
ధర్నా చేస్తున్న రజక సంఘాల నాయకులు
తెనాలి: మాజీ సీఎం చంద్రబాబు అరెస్ట్‌ను ఖండిస్తూ బెంగళూరులో టీడీపీ ఆధ్వర్యాన ఐటీ ఉద్యోగులు చేపట్టిన నిరసనలో ఓ మహిళ ‘రజకులు వెధవలు...’ అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంపై రజక సంఘాల నేతలు మండిపడ్డారు.
సదరు మహిళ వ్యాఖ్యలను ఏబీఎన్ ఆంధ్రజ్యోతి చానల్ పదేపదే ప్రసారం చేయడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. మహిళ వ్యాఖ్యలను నిరసిస్తూ గుంటూరు జిల్లా తెనాలిలో శనివారం ధర్నా చేశారు. టైర్లను దహనం చేసి, ఆ మంటల్లో ఆంధ్రజ్యోతి పత్రిక ప్రతులను పడేశారు. ఐటీ ఉద్యోగుల ముసు గులో టీడీపీ కార్యకర్తలే రజకులను కించపరి చేలా మాట్లాడారని, తక్షణమే క్షమాపణ చెప్పా లని రాష్ట్ర రజక సంఘాల ఐక్యవేదిక అధ్యక్షుడు పాతపాటి అంజిబాబు డిమాండ్ చేశారు.