శ్రావణం.. శుభప్రదం | Shravana Masam starts from Today | Sakshi
Sakshi News home page

శ్రావణం.. శుభప్రదం

Published Wed, Aug 7 2013 4:56 AM | Last Updated on Fri, Sep 1 2017 9:41 PM

Shravana Masam starts from Today

 ఆదిలాబాద్ కల్చరల్, న్యూస్‌లైన్ : హిందువులకు అతి నియమ నిష్టలతో కూడిన మాసం శ్రావణం. శ్రావ ణ మాసం ముగిసే వరక మహిళలు, భక్తులు సంప్రదాయాలు ఆచరిస్తారు. కఠిన ఉపవాసాలు ఆచరిస్తూ దైవనామస్మరణలో గడుపుతారు. మరి ఆ శ్రావణ మాసం రానే వచ్చింది. బుధవారం నుంచి ఈ మాసం ప్రారంభమైంది.  కైలాసనాధుడైన శివుడికి అత్యంత ప్రీతి పాత్రమైన మాసాలలో శ్రావణమాసం ప్రధానమైంది. మహిళలు ఆయురారోగ్యాల కోసం, కుటుంబ, భర్త శ్రేయస్సుల కో సం వ్రతాలు, నోములను ఆచరిస్తారు.
 
 ఉదయం నుంచి రాత్రి వరకు వ్రతాలు ఆచరిస్తూ రాత్రి జాగరణ చేయడం ఆనవాయితీ. మైసమ్మ, పోచమ్మ ఆలయా లు మూత వేసి, శివకేశవుల ఆలయాలు ఈ మాసంలో నుంచి తెరుచుకుంటా యి. ఈ మాసంలో మహిళలు నక్తవ్రతా లు, ఏకవృత్తవ్రతాలు ఆచరిస్తారు. మంగళగౌరీ, గౌరీ వ్రతాలు, అన్నపానీ యాలు లేకుండా కఠిన ఉపవాసాలు ఆచరిస్తారు. ఈ మాసంలో సోమవారం శివాలయాలకు వెళ్లి శివుడి తలపై పత్రదళం పెట్టి, నీళ్లతో అభిషేకాలు చేస్తారు. ఇలా చేస్తే జపతపాలు, యాగాలు చేసిన ప్రతిఫలం చేకూరుతుందని, శివలోకప్రాప్తి చేకూరుతుందని భక్తుల నమ్మకం. నెలరోజుల పాటు శివాలయాల్లో బిల్వపూజ, పత్రదళ పూజలు ఆచరిస్తారు. మహిళలు పత్రదళాలలో భోజనాలు చే స్తారు. ఐదు సోమవారాలు ఒక్కో ధ్యా నంతో శివుడికి శివముక్తి పూజలు చేస్తా రు. ఇలాచేస్తే జన్మజన్మంతరాల పుణ్యఫలం లభిస్తుందని వారి నమ్మకం.
 
 మాంసాహారాలు మానీ..
 హిందువుల పవిత్ర మాసమైన శ్రావణ మాసంలో కఠిన నియమాలు ఆచరిస్తుం టారు. ఉదయం నుంచి రాత్రి వరకు దే వాలయాల్లో గడపడమే కాకుండా.. నెల రోజులు మాంసాహారాలు మానేస్తుం టారు. పురుషులు క్షవరం తీసుకోరు.
 
 శైవక్షేత్రాల దర్శనం..
 మునులు, రుషిలు, సన్యాసులు, భక్తులు పెద్దసంఖ్యలో ఈ మాసంలో శైవ క్షేత్రాలను సందర్శిస్తుంటారు. పాదయాత్రలతో వెళ్తారు. పుణ్యక్షేత్రాలైన కాశీ విశ్వనాధుడు, శ్రీశైలం మల్లికార్జునుడును దర్శించుకుంటారు. ప్రతి దేవాలయాల్లో విశేష పూజలు చేస్తారు. పుణ్యక్షేత్రాలు దర్శించుకుంటే పాపాలు దూరమై శివలోకప్రాప్తి చేకూరుతుందని నమ్మకం.
 
 శుభ ముహూర్తాలెన్నో..
 శ్రావణ మాసంలో వివాహాలకు ఎంతో ప్రాముఖ్యత ఉంటుంది. రెండు మూడు నెలలుగా మంచి ముహూర్తాలు లేకపోవడంతో ఈసారి పెళ్లి సందడి ఎక్కువగానే ఉండనుంది. ఈనెలలో 9, 15, 19, 22, 23, 24, 25, 28, 30 తేదీలలో వివాహ శుభ ముహూర్తాలున్నాయి. దీంతో ఫంక్షన్‌హాళ్లు, దుకాణాలు కళకళలాడనున్నాయి.
 
 వరలక్ష్మీ వ్రతం
 పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం (16న) వరలక్ష్మీ వ్రతం ఆచరిస్తారు. అష్ట ఐశ్వర్యాలు ప్రసాదించాలని లక్ష్మీదేవిని ప్రార్థిస్తూ ఈ వ్ర తం చేస్తారు. సౌభాగ్యంతో వర్ధిల్లాలని కుంకుమార్చనలు చేస్తారు.
 
 పుత్రైకాదశి
 శ్రావణ మాసంలో శుద్ధ ఏకాదశి (17)న భక్తులు పుత్రైకాదశిని జరుపుకుంటారు. సంతానం లేనివారు, మగ సంతానం కోరుకునేవారు ఈ రోజున పుత్రైకాదశి వ్రతం ఆచరిస్తారు. శివకేశవులను ఆరాధిస్తారు.
 
 రక్షాబంధన్
 శ్రావణ పౌర్ణమి(21న) రోజున రక్షా బంధన్ జరుపుకుంటారు. మహిళలు సోదరులకు రాఖీ కడతారు. సోదరసోదరీమణుల బంధానికి ఈ పండుగ ప్రతీకగా నిలుస్తోంది. ఇదే రోజున జంధ్యాల పౌర్ణమినీ జరుపుకుంటారు. అర్హులైనవారు ఈరోజు నూతన యజ్ఞోపవీతాన్ని ధరిస్తారు.
 
 నాగుల పంచమి
 శ్రావణ శుద్ధ పంచమి(ఈనెల 11వ తేదీ)న నాగుల పంచమి జరుపుకుంటారు.  సర్పదోషాలు తొలగిపోవడానికి నాగదేవత అనుగ్రహాన్ని కోరుతూ మహిళలు పుట్టలో పాలుపోసి, పూజలు చేస్తారు. వెండితో నాగ ప్రతిమలు చేయించి పుట్టలో వదులుతారు.
 
 మంగళగౌరి వ్రతం
 నిండు నూరేళ్ల సౌభాగ్యం, అన్యోన్య దాంపత్యం, ధర్మ సంతానం కోసం నూతన వధువులు మంగళగౌరి వత్రం ఆచరిస్తారు. వివాహం జరిగిన మొదటి ఐదేళ్లలో శ్రావణ మాసంలో ప్రతి మంగళవారం ఈ వ్రతం చేయడం ఆనవాయితీగా వస్తోంది.
 
 శ్రీకృష్ణాష్టమి
 శ్రావణ బహుళ అష్టమిన శ్రీకృష్ణ పరమాత్మ జన్మించాడు. భక్తులు ఈనెల 29న శ్రీకృష్ణ జన్మాష్టమి జరుపుకోనున్నా రు. కృష్ణుడి అనుగ్రహం కోసం ఈ రో జంతా ఉపవాసం ఉండి జాగరణ చేస్తూ భగవంతుడికి వివిధ ఉపచారాలు చేస్తా రు. ఇలా చేస్తే కోటి ఏకాదశి వ్రతాలు చేసిన ఫలితం లభిస్తుందన్నది విశ్వాసం.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement