కరోనా వైరస్ మహమ్మారి తీవ్రంగా వ్యాప్తి చెందుతున్న సమయంలో డిజిటల్ లావాదేవీలు పెరిగాయి. ఇలాంటి క్లిష్ట సమయంలో వినియోగదారులు బ్యాలెన్స్ చెక్ చేసుకోవడం కోసం, చెక్ బుక్ వంటి ఇతర పనుల కోసం బ్యాంకు చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు అని బ్యాంక్ ఆఫ్ బరోడా పేర్కొంది. బ్యాంక్ ఆఫ్ బరోడా తన ఖాతాదారుల కోసం కొన్ని ప్రత్యేక నంబర్లను జాబితాను విడుదల చేసింది. వాట్సాప్ ద్వారా లావాదేవీ వివరాలను తెలుసుకోవడంతో సహా బ్యాలెన్స్‌ను తనిఖీ చేసుకోవచ్చు అని తెలిపింది. అలాగే, టోల్ ఫ్రీ నంబర్‌కు కాల్ చేయడం ద్వారా ఇతర సౌకర్యాలను సద్వినియోగం చేసుకోవచ్చు అని ట్విటర్ ద్వారా వెల్లడించింది. బ్యాంక్ ఆఫ్ బరోడా జారీ చేసిన ఈ ముఖ్యమైన సంఖ్యలు 24 * 7 అందుబాటులో ఉంటాయి.
బ్యాంకింగ్ సేవలు అవసరమైన సంఖ్యల జాబితా
- మీ ఖాతా బ్యాలెన్స్ తెలుసుకోవడానికి- 8468001111కి మిస్డ్ కాల్ ఇవ్వండి
- చివరి 5 లావాదేవీల సమాచారం కోసం- 8468001122కి మిస్డ్ కాల్ ఇవ్వండి
- టోల్ ఫ్రీ -18002584455 / 18001024455
- వాట్సాప్ బ్యాంకింగ్ సేవల కోసం- 8433888777
To maintain social distancing, you can continue your banking services from your home. #BankofBaroda is here by your side 24x7, with these simple and easy ways. #BankfFromHome #BreakTheChain #StaySafeBankSafe pic.twitter.com/MiXNKaCSc8
— Bank of Baroda (@bankofbaroda) May 10, 2021
బ్యాంక్ ఆఫ్ బరోడా వాట్సాప్ బ్యాంకింగ్ సేవల ద్వారా డెబిట్ కార్డును బ్లాక్ చేయడం, బ్యాలెన్స్ తెలుసుకోవడం, చెక్ స్టేటస్, వడ్డీ రేట్లు, మినీ స్టేట్‌మెంట్‌లు మొదలైనవి తెలుసుకోవచ్చు. ఇటీవల, బ్యాంక్ 'బరోడా ఎమ్ కనెక్ట్ ప్లస్' యాప్‌ను కూడా ప్రవేశపెట్టింది. దీని ద్వారా ఖాతాదారులు 24 * 7 వారి మొబైల్ ఫోన్లలో బ్యాంకింగ్ సంబంధిత సదుపాయాలను వెంట వెంటనే పొందవచ్చు.
చదవండి:
Comments
Please login to add a commentAdd a comment