గుడిహత్నూర్, న్యూస్‌లైన్ : మండలంలోని మన్నూర్‌కు చెందిన కేంద్రే రంజనాబాయి(42) భర్త సుభాష్ మూడేళ్ల క్రితం చనిపోయూడు. దీం తో రంజనాబారుు వ్యవసాయ కూలీగా పని చే స్తూ కుమారులు రతన్‌హరి(18), జ్ఞానేశ్వర్ (16)ను పోషిస్తోంది. ఆదివారం ఉదయం వం ట చెరకు తెస్తానని సంచిలో తాడు తీసుకుని బ యల్దేరింది. సాయంత్రం దాటినా ఇంటికి చేరలే దు. దీంతో కుమారులు, స్థానికులు గ్రామ పరి సర ప్రాంతాల్లో, బంధువుల ఇళ్లలో వెతికినా ఫలితం లేకపోరుుంది. సోమవారం ఉదయం స్థానికుడొకరు వాగు పక్క నుంచి వెళ్తుండగా చెట్టు పక్కన పొదల్లో సంచి కనిపించింది. అక్కడికెళ్లి చూడగా మహిళ శవం కనిపించడంతో గ్రా మస్తులకు సమాచారం అందించాడు. సమాచా రం అందుకున్న ఎస్సై ఎల్.వెంకటరమణ చేరుకుని సంఘటన స్థలాన్ని పరిశీలించారు. మృతదేహం రంజనాబాయిదిగా గుర్తించారు.
కట్టేసి.. హింసించి..
రంజనాబారుుని కట్టేసి.. హింసించి చంపినట్లు ఆనవాళ్ల ఆధారంగా తెలుస్తోంది. మృతదేహం కాళ్లూచేతులు తాడుతో కట్టేసి ఉన్నారుు. అదే తాడు మెడలో ఉచ్చు వేసి ఉంది. తల, కంటి భాగంలో గాయాలై రక్తస్రావం అరుుంది. ఆమె లోదుస్తులు మృతదేహం పక్కన పడేసి ఉన్నా యి. మృతురాలి ఛాతి భాగంలో పంటిగాట్లు, జననాంగం నుంచి రక్తస్రావం జరిగినట్లు ఆనవాళ్లున్నాయి. మృతురాలిని తాడుతో కట్టేసి, లైంగికదాడి జరిపి, ఆపై హత్య చేసి ఉంటారని పోలీసులు పేర్కొన్నారు. సమాచారం అందుకున్న రూరల్ సీఐ రాంగోపాల్ సంఘటన స్థలాన్ని పరిశీలించారు. అనంతరం ఆదిలాబాద్ డీఎస్పీ లతామాధురి సంఘటన స్థలానికి చేరుకుని వివరాలు అడిగి తెలుసుకున్నారు. డాగ్ స్క్వాడ్ బృందాన్ని రప్పించారు.
జాగిలా లు మృతదేహం నుంచి గ్రామంలోకి వెళ్లి ఆగిపోవడంతో స్థానికులపై అనుమానాలు వ్యక్తమవుతున్నారుు. మృతదేహాన్ని పోస్టుమార్టమ్ నిమిత్తం రిమ్స్‌కు తరలించారు. ఈ హత్య లో ఇద్దరు లేదా ముగ్గురు పాల్గొని ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. ఆధారాలు లభించకపోవడంతో కేసు పోలీసులకు సవాల్‌గా మారింది. పోస్టుమార్టం నివేదిక ఆధారం గా కేసు దర్యాప్తు ప్రారంభిస్తామని పోలీసులు పేర్కొన్నారు. కాగా, గతంలో తండ్రి మరణం.. తాజాగా తల్లి హత్యకు గురవడంతో కుమారులు ఒంటరి వారయ్యారు. మృతదేహం వద్ద వారి రోదన స్థానికులను కలచివేసింది.
మహిళపై అఘాయిత్యం
Published Tue, Oct 8 2013 4:26 AM | Last Updated on Mon, Jul 30 2018 8:27 PM
Advertisement
Advertisement