
మహాగాంలో బయటపడ్డ నందీశ్వరుని విగ్రహం
సాక్షి,భైంసారూరల్(ముథోల్) : నిర్మల్ జిల్లా భైంసా మండలంలోని మహాగాంలో సోమవారం పోచమ్మ ఆలయం వద్ద తవ్వకాలు జరుపుతుండగా నందీశ్వరుడి విగ్రహం బయటపడింది. ఈ విషయం తెలియగానే త్రియంబకేశ్వరుని ఆలయం వద్ద పూజలు చేస్తున్న భక్తులంతా అక్కడికి చేరుకుని నందీశ్వరున్ని శుద్ధిచేసి జలాభిషేకాలు చేశారు. గ్రామంలో పురాతన ఆలయాలు ఉండేవని కాలగర్భంలో కలిసిన ఆలయాల వద్ద తవ్వకాలు చేపడితే ఇలా విగ్రహాలు బయటకు వస్తున్నాయని పలువురు పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment