న్యూఢిల్లీ: నిరర్ధక ఆస్తుల (ఎన్‌పీఏ) మొత్తం భారీగా పెరిగినట్లుగా కనిపించడానికి లోపభూయిష్టమైన ఇన్ఫోసిస్ సాఫ్ట్‌వేరే కారణమని యునెటైడ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (యూబీఐ) ఆరోపించింది. కొన్ని విభాగాల్లో ఆస్తులను వర్గీకరించడంలో ఈ సాఫ్ట్‌వేర్ విఫలమవుతోందని పేర్కొంది. కోర్ బ్యాంకింగ్ సేవల కోసం తమతో పాటు పలు బ్యాంకులు ఇన్ఫోసిస్ రూపొందించిన ఫినాకిల్ సాఫ్ట్‌వేర్‌నే ఉపయోగిస్తున్నాయని స్టాక్ ఎక్స్చేంజీ బీఎస్‌ఈకి యూబీఐ తెలిపింది.
అయితే, పునర్‌వ్యవస్థీకరించిన ఖాతాలు, ఓవర్‌డ్రాఫ్ట్ అకౌంట్లు తదితర విభాగాల వివరాలను వర్గీకరించడంలో ఈ సాఫ్ట్‌వేర్ పొరపాట్లు చేస్తోందని వివరించింది. ఇలాంటి పొరపాట్ల వల్లే భేషుగ్గా ఉన్న ఖాతాలను ఎన్‌పీఏలుగాను, ఎన్‌పీఏలను మంచి ఖాతాలుగానూ చూపించిందని యూబీఐ తెలిపింది. వివిధ త్రైమాసికాల్లో ఎన్‌పీఏలు భారీగా ఎగియడంపై సందేహాలు వ్యక్తం చేసిన ఆర్‌బీఐ.. యునెటైడ్ బ్యాంక్ ఖాతాల ఫోరెన్సిక్ ఆడిట్‌కి ఆదేశించిన సంగతి తెలిసిందే. మరోవైపు, తమ సాఫ్ట్‌వేర్‌లో ఎటువంటి లోపాలు లేవని, ఆర్‌బీఐ నిర్దేశాలకు అనుగుణంగానే అది పనిచేస్తుందని ఇన్ఫోసిస్ వర్గాలు స్పష్టం చేశాయి.
మొండిబకాయిల పాపం ఇన్ఫీ సాఫ్ట్‌వేర్‌దే: యునెటైడ్ బ్యాంక్
Published Thu, Feb 20 2014 1:01 AM | Last Updated on Mon, Oct 22 2018 7:42 PM
Advertisement