సాక్షి, నిర్మల్ : జిల్లాలోని భైంసాలో కత్తులు, గొడ్డళ్లతో ఓ వర్గం వారి ఇండ్లపై కొందరు వ్యక్తులు దాడి చేశారని, అక్కడ గొడవ జరగటానికి ప్రధాన కారణం ఏంటని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పోలీసులను ప్రశ్నించారు. సోమవారం ఆదిలాబాద్ జిల్లాలో ఆయన పర్యటించారు. జిల్లా అధ్యక్షుడు పాయల్ శంకర్ ఇంట్లో భైంసా అల్లర్ల బాధితులను పరామర్శించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. ‘‘ ప్రార్థనా మందిరాల్లో ప్రార్థనలకు ఎవరు అనుమతి ఇచ్చారు. పోలీసులు ఒక వర్గానికి కొమ్ము కాస్తున్నారు. కొంత మంది పోలీస్ అధికారుల వ్యవహారం వృత్తిని కించపర్చే విధంగా ఉంది. ( భైంసా బాధితులకు పరిహారం చెల్లించాలి )
సంతోష్ అనే వ్యక్తికి సంఘటనతో సంబంధం లేదు. అంతర్రాష్ట్ర ఉగ్రవాదన్న ఆరోపణలతో అతన్ని తీసుకెళ్లి పోలీసులు తీవ్రంగా కొట్టారు. పోలీసులకు మైనర్ బాలుడిని కొట్టే అధికారం ఎవరిచ్చారు. కాళ్లావేళ్లా పడ్డా వదలిపెట్టలేదు. దీనిపై ప్రభుత్వం, డీజీపీ స్పందించాలి. పోలీసులు ఓ వర్గానికి కొమ్ముకాస్తున్నారు. కశ్మీర్ తరహలో భైంసాలో హిందువులను పంపించాలనే ఎంఐఎం కుట్రలకు ప్రభుత్వం సపోర్ట్ చేస్తోంది’’ అని అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment