ఇన్వెస్ట్‌మెంట్ ద్వారా మరింత డబ్బు సంపాదించాలని చాలామంది కోరుకుంటారు. అందుకు రియల్‌ఎస్టేట్, బ్యాంకు సేవింగ్స్, ఎఫ్‌డీ, స్టాక్‌మార్కెట్.. వంటి విభిన్న మార్గాలను ఎంచుకుంటారు. అయితే ఆయా పథకాల్లో డబ్బు పెట్టుబడి పెడితే భద్రత పరమైన సమస్యలు రావొచ్చు. ఇన్వెస్ట్ చేసే నగదుపై మంచి రాబడిని ఇచ్చేలా, ప్రైవేట్ సంస్థల కంటే మెరుగైన భద్రత కల్పించేలా ప్రభుత్వ పథకాల్లో పెట్టుబడి పెడితే దీర్ఘకాలంలో ఆర్థిక లక్ష్యాలు చేరుకోవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. ప్రస్తుతం ప్రభుత్వం అందిస్తున్న కొన్ని ఇస్వెస్ట్‌మెంట్ పథకాల గురించి తెలియజేశాం.
సీనియర్ సిటిజన్స్ సేవింగ్స్ స్కీమ్
వడ్డీ: 8.2 శాతం
పెట్టుబడి పరిమితులు: రూ.1000-రూ.30 లక్షలు
కాలపరిమితి: ఐదేళ్లు, అదనంగా మరో మూడేళ్లు పెంచుకోవచ్చు. నిర్దేశించిన పరిమితికి ముందే డబ్బు విత్‌డ్రా చేయాలనుకుంటే మాత్రం 1 శాతం పెనాల్టీ విధించాల్సి ఉంటుంది.
అర్హత: 60 ఏళ్లు కంటే ఎక్కువ వయసు ఉండాలి. భారతీయులై ఉండాలి.
సెక్షన్ 80సీ కింద రూ.1.5 లక్షల వరకు పన్ను మినహాయింపు పొందవచ్చు.
సుకన్య సమృద్ధి యోజన(ఎస్‌ఎస్‌వై)
వడ్డీ: 8 శాతం
పెట్టుబడి పరిమితులు: రూ.250(నెలవారీ)-రూ.1.5 లక్షలు(ఏటా)
కాలపరిమితి: అమ్మాయికి 21 ఏళ్లు వచ్చేవరకు.
అమ్మాయికి 18 ఏళ్లు వచ్చిన తర్వాత తాత్కాలికంగా 50 శాతం విత్‌డ్రా చేసుకోవచ్చు.
అర్హత: 10 ఏళ్లు కంటే తక్కువ వయసు ఉన్న ఆడ పిల్లలు.
ప్రతి ఇంటిలో ఒకరు మాత్రమే ఈ స్కీమ్‌లో చేరేందుకు అర్హులు.
సెక్షన్ 80సీ కింద రూ.1.5 లక్షల వరకు పన్ను మినహాయింపు పొందవచ్చు.
కిసాన్ వికాస్ పాత్ర(కేవీపీ)
వడ్డీ: 7.5 శాతం
పెట్టుబడి పరిమితులు: రూ.1000-గరిష్ట పరిమితి లేదు
కాలపరిమితి: 115 నెలలు(తొమ్మిదేళ్ల 5 నెలలు)
అత్యవసరంగా డబ్బు కావాల్సివస్తే 2.5 ఏళ్లు తర్వాత విత్‌డ్రా చేసుకోవచ్చు. అందుకు పెనాల్టీ చెల్లించాల్సి ఉంటుంది.
పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్(పీపీఎఫ్)
వడ్డీ: 7.1 శాతం
పెట్టుబడి పరిమితులు: రూ.500(నెలవారీ)-రూ.1.5 లక్షలు(ఏటా)
కాలపరిమితి: 15 ఏళ్లు
అర్హత: మైనర్లు, భారతీయ పౌరులు ఇందుకు అర్హులు.
సెక్షన్ 80సీ కింద రూ.1.5 లక్షల వరకు పన్ను మినహాయింపు పొందవచ్చు.
నేషనల్ సేవింగ్స్ సర్టిఫికేట్(ఎన్‌ఎస్‌సీ)
వడ్డీ: 7.7 శాతం
పెట్టుబడి పరిమితులు: రూ.1000-గరిష్ట పరిమితి లేదు.
కాలపరిమితి: 5 ఏళ్లు
అర్హత: మైనర్లు, భారతీయ పౌరులు ఇందుకు అర్హులు.
సెక్షన్ 80సీ కింద రూ.1.5 లక్షల వరకు పన్ను మినహాయింపు పొందవచ్చు.
ఇదీ చదవండి: విభిన్న ఖాతాలు.. మరెన్నో పరిమితులు!
పోస్ట్ ఆఫీస్ మంత్లీ ఇన్‌కమ్ స్కీమ్(పీఓఎంఐఎస్)
వడ్డీ: 7.4 శాతం
పెట్టుబడి పరిమితులు: రూ.1000-రూ.9 లక్షలు/జాయింట్ అకౌంట్ హోల్డర్లు గరిష్టంగా రూ.15 లక్షలు వరకు డిపాజిట్ చేసుకోవచ్చు.
కాలపరిమితి: 5 ఏళ్లు
Comments
Please login to add a commentAdd a comment