Savings Schemes
-
పొదుపు పథకాల్లో వడ్డీరేట్లు ఎలా ఉన్నాయంటే..
న్యూఢిల్లీ: పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (PPF), నేషనల్ సేవింగ్స్ సర్టిఫికేట్(NSC) సహా వివిధ చిన్న పొదుపు పథకాలపై 2025 జనవరి 1 నుంచి ప్రారంభమయ్యే నాలుగో త్రైమాసికానికి (జనవరి–మార్చి) వడ్డీ రేట్లను ప్రభుత్వం యథాపూర్వం కొనసాగించింది. వడ్డీ రేట్లు గత నాలుగు త్రైమాసికాలుగా మార్పులు లేకుండా కొనసాగుతున్నాయి. గత ఆర్థిక సంవత్సరంలో నాలుగో త్రైమాసికానికి కొన్ని పథకాలలో ప్రభుత్వం చివరిసారి మార్పులు చేసింది.2024–25 ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికం (అక్టోబర్ 2024 నుంచి డిసెంబర్ 2024 వరకు) కోసం నోటిఫై చేసిన రేట్లను మార్చకుండా కొనసాగిస్తున్నట్లు ఆర్థిక మంత్రిత్వ శాఖ తాజా నోటిఫికేషన్ పేర్కొంది. పోస్టాఫీసులు, బ్యాంకులు(Banks) నిర్వహించే స్మాల్ సేవింగ్స్ పథకాలనుపై వడ్డీ రేట్లను ఆర్థిక పరిస్థితులకు అనుగుణంగా ప్రతి త్రైమాసికం ఆర్థికశాఖ నోటిఫై చేసే సంగతి తెలిసిందే.ఇదీ చదవండి: ‘బీ-రెడీ’లో మంచి స్కోర్ రావాలంటే కష్టమే..తాజా నోటిఫికేషన్ ప్రకారం జనవరి-మార్చి 2025 వరకు వడ్డీరేట్లు..పథకం-రేటు(%)సుకన్య సమృద్ధి 8.2 మూడేళ్ల టర్మ్ డిపాజిట్ 7.1 పీపీఎఫ్ 7.1 పోస్టాఫీ సేవింగ్స్ డిపాజిట్ 4.0 కిసాన్ వికాస్ పత్ర 7.5 నేషనల్ సేవింగ్స్ సర్టిఫికేట్ 7.7 మంత్లీ ఇన్కమ్ స్కీమ్ 7.4 -
అధిక వడ్డీ ఇచ్చే ప్రభుత్వ పథకాలు ఇవే..
ఇన్వెస్ట్మెంట్ ద్వారా మరింత డబ్బు సంపాదించాలని చాలామంది కోరుకుంటారు. అందుకు రియల్ఎస్టేట్, బ్యాంకు సేవింగ్స్, ఎఫ్డీ, స్టాక్‌మార్కెట్.. వంటి విభిన్న మార్గాలను ఎంచుకుంటారు. అయితే ఆయా పథకాల్లో డబ్బు పెట్టుబడి పెడితే భద్రత పరమైన సమస్యలు రావొచ్చు. ఇన్వెస్ట్ చేసే నగదుపై మంచి రాబడిని ఇచ్చేలా, ప్రైవేట్ సంస్థల కంటే మెరుగైన భద్రత కల్పించేలా ప్రభుత్వ పథకాల్లో పెట్టుబడి పెడితే దీర్ఘకాలంలో ఆర్థిక లక్ష్యాలు చేరుకోవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. ప్రస్తుతం ప్రభుత్వం అందిస్తున్న కొన్ని ఇస్వెస్ట్మెంట్ పథకాల గురించి తెలియజేశాం.సీనియర్ సిటిజన్స్ సేవింగ్స్ స్కీమ్వడ్డీ: 8.2 శాతంపెట్టుబడి పరిమితులు: రూ.1000-రూ.30 లక్షలుకాలపరిమితి: ఐదేళ్లు, అదనంగా మరో మూడేళ్లు పెంచుకోవచ్చు. నిర్దేశించిన పరిమితికి ముందే డబ్బు విత్‌డ్రా చేయాలనుకుంటే మాత్రం 1 శాతం పెనాల్టీ విధించాల్సి ఉంటుంది.అర్హత: 60 ఏళ్లు కంటే ఎక్కువ వయసు ఉండాలి. భారతీయులై ఉండాలి.సెక్షన్ 80సీ కింద రూ.1.5 లక్షల వరకు పన్ను మినహాయింపు పొందవచ్చు.సుకన్య సమృద్ధి యోజన(ఎస్ఎస్వై) వడ్డీ: 8 శాతంపెట్టుబడి పరిమితులు: రూ.250(నెలవారీ)-రూ.1.5 లక్షలు(ఏటా)కాలపరిమితి: అమ్మాయికి 21 ఏళ్లు వచ్చేవరకు.అమ్మాయికి 18 ఏళ్లు వచ్చిన తర్వాత తాత్కాలికంగా 50 శాతం విత్‌డ్రా చేసుకోవచ్చు.అర్హత: 10 ఏళ్లు కంటే తక్కువ వయసు ఉన్న ఆడ పిల్లలు.ప్రతి ఇంటిలో ఒకరు మాత్రమే ఈ స్కీమ్‌లో చేరేందుకు అర్హులు.సెక్షన్ 80సీ కింద రూ.1.5 లక్షల వరకు పన్ను మినహాయింపు పొందవచ్చు.కిసాన్ వికాస్ పాత్ర(కేవీపీ)వడ్డీ: 7.5 శాతంపెట్టుబడి పరిమితులు: రూ.1000-గరిష్ట పరిమితి లేదుకాలపరిమితి: 115 నెలలు(తొమ్మిదేళ్ల 5 నెలలు)అత్యవసరంగా డబ్బు కావాల్సివస్తే 2.5 ఏళ్లు తర్వాత విత్‌డ్రా చేసుకోవచ్చు. అందుకు పెనాల్టీ చెల్లించాల్సి ఉంటుంది.పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్(పీపీఎఫ్)వడ్డీ: 7.1 శాతంపెట్టుబడి పరిమితులు: రూ.500(నెలవారీ)-రూ.1.5 లక్షలు(ఏటా)కాలపరిమితి: 15 ఏళ్లుఅర్హత: మైనర్లు, భారతీయ పౌరులు ఇందుకు అర్హులు.సెక్షన్ 80సీ కింద రూ.1.5 లక్షల వరకు పన్ను మినహాయింపు పొందవచ్చు.నేషనల్ సేవింగ్స్ సర్టిఫికేట్(ఎన్ఎస్సీ)వడ్డీ: 7.7 శాతంపెట్టుబడి పరిమితులు: రూ.1000-గరిష్ట పరిమితి లేదు.కాలపరిమితి: 5 ఏళ్లుఅర్హత: మైనర్లు, భారతీయ పౌరులు ఇందుకు అర్హులు.సెక్షన్ 80సీ కింద రూ.1.5 లక్షల వరకు పన్ను మినహాయింపు పొందవచ్చు.ఇదీ చదవండి: విభిన్న ఖాతాలు.. మరెన్నో పరిమితులు!పోస్ట్ ఆఫీస్ మంత్లీ ఇన్కమ్ స్కీమ్(పీఓఎంఐఎస్)వడ్డీ: 7.4 శాతంపెట్టుబడి పరిమితులు: రూ.1000-రూ.9 లక్షలు/జాయింట్ అకౌంట్ హోల్డర్లు గరిష్టంగా రూ.15 లక్షలు వరకు డిపాజిట్ చేసుకోవచ్చు.కాలపరిమితి: 5 ఏళ్లు -
ఈఎల్ఎస్ఎస్ను అలవాటుగా మార్చుకోండి
ఒకవైపు పన్ను భారాన్ని తగ్గించుకుంటూ మరోవైపు సంపదను పెంచుకునేలా పెట్టుబడులను ఉపయోగించుకునేందుకు మంచి అవకాశాలు ఉన్నాయి. ఈక్విటీ ఆధారిత సేవింగ్స్ స్కీములు (ఈఎల్ఎస్ఎస్) ఆ కోవకి చెందినవే. ఇలాంటి సాధనంలో ఇన్వెస్ట్ చేయడాన్ని అలవాటుగా మార్చుకోవడం వల్ల ఒనగూరే ప్రయోజనాలపై అవగాహన కల్పించేదే ఈ కథనం. ► కష్టమైనదైనా స్థిరంగా, తరచుగా ఒకే పనిని పదే పదే చేయడం వల్ల అలవాటు ఏర్పడుతుంది. ఒకసారి అలవాటుగా మారిన తర్వాత ఆ పని చేయడం కూడా సులువవుతుంది. ఆర్థిక క్రమశిక్షణలోనూ కొన్ని మంచి అలవాట్లు మనల్ని ఎంతగానో ఆదుకుంటాయి. సాధారణంగా మనకు క్రమం తప్పకుండా వచ్చే ఆదాయాలను నిత్యం ఎదురయ్యే అవసరాల కోసం ఖర్చు పెడుతుంటాం. ఈ క్రమంలో పొదుపు చేయడం, పెట్టుబడి పెట్టడం కన్నా ఖర్చు చేయడానికే ప్రాధాన్యం ఇవ్వడమనేది మనకు సులువైన అలవాటుగా మారిపోతుంది. ఎందుకంటే పొదుపు, పెట్టుబడి చేసి తర్వాతెప్పుడో ప్రతిఫలాన్ని అందుకోవడం కన్నా ఇప్పటికిప్పుడు ఖర్చు చేయడం వల్ల తక్షణం కలిగే సంతృప్తి ఎంతో ఎక్కువగా అనిపిస్తుంది. ఇదే ధోరణికి అలవాటు పడిపోయి తీరా ఆర్థిక సంవత్సరం ముగింపు వచ్చేసి, పన్ను భారం భయపెడుతుంటే అప్పుడు ఆ భారాన్ని తప్పించుకునేందుకు మార్గాలను వెదకడం మొదలుపెడుతుంటాం. ఆ ఒత్తిడిలో ఇటు పన్ను భారాన్ని తగ్గించడంతో పాటు మెరుగైన రాబడులను ఇవ్వగలిగే పెట్టుబడి సాధనాలను క్షుణ్నంగా తెలుసుకునే అవకాశాలు కోల్పోతుంటాం. ముందు నుంచే కాస్త జాగ్రత్తపడితే అలాంటి పరిస్థితి ఎదురుకాకుండా చూసుకోవచ్చు. ► వేతనజీవులైన ట్యాక్స్‌పేయర్ల విషయంలో వారి కంపెనీలు పీఎఫ్ రూపంలో ప్రతి నెలా ఎంతో కొంత ఆటోమేటిక్‌గా డిడక్ట్ చేస్తుంటాయి. పన్ను ఆదా చేసుకునేందుకు సింహభాగం వాటా ఈ రూపంలోనే వెడుతుంటుంది. పన్ను ఆదాకు సంబంధించి సెక్షన్ 80సి కింద ప్రావిడెంట్ ఫండ్ (పీఎఫ్) సహా అనేక చాయిస్‌లు ఉన్నాయి. దీనితో ఏది ఎంచుకోవాలనేదానిపై కాస్త సందిగ్ధం ఏర్పడవచ్చు. ► సెక్షన్ 80సి కింద పన్ను ఆదా చేసుకునేందుకు ఉపయోగపడే సాధనాల్లో ఈఎల్ఎస్ఎస్ అనేది ఎంతగానో ప్రాచుర్యం పొందింది. దీనితో రెండు రకాల ప్రయోజనాలు ఉంటాయి. పన్నులను ఆదా చేసుకోవడం ఒకటైతే, సంపద సృష్టికి ఉపయోగపడటం రెండోది. మెరుగైన రాబడులు.. మిగతా సాధనాలతో పోలిస్తే దీర్ఘకాలంలో ఈక్విటీలు మరింత మెరుగైన రాబడులు ఇస్తాయని రుజువైంది. నిఫ్టి 500 టీఆర్ఐ గత పదేళ్లలో 13.32 శాతం మేర వార్షిక రాబడులు ఇచ్చింది. మిగతా ట్యాక్స్ సేవింగ్ సాధనాలతో పోల్చితే ఈఎల్ఎస్ఎస్ లాకిన్ పీరియడ్ చాలా తక్కువగా మూడేళ్లే ఉంటుంది. కాబట్టి ఈక్విటీలపై ఆసక్తి గల ఇన్వెస్టర్లు ఈ సాధనాన్ని పరిశీలించవచ్చు. సిప్ ప్రయోజనాలు.. మీకు ప్రతి నెలా ఎలాగైతే వేతనం వస్తుందో, పీఎఫ్ కటింగ్ జరుగుతుందో అదే విధంగా ఈఎల్ఎస్ఎస్లో ఇన్వెస్ట్ చేసేందుకు సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ (సిప్) విధానాన్ని ఎంచుకోవచ్చు. మన ఆర్థిక లక్ష్యాల కోసం పొదుపు చేసేటప్పుడు ఆ ప్రక్రియను ఆటోమేటిక్ చేయడం వల్ల ఇన్వెస్ట్ చేయడం సులభతరం అవుతుంది. ఆదాయం ఆర్జించడం, ఖర్చు చేయడం, పొదుపు, విందులు.. విహారయాత్రల తరహాలోనే ట్యాక్స్ సేవింగ్‌ను కూడా ఒక అలవాటుగా మార్చుకోండి. ఫలితంగా పన్ను ఆదా చేసుకోవడం కోసం ఆఖరు నిమిషంలో హడావిడిగా పరుగులు తీయనక్కర్లేదు. ► సిప్ మార్గంలో ఇన్వెస్ట్ చేయడం వల్ల కాస్ట్ యావరేజింగ్ ప్రయోజనాలు పొందవచ్చు. ఈక్విటీలు ఒకోసారి పెరుగుతాయి ఒకోసారి తగ్గుతాయి. ఏకమొత్తంగా ఒకేసారి ఇన్వెస్ట్ చేయడం వల్ల ఒకే రేటు దగ్గర కొనుగోలు చేసినట్లవుతుంది. అలా కాకుండా సిప్ విధానంలో కాస్త కాస్తగా పెట్టుబడులు పెట్టడం వల్ల కాస్ట్ యావరేజింగ్ ప్రయోజనాలు పొందవచ్చు. అంటే కొనుగోలు రేటు సగటున తగ్గుతుంది. తత్ఫలితంగా తదుపరి మరింత రాబడులను అందుకోవడానికి ఆస్కారం ఉంటుంది. ► ఈఎల్ఎస్ఎస్లో అవసరమైనప్పుడు మీకు కావాల్సిన విధంగా పెట్టుబడిని పెంచుకునే సౌలభ్యం కూడా ఉంటుంది. ముందుగా మీ పన్ను భారాన్ని తగ్గించుకునేందుకు అవసరమైన మొత్తంతో మొదలుపెట్టండి. క్రమంగా ఆర్థిక సంవత్సరం ఆఖరు నాటికి పెట్టుబడులు ఒకవేళ సెక్షన్ 80సి కింద గల రూ. 1.5 లక్షల పరిమితి కన్నా తక్కువగానే ఉంటే కాస్త పెంచుకోండి. ► ఇలా క్రమం తప్పకుండా సిప్ ద్వారా ఈఎల్ఎస్ఎస్లో ఇన్వెస్ట్ చేయడాన్ని ఒక అలవాటుగా మార్చుకోండి. ఇటు సంపద సృష్టికి అదనంగా అటు పన్నుల ఆదాను చేసుకునేందుకు కూడా ఇది ఉపయోగపడుతుంది. -
బ్యాంక్ స్టేట్మెంట్నే మార్చి మరీ..
వెల్దుర్తి(తూప్రాన్) : మాసాయిపేట మండలం కొప్పులపల్లి గ్రామంలో పొదుపు సంఘాల సభ్యుల డబ్బుల చెల్లింపుల్లో వీవోఏలు నమ్మితే నట్టేట ముంచుడే అన్నచందంగా వ్యవహరిస్తున్నారు. మహిళా సంఘం సభ్యులు ప్రతినెలా బ్యాంకులో డిపాజిట్ చేసే డబ్బుల చెల్లింపులోనూ వీవోఏలు చేతివాటం ప్రదర్శించారు. ఈ నెల 20న విచారణ చేపట్టిన అధికారులు అక్రమాలను గుర్తించి వీవోఏ–2 మాధవి నుంచి రూ.4,65,798 రికవరీకి ఆదేశించారు. విచారణ సమయంలో అధికారులు, మహిళలకు చిక్కకుండా గ్రామానికి చెందిన వీవోఏ–1 మానస ఏకంగా బ్యాంక్ స్టేట్మెంట్ రికార్డులను ఫోర్జరీ చేసినట్లు సుమిత్ర సంఘం సభ్యులు గుర్తించారు. మార్చి, ఏప్రిల్ నెలకు సంబంధించి పొదుపు సంఘం సభ్యులు రూ. 20 వేలు చొప్పున వీవోఏ మానసకు డబ్బులు అప్పగించగా బ్యాంకులో మాత్రం కేవలం రూ.10 వేల చొప్పున డిపాజిట్ చేసింది. సభ్యులకు అనుమానం రాకుండా బ్యాంక్ వోచర్లో ఇరవై వేలుగా మార్చి అక్షరాల్లోనూ రాసి రశీదులను అందజేసింది. విచారణలో బయట పడుతుందని.. విచారణ సమయంలో తక్కువ డబ్బులు డిపాజిట్ చేసిన విషయం బయట పడుతుందనే ఉద్దేశ్యంతో బ్యాంక్ అధికారులు ఇచ్చిన స్టేట్మెంట్ను సైతం ఓ జిరాక్స్ సెంటర్లో మార్చి అటు అధికారులు, ఇటు పొదుపు సంఘాల సభ్యులను పక్కదారి పట్టించింది. మానస తీరుపై అనుమానం వచ్చిన సుమిత్ర సంఘం సభ్యులు శుక్రవారం బ్యాంక్‌లో స్టేట్మెంట్ తీసుకోగా అందులో రూ.10 వేల చొప్పున డిపాజిట్ చేసినట్లు గుర్తించారు. దీంతో గ్రామచావిడి వద్ద వీవోఏ మానసను కమ్యూనిటీ కో ఆర్డినేటర్ రజిత ఎదుటే నిలదీశారు. రుణాల మంజూరు విషయంలో జిల్లా ఉన్నతాధికారులు స్పందించి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని, తమను మోసం చేసి డబ్బులు కాజేసిన విషయమై త్వరలో పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయనున్నట్లు పొదుపు సంఘాల సభ్యులు తెలిపారు. -
‘పొదుపు’ మళ్లీ కళకళ!
(సాక్షి, పర్సనల్ ఫైనాన్స్ విభాగం) : వడ్డీ రేట్లు పెరుగుతుండటంతో చిన్న మొత్తాల పొదుపు పథకాలకు మళ్లీ కళొచ్చింది. సామాన్యుల పొదుపు సాధనాలుగా వర్ధిల్లిన ఈ పథకాలు నాలుగేళ్లుగా వడ్డీ రేట్ల క్షీణతతో కాస్తంత కళ తప్పాయనే చెప్పాలి. అయినప్పటికీ బ్యాంకులతో పోలిస్తే గతంలోనూ, ఇప్పుడు కూడా కాస్తంత ఎక్కువ రాబడి వస్తున్నది చిన్న మొత్తాల పొదుపు పథకాల్లోనేనని నిస్సందేహంగా చెప్పుకోవాలి.అయితే, దేశంలో తిరిగి వడ్డీ రేట్లు పెరుగుతున్న వాతావరణం నెలకొంది. ఫలితంగా... అక్టోబర్ 1 నుంచి ప్రారంభమయ్యే మూడు నెలల కాలానికి అన్ని జాతీయ చిన్న మొత్తాల పొదుపు పథకాలపై వడ్డీ రేట్లను 0.40 శాతం వరకు పెంచుతున్నట్టు కేంద్రం ప్రకటించింది. అన్ని వయసుల వారి అవసరాలకు సరిపడే పథకాలు వీటిల్లో ఉన్నాయి. ఆ వివరాలొకసారి చూస్తే... ప్రజా భవిష్య నిధి (పీపీఎఫ్) పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (పీపీఎఫ్) ఆదాయపన్ను ప్రయోజనంతో పాటు దీర్ఘకాలిక లక్ష్యాల కోసం అనువైన పథకాల్లో ఒకటి. భద్రతతో కూడిన ఆకర్షణీయమైన దీర్ఘకాలిక పెట్టుబడి పథకాల్లో ఇదీ ఒకటి. పైగా ఆదాయపన్ను ప్రయోజనాన్ని చూసుకుంటే అందరి పోర్ట్‌ఫోలియోలో తప్పని సరిగా ఉండాల్సిన సాధనం. దీని కాల వ్యవధి 15 ఏళ్లు. కావాలంటే ఐదేళ్ల చొప్పున పొడిగించుకోవచ్చు. ఇందులో ఏటా కనీసం డిపాజిట్ చేయాల్సిన మొత్తం రూ.500. గరిష్టంగా రూ.1.50 లక్షల వరకు ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఒకేసారి లేక 12 వాయిదాల రూపంలో ఇన్వెస్ట్ చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి సామాన్యులు సైతం ఇన్వెస్ట్ చేయొచ్చు. ఇందులో ఒక ఆర్థిక సంత్సరంలో రూ.1.50 లక్షల వరకు ఇన్వెస్ట్ చేసి, ఆ మొత్తంపై ఆదాయపన్ను చట్టంలోని సెక్షన్ 80సీ కింద పన్ను మినహాయింపు పొందొచ్చు. 15 ఏళ్ల కాల వ్యవధిలో 7వ ఏట నుంచి పాక్షిక ఉపసంహరణకు అనుమతి ఉంటుంది. ముందస్తుగా ఖాతా మూసివేసేందుకు అవకాశం లేదు. దీనిపై వడ్డీ రేటును కేంద్రం ప్రతీ మూడు నెలలకోసారి సమీక్షించి, సవరిస్తుంటుంది. వడ్డీ గత నెల వరకు 7.6 శాతం కాగా దీన్ని తాజాగా 8 శాతానికి సవరించింది. వడ్డీని ఏడాదికోసారి అసలుకు కలుపుతారు. ఈ పథకంలో పెట్టుబడులపైనే కాదు, వడ్డీ రాబడి, కాల వ్యవధి తీరిన తర్వాత అందుకునే మొత్తంపైనా ఆదాయపన్ను లేదు. అందుకే మూడు మినహాయింపులు (ఈఈఈ) కలిగిన పథకంగా దీన్ని చెబుతారు. ముఖ్యంగా 30 శాతం ఆదాయపన్ను శ్లాబులో ఉన్నవారు ఇందులో ఇన్వెస్ట్ చేయడం ద్వారా పన్ను మినహాయింపులను లెక్కేసి చూస్తే అధిక రాబడి పొందొచ్చు. వీరికి నికరంగా 11.9 శాతం రాబడి పొందినట్లవుతుంది. చాలా డెట్ ఫండ్స్, బాండ్లతో పోలిస్తే పీపీఎఫ్ చక్కని రాబడి సాధనంగా ఉంది. అదనపు ప్రయోజనాలు పీపీఎఫ్ బ్యాలన్స్‌పై రుణాన్ని కూడా తీసుకోవచ్చు. ఖాతా ప్రారంభించిన తర్వాత మూడో ఆర్థిక సంవత్సరం నుంచి ఆరో ఆర్థిక సంవత్సరం వరకు ఈ అవకాశం ఉంటుంది. బ్యాలన్స్‌లో 25 శాతం పొందొచ్చు. మూడేళ్లలోగా తిరిగి చెల్లించాలి. పాక్షిక ఉపసంహరణ అవకాశం ఏడో సంవత్సరం నుంచి ఉంటుంది. ఏ పోస్టాఫీసులో అయినా లేక బ్యాంకులో అయినా పీపీఎఫ్ ఖాతాను తెరవొచ్చు. బ్యాంకుల్లో అయితే ఆన్లైన్లో ప్రారంభించే సదుపాయం కూడా ఉంది. వేరే శాఖకు కూడా బదిలీ చేసుకోవచ్చు. నేషనల్ సేవింగ్స్ సర్టిఫికెట్ (ఎన్ఎస్సీ) ఇటీవలి రేట్ల సవరణ తర్వాత నేషనల్ సేవింగ్స్ సర్టిఫికెట్ (జాతీయ పొదుపు పత్రం) పథకంలో వడ్డీ రేటు 8 శాతానికి చేరుకుంది. కాల వ్యవధి ఐదేళ్లు. ఐదేళ్లపాటు లాకిన్‌లో ఉంటుంది. ఆ లోపు పెట్టుబడులను వెనక్కి తీసుకునే వీలుండదు. పెట్టుబడి సమయంలో ఉన్న వడ్డీ రేటే కాల వ్యవధి పూర్తయ్యే వరకూ అమలవుతుంది. ఏటా వడ్డీ ఆదాయాన్ని ఆసలుకు కలుపుతారు. కనీసం రూ.100 నుంచి ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. రూ.100 పెట్టుబడి ఐదేళ్ల తర్వాత రూ.144.23 అవుతుంది. ఇందులో పెట్టుబడులకు గరిష్ట పరిమితి లేదు. ఎన్ఎస్సీలో చేసే రూ.1.50 లక్షల పెట్టుబడికి ఆదాయపన్ను చట్టంలోని సెక్షన్ 80సీ కింద పన్ను మినహాయింపు లభిస్తుంది. వడ్డీ ఏటా అసలుకు కలుస్తుంటుంది. ఇలా కలిసే మొత్తాన్ని తిరిగి పెట్టుబడి పెట్టినట్టుగా ఆదాయపన్ను చట్టం పరిగణిస్తుంది. కనుక దీనిపైనా సెక్షన్ 80సీ కింద గరిష్ట పరిమితి మేరకు పన్ను మినహాయంపు క్లెయిమ్ చేసుకోవచ్చు. కానీ, చివరి ఏడాది (ఐదో ఏట) వచ్చే వడ్డీ ఆదాయం తిరిగి ఇన్వెస్ట్ చేయడం ఉండదు కనుక దీనిపై పన్ను మినహాయింపు ఉండదు. దీన్ని తమ వ్యక్తిగత ఆదాయానికి కలిపి నిబంధనల మేరకు పన్ను చెల్లించాల్సి ఉంటుంది. వడ్డీ ఆదాయానికి టీడీఎస్ (మూలం వద్ద పన్ను కోత) వర్తించదు. పోస్టాఫీసు ఐదేళ్ల టైమ్ డిపాజిట్ పథకంతో పోల్చిచూస్తే... ఎన్‌ఎస్‌సీలోనే కాస్తంత అధిక రాబడి ఉంది. టైమ్ డిపాజిట్లో 7.8 శాతమే వడ్డీ రేటు ఉంది. కాకపోతే , పన్ను ఆదా చేసే బ్యాంకు ఫిక్స్డ్ డిపాజిట్ పథకంలో మాత్రం అధిక రాబడి అందుకోవచ్చు. ఉదాహరణకు డాయిష్ బ్యాంకు, ఐడీఎఫ్సీ బ్యాంకు పన్ను ఆదా చేసే ఐదేళ్ల ఎఫ్డీలపై 8.5 శాతం వడ్డీ రేటును ఆఫర్ చేస్తున్నాయి. కానీ, వడ్డీ ఆదాయానికి పన్ను పడుతుంది. అలా చూస్తే ఎన్ఎస్సీయే మెరుగైనది. ఎందుకంటే పన్ను తర్వాత అధిక రాబడి ఎన్‌ఎస్‌సీలోనే అధికం. పైగా ఇందులో పెట్టుబడులకు కేంద్ర ప్రభుత్వ హామీ ఉంటుంది. బ్యాంకు డిపాజిట్ల కంటే సురక్షితమైనది. ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్సెస్ (ఇతర మార్గాల ద్వారా వచ్చిన ఆదాయం) అనే కాలమ్‌లో ఎన్ఎస్సీ రాబడిని చూపించాల్సి ఉంటుంది. ఏ పోస్టాఫీసు నుంచి అయినా ఎన్ఎస్సీ పత్రాలను కొనుగోలు చేయవచ్చు. సొంతంగాను, మైనర్ల పేరిట, జాయింట్‌గానూ తీసుకోవచ్చు. సుకన్య సమృద్ధి యోజన (ఎస్ఎస్వై) చిన్న వయసులో ఉన్న కుమార్తెల పేరిట వారి భవిష్యత్తు లక్ష్యాల కోసం పొదుపు చేసుకునేందుకు ఉద్దేశించిన సాధనం. కుమార్తెల ఉన్నత విద్య, వివాహ అవసరాల కోసం ఇన్వెస్ట్ చేసుకునేందుకు పూర్తి భద్రత కలిగిన మెరుగైన సాధనంగా దీన్ని చెప్పుకోక తప్పదు. తాజా త్రైమాసికానికి ఈ పథకంలో పెట్టుబడులపై వడ్డీ రేటును 8.1 శాతం నుంచి 8.5 శాతానికి పెంచారు. ఇతర చిన్న మొత్తాల పొదుపు పథకాల కంటే (సీనియర్ సిటిజన్ సేవింగ్స్ పథకం మినహా) ఇందులో వడ్డీ రేటు ఎక్కువ. ఇక ఇందులో పెట్టుబడులు, వడ్డీ ఆదాయం, మెచ్యూరిటీ మొత్తాలపైనా పన్ను లేకపోవడం అదనపు ఆకర్షణ. ఇద్దరు కుమార్తెల పేరిటే ఖాతాలు తెరిచే అవకాశముంది. పదేళ్లలోపు కుమార్తె ఉన్న వారు తప్పకుండా పరిశీలించాల్సిన ఫిక్స్డ్ ఇన్కమ్ పథకమిది. దత్తత తీసుకున్న కుమార్తె పేరిటా ఖాతాను తెరవొచ్చు. ఏడాదిలో కనీసం రూ.250 ఇన్వెస్ట్ చేయాలి. గరిష్టంగా ఓ ఆర్థిక సంవత్సరంలో రూ.1.5 లక్షల వరకు ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఇంతకుమించి కుదరదు. ఇందులో పెట్టుబడులకు ఆదాయపన్ను చట్టంలోని సెక్షన్ 80సీ కింద పన్ను మినహాయింపు ఉంది. పోస్టాఫీసులతోపాటు బ్యాంకుల్లోనూ ఈ ఖాతా తెరిచేందుకు వీలుంది. ఇందులో వడ్డీని ఏటా అసలుకు కలుపుతారు. 15 ఏళ్ల పాటు ఇన్వెస్ట్ చేయాలి. ఖాతా ప్రారంభించిన తర్వాత 21 ఏళ్లకు కాల వ్యవధి తీరిపోతుంది. ఏడాదిలో ఎన్ని విడతలుగానైనా ఇన్వెస్ట్ చేసుకునేందుకు వీలుంది. ఉన్నత విద్య కోసం కుమార్తె 18వ సంవత్సరంలోకి వచ్చిన తర్వాత లేదా 10వ తరగతి పూర్తయిన తర్వాత 50% బ్యాలన్స్‌ను వెనక్కి తీసుకోవచ్చు. ఏది ముందు అయితే దాన్నే పరిగణనలోకి తీసుకోవడం జరుగుతుంది. అలాగే, 18 ఏళ్లు నిండిన తర్వాత అమ్మాయి వివాహం కోసం మొత్తాన్ని వెనక్కి తీసేసుకోవచ్చు. సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్ (ఎస్సీఎస్ఎస్) 60 ఏళ్లు నిండిన వృద్ధుల కోసం ఉద్దేశించిన పథకం ఇది. ఇటీవలి వడ్డీ రేట్ల సవరణ తర్వాత ఈ పథకంలో పెట్టుబడిపై వార్షిక వడ్డీ రేటు 8.7 శాతానికి పెరిగింది. సురక్షితమైన సాధనాల్లో అత్యధిక రాబడి ఉన్న పథకం ఇదేనని స్పష్టంగా చెప్పొచ్చు. వీఆర్ఎస్తో ముందే పదవీ విరమణ చేసిన వారయితే 55 ఏళ్లకే ఇందులో ఇన్వెస్ట్ చేయొచ్చు. కాకుంటే 55 ఏళ్లకే చేరే వారు రిటైర్మెంట్ ప్రయోజనాలు అందిన నెలలోపే ఈ ఖాతాను ప్రారంభించాల్సి ఉంటుంది. ఈ పథకం కాల వ్యవధి ఐదేళ్లు. ఇతర చిన్న మొత్తాల పొదుపు పథకాల మాదిరే ఈ పథకం వడ్డీ రేటును కూడా కేంద్రం మూడు నెలలకోసారి సవరిస్తుంది. ఇన్వెస్ట్ చేసిన రోజు ఉన్న వడ్డీ రేటే పూర్తి కాలావధికి వర్తిస్తుంది. ఐదేళ్ల తర్వాత కావాలనుకుంటే మరో మూడేళ్ల పాటు పొడిగించుకోవచ్చు. విడిగా ఒకరు తమ పేరిట రూ.15 లక్షల వరకు ఇన్వెస్ట్ చేసుకునేందుకు అవకాశం ఉంది. ఈ పథకంలో రూ.1.5 లక్షల పెట్టుబడికి సెక్షన్ 80సీ కింద పన్ను ప్రయోజనానికి అనుమతి ఉంది. కాకపోతే ఈ పథకంలో పెట్టుబడులపై వచ్చే వడ్డీ ఆదాయం పన్ను పరిధిలోకి వస్తుంది. ప్రతీ త్రైమాసికం ముగింపు రోజున వడ్డీ ఆదాయం చెల్లించడం జరుగుతుంది. అన్ని బ్యాంకులు సీనియర్ సిటిజన్ డిపాజిట్లపై 6.5–8.25 శాతం మధ్యే వడ్డీని ఆఫర్ చేస్తున్నాయి. ఒక్క ఐడీఎఫ్సీ బ్యాంకు 8.75 శాతం ఆఫర్ చేస్తోంది. పోస్టాఫీసు నెలసరి ఆదాయ పథకం పెట్టుబడికి భద్రత ఉండాలి, ప్రతీ నెలా ఆదాయం రావాలి అని కోరుకునే వారికి పోస్టాఫీసు నెలసరి ఆదాయ పథకం కూడా ఒక సాధనమే. ఇందులో పెట్టుబడులపై 7.3%గా ఉన్న వడ్డీ రేటు ఈ నెల 1 నుంచి 7.7%కి పెరిగింది. ఈ పథకంలో పెట్టుబడు లకు ప్రభుత్వ హామీ ఉంటుంది. పథకం కాల వ్యవధి ఐదేళ్లు. వడ్డీ ఆదాయాన్ని ప్రతి నెలా చెల్లిస్తారు. ఒకరు లేదా ఇద్దరు కలసి జాయింట్‌గానూ ప్రారంభించొచ్చు. కనీస పెట్టుబడి రూ.1,500. గరిష్ట పరిమితి రూ.4.5 లక్షలు. జాయింట్ ఖాతా అయితే గరిష్ట పరిమితి రూ.9 లక్షలు. దాదాపు అన్ని బ్యాంకుల ఎఫ్‌డీల కంటే (నెలవారీ వడ్డీ చెల్లించేవి) అధిక రాబడి ఇందులో అందుకోవచ్చు. డిఫాల్ట్ రిస్క్ ఉండదు. ఇక ఈ పథకంలో పెట్టుబడులకు సెక్షన్ 80సీ పన్ను ప్రయోజనాల్లేవు. పైగా పోస్టాఫీసుల నెలసరి ఆదాయ పథకంపై వచ్చే వడ్డీ ఆదాయం, బ్యాంకు ఎఫ్డీలపై ఆదాయం పన్ను పరిధిలోకి వస్తుంది. కాస్త ఆకర్షణీయ అంశాలు ఏమిటంటే... వడ్డీ ఆదాయంపై టీడీఎస్ అమలు చేయరు. ఏడాది తర్వాత ముందస్తుగా క్లోజ్ చేయవచ్చు. కాకపోతే కాస్త పెనాల్టీ భరించాలి. ఇక పదేళ్ల కాల వ్యవధి కలిగిన ప్రధానమంత్రి వయవందన యోజనలో సీనియర్ సిటిజన్లకు పెట్టుబడిపై 8.3 శాతం రాబడి మాత్రమే అందుతుంది. ఒకరు ఒకటికి మించిన ఖాతాలను ప్రారంభించొచ్చు. కానీ అన్నింటిలోనూ పెట్టుబడి మొత్తం రూ.15 లక్షలు మించకూడదు. వడ్డీ రేట్లు భవిష్యత్తులో పెరుగుతాయని భావిస్తే ఏక మొత్తంలో కాకుండా వివిధ కాల వ్యవధులతో క్రమంగా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఖాతాను ముందే క్లోజ్ చేయటానికి అనుమతిస్తారు. కాకపోతే పెట్టుబడిపై 1– 1.5 శాతం వరకు మినహాయిస్తారు. వడ్డీ ఆదాయం ఓ ఆర్థిక సంవత్సరంలో రూ.10,000 దాటితే టీడీఎస్ మినహాయిస్తారు. పోస్టాఫీసు లేదా ఎస్బీఐ, బ్యాంకు ఆఫ్ ఇండియా, సెంట్రల్ బ్యాంకు, యూనియన్ బ్యాంకు, ఐసీఐసీఐ బ్యాంకుల్లో ఈ ఖాతాను ప్రారంభించుకోవచ్చు. -
ఈఎల్ఎస్ఎస్లకంటే యులిప్‌లు బెటరా?
మ్యూచువల్ ఫండ్స్‌కు చెందిన ఈక్విటీ లింక్డ్ సేవింగ్స్ స్కీమ్స్(ఈఎల్ఎస్ఎస్) మెచ్యూరిటీపై పన్నులు విధించారు కదా ! అందుకని యులిప్స్‌లో ఇన్వెస్ట్ చేద్దామనుకుంటున్నాను. యులిప్స్‌లో పన్ను ప్రయోజనాలు లభిస్తాయి కాబట్టి ఇప్పుడు యులిప్స్ బెటరని మిత్రులంటున్నారు. తగిన సలహా ఇవ్వండి ? – రవికాంత్, కరీంనగర్ ఈఎల్ఎస్ఎస్ స్కీమ్‌ల మెచ్యూరిటీపై పన్నులున్నాయన్న ఆలోచనతో యులిప్(యూనిట్ లింక్డ్ ఇన్సూరెన్స్ ప్లాన్)ల్లో ఇన్వెస్ట్ చేయడం సరైన నిర్ణయం కాదు. ఈఎల్ఎస్ఎస్ యూనిట్లను విక్రయించినప్పుడు మీరు 10.4 శాతం దీర్ఘకాల మూలధన లాభాల పన్ను(ఎల్టీసీజీ) చెల్లించాల్సి ఉంటుంది. యులిప్స్ యూనిట్లను విక్రయించినప్పుడు ఎలాంటి పన్ను భారం ఉండదు. అయితే యులిప్స్ కంటే ఈఎల్ఎస్ఎస్లకే ప్రాధాన్యత ఇవ్వడానికి ప్రధానంగా మూడు పన్నేతర కారణాలున్నాయి. మొదటిది పారదర్శకత... మ్యూచువల్ ఫండ్స్ ఏ యే కంపెనీల్లో ఇన్వెస్ట్ చేస్తాయో వెల్లడిస్తాయి. కానీ యులిప్స్ ఆ విషయంలో మ్యూచువల్ ఫండ్స్ అంత పారదర్శకంగా వ్యవహరించవు. ఇతర ఫండ్స్‌తో పోల్చిచూసుకోవడానికి, బెంచ్ మార్కింగ్ విషయంలో ఫండ్స్ పారదర్శకత యులిప్స్ కంటే బాగా ఉంటుంది. రెండో కారణం వ్యయాలు. ఈఎల్ఎస్ఎస్ స్కీమ్స్‌తో పోల్చితే యులిప్స్ ఎక్కువ చార్జీలు వసూలు చేస్తాయి. పైగా ఈ యులిప్‌లు విధించే చార్జీల్లో తగిన పారదర్శకత కూడా ఉండదు. ఇక మూడో అంశం...లాక్ ఇన్ పీరియడ్.. యూలిప్‌ల్లో లాక్–ఇన్ పీరియడ్ ఐదేళ్లు కాగా, ఈఎల్ఎస్ఎస్ల్లో లాక్–ఇన్ పీరియడ్ మూడేళ్లు మాత్రమే. గత బడ్జెట్ల సరళిని చూస్తే, పన్ను ఆదాయం పెంపు వ్యూహంలో భాగంగా ప్రభుత్వం ఇప్పటివరకూ ఇస్తున్న రాయితీలను క్రమక్రమంగా ఎత్తేస్తున్నది. భవిష్యత్తులో యులిప్‌లపై కూడా పన్ను భారం ఉండే అవకాశాలూ లేకపోలేదు. అందుకని కేవలం పన్ను అనే ఒకే ఒక అంశం ఆధారంగా యులిప్‌ల్లో ఇన్వెస్ట్ చేయాలనుకోవడం సరైన నిర్ణయం కాదు. సీనియర్ సిటిజన్స్ సేవింగ్స్ స్కీమ్(ఎస్సీఎస్ఎస్)లో సంయుక్తంగా రూ. 30 లక్షల వరకూ ఇన్వెస్ట్ చేయవచ్చని ఒక వెబ్సైట్లో చదివాను. కానీ ఇండియన్ పోస్ట్ ఆఫీస్ వెబ్సైట్ప్రకారం, ఎస్సీఎస్ఎస్లో సింగిల్‌గా కానీ, జాయింట్‌గా కానీ గరిష్టంగా ఇన్వెస్ట్ చేసే మొత్తం రూ.15 లక్షలని ఉంది. దీంట్లో ఏది నిజం ? – విష్ణు, విజయవాడ కొన్ని సార్లు కొన్ని వెబ్సైట్లలో లభించే సమాచారంపై తగిన స్పష్టత ఉండదు. అలాంటిదే ఇది కూడా. ఒక వ్యక్తి వ్యక్తిగతంగా సీనియర్ సిటిజెన్స్ సేవింగ్స్ స్కీమ్(ఎస్సీఎస్ఎస్)లో గరిష్టంగా రూ.15 లక్షల వరకూ ఇన్వెస్ట్ చేయవచ్చు. తన జీవిత భాగస్వామి(భార్య/భర్త)తో జాయింట్‌గా ఏర్పాటు చేసిన ఎస్సీఎస్ఎస్ ఖాతాలో (జీవిత భాగస్వామి ఫస్ట్ హోల్డర్‌గా ఉండాలి)అదనంగా మరో రూ.15 లక్షల వరకూ ఇన్వెస్ట్ చేయవచ్చు. అంటే జీవిత భాగస్వామితో ఏర్పాటు చేసిన జాయింట్ ఎస్సీఎస్ఎస్ ఖాతాలో గరిష్టంగా రూ.30 లక్షల వరకూ ఇన్వెస్ట్ చేయవచ్చు. ఎవరైనా భార్య/భర్తతో మాత్రమే జాయింట్ ఖాతా తెరవాల్సి ఉంటుంది. ప్రిన్సిపల్ ట్యాక్స్–సేవింగ్స్ ఫండ్‌లో కొత్త సిప్‌ను ప్రారంభిద్దామనుకుంటున్నాను. సిప్(సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్) విధానంలో ఇన్వెస్ట్ చేయడానికి ఈ ఫండ్ తగినదేనా? గోల్డ్ ఈటీఎఫ్‌లు డిస్కౌంట్‌కే ట్రేడవుతుంటాయి. ఎందుకని ? – రషీద, హైదరాబాద్ ప్రిన్సిపల్ ట్యాక్స్–సేవింగ్స్ ఫండ్‌లో నిరభ్యంతరంగా సిప్ విధానంలో ఇన్వెస్ట్ చేయవచ్చు. సాధారణ ఇన్వెస్టర్లు ఇన్వెస్ట్ చేయదగ్గ మంచి ఫండ్స్‌లో ఇది కూడా ఒకటి. కొనుగోలు చేయాలనుకుంటున్న లేదా విక్రయించాలనుకుంటున్న ఇన్వెస్టర్ల సంఖ్యను బట్టి గోల్డ్ ఈటీఎఫ్(ఎక్సే్చంజ్ ట్రేడెడ్ ఫండ్) ఎక్కువ (ప్రీమియమ్)ధరకు, లేదా తక్కువ(డిస్కౌంట్) ధరకు ట్రేడవడం జరుగుతుంది. కొనుగోలుదార్ల కంటే అమ్మేవాళ్లు ఎక్కువగా ఉంటే గోల్డ్ ఈటీఎఫ్ తక్కువ ధరకు ట్రేడవుతుంది. కొన్ని గోల్డ్ ఈటీఎఫ్‌లు ఎన్ఏవీ కంటే తక్కువ ధరకు ట్రేడ్ కావడానికి కూడా ఇదే కారణం. సుందరమ్ మ్యూచువల్ ఫండ్ అందిస్తున్న ఐదేళ్ల క్లోజ్డ్ ఎండ్ మైక్రో క్యాప్ ఫండ్‌లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నాను. ఇది సరైన నిర్ణయమేనా ? – వినోద్, విశాఖపట్టణం సాధారణంగా ఇన్వెస్టర్లు క్లోజ్డ్ ఎండ్ ఫండ్స్‌కు దూరంగా ఉంటేనే మంచిది. మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయడానికి సిప్(సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్) సరైన విధానం. ముఖ్యంగా చిన్న ఇన్వెస్టర్లు మ్యూచువల్ ఫండ్స్‌లో సిప్ల ద్వారానే ఇన్వెస్ట్ చేయాలి. ఇలా చేస్తేనే స్టాక్ మార్కెట్ పెరిగినప్పుడు, అదేవిధంగా తగ్గినప్పుడూ తగిన ప్రయోజనాలు వారికి లభిస్తాయి. అదే క్లోజ్డ్ ఎండ్ ఫండ్‌లో అయితే... మీరు ఆ ఫండ్ ఆరంభంలోనే ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది. అంతేకాకుండా ఈ ఫండ్స్‌లో లిక్విడిటీ కూడా పెద్దగా ఉండదు. మరోవైపు క్లోజ్డ్ ఎండ్ ఫండ్‌లో నిర్దేశిత సమయం వరకూ మీరు మీ ఇన్వెస్ట్‌మెంట్స్‌ను వెనక్కి తీసుకోవడానికి అవకాశం ఉండదు. మీ విషయంలో అయితే మీరు ఐదేళ్ల వరకూ మీ ఇన్వెస్ట్‌మెంట్స్‌ను వెనక్కి తీసుకోవడానికి వీలుండదు. టెక్నికల్‌గా అవి లిస్టవుతాయి. కానీ, ట్రేడింగ్ లావాదేవీలు పెద్దగా ఉండవు. అందుకని ఐదేళ్ల కాలం కంటే ముందుగానే మీ ఇన్వెస్ట్మెంట్స్ వెనక్కి తీసుకోలేరు. క్లోజ్డ్ ఎండ్ ఫండ్ విధానం... మైక్రో, స్మాల్ క్యాప్ ఫండ్స్‌కు తగిన విధంగానే ఉన్నప్పటికీ, సిప్ ఇన్వెస్ట్మెంట్స్ ద్వారా వచ్చే ప్రయోజనాలు మీకు దక్కవు. అందుకని క్లోజ్డ్ ఎండ్ ఫండ్స్‌ను కాకుండా వేరే ఫండ్స్‌ను ఎంచుకోండి. సిప్ విధానం ద్వారా ఐదేళ్లు అంతకుమించి ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటే ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్‌ను పరిశీలించవచ్చు. ధీరేంద్ర కుమార్ సీఈవో, వ్యాల్యూ రీసెర్చ్ -
పీపీఎఫ్ వడ్డీరేట్లలోనూ కోత!
ఆర్బీఐ ప్రకటించిన పావుశాతం రెపో రేటు కోత, రుణదారులకు ఆశల పల్లకిలా కనిపిస్తుంటే.. పొదుపరులకు మాత్రం నిరాశా నిస్పృహలను మిగులుస్తోంది. రెపో రేటును ఆర్బీఐ తగ్గించడంతో, అప్పు తీసుకున్నవారికి వడ్డీ రేట్లు తగ్గనున్నాయి. ఈ క్రమంలోనే చిన్న మొత్తాల్లో పొదుపు చేసుకునే పీపీఎఫ్ (పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్) లాంటి పథకాల వడ్డీరేట్లు జూలై-సెప్టెంబర్ కాలంలో 20 నుంచి 25 బేసిస్ పాయింట్లు తగ్గే అవకాశాలున్నాయని రీసెర్చ్ ఏజెన్సీ ఇండియా రేటింగ్స్ వెల్లడించింది. దీంతో చిన్నమొత్తాల్లో పొదుపు చేసుకునేవారు చింతించాల్సిన పరిస్థితి ఏర్పడింది. పీపీఎఫ్ వడ్డీరేట్లు 7.85 నుంచి 7.9 శాతం మధ్య ఉండనున్నట్టు రీసెర్చ్ ఏజెన్సీ తెలిపింది. చిన్న మొత్తాల్లో పొదుపు చేసుకునేవారి వడ్డీరేట్లలో ప్రతి మూడు నెలలకోసారి మార్పులు జరుగుతాయి. ప్రభుత్వ సెక్యురిటీలు, బాండ్లకు అనుగుణంగా వీటిని సమీక్షిస్తుంటారు. చిన్న మొత్తాల పొదుపు వడ్డీరేట్లపై ఏప్రిల్ క్వార్టర్ లో ప్రభుత్వం కోత విధించింది. దీని ఫలితంగా జూన్ 30-ఏప్రిల్ 1 మధ్యకాలంలో పీపీఎఫ్ వడ్డీరేట్లు 8.7 శాతం నుంచి 8.1 శాతానికి తగ్గాయి. సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్ పై వడ్డీరేటు 9.3 శాతం నుంచి 8.6 శాతానికి తగ్గగా.. చిన్న పిల్లల సుకన్య సమృద్ధి అకౌంట్లపై వడ్డీరేట్లు 9.2 నుంచి 8.6 శాతానికి దిగివచ్చాయి. బ్యాంకుల్లో నగదు నిల్వలు పెంచేందుకే ఆర్బీఐ ఈ లిక్విడిటీ విధానాన్ని ప్రవేశపెట్టినట్లు మార్కెట్ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. -
మనం చౌక వడ్డీరేట్ల జమానాలోకి వెళ్లాల్సిందే..
♦ పొదుపు పథకాల రేట్ల తగ్గింపుపై ♦ ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ వ్యాఖ్య న్యూఢిల్లీ: చిన్న మొత్తాల పొదుపు పథకాలకు సంబంధించి వడ్డీరేట్లను భారీగా తగ్గించడంపట్ల సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నప్పటికీ.. ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ మాత్రం ఈ చర్యలను సమర్థించుకున్నారు. ఆర్థిక వ్యవస్థను మరింతగా పుంజుకునేలా చేయాలంటే భారత్ చౌక వడ్డీరేట్ల జమానాలోకి వెళ్లాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు. ఆదివారమిక్కడ బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశంలో పాల్గొన్న సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్(పీపీఎఫ్), సీనియర్ సిటిజన్స్ సేవింగ్స్ స్కీమ్‌తో పాటు ఇతర పథకాలకు వడ్డీరేట్ల కోత విధించడంపై కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ చేసిన విమర్శలను ఆయన తోసిపుచ్చారు. ‘పొదుపు పథకాలపై వడ్డీరేట్ల ఖరారుకు ఒక విధానాన్ని ప్రభుత్వం అనుసరిస్తోంది. వడ్డీరేట్లను మార్కెట్ నిర్ధేశిస్తుంది. వీటితో పోలిస్తే పొదుపు స్కీమ్‌లకు అధిక వడ్డీనిచ్చేందుకు ప్రభుత్వం తన నిధులను ఉపయోగిస్తోంది. కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ హయాంలో కూడా ఇదే విధమైన ఫార్ములాను అమలు చేశారు. ఇది మా ప్రభుత్వం ఖరారు చేసిందేమీకాదు. అయితే, అప్పుడు ఆర్థిక వ్యవస్థ మందగమనంలో ఉండటంతో ఈ వడ్డీరేట్లు ఎక్కువగా ఉన్నాయి. గతంలో భారీగా పెరిగిన నేపథ్యంలో ఇప్పుడు ఇవి క్రమంగా దిగొస్తున్నాయంతే. ప్రస్తుతం మన ఆర్థిక వ్యవస్థ పరిస్థితులను పరిశీలిస్తే.. ఒకపక్క రుణాలపై వడ్డీరేట్లు తగ్గుతున్నాయి. ఇదే క్రమంలో డిపాజిట్లపై అధిక వడ్డీరేట్లు అధికంగా ఉన్నాయి. ఆర్థిక వ్యవస్థ మందగమనంలో కాకుండా వృద్ధి బాటన పయనించాలంటే రుణ, డిపాజిట్ రేట్లు రెండూ తగ్గాల్సిందే’ అని జైట్లీ పేర్కొన్నారు. పీపీఎఫ్‌పై 8.1 శాతం(తగ్గించిన తర్వాత) వడ్డీరేటు అనేది మంచి రాబడి కిందే లెక్కఅని కూడా ఆర్థిక మంత్రి చెప్పారు. ప్రపంచంలో ఎక్కడా కూడా ఇలాంటి స్కీమ్‌కు అధిక వడ్డీరేట్లు లేవన్నారు. ఈ పథకానికి పన్ను మినహాయింపు ఉన్న నేపథ్యంలో వాస్తవ రాబడి 11.12 శాతంమేర ఉంటుందన్నారు. జీఎస్టీ బిల్లుకు త్వరలో మోక్షం! రెండో విడత బడ్జెట్ సమావేశాల్లో వస్తు, సేవల పన్ను(జీఎస్టీ); దివాళా కోడ్ బిల్లులకు ఆమోదం లభించగలదన్న ఆశాభావాన్ని జైట్లీ వ్యక్తం చేశారు. వీటికి సంబంధించి నెలకొన్న విభేధాలు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయని... ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్‌ను ఒప్పించేందుకు పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి వెంకయ్య నాయుడు తన ప్రయత్నాలను ముమ్మరం చేయనున్నారని కూడా ఆర్థిక మంత్రి చెప్పారు. మరోపక్క, జువెలరీ వర్తకులపై విధించిన 1 శాతం ఎక్సైజ్ సుంకాన్ని కూడా జైట్లీ సమర్థించుకున్నారు. జీఎస్టీ వ్యవస్థ దిశగా అడుగులు వేస్తున్న నేపథ్యంలో విలాసవంత ఉత్పత్తులన్నింటినీ పన్నుల పరిధిలోకి తీసుకురావాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు. పన్ను అధికారులు తమను వేధిస్తారని జువెలర్లు వ్యక్తం చేస్తున్న అభిప్రాయాలపై మాట్లాడుతూ.. అలాంటివి జరగడానికి వీల్లేదని జైట్లీ వ్యాఖ్యానించారు. -
రిస్క్‌లేని పెట్టుబడి అదొక్కటే..!
చీటీలు, మంత్లీ సేవింగ్స్ స్కీమ్స్, ఆర్డీలు, సేవింగ్స్ సర్టిఫికెట్ల కొనుగోలు.... వీటిలో ఏది తక్కువ రిస్క్‌తో ఎక్కువ రాబడినిస్తాయి? - పి. పద్మజ, మచిలీపట్నం ప్రైవేట్ చిట్‌ఫండ్స్..ముఖ్యంగా అన్ రిజిస్టర్డ్ చిట్ఫండ్లలో నూటికి నూరు శాతం రిస్కు ఉంటుంది. అయినా మీరు చీటీలు వేయదల్చుకుంటే రిజిస్టర్డ్ చిట్‌ఫండ్స్ కొంత ఫర్వాలేదు. ప్రైవేట్ చిట్స్‌లో ఇన్వెస్ట్ చేయడానికి ప్రత్యామ్నాయంగా కొన్ని సంప్రదాయ ఇన్వెస్ట్మెంట్ సాధనాలున్నాయి. మీరు ఇన్వెస్ట్ చేసిన డబ్బుకు వీటిలో అసలు రిస్కు ఉండదు. రిస్కు చేయగలను అనుకుంటే సగం మొత్తాన్ని ఈక్విటీ గ్రోత్ ఓరియంటెడ్ మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టొచ్చు. సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ (సిప్) కింద నెలకు ఇంత అని స్థిరమొత్తంలో ఇన్వెస్ట్ చేయొచ్చు. గత 15 ఏళ్ల సగటు చూస్తే కొన్ని ఫండ్ స్కీములు దాదాపు 15-18 శాతం దాకా రాబడి ఇచ్చాయి. మంత్లీ సేవింగ్స్ స్కీమ్స్ (పీపీఎఫ్): ఏడాదికి రూ. 500 కనీస డిపాజిట్‌తో పీపీఎఫ్ ఖాతా ప్రారంభించవచ్చు. 15 సంవత్సరాల పాటు ఇన్వెస్ట్ చేయాలి. పీపీఎఫ్‌పై ప్రస్తుతం 8.7 శాతం మేర వడ్డీ లభిస్తోంది. సెక్షన్ 80 సీ కింద అసలు, వడ్డీ మీద కూడా పన్ను మినహాయింపు ఉంటుంది. ఒకవేళ డిపాజిట్‌దారు చట్టపరంగా ఏవైనా చిక్కుల్లో ఇరుక్కున్నా పీపీఎఫ్ మొత్తాన్ని కోర్టులు అటాచ్ చేయడానికి లేదు. రికరింగ్ డిపాజిట్లు: ప్రస్తుతం వీటిపై 8.4 శాతం మేర వడ్డీ రేటు లభిస్తోంది. బ్యాంకులు, పోస్టాఫీసుల్లో ఈ ఖాతాలు తీసుకోవచ్చు. నెలకు అత్యంత తక్కువగా రూ. 10 కూడా ఇన్వెస్ట్ చేయొచ్చు. నేషనల్ సేవింగ్స్ సర్టిఫికెట్స్: వీటిని మీ పేరున లేదా మీ పిల్లల పేరు మీదనైనా తీసుకోవచ్చు. ప్రస్తుతం 5 సంవత్సరాల ఎన్ఎస్సీలపై 8.5 శాతం, 10 సంవత్సరాల సర్టిఫికెట్స్‌పై 8.8 శాతం వడ్డీ రేటు లభిస్తోంది. కనీస ఇన్వెస్ట్మెంట్ రూ.100. - రజనీ భీమవరపు సీఎఫ్‌పీ, జెన్‌మనీ