
ఓబీసీ, కెనరా బ్యాంక్ బేస్ రేట్ తగ్గింపు
న్యూఢిల్లీ: ఇతర బ్యాంకుల బాటలోనే తాజాగా ప్రభుత్వ రంగ ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్, కెనరా బ్యాంక్ కూడా రుణాలపై వడ్డీ రేటును తగ్గించాయి. కెనరా బ్యాంక్ బేస్ రేటు (కనీస వడ్డీ రేటు)ను 0.20 శాతం మేర తగ్గించడంతో ఇది 10 శాతానికి దిగివచ్చింది. కొత్త రేటు మే 11 నుంచి అమల్లోకి వస్తుంది. అలాగే ఓబీసీ బేస్ రేటును పావు శాతం తగ్గించడంతో ఇది 10 శాతానికి తగ్గుతుంది. కొత్త రేటు మే 15 నుంచి అమలవుతుంది.