
అగళి(అనంతపురం): మండలంలోని హుల్లేకెర గ్రామానికి చెందిన మాజీ సర్పంచు దేవన్న తనయుడు, వైఎస్సార్‌సీపీ యువనాయకుడు డీ శ్రీనివాస్ (38) అనారోగ్యంతో ఆదివారం మృతి చెందాడు. బెంగళూరులో చికిత్స పొంది ఇంట్లో విశ్రాంతి తీసుకుంటున్నాడు.
ఆదివారం ఉన్నఫళంగా కోమాలోకి వెళ్లిపోయాడు. వెంటనే శిర ప్రభుత్వసుపత్రికి తీసుకెళ్లారు.అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. పార్టీలో చురుకుగా పనిచేసేవాడని స్థానిక ప్రజాప్రతినిధులు అన్నారు. బాధిత కుటుంబానికి సంతాపం తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment