి ఒక్కరూ కరోనా కష్టాలు పడ్డవారే. ఇక యూకేలో అయితే మహమ్మారి రెండుసార్లు విజృంభించి ఎంతోమంది ప్రాణాలు బలిగొంది. ‘‘అయితే ఇప్పుడు ఈ ప్రపంచాన్ని చూస్తున్న జోసెఫ్‌కు ఇవన్నీ చెబితే ఎలా తీసుకుంటాడో అర్థం కావడం లేదని జోసెఫ్ ఆంటీ అన్నారు. తను కోలుకున్నాక మెలమెల్లగా అన్నీ అర్థమయ్యేలా చెబుతామని కుటుంబసభ్యులు చెప్పారు. -
గుండెలు పిండేసే విషాదం
చిన్నారి శ్రావణి... అంతపెద్ద కష్టాన్ని ఎలా భరించగలదో తలచుకుంటేనే అందరి గుండెలు బరువెక్కి పోతున్నాయి. విధి ఆడిన నాటకం శ్రావణి జీవితంలో అమావాస్య చీకట్లు నింపింది. తల్లిదండ్రులను, సోదరిని రోడ్డు ప్రమాదంలో పోగొట్టుకున్న ఆ అభాగ్యురాలు ఏం జరిగిందో తెలియని పరిస్థితిలో కేజీహెచ్‌లో ఉంది. ఆమె కోమాలో ఉండగానే తల్లిదండ్రులు, సోదరి మృతదేహాలకు బంధువులు అంత్యక్రియలు నిర్వహించారు. దీంతో కడసారి చూపునకు కూడా ఆమె నోచుకోలేకపోయింది. విశాఖపట్నం, యలమంచిలి: అమ్మానాన్న చెల్లి లేరన్న నిజం ఆ దురదృష్టవంతురాలికి ఇంకా తెలియదు. ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ఆ చిన్నారి కోమాలో ఉంది. కోమాలో నుంచి బయటపడితే గాని గుండెలు పిండేసే విషాదవార్త ఆమెకు తెలిసే అవకాశం లేదు. సోమవారం కొక్కిరాపల్లి హైవేపై రోడ్డుప్రమాదం జరిగి ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతిచెందిన సంగంతి తెలిసిందే. ప్రమాదంలో గాయాలతో బయటపడిన పెద్దకుమార్తె శ్రావణి కేజీహెచ్‌లో చికిత్స పొందుతోంది. ప్రమాదంలో మరణించిన వారి మృతదేహాలకు మంగళవారం పోలీసులు యలమంచిలిలో పోస్టుమార్టం నిర్వహించి, బంధువులకు అప్పగించారు. గంగరాజు అన్నదమ్ములు మృతదేహాలను నేరుగా శ్మశానానికి తరలించారు. గంగరాజు,కుమారి, పుష్ప మృతదేహాలను ఖననం చేసి, అంత్యక్రియలు పూర్తిచేశారు. కుటుంబ సభ్యులతో పాటు గాంధీనగరం కాలనీవాసులు హాజరయ్యారు. కనీసం కుమార్తె శ్రావణి వచ్చి పిడికెడు మట్టివేసినా వారి ఆత్మకు శాంతిచేకూరేదని, ఆ ఆవకాశం కూడా లేకుండాపోయిందని అక్కడివారు కంటతడిపెట్టారు. శ్రావణి స్పృహలో ఉంటే కుటుంబసభ్యులను కడసారిగా చూసుకునేది. బంధువుల మొక్కులు ఫలించి శ్రావణి పూర్తిగా కోలుకొని బయటపడితే నెమ్మదిగా సంఘటన గురించి చెప్పాల్సి ఉంటుంది. చిన్నారి పరిస్థితి విషమం పాతపోస్టాఫీసు(విశాఖ దక్షిణ) : యలమంచిలి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన చిన్నారి డి.శ్రావణి (13) పరిస్థితి విషమంగా ఉందని కేజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ జి.అర్జున తెలిపారు. పాప ఆరోగ్య పరిస్థితిని మంగళవారం సమీక్షించి ట్రామాకేర్ వైద్యులకు పలు సూచనలు ఇచ్చారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కనుబొమల మధ్య ఎముక, కుడి తొడ ఎముక విరగడంతో పాటు మెదడులో రక్తం గడ్డగట్టిందని తెలిపారు. చికిత్సపై సంబంధిత న్యూరో సర్జన్స్, ఆర్థోపెడిక్ వైద్యులతో పాటు నర్సింగ్ స్టాఫ్‌కు ఆదేశాలు జారీచేశారు. న్యూరో సర్జరీ ప్రొఫెసర్ డాక్టర్ సత్యవరప్రసాద్, ఆర్థోపెడిక్ శాఖ హెడ్ డాక్టర్ వి.ధర్మారావు, సీఎస్‌ఆర్‌ఎంవో డాక్టర్ కేఎస్‌ఎల్‌జీ శాస్త్రి, ఆర్ఎంవో డాక్టర్ బంగారయ్య, ఏఆర్ఎంవో డాక్టర్ సాధన ఆయన వెంట ఉన్నారు. బీమా సొమ్మపై సందిగ్ధం రోడ్డు ప్రమాదంలో చనిపోయిన గంగరాజు, కుమారి,పుష్పలు చంద్రన్నభీమాలో సభ్యులు. బీమాలో తక్షణ సాయంగా రూ.15వేల మంజూరయ్యాయి. భర్త చనిపోతే భార్యకు, భార్య చనిపోతే భర్తకు ఇద్దరు చనిపోతే పిల్లలకు అందజేస్తారు. కుటుంబంలో ముగ్గురు చనిపోగా మిగిలిన ఒక్క కుమార్తె శ్రావణి కోమాలో ఉంది. దీంతో బీమా సొమ్ము ఎవరికి ఇవ్వాలో చిక్కుముడిగా తయారయ్యింది. శ్రావణి కోమానుంచి బయటపడితే బీమాసొమ్మును అందజేయనున్నారు.+ పాపం.. పసిపాప! -
వీడని మిస్టరీ
కోమాలోనే మహిళ ముమ్మరంగా పోలీసుల దర్యాప్తు రాజమహేంద్రవరం క్రైం : అపస్మారకస్థితిలో ఉన్న మహిళ సంఘటనకు సంబంధించిన మిస్టరీ వీడలేదు. ఆలమూరు మండలం పెద్దపళ్ల గ్రామానికి చెందిన చిలుకూరి భవాని గత నెల 30న బాకీలు వసూలు చేసుకువస్తానని చెప్పి మండపేట Ðð ళ్లినట్టు బంధువులు చెబుతున్నారు. ఆమెను మండపేట నుంచి కిడ్నాప్ చేసి రాజమహేంద్రవరం తీసుకువచ్చి ఉంటారని, ఆమెకు సన్నిహితులే ఈ సంఘటనకు పాల్పడి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. రైల్వే క్వార్టర్స్ గురించి పూర్తిగా తెలిసిన వారే ఈ సంఘటన కు పాల్పడి ఉంటారన్నారు. ఆ క్వార్టర్లలో ఖాళీగా ఉన్న పోర్షన్ గురించి బయట వారికి తెలిసే అవకాశం లేదన్నారు. ముమ్మరంగా దర్యాప్తు ఈ కేసులో మిస్టరీని ఛేదించేందుకు పోలీసులు ముమ్మరంగా దర్యాప్తు చేపట్టారు. దీనికి ఒక ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసినట్లు పోలీస్ ఉన్నతాధికారి తెలిపారు. బంధువులను, ఆమె వద్ద అప్పులు తీసుకున్న వారిని, గతంలో ఆమె పని చేసిన జ్యోతిషుడిని కూడా ప్రశ్నించేందుకు ప్రయత్నిస్తున్నారు. అయితే జ్యోతిషుడు ఇప్పటికే సెల్‌ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి పరారీలో ఉన్నట్లు తెలుస్తోంది. కోమా నుంచి బయటకు వస్తేనే.. పోలీసులు ఇప్పటి వరకూ ఈ కేసులో ఎవరినీ అరెస్టు చేసిన దాఖలాలు లేవు. మహిళను మండపేట నుంచి కిడ్నాప్ చేసి తీసుకువచ్చి ఉంటారా? లేక రాజమహేంద్రవరం వచ్చిన తరువాత ఇక్కడే కిడ్నాప్ చేసి రైల్వే క్వార్టర్స్‌కు తీసుకువెళ్లారా అనేది ప్రశ్నార్థకంగా మారింది. ఎక్కువరోజులు కాళ్లూ చేతులూ కట్టేయడంతో ఆమె అవయవాల పనితీరు క్షిణించిందని వైద్యులు చెబుతున్నారు. దాని కారణంగా బ్రెయి¯Œæలో నరాలు దెబ్బతిని ఆ మహిళ కోమాలోనే ఉందన్నారు. కోమా నుంచి బయటకు వస్తేనే వివరాలు తెలుస్తాయన్నారు.