pochamma temple
-
లద్నాపూర్ గ్రామంలో ఉద్రిక్తత..! ఎమ్మెల్యే శ్రీధర్‌బాబు ఆగ్రహం..!!
పెద్దపల్లి: మండలంలోని లద్నాపూర్ గ్రామంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. సింగరేణి అధికారులు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా శనివారం అర్ధరాత్రి గ్రామ దేవత పోచమ్మ విగ్రహాన్ని తొలగించడాన్ని నిరసిస్తూ ఆదివారం ఉదయం ఆర్జీ–3 పరిధి ఓసీపీ–2 గేట్ వద్ద గ్రామస్తులు ఆందోళన చేపట్టారు. గ్రామానికి సంబంధించిన ఆర్అండ్ఆర్ ప్యాకేజీ సమస్యలను పరిష్కరించకుండా యాజమాన్యం కవ్వింపు చర్యలకు పాల్పడుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. భూ నిర్వాసితుల పట్ల అమానుషంగా ప్రవర్తిస్తోందని, తమ మనోభావాలను దెబ్బతీయడానికే ఇలా చేస్తోందని మండిపడ్డారు. అమ్మవారి విగ్రహన్ని ఆర్జీ–3 జీఎం దంపతులు తిరిగి ప్రతిష్ఠించాలని డిమాండ్ చేశారు. గేట్ వద్ద ఆందోళన అనంతరం సైట్ ఆఫీస్‌లోకి చొచ్చుకెళ్లే ప్రయత్నం చేశారు. పోలీసులు అడ్డుకోగా వారితో వాగ్వాదానికి దిగారు. గ్రామంలోని 284 మందికి ఆర్అండ్ఆర్ ప్యాకేజీ వచ్చాకే పనులు చేపట్టాలని సింగరేణి అధికారులకు గతంలోనే చెప్పామన్నారు. అయినప్పటికీ గ్రామాన్ని బలవంతంగా ఖాళీ చేయించాలన్న ఉద్దేశంతోనే పోచమ్మ తల్లి విగ్రహాన్ని తొలగించారని ఆరోపించారు. మ్యాన్ వే రూంకు తాళం వేసి, కార్మికులను, క్వారీలో బ్లాస్టింగ్ పనులను అడ్డుకున్నారు. సింగరేణి యాజమాన్యం స్పందించి, యథాస్థానంలో పోచమ్మ తల్లి విగ్రహ ప్రతిష్ఠకు హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా గోదావరిఖని వన్ టౌన్ సీఐ ప్రసాద్‌రావు, రామగిరి, ముత్తారం, మంథని ఎస్సై లు దివ్య, మధుసూదన్‌రావు, కిరణ్‌లు తమ సిబ్బందితో బందోబస్తు చేపట్టారు. ఎమ్మెల్యే శ్రీధర్‌బాబు ఆగ్రహం.. లద్నాపూర్‌లో పోచమ్మ తల్లి విగ్రహం తొలగించడం పట్ల ఎమ్మెల్యే శ్రీధర్ బాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రామస్తుల మనోభావాలు దెబ్బతినేలా వ్యవహరించిన అధికారులపై చర్యలు తీసుకోవాలని ఉన్నతా ధికారులను కోరారు. అమ్మవారి విగ్రహాన్ని తిరిగి ప్రతిష్ఠించాలని, మరోసారి ఇలాంటి ఘటనలు జరగకుండా చూడాలన్నారు. -
ఒకేసారి 108 పోతరాజుల విన్యాసాలు
హైదరాబాద్: రాంగోపాల్‌పేట్ డివిజన్ నల్లగుట్టలో ఆదివారం జరిగిన తొట్టెల ఊరేగింపులో ఒకేసారి 108 మంది పోతరాజులు చేసిన విన్యాసాలు చూపరులను అలరించాయి. స్థానికనేత కేశబోయిన మనోహర్ యాదవ్ తన తాత బలరాం యాదవ్ జ్ఞాపకార్థం పీజీరోడ్ జవహార్‌నగర్‌లోని పోచమ్మ దేవాలయం నుంచి నల్లగుట్టలోని కనకదుర్గమ్మ ఆలయం వరకు ఫలహార బండి, తొట్టెల ఊరేగింపును నిర్వహించారు. పీజీరోడ్ జవహార్‌నగర్‌లోని పోచమ్మ దేవాలయం నుంచి నల్లగుట్టలోని కనకదుర్గమ్మ ఆలయం వరకు కొనసాగిన ఈ ఊరేగింపునకు భక్తులు భారీగా హాజరయ్యారు. ఈ ఊరేగింపులో పోతరాజులు తమ వీరంగాలు, డప్పులు దరువులు, నృత్యాలతో అలరించారు. వీరితో పాటుగా 20 బృందాలకు చెందిన 625 మంది కళాకారులు పాల్గొన్నారు. మల్లన్న డప్పులు, కోలాటాలు, విచిత్ర వేషాలు, రాధా కృష్ణుల వేషధారణ, పులివేషాలతో వీరంతా చూపరులను అలరించారు. ఈ సందర్భంగా నిర్వాహకులు మనోహర్ యాదవ్ మాట్లాడుతూ 108 మంది పోతరాజులతో ఎక్కడ ఫలహార బండి ఊరేగింపు జరగలేదని దేశంలో తొలిసారిగా తాము నిర్వహిస్తున్నామని చెప్పారు. ఈ విషయాన్ని గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్, యూనివర్శల్ బుక్ ఆఫ్ రికార్డ్స్ అధికారుల దృష్టికి తీసుకుని వెళ్లామని చెప్పారు. దీనికి సంబంధించిన ఫొటోలు, వీడియోలను వారికి సమర్పిస్తామని అటు తర్వాత రికార్డుల్లోకి ఎక్కుతాయని చెప్పారు. -
తవ్వకాల్లో బయటపడ్డ నందీశ్వరుడి విగ్రహం
సాక్షి,భైంసారూరల్(ముథోల్) : నిర్మల్ జిల్లా భైంసా మండలంలోని మహాగాంలో సోమవారం పోచమ్మ ఆలయం వద్ద తవ్వకాలు జరుపుతుండగా నందీశ్వరుడి విగ్రహం బయటపడింది. ఈ విషయం తెలియగానే త్రియంబకేశ్వరుని ఆలయం వద్ద పూజలు చేస్తున్న భక్తులంతా అక్కడికి చేరుకుని నందీశ్వరున్ని శుద్ధిచేసి జలాభిషేకాలు చేశారు. గ్రామంలో పురాతన ఆలయాలు ఉండేవని కాలగర్భంలో కలిసిన ఆలయాల వద్ద తవ్వకాలు చేపడితే ఇలా విగ్రహాలు బయటకు వస్తున్నాయని పలువురు పేర్కొన్నారు. -
రాత్రికి రాత్రే వెలిసిన పోచమ్మ!
భీమారం(చెన్నూర్) : మంచిర్యాల జిల్లా భీమారంలో నూతనంగా నిర్మించనున్న పోలీస్ స్టేషన్ భవన ప్రతిపాదిత స్థలంలో సోమవారం రాత్రి పోచమ్మ విగ్రహం దర్శనం ఇచ్చింది. కొత్త జిల్లాలు, మండలాలు ఏర్పాటు చేసిన సమయంలో భీమారం ను కూడా కొత్త మండలంగా ప్రభుత్వం ప్రకటించింది. అయితే 2016 దసరా రోజున కొత్త కార్యాలయాలు ఏర్పాటు చేయాలనే సంకల్పంతో పలు భవనాల్లో కార్యాలయాలు ప్రారంభించారు. సంవత్సరం అనంతరం మోడల్ పోలీస్ స్టేషన్ భవనం కోసం ప్రభుత్వం నిధులు కేటాయించింది. ప్రభుత్వ స్థలాల్లో ఒక ఎకరం భూమి కేటాయించాలని పోలీస్ శాఖ రెవెన్యూ శాఖకు లేఖ రాసింది. ఈమేరకు పలు స్థలాలు కేటాయించినా అవి మధ్యలోనే నిలిచి పోయాయి. దీంతో సర్వే నెంబర్ 411లోని 19 గుంటల భూమి కేటాయించాలని జైపూర్ ఏసీపీ సీతారాములు ఆర్డీవో శ్రీనివాస్‌ను కోరగా ఆర్డీవో భీమారం వచ్చి ప్రస్తుత పోలీస్ స్టేషన్ ఎదురు స్థలాన్ని ఇస్తున్నట్లు ప్రకటించారు. ఈనేపథ్యంలో ఆ భూమిలో సోమవారం రాత్రి పోచమ్మ ప్రతిష్ఠాపన జరిగింది. దీంతో పోలీస్ స్టేషన్ భవన నిర్మాణం ప్రశ్నార్థకంగా మారింది. -
శ్రావణం.. శుభప్రదం
ఆదిలాబాద్ కల్చరల్, న్యూస్‌లైన్ : హిందువులకు అతి నియమ నిష్టలతో కూడిన మాసం శ్రావణం. శ్రావ ణ మాసం ముగిసే వరక మహిళలు, భక్తులు సంప్రదాయాలు ఆచరిస్తారు. కఠిన ఉపవాసాలు ఆచరిస్తూ దైవనామస్మరణలో గడుపుతారు. మరి ఆ శ్రావణ మాసం రానే వచ్చింది. బుధవారం నుంచి ఈ మాసం ప్రారంభమైంది. కైలాసనాధుడైన శివుడికి అత్యంత ప్రీతి పాత్రమైన మాసాలలో శ్రావణమాసం ప్రధానమైంది. మహిళలు ఆయురారోగ్యాల కోసం, కుటుంబ, భర్త శ్రేయస్సుల కో సం వ్రతాలు, నోములను ఆచరిస్తారు. ఉదయం నుంచి రాత్రి వరకు వ్రతాలు ఆచరిస్తూ రాత్రి జాగరణ చేయడం ఆనవాయితీ. మైసమ్మ, పోచమ్మ ఆలయా లు మూత వేసి, శివకేశవుల ఆలయాలు ఈ మాసంలో నుంచి తెరుచుకుంటా యి. ఈ మాసంలో మహిళలు నక్తవ్రతా లు, ఏకవృత్తవ్రతాలు ఆచరిస్తారు. మంగళగౌరీ, గౌరీ వ్రతాలు, అన్నపానీ యాలు లేకుండా కఠిన ఉపవాసాలు ఆచరిస్తారు. ఈ మాసంలో సోమవారం శివాలయాలకు వెళ్లి శివుడి తలపై పత్రదళం పెట్టి, నీళ్లతో అభిషేకాలు చేస్తారు. ఇలా చేస్తే జపతపాలు, యాగాలు చేసిన ప్రతిఫలం చేకూరుతుందని, శివలోకప్రాప్తి చేకూరుతుందని భక్తుల నమ్మకం. నెలరోజుల పాటు శివాలయాల్లో బిల్వపూజ, పత్రదళ పూజలు ఆచరిస్తారు. మహిళలు పత్రదళాలలో భోజనాలు చే స్తారు. ఐదు సోమవారాలు ఒక్కో ధ్యా నంతో శివుడికి శివముక్తి పూజలు చేస్తా రు. ఇలాచేస్తే జన్మజన్మంతరాల పుణ్యఫలం లభిస్తుందని వారి నమ్మకం. మాంసాహారాలు మానీ.. హిందువుల పవిత్ర మాసమైన శ్రావణ మాసంలో కఠిన నియమాలు ఆచరిస్తుం టారు. ఉదయం నుంచి రాత్రి వరకు దే వాలయాల్లో గడపడమే కాకుండా.. నెల రోజులు మాంసాహారాలు మానేస్తుం టారు. పురుషులు క్షవరం తీసుకోరు. శైవక్షేత్రాల దర్శనం.. మునులు, రుషిలు, సన్యాసులు, భక్తులు పెద్దసంఖ్యలో ఈ మాసంలో శైవ క్షేత్రాలను సందర్శిస్తుంటారు. పాదయాత్రలతో వెళ్తారు. పుణ్యక్షేత్రాలైన కాశీ విశ్వనాధుడు, శ్రీశైలం మల్లికార్జునుడును దర్శించుకుంటారు. ప్రతి దేవాలయాల్లో విశేష పూజలు చేస్తారు. పుణ్యక్షేత్రాలు దర్శించుకుంటే పాపాలు దూరమై శివలోకప్రాప్తి చేకూరుతుందని నమ్మకం. శుభ ముహూర్తాలెన్నో.. శ్రావణ మాసంలో వివాహాలకు ఎంతో ప్రాముఖ్యత ఉంటుంది. రెండు మూడు నెలలుగా మంచి ముహూర్తాలు లేకపోవడంతో ఈసారి పెళ్లి సందడి ఎక్కువగానే ఉండనుంది. ఈనెలలో 9, 15, 19, 22, 23, 24, 25, 28, 30 తేదీలలో వివాహ శుభ ముహూర్తాలున్నాయి. దీంతో ఫంక్షన్‌హాళ్లు, దుకాణాలు కళకళలాడనున్నాయి. వరలక్ష్మీ వ్రతం పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం (16న) వరలక్ష్మీ వ్రతం ఆచరిస్తారు. అష్ట ఐశ్వర్యాలు ప్రసాదించాలని లక్ష్మీదేవిని ప్రార్థిస్తూ ఈ వ్ర తం చేస్తారు. సౌభాగ్యంతో వర్ధిల్లాలని కుంకుమార్చనలు చేస్తారు. పుత్రైకాదశి శ్రావణ మాసంలో శుద్ధ ఏకాదశి (17)న భక్తులు పుత్రైకాదశిని జరుపుకుంటారు. సంతానం లేనివారు, మగ సంతానం కోరుకునేవారు ఈ రోజున పుత్రైకాదశి వ్రతం ఆచరిస్తారు. శివకేశవులను ఆరాధిస్తారు. రక్షాబంధన్ శ్రావణ పౌర్ణమి(21న) రోజున రక్షా బంధన్ జరుపుకుంటారు. మహిళలు సోదరులకు రాఖీ కడతారు. సోదరసోదరీమణుల బంధానికి ఈ పండుగ ప్రతీకగా నిలుస్తోంది. ఇదే రోజున జంధ్యాల పౌర్ణమినీ జరుపుకుంటారు. అర్హులైనవారు ఈరోజు నూతన యజ్ఞోపవీతాన్ని ధరిస్తారు. నాగుల పంచమి శ్రావణ శుద్ధ పంచమి(ఈనెల 11వ తేదీ)న నాగుల పంచమి జరుపుకుంటారు. సర్పదోషాలు తొలగిపోవడానికి నాగదేవత అనుగ్రహాన్ని కోరుతూ మహిళలు పుట్టలో పాలుపోసి, పూజలు చేస్తారు. వెండితో నాగ ప్రతిమలు చేయించి పుట్టలో వదులుతారు. మంగళగౌరి వ్రతం నిండు నూరేళ్ల సౌభాగ్యం, అన్యోన్య దాంపత్యం, ధర్మ సంతానం కోసం నూతన వధువులు మంగళగౌరి వత్రం ఆచరిస్తారు. వివాహం జరిగిన మొదటి ఐదేళ్లలో శ్రావణ మాసంలో ప్రతి మంగళవారం ఈ వ్రతం చేయడం ఆనవాయితీగా వస్తోంది. శ్రీకృష్ణాష్టమి శ్రావణ బహుళ అష్టమిన శ్రీకృష్ణ పరమాత్మ జన్మించాడు. భక్తులు ఈనెల 29న శ్రీకృష్ణ జన్మాష్టమి జరుపుకోనున్నా రు. కృష్ణుడి అనుగ్రహం కోసం ఈ రో జంతా ఉపవాసం ఉండి జాగరణ చేస్తూ భగవంతుడికి వివిధ ఉపచారాలు చేస్తా రు. ఇలా చేస్తే కోటి ఏకాదశి వ్రతాలు చేసిన ఫలితం లభిస్తుందన్నది విశ్వాసం.