rajaka sangham
-
రాష్ట్రంలో రజకులకు సమున్నత స్థానం
ఏఎన్‌యూ: రజకుల సాధికారతకు సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రత్యేక చర్యలు చేపడుతున్నారని ఏపీ సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి మేరుగు నాగార్జున అన్నారు. ఆచార్య నాగార్జున యూనివర్సిటీ ఎదురుగా ఉన్న మైదానంలో ఆదివారం రాత్రి ఆంధ్రప్రదేశ్ రజక సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో జరిగిన రజక ఆత్మగౌరవ మహాసభలో మంత్రి ప్రసంగిస్తూ.. రజకుల సమస్యల పరిష్కారానికి ఏపీ ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషిచేస్తోందన్నారు. రజక కార్పొరేషన్ ఏర్పాటు ద్వారా రజకులకు సమున్నత స్థానం కల్పించారని తెలిపారు. అంబేడ్కర్ ఆశించిన సామాజిక న్యాయమే లక్ష్యంగా ఏపీ ప్రభుత్వం చర్యలు చేపడుతోందని తెలిపారు. అర్హతే ప్రామాణికంగా సంక్షేమ పథకాలు పేదవాడి చెంతకు చేరుతున్నాయని తెలిపారు. అణగారిన వర్గాల సాధికారతకు అంకితభావంతో పనిచేస్తున్న ముఖ్యమంత్రి ఉండటం మన అదృష్టమన్నారు. ఆయన నాయకత్వంలో పనిచేయడం మాకు గర్వంగా ఉందని తెలిపారు. రజకుల సమస్యలు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషిచేస్తానని నాగార్జున హామీ ఇచ్చారు. సామాజిక సాధికారతకు ఏపీ వేదిక.. బీసీ సంక్షేమ శాఖా మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ మాట్లాడుతూ.. కులగణన విషయంలో దేశంలో ఏ రాష్ట్రం చేయని సాహసం ఏపీ ప్రభుత్వం చేస్తోందన్నారు. ఈ ప్రక్రియ తరువాత రజకులకు మరిన్ని ప్రయోజనాలు అందుతాయన్నారు. సామాజిక సాధికారతకు ఏపీ వేదికగా నిలుస్తోందని తెలిపారు. గత పాలకుల వివక్షకు గురైన వర్గాలకు వైఎస్సార్సీపీ ప్రభుత్వం సమున్నత స్థానం కల్పిస్తోందన్నారు. ప్రస్తుతం ఏపీలో బీసీల రాజ్యం నడుస్తోందని తెలిపారు. రజకుల సమస్యలు సీఎం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేందుకు కృషి చేస్తామని ప్రభుత్వ విప్ లేళ్ల అప్పిరెడ్డి, వైఎస్సార్సీపీ గుంటూరు జిల్లా అధ్యక్షుడు డొక్కా మాణిక్యవరప్రసాద్ తెలిపారు. రజకులకు ఏపీ ప్రభుత్వం అగ్రస్థానం కల్పించిందని.. రానున్న రోజుల్లో మరిన్ని పదవులు కల్పించనుందన్నారు. చట్టసభల్లో రజకులకు తప్పకుండా స్థానం దక్కుతుందన్నారు. రజకులను వంచించిన చంద్రబాబు ఏపీ రజక కార్పొరేషన్ చైర్మన్ రంగన్న, రజక సంఘాల ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షుడు అంజిబాబు ప్రసంగిస్తూ.. రజకుల సమస్యల పరిష్కారంపై సీఎం జగన్‌కు ప్రత్యేక ప్రణాళిక ఉందన్నారు. మాటతప్పే వ్యక్తిత్వం ఆయనది కాదన్నారు. చంద్రబాబు ప్రభుత్వం రజకులను తీవ్రంగా వంచించిందన్నారు. రజకుల్లో 50 ఏళ్ల వారికి పింఛన్ ఇవ్వమంటే మీకు ఇస్తే మిగతా కులాలు కూడా అడుగుతాయని చంద్రబాబు అవమానించారన్నారు. సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ మాట్లాడుతూ.. రజకుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలన్నారు. బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కేశన శంకరరావు, ఏపీ ఎన్జీఓ రాష్ట్ర నాయకుడు బండి శ్రీనివాసరావు, పలువురు బీసీ సంఘాలు, రజక సంఘాల నాయకులు పాల్గొన్నారు. ఏపీలో గొప్ప సంక్షేమ పథకాలు అమలు.. ఏపీలో గొప్ప సంక్షేమ పథకాలు అమలవుతున్నాయని తెలంగాణ ఎమ్మెల్సీ, కవి గోరటి వెంకన్న అన్నారు. రజకులపై తాను రాసిన పాట అంటే మహానేత వైఎస్ రాజశేఖర్‌రెడ్డికి ఎంతో ఇష్టమన్నారు. రాష్ట్రంలో గతానికి, ఇప్పటికి ఉన్న మంచిని గమనించాలని రజకులకు సూచించారు. పాటలతో ఆయన సభికులను ఉత్తేజపరిచారు. -
టీడీపీ వ్యాఖ్యలపై రజక సంఘాల నిరసన
తెనాలి: మాజీ సీఎం చంద్రబాబు అరెస్ట్‌ను ఖండిస్తూ బెంగళూరులో టీడీపీ ఆధ్వర్యాన ఐటీ ఉద్యోగులు చేపట్టిన నిరసనలో ఓ మహిళ ‘రజకులు వెధవలు...’ అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంపై రజక సంఘాల నేతలు మండిపడ్డారు. సదరు మహిళ వ్యాఖ్యలను ఏబీఎన్ ఆంధ్రజ్యోతి చానల్ పదేపదే ప్రసారం చేయడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. మహిళ వ్యాఖ్యలను నిరసిస్తూ గుంటూరు జిల్లా తెనాలిలో శనివారం ధర్నా చేశారు. టైర్లను దహనం చేసి, ఆ మంటల్లో ఆంధ్రజ్యోతి పత్రిక ప్రతులను పడేశారు. ఐటీ ఉద్యోగుల ముసు గులో టీడీపీ కార్యకర్తలే రజకులను కించపరి చేలా మాట్లాడారని, తక్షణమే క్షమాపణ చెప్పా లని రాష్ట్ర రజక సంఘాల ఐక్యవేదిక అధ్యక్షుడు పాతపాటి అంజిబాబు డిమాండ్ చేశారు. -
తిరుపతిలో రజక సంఘాల నిరసన
-
రజకులకు మహర్దశ
సాక్షి, ప్రొద్దుటూరు : పుట్టినప్పటి నుంచి మరణించే వరకు పుట్టెడు చాకిరి చేసే రజకుల బతుకులు నేడు దుర్భరంగా మారాయి. ఒకప్పుడు బండెడు పని ఉండేది. నేడు పనిలేక ఇతర వృత్తుల వైపు పయనిస్తున్నారు. తరతరాలుగా రజక వృత్తిపై ఆధారపడి జీవిస్తున్నా తమ జీవితాల్లో ఎలాంటి మార్పు లేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చాలా మంది ఈ వృత్తితో జీవనం సాగించలేక మానుకొని.. ఇతర వృత్తులను నమ్ముకుని ఆధారపడ్డారు. ప్రతి రజకుడి ఇంటిలో ఒకరు కాకుండా కుటుంబ సభ్యులంతా కలసి వృత్తి పని చేయాల్సిన పరిస్థితి ఉంది. అదే సమయంలో తమకు ఇచ్చే కూలి (మేర) అధ్వానంగా ఉంటోందని వారు అంటున్నారు. జిల్లాలో దాదాపు లక్ష 69 వేల మంది రజకులు వృత్తినే ఆధారంగా చేసుకుని బతుకుతున్నారు. చాలా గ్రామాల్లో దుస్తులు ఉతకడంపై సమస్యలు ఏర్పడటంతో.. రజకులను సాంఘిక బహిష్కరణ చేసిన సంఘటనలు అనేకం ఉన్నాయి. జమ్మలమడుగు నియోజకవర్గంలో ఎక్కువగా ఇలాంటి ఘటనలు చోటు చేసుకున్నాయని సంఘ నాయకులు చెబుతున్నారు. రాజుపాళెం మండలంలోని టంగుటూరు గ్రామంలో కూడా ఈ సమస్య తలెత్తినప్పుడు అప్పటి కలెక్టర్ జయేష్‌రంజన్ జోక్యం చేసుకుని పరిష్కరించారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి గత నెల 17న ఏలూరులో బీసీ గర్జన సభలో ప్రకటించిన బీసీ డిక్లరేషన్‌లో రజకులకు సంబంధించి ఎంతో ప్రాధాన్యతను ఇచ్చారు. దీంతో రజకుల్లో సర్వత్రా ఆనందం వ్యక్తమవుతోంది. తమను ఎస్సీ జాబితాలోకి చేర్చే అంశంపై బీసీ కమిషన్ నివేదికను కేంద్ర ప్రభుత్వానికి పంపాలని రజకులు డిమాండ్ చేస్తున్నారు. 2017 నవంబర్‌లో వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రజాసంకల్పయాత్ర 5వ రోజున ప్రొద్దుటూరుకు చేరుకుంది. ఈ సందర్భంగా జగన్ రజకుల సమస్యలపై స్పందించారు. అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రంతో గట్టిగా పోరాటం చేస్తామని హామీ ఇచ్చారు. ఈ విషయం తెలుసుకున్న సీఎం చంద్రబాబు నాయుడు తాము రజకులను ఎస్సీ జాబితాల్లో చేర్చుతామని ప్రకటించారు. సీఎం చంద్రబాబు బీసీ కమిషన్ వేయకుండా ఆంధ్ర విశ్వవిద్యాలయంలోని ముగ్గురు ప్రొఫెసర్లతో అధ్యయన కమిటీ వేశారు. వారు కేవలం రాష్ట్రంలోని విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో మాత్రమే పర్యటించారు. మిగతా జిల్లాలో వీరు పర్యటించడానికి బడ్జెట్ కేటాయించలేదు. హంగూ, ఆర్భాటాల కోసం రూ.కోట్లు ఖర్చుపెడుతున్న చంద్రబాబు ఈ కమిటీకి కనీసం రూ.50 లక్షలు కూడా కేటాయించకపోవడాన్ని చూస్తే తమపై ఎంత మాత్రం ప్రేమ ఉందో అర్థమవుతోందని రజకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నాలుగేళ్లుగా కేంద్రంలోని బీజేపీతో భాగస్వామ్యంగా ఉంటూ 20 మంది ఎంపీలు కలిగిన చంద్రబాబు ప్రభుత్వంలో తమకు న్యాయం జరగలేదని వారు అంటున్నారు. జగన్ ఇచ్చిన మాట తప్పడని వారు పేర్కొంటున్నారు. 2008లో హామీ ఇచ్చి అమలు చేయని చంద్రబాబు రజకులు తొలి నుంచి తెలుగుదేశం పార్టీకి అండగా ఉంటూ వస్తున్నారు. అయితే సీఎం చంద్రబాబు నాయుడు మాత్రం వారిపై చిన్నచూపు చూస్తున్నారు. రాష్ట్రంలో ఉన్న రజకులను ఎస్సీ జాబితాలో చేర్చాలని ఏనాటి నుంచో డిమాండ్ ఉంది. దేశంలోని 17 రాష్ట్రాలతోపాటు మూడు కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఈ విధానం అమలు అవుతోంది. వారిలాగే తమను అదే జాబితాలో చేర్చాలని తరతరాలుగా రజకులు డిమాండ్ చేస్తున్నారు. 2008లో ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు హైదరాబాద్‌లోని ఇందిరాపార్కు వద్ద రజక గర్జన సభ నిర్వహించారు. సభకు ముఖ్య అతిథిగా హాజరైన అప్పటి ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే.. రజకులను ఎస్సీ జాబితాలో చేర్చుతామని స్పష్టమైన హామీ ఇచ్చారు. 2016లో హైదరాబాద్‌లో జరిగిన చివరి అసెంబ్లీ సమావేశాల్లో రజకులను ఎస్సీ జాబితాలో చేర్చుతామని గవర్నర్ ప్రసంగంలో తెలిపారు. 1999, 2004 ఎన్నికల మేనిఫెస్టోలో కూడా తెలుగుదేశం పార్టీ రజకులను ఎస్సీ జాబితాలో చేర్చుతామని ప్రకటించింది. కానీ అమలు చేయలేదు. రజక సంఘం డిమాండ్లు ఎ భారతదేశంలోని 17 రాష్ట్రాలు, మూడు కేంద్ర పాలిత ప్రాంతాల్లో రజకులు ఎస్సీ జాబితాలో ఉన్నారు. ఆంధ్రప్రదేశ్‌లోని రజకులను ఎస్సీ జాబితాలో చేర్చాలి. ఎ 50 ఏళ్లు నిండిన రజక వృత్తిదారులకు నెలకు రూ.2 వేల పింఛన్ ఇవ్వాలి. ఎ రజకులపై జరిగే దాడులను అరికట్టడానికి రజక రక్షణ చట్టం అమలు చేయాలి. ఎ రజక ఫెడరేషన్ స్థానంలో కార్పొరేషన్ ఏర్పాటు చేసి రూ.500 కోట్లు కేటాయించాలి. ఎ రజక వృత్తి చెరువులు, ధోబీఘాట్ల స్థలాలు అన్యాక్రాంతం కాకుండా కాపాడి.. రజక కమ్యూనిటీ హాళ్లు, వీలైన చోట రజక కాలనీలను ఏర్పాటు చేయాలి. ఎ ధోబీఘాట్ల నిర్మాణ పనులను నామినేషన్ల కింద రజక సొసైటీలకు అప్పగించాలి. ఎ టీటీడీ, ప్రభుత్వ ఆస్పత్రులు, కార్యాలయాల్లో రజక వృత్తిని కాంట్రాక్టర్లకు కాకుండా రజక వృత్తిదారులకే కేటాయించాలి. ఎ ప్రభుత్వ ఆస్పత్రులు, ప్రభుత్వ కార్యాలయాల్లో ఉన్న ధోబీ పోస్టుల్లో రజకులనే నియమించాలి. ఎ రాజధాని ప్రాంతంలో స్థలం కేటాయించి రజక భవన్ నిర్మించాలి. ఎ రాజకీయ ప్రాధాన్యత కల్పించాలి. జిల్లాలో రజకుల జనాభా నియోజకవర్గం జనాభా ప్రొద్దుటూరు 20 వేలు జమ్మలమడుగు 18 వేలు బద్వేలు 20 వేలు కడప 18 వేలు మైదుకూరు 15 వేలు పులివెందుల 15 వేలు కమలాపురం 15 వేలు రాయచోటి 18 వేలు రాజంపేట 15 వేలు రైల్వేకోడూరు 15 వేలు మొత్తం 1,69,000 -
రజకులని ఎస్టీల్లో చేర్చాలని వైఎస్ జగన్‌కు వినతి
-
కొత్తగా 5 మోడల్ వాషింగ్ యూనిట్లు
సాక్షి, హైదరాబాద్: రజక వృత్తికి ఆధునిక సొబగులు అద్దుతోంది రజక ఫెడరేషన్. చెరువులు, వాగుల వద్ద బట్టలుతికే పద్ధతికి స్వస్తి పలికేందుకు ఫెడరేషన్ చర్యలు చేపట్టింది. వృత్తిని ఆధునీకరించేందుకు నడుంబిగించింది. మోడ ల్ వాషింగ్ యూనిట్ల ఏర్పాటుకు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. చెరువులు, వాగుల్లో నీటి లభ్యత లేకపోవడం, కొన్నిచోట్ల అపరిశుభ్రమైన నీటితో ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో వృత్తికి సాంకేతికతను జోడిస్తోంది. ప్రయోగాత్మకంగా ఐదు జిల్లాల్లో మోడల్ వాషింగ్ యూనిట్లు ఏర్పాటు చేయా లని నిర్ణయించింది. ఫెడరేషన్ పరిధిలోని సంఘాల్లో సభ్యత్వం ఉన్న రజకులకు తక్కు వ ధరలో బట్టలుతికి ఆరబెట్టి ఇచ్చే వాషింగ్ మిషన్లను తీసుకురానుంది. రజకులకు శ్రమ తగ్గించి వృత్తిని విస్తృత పర్చుకునే వెసులుబా టు కల్పించాలని రజక ఫెడరేషన్ భావిస్తోంది. ఐదు జిల్లాల్లో ప్రయోగాత్మకంగా.. మోడల్ వాషింగ్ యూనిట్లను తొలుత ఐదు జిల్లాల్లో ప్రయోగాత్మకంగా ఏర్పాటు చేయాల ని ఫెడరేషన్ నిర్ణయించింది. రజకుల జనాభా అధికంగా ఉన్న ఆదిలాబాద్, హైదరాబాద్, రంగారెడ్డి, సిద్దిపేట్, నల్లగొండ జిల్లాలను ఎంపిక చేసింది. ఒక్కో యూనిట్ ఏర్పాటుకు రూ.40 లక్షల వరకు వెచ్చించనుంది. ఈ మేరకు ప్రతిపాదనలు రూపొందించి ప్రభుత్వానికి సమర్పించింది. వాటికి ఆమోదం లభిస్తే క్షేత్రస్థాయిలో చర్యలు వేగవంతం చేయనుంది. రజకులు ఇళ్ల నుంచి సేకరించే వస్త్రాలను చెరువులు, వాగులు వద్ద ఉతకడంతోపాటు అక్కడే ఆరబెట్టేవారు. దీనికిగాను ఒకరిద్దరు సహాయకులను నియమించుకునేవారు. మోడల్ వాషింగ్ యూనిట్లతో ఈ కష్టాలన్నీ దూరమ య్యే అవకాశముంది. ఆయా ప్రాజెక్టుల పరిధుల్లో రజకులు సేకరించిన వస్త్రాలను నేరుగా యూనిట్లో సమర్పించాలి. యూనిట్ నిర్వహకులు వాటిని నిర్ణీత గడువులోగా ఉతికి, ఆరబెడతారు. ఆ తర్వాత ఎవరి వస్త్రాలను వారు తీసుకువెళ్లాల్సి ఉంటుంది. ఉతికి, ఆరబెట్టినందుకు ప్రతిఫలంగా ఫీజు ఇవ్వాలి. ఈ ఫీజు మొత్తాన్ని రజక ఫెడరేషన్ నిర్ణయిస్తుంది. ఉతికి, ఆరబెట్టిన వస్త్రాలను రజకులు ఇంటి వద్ద ఇస్త్రీ చేసి కస్టమర్లకు అందజేయవచ్చు. -
సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాం
అనంతపురం సప్తగిరిసర్కిల్ : రజకుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని రజక సహకార సంఘం సొసైటీæ చైర్మన్ రాజమండ్రి నారాయణ తెలిపారు. శనివారం స్థానిక బీసీ స్టడీ సర్కిల్ సమావేశ హాలులో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ప్రభుత్వం అందిస్తున్న రుణాలను ఎవరూ తిరిగి చెల్లించడం లేదని, ఇలాంటి సమయంలో మళ్లీ రుణాలు ఎలా అందిస్తారన్నారు. కాగా కాపులపై ఉన్న ప్రేమ ఈ ప్రభుత్వానికి బీసీలపై లేదని వివిధ సంఘాల నాయకులు చైర్మన్ ముందు వాపోయారు. బీసీలకు అందించాల్సిన రుణాలను అందించకపోవడంపై అధికారుల నిర్లక్ష్య వైఖరిని ముఖ్యమంత్రి దష్టికి, సంబంధిత మంత్రి దష్టికి తీసుకెళ్తామన్నారు. కార్యక్రమంలో వడ్డెర సహకార సంఘం చైర్మన్ దేవళ్ల మురళి, రజక సహకార సంఘం డైరెక్టర్ షణ్ముగం, ఉప్పర సహకార సంఘం డైరెక్టర్ సగర శ్రీకాంత్, దేవేంద్రప్ప, చంద్రమోహన్, లింగమయ్య, కంబన్న, లింగమయ్య తదితరులు పాల్గొన్నారు.