లైంగికదాడులకు పాల్పడితే కఠిన చర్యలు | Sexual Harassment cases | Sakshi
Sakshi News home page

లైంగికదాడులకు పాల్పడితే కఠిన చర్యలు

Published Mon, Sep 23 2013 4:41 AM | Last Updated on Mon, Jul 23 2018 9:13 PM

Sexual Harassment cases

 జనగామ క్రైం,న్యూస్‌లైన్ :  మహిళలపై లైగింకదాడులకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా రూరల్ ఎస్పీ పాలరాజు హెచ్చరించారు. జనగామ ఏరియా ఆస్పత్రిలో ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. బచ్చన్నపేట మం డలం తమ్మడపల్లి గ్రామం వద్ద శనివారం లైం గికదాడికి గురైన మహిళను ఎస్పీ పాలరాజుతో పాటు రూరల్ అడిషినల్ ఎస్పీ కె. శ్రీకాంత్ ఆస్పత్రికి చేరుకుని పరామర్శించారు. ఈ సం దర్భంగా ఎస్పీ మాట్లాడుతూ లైంగికదాడికి గురైన మహిళ హైదరాబాద్‌లోని శావాలి దర్గా ప్రాంతానికి చెందినదని, పేరు ఇ.లక్ష్మీ అని రా సి చూపించడంతోపాటు ఆమె బంధువుల ద్వా రా తెలిసిందన్నారు. బాధితురాలు మహిళ మూగ, చెవిటి  అని తమ ప్రాథమిక దర్యాప్తు లో తేలిందన్నారు.లైంగికదాడికి పాల్పడ్డ నిం దితులపై నిర్భయ చట్టం సెక్షన్ 376 (డి) కిం ద కేసు నమోదు చేసి లారీని సీజ్ చేయనున్న ట్లు తెలిపారు. హైదరాబాద్‌కు చెందిన లక్ష్మి మెదక్ జిల్లా రామాయంపేటకు ఎందుకు వెళ్లింది? ఆమె వెంట ఎవరెవరు ఉన్నారో వారి బంధువుల ద్వారా వివరాలు తెలుకుంటామని, బాధితురాలే లారీని ఆశ్రయించిందా? లేక లైంగిక దాడికి పాల్పడినట్లు అభియోగం ఎదుర్కొంటున్న లారీ డ్రైవర్లు ఆమెను నమ్మించారా అనే విషయాలను సమగ్రంగా దర్యాప్తు చేస్తామని ఎస్పీ తెలిపారు.  

 ఉదయం మరోసారి పరీక్షించిన వైద్యులు
 బాధిత మహిళకు ఆదివారం ఉదయం జనగామ ఏరియా ఆస్పత్రి ఆర్‌ఎంఓ డాక్టర్ పగిడిపాటి సుగుణాకర్ రాజు, సూపరింటెండెంట్ డాక్టర్ పద్మ, అడిషినల్ ఎస్పీ కె. శ్రీకాంత్ ఆధ్వర్యంలో, ఆమె బంధువుల సమక్షంలో మరోసారి వైద్యపరీక్షలను నిర్వహించారు. వైద్యులు చికిత్స అందిస్తుండడంతో ఆమె క్రమంగా కోలుకుంటోంది. మహిళపై లైంగికదాడికి పాల్పడిన నిందితులను కఠినంగా శిక్షించాలని ఐద్వా డివిజన్ కార్యదర్శి ఇర్రి ఆహల్య ఓ ప్రకటనలో డిమాండ్ చేస్తూ జరిగిన సంఘటనను తీవ్రంగా ఖండించారు.
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement