ప్రపంచంలో ఏ మూలన ఉన్న వ్యక్తినైనా కరోనా అంటే ఏంటీ అని అడిగితే.. వెంటనే కరోనా కారణంగా వారు పడ్డ కష్టాలను ఏకరువు పెడతారు. అటువంటిది 19 ఏళ్ల ఓ టీనేజర్‌కు మాత్రం కరోనా ఊసే తెలియదు. అవును మీరు చదివింది నిజమే. యూకేకు చెందిన 19 జోసెఫ్ ఫ్లావిల్ 11 నెలలపాటు కోమాలో ఉండడంవల్ల అతనికి కోవిడ్ సంగతులు ఏవీ తెలియదు. రెండు రోజుల క్రితం జోసెఫ్ కళ్లు తెరవడం తో వార్తల్లోకెక్కాడు. కాగా ప్రపంచంలో కరోనా అంతగా వ్యాప్తిచెందక ముందు మార్చి 1న జోసెఫ్ రోడ్డు మీద నడిచి వెళ్తుంటే ఒక కారు గుద్దింది.
తలకు దెబ్బతగలడంతో మెదడుకు తీవ్ర గాయం అయింది. దీంతో అతను అప్పటి నుంచి ఇప్పటిదాకా అంటే 11 నెలలపాటు కోమాలోనే ఉండిపోయాడు. ఆ తరువాత ప్రపంచదేశాల్లో అనేక మార్పులు చోటుచేసుకున్నాయి. స్పృహలో ఉన్న ప్రతి ఒక్కరూ కరోనా కష్టాలు పడ్డవారే. ఇక యూకేలో అయితే మహమ్మారి రెండుసార్లు విజృంభించి ఎంతోమంది ప్రాణాలు బలిగొంది. ‘‘అయితే ఇప్పుడు ఈ ప్రపంచాన్ని చూస్తున్న జోసెఫ్‌కు ఇవన్నీ చెబితే ఎలా తీసుకుంటాడో అర్థం కావడం లేదని జోసెఫ్ ఆంటీ అన్నారు. తను కోలుకున్నాక మెలమెల్లగా అన్నీ అర్థమయ్యేలా చెబుతామని కుటుంబసభ్యులు చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment