Balance Savings Accounts
-
అకౌంట్లో మినిమం బ్యాలెన్స్.. ఆర్బీఐ కీలక ఆదేశాలు
బ్యాంక్‌ఖాతా ఉండి ఎలాంటి లావాదేవీలు జరపని వినియోగదారులపై విధించే ఛార్జీలకు సంబంధించి ఆర్బీఐ కీలక ఆదేశాలు జారీ చేసింది. ఏళ్లు గడుస్తున్నా బ్యాంక్‌ఖాతాలో ఎలాంటి లావాదేవీలు జరపని వారి అకౌంట్లో మినిమం బ్యాలెన్స్ లేదంటూ ఛార్జీలు వేస్తూంటారు. ఇకపై ఎలాంటి లావాదేవీలు లేకుండా ఇన్ఆపరేటివ్గా ఉన్న ఖాతాలపై మినిమం బ్యాలెన్స్ లేదంటూ ఛార్జీలు వేయకూడదని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) బ్యాంకులను ఆదేశించింది. అలాగే స్కాలర్షిప్ నగదును పొందడం కోసం లేదా ప్రత్యక్ష నగదు బదిలీల కోసం ఓపెన్‌చేసిన బ్యాంక్‌ఖాతాల్లో రెండేండ్లకుపైగా ఎలాంటి లావాదేవీలు జరగకపోయినా వాటిని ఇన్ఆపరేటివ్ ఖాతాలుగా పరిగణించకూడదని స్పష్టం చేసింది. ఇదీ చదవండి: ఫిక్స్డ్ డిపాజిటర్లకు శుభవార్త - భారీగా పెరిగిన వడ్డీ రేట్లు అన్క్లెయిమ్డ్ బ్యాంక్ డిపాజిట్లను తగ్గించే చర్యల్లో భాగంగా, ఇన్ఆపరేటివ్ ఖాతాలపై విడుదల చేసిన తాజా సర్క్యులర్‌లో బ్యాంకులకు ఆర్బీఐ ఈ సూచనలు చేసింది. ఏప్రిల్ 1 నుంచి ఈ కొత్త మార్గదర్శకాలు అమల్లోకి రానున్నాయి. బ్యాంకింగ్ వ్యవస్థలో పేరుకుపోయిన అన్క్లెయిమ్డ్ డిపాజిట్లను తగ్గించడానికి, సదరు డిపాజిట్లు వాటి నిజమైన హక్కుదారులు/ వారసులకు చేరడానికి బ్యాంకులు, ఆర్బీఐ ప్రస్తుతం తీసుకుంటున్న చర్యలకు ఈ కొత్త మార్గదర్శకాలు ఉపయోగపడుతాయని సర్క్యులర్ ద్వారా తెలిసింది. -
బ్యాంక్ ఆఫ్ బరోడా ఖాతాదారులకు గుడ్ న్యూస్..!
కరోనా వైరస్ మహమ్మారి తీవ్రంగా వ్యాప్తి చెందుతున్న సమయంలో డిజిటల్ లావాదేవీలు పెరిగాయి. ఇలాంటి క్లిష్ట సమయంలో వినియోగదారులు బ్యాలెన్స్ చెక్ చేసుకోవడం కోసం, చెక్ బుక్ వంటి ఇతర పనుల కోసం బ్యాంకు చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు అని బ్యాంక్ ఆఫ్ బరోడా పేర్కొంది. బ్యాంక్ ఆఫ్ బరోడా తన ఖాతాదారుల కోసం కొన్ని ప్రత్యేక నంబర్లను జాబితాను విడుదల చేసింది. వాట్సాప్ ద్వారా లావాదేవీ వివరాలను తెలుసుకోవడంతో సహా బ్యాలెన్స్‌ను తనిఖీ చేసుకోవచ్చు అని తెలిపింది. అలాగే, టోల్ ఫ్రీ నంబర్‌కు కాల్ చేయడం ద్వారా ఇతర సౌకర్యాలను సద్వినియోగం చేసుకోవచ్చు అని ట్విటర్ ద్వారా వెల్లడించింది. బ్యాంక్ ఆఫ్ బరోడా జారీ చేసిన ఈ ముఖ్యమైన సంఖ్యలు 24 * 7 అందుబాటులో ఉంటాయి. బ్యాంకింగ్ సేవలు అవసరమైన సంఖ్యల జాబితా మీ ఖాతా బ్యాలెన్స్ తెలుసుకోవడానికి- 8468001111కి మిస్డ్ కాల్ ఇవ్వండి చివరి 5 లావాదేవీల సమాచారం కోసం- 8468001122కి మిస్డ్ కాల్ ఇవ్వండి టోల్ ఫ్రీ -18002584455 / 18001024455 వాట్సాప్ బ్యాంకింగ్ సేవల కోసం- 8433888777 To maintain social distancing, you can continue your banking services from your home. #BankofBaroda is here by your side 24x7, with these simple and easy ways. #BankfFromHome #BreakTheChain #StaySafeBankSafe pic.twitter.com/MiXNKaCSc8 — Bank of Baroda (@bankofbaroda) May 10, 2021 బ్యాంక్ ఆఫ్ బరోడా వాట్సాప్ బ్యాంకింగ్ సేవల ద్వారా డెబిట్ కార్డును బ్లాక్ చేయడం, బ్యాలెన్స్ తెలుసుకోవడం, చెక్ స్టేటస్, వడ్డీ రేట్లు, మినీ స్టేట్మెంట్లు మొదలైనవి తెలుసుకోవచ్చు. ఇటీవల, బ్యాంక్ 'బరోడా ఎమ్ కనెక్ట్ ప్లస్' యాప్‌ను కూడా ప్రవేశపెట్టింది. దీని ద్వారా ఖాతాదారులు 24 * 7 వారి మొబైల్ ఫోన్లలో బ్యాంకింగ్ సంబంధిత సదుపాయాలను వెంట వెంటనే పొందవచ్చు. చదవండి: ఈ మొబైల్ ఫోన్‌పై ఏకంగా రూ. 60 వేలు తగ్గింపు -
ఓబీసీ పొదుపు ఖాతాల్లో ఇక నెలవారీ వడ్డీ
ముంబై: సేవింగ్స్ అకౌంట్స్ బ్యాలెన్స్‌కు సంబంధించి ఇకపై ప్రతి నెలా ఒకసారి ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్ (ఓబీసీ) వడ్డీ జమ చేయనుంది. ఇప్పటి వరకూ ఆరునెలలకోసారి వడ్డీని జమ చేస్తుండగా ఇకపై దీన్ని నెలరోజులకు కుదిస్తున్నట్లు ఓబీసీ ఒక ప్రకటనలో పేర్కొంది. ఏప్రిల్ 1 నుంచీ ఈ విధానం అమల్లోకి వస్తుందని తెలిపింది. సేవింగ్స్ అకౌంట్స్ బ్యాలెన్స్‌కు సంబంధించి ఇకపై ప్రతి మూడు నెలలకు ఒకసారి వడ్డీ జమ చేయాలని ఇటీవలే ఆర్బీఐ ఆదేశాలు ఇచ్చింది. ఓబీసీ ఒక అడుగు ముందుకువేసి... నెలకొకసారి సేవింగ్స్ అకౌంట్ వడ్డీ జమ అవుతుందని ప్రకటించింది. 2010 ఏప్రిల్ 1 నుంచీ రోజువారీ ప్రాతిపదికన వడ్డీ లెక్కింపు జరుగుతోంది. అయితే ఈ వడ్డీ ఇప్పటి వరకూ ఆరు నెలలకు ఒకసారి జమవుతోంది. ఆర్బీఐ వడ్డీ జమ కాల వ్యవధి మూడు నెలలకు తగ్గించడం వల్ల బ్యాంకింగ్‌పై మొత్తంగా రూ.500 అదనపు భారం పడే అవకాశం ఉందన్నది ఈ రంగంలో నిపుణుల విశ్లేషణ. సేవింగ్స్ అకౌంట్లపై ప్రభుత్వ బ్యాంకులు 4% వరకూ వడ్డీ ఇస్తుండగా, ప్రైవేటు బ్యాంకులు 6 శాతం వరకూ వడ్డీని ఆఫర్ చేస్తున్నాయి.