Bhaimsa
-
సరైన పార్టీ అధికారంలోకి వస్తేనే అభివృద్ధి: సీఎం కేసీఆర్
-
‘కాళ్లావేళ్లా పడ్డా వదలిపెట్టలేదు’
సాక్షి, నిర్మల్ : జిల్లాలోని భైంసాలో కత్తులు, గొడ్డళ్లతో ఓ వర్గం వారి ఇండ్లపై కొందరు వ్యక్తులు దాడి చేశారని, అక్కడ గొడవ జరగటానికి ప్రధాన కారణం ఏంటని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పోలీసులను ప్రశ్నించారు. సోమవారం ఆదిలాబాద్ జిల్లాలో ఆయన పర్యటించారు. జిల్లా అధ్యక్షుడు పాయల్ శంకర్ ఇంట్లో భైంసా అల్లర్ల బాధితులను పరామర్శించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. ‘‘ ప్రార్థనా మందిరాల్లో ప్రార్థనలకు ఎవరు అనుమతి ఇచ్చారు. పోలీసులు ఒక వర్గానికి కొమ్ము కాస్తున్నారు. కొంత మంది పోలీస్ అధికారుల వ్యవహారం వృత్తిని కించపర్చే విధంగా ఉంది. ( భైంసా బాధితులకు పరిహారం చెల్లించాలి ) సంతోష్ అనే వ్యక్తికి సంఘటనతో సంబంధం లేదు. అంతర్రాష్ట్ర ఉగ్రవాదన్న ఆరోపణలతో అతన్ని తీసుకెళ్లి పోలీసులు తీవ్రంగా కొట్టారు. పోలీసులకు మైనర్ బాలుడిని కొట్టే అధికారం ఎవరిచ్చారు. కాళ్లావేళ్లా పడ్డా వదలిపెట్టలేదు. దీనిపై ప్రభుత్వం, డీజీపీ స్పందించాలి. పోలీసులు ఓ వర్గానికి కొమ్ముకాస్తున్నారు. కశ్మీర్ తరహలో భైంసాలో హిందువులను పంపించాలనే ఎంఐఎం కుట్రలకు ప్రభుత్వం సపోర్ట్ చేస్తోంది’’ అని అన్నారు. -
వటోలి నిందితులపై కేసు కొట్టివేత
సాక్షి, ఆదిలాబాద్: వటోలి కేసులో ఆదిలాబాద్ కోర్టు నిందితులపై కేసును కొట్టివేసింది. నిందితులపై నేరారోపణలు నిరూపించడానికి సీబీసీఐడీ తగిన సాక్ష్యాలు చూపించడంలో విఫలమైందని సోమవారం ఆదిలాబాద్ మొదటి అదనపు జిల్లా సెషన్స్‌కోర్టు ఇన్చార్జి జడ్జి అరుణసారిక కేసును కొట్టివేస్తూ తీర్పునిచ్చారు. 2008లో భైంసా మండలం వటోలిలో ఒకే వర్గానికి చెందిన ఆరుగురు నిద్రిస్తున్న గుడి సెకు రాత్రి నిప్పుపెట్టి చంపిన ఘటన అప్పట్లో దేశవ్యాప్తంగా సంచలనం కలిగించింది. కేసు పుర్వాపరాలు.. 2008 అక్టోబర్ 11, 12 మధ్యరాత్రి వటోలి లోని ఓ గుడిసెలో మహబూబ్‌ఖాన్(55), ఫసియా ఖానమ్(50), రిజ్వాన బేగం(22), మీనమ్ఖాన్(3), అస్లమ్‌ఖాన్ (6), శబామాహిన్ (2) గుడిసెలో నిద్రిస్తున్న సమయం లో గ్రామానికి చెందిన కొంతమంది సజీవ దహనం చేశారని భైంసా పోలీసులు కేసు నమోదు చేశారు. అదే గ్రామానికి చెందిన హిందూవాహిని కార్యకర్తలుగా భావిస్తున్న కుంచల్‌వార్ చంద్రభాన్, జాదవ్ వినోద్, అడబాగి చంద్రకాంత్, జాదవ్ అవధూత్, జాదవ్ భగవంత్‌రావు, సూర్యవంశి రామానంద్, జాదవ్ వినాయక్, కుంచల్‌వార్ నాగనాథ్, భైంసాకు చెందిన శిండే డిగంబర్లపై హత్యారోపణల కింద కేసు నమోదు చేశారు. ప్రభుత్వం ఈ కేసును హైదరాబాద్ సీబీసీఐడీకి అప్పగించింది. 2009లో సీబీసీఐడీ పోలీసులు కోర్టులో చార్జ్‌షీట్ దాఖలు చేశారు. అప్పటి నుంచి కేసు విచారణ కొనసాగింది. 60 మంది సాక్షులను విచారించింది. నిందితులపై సాంకే తికంగా నేర నిరూపణకు సీబీసీఐడీ సాక్ష్యాలను చూపలేకపోయింది. -
తవ్వకాల్లో బయటపడ్డ నందీశ్వరుడి విగ్రహం
సాక్షి,భైంసారూరల్(ముథోల్) : నిర్మల్ జిల్లా భైంసా మండలంలోని మహాగాంలో సోమవారం పోచమ్మ ఆలయం వద్ద తవ్వకాలు జరుపుతుండగా నందీశ్వరుడి విగ్రహం బయటపడింది. ఈ విషయం తెలియగానే త్రియంబకేశ్వరుని ఆలయం వద్ద పూజలు చేస్తున్న భక్తులంతా అక్కడికి చేరుకుని నందీశ్వరున్ని శుద్ధిచేసి జలాభిషేకాలు చేశారు. గ్రామంలో పురాతన ఆలయాలు ఉండేవని కాలగర్భంలో కలిసిన ఆలయాల వద్ద తవ్వకాలు చేపడితే ఇలా విగ్రహాలు బయటకు వస్తున్నాయని పలువురు పేర్కొన్నారు. -
ఆర్టీసీ బస్సు బోల్తా
ఏడుగురికి తీవ్రగాయాలు ఆదిలాబాద్: ఆదిలాబాద్ జిల్లా భైంసా మండలం మహాగావ్ వద్ద 50 మంది ప్రయాణికులు ఉన్న ఆర్టీసీ బస్సు బోల్తా పడింది. ఏడుగురికి తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రులను భైంసా ఆసుపత్రికి తరలించారు. అదృష్టవశాత్తూ ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. -
సాగు‘బడి’లో విద్యార్థులు
భైంసారూరల్ : బడిలో ఆటలు ఆడుకోవడానికి విశాలంగా ఉన్న మైదానంలో టమాటా సాగు చేస్తూ విద్యార్థులు చదువులో ముందుకు ‘సాగు’తున్నారు. భైంసా పట్టణంలోని గిరిజన ఆశ్రమ పాఠశాలలో తొమ్మిదో తరగతి విద్యార్థినులు అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు. పాఠశాలలో విశాలమైన మైదానం ఉంది. పిచ్చిమొక్కలతో నిండుగా కనిపించే మైదానంలో విషసర్పాలు తిరగకుండా చదును చేశారు. పచ్చని చెట్లను పెంచి ఆహ్లాదకర వాతావరణాన్ని ఏర్పాటు చేసుకున్నారు. ఆ తర్వాత ఖాళీగా ఉన్న స్థలంలో టమాటా సాగుచేశారు. తొమ్మిదో తరగతి విద్యార్థినులే కలుపుమొక్కలు తీస్తూ టమాటా పండిస్తున్నారు. అక్కడే టమాటాలు కోసి రోజు వారీ వసతి గృహ భోజనంలో వంటకు వినియోగిస్తున్నారు. తాము పండించిన టమాటాను వసతిగృహ విద్యార్థులకు అందించడం ఎంతో సంతోషాన్ని ఇస్తోందని విద్యార్థులు చెబుతున్నారు. ఏడాదికాలంగా విద్యార్థులు టమాటా సాగు చేస్తున్నారు. గ్రామీణ ప్రాంతాలవారే... గిరిజన ఆశ్రమ పాఠశాలలో 600 మంది విద్యార్థినులు ఉన్నారు. గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చిన వారే అధికం. పంట పొలంలో వేసే టమాటాను పాఠశాలలో సాగు చేస్తూ విద్యార్థులు ఆదర్శంగా నిలుస్తున్నారు. రోజు బడిలో పాఠాలు చదువుతూ తీరిక సమయంలో ఇలా సాగు బాటలో శ్రమిస్తున్నారు. స్వచ్ఛభారత్‌లోనూ ఈ విద్యార్థుల బృందం పాల్గొంటూ పాఠశాల పరిసరాలను శుభ్రం చేసుకుంది. ప్రోత్సహిస్తున్నాం.. విద్యార్థుల్లో టమాటా సాగుపై ఆసక్తిని గమనించాం. అందుకు తగ్గట్లు వారిని ప్రోత్సహిస్తున్నాం. కొంతమంది విద్యార్థులు ఇతర కాయగూరలు సాగుచేద్దామంటున్నారు. ప్రస్తుతమైతే టమాటా సాగు చేశారు. సెలవుదినం ఉంటే అక్కడే ఉంటూ కలుపు మొక్కలు తీస్తూ పంటలో సస్యరక్షణ చర్యలు చేపడుతున్నారు. - అంబారావు, ప్రిన్సిపాల్