ప్రపంచం మార్కెట్లో ఎన్నో కంపెనీలు ఆవిర్భవించి కొన్ని దశాబ్దాలు తిరుగులేని సంస్థలుగా అవతరించి కాల గర్భంలో కలిసిపోయాయి. అలాంటి కోవకు చెందిన టాప్ 5 ఇండియన్ కంపెనీలను గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.
ప్రీమియర్ ఆటోమొబైల్ (Premier Automobiles)
19వ దశకంలో భారతదేశంలో ఒక మెరుపు మెరిసిన ప్రీమియర్ ఆటోమొబైల్ కంపెనీ మొదటి కార్ రిపేర్ వర్స్క్ షాప్ మాదిరిగా ముంబైలో ప్రారంభమైంది. ఆ తరువాత ఆటో మొబైల్ రంగంలోకి అడుగు పెట్టింది. ఇందులో భాగంగానే కంపెనీ 1970లో 'ప్రీమియర్ పద్మిని' అనే అద్భుతమైన కారుని పరిచయం చేసింది. ఇది 2004 వరకు మార్కెట్లో విస్తృతమైన అమ్మకాలను పొందింది.
మార్కెట్లో ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకోవడంలో విఫలమైన ఈ కంపెనీ కొత్త కార్లను పరిచయం చేయడంలో కూడా సక్సెస్ కాలేక పోయింది. ఆ తరువాత ప్రీమియర్ పద్మిని ఉత్పత్తి 1980లోనే నిలిచిపోయింది. కాగా కంపెనీ ఆటోమొబైల్ రంగం నుంచి పూర్తిగా 2004కి బయటకు వచ్చేసింది.
గోల్డ్ స్పాట్ (Gold Spot)
భారతీయ మార్కెట్లో అత్యంత ప్రజాదరణ పొంది, ప్రత్యర్థులను ఎదుర్కోలేక నిలిచిపోయిన కంపెనీలలో ఒకటి ఈ గోల్డ్ స్పాట్. 1950లోనే యూత్ ఫెవరెట్ బ్రాండ్‌గా మారిన ఈ సాఫ్ట్ డ్రింక్ 'పార్లే' (Parle) కంపెనీకి చెందినది కావడం గమనార్హం. 1960 & 70లలో బాగా పాపులర్ అయినప్పటికీ.. కోక్ అండ్ పెప్సీ కంపెనీ సాఫ్ట్ డ్రింకులతో పోటీ పడలేక 2000 ప్రారంభంలో కంపెనీ ఈ ఉత్పత్తిని నిలిపివేసింది.
హెచ్‌ఎమ్‌టి (HMT)
ఆధునిక కాలంలోనే హెచ్‌ఎమ్‌టి వాచ్‌ల గురించి పెద్దగా తెలియకపోవచ్చు. కానీ ఒకప్పుడు ఈ బ్రాండ్‌కు పెద్ద ఫాలోయింగ్ ఉండేది. నిజానికి 1953లో ఇండియన్ గవర్నమెంట్ ఆధ్వరంలో మన దేశంలో ఈ కంపెనీ ప్రారంభమై 2016 వరకు కొనసాగింది. ఇందులో హెచ్‌ఎమ్‌టి జనతా అనే వాచ్ చాలా మందికి ఇష్టమైనదని చెబుతారు. అయితే మారుతున్న కాలానికి అనుగుణంగా కంపెనీ మారలేక.. కొత్త ఉత్పత్తులకు సరైన పోటీ ఇవ్వలేక 2016లో కనుమరుగైపోయింది.
రాజ్‌దూత్ మోటార్‌సైకిల్స్ (Rajdoot MotorCycles)
ఆటో మొబైల్ మార్కెట్లో చరిత్ర సృష్టించిన రాజ్‌దూత్ మోటార్ సైకిల్స్ 1960 నుంచి 2005 వరకు కుర్రకారుని ఎంతగానో ఆకర్శించింది. ఈ బైకులు ప్రముఖ ఇంజినీరింగ్ కంపెనీ ద్వారా రూపుదిద్దుకున్నాయి. కావున చాలా వరకు అప్పట్లోనే అడ్వాన్స్డ్ ఫీచర్స్ కలిగి ఉండేది. 1973లో విడుదలైన బాబీ అనే చిత్రం ద్వారా ఈ బైక్ మరింత పాపులర్ అయింది. అయితే మార్కెట్లో జరిగుతున్న ఆధునీకరణకు, ఇతరత్రా కారణాల వల్ల కంపెనీ రాజ్‌దూత్ ఉత్పత్తిని నిలిపివేసింది. అప్పుడప్పుడు వింటేజ్ బైకుల మాదిరిగా అక్కడక్కడా దర్శనమిస్తూ ఉంటాయి.
(ఇదీ చదవండి: ఎంత మిలియనీర్ అయినా.. ఇండియాలో ఇలాగే ఉంటది!)
అంబాసిడర్ (Ambassador)
ఇక భారతదేశ ఆటో మోటివ్ ఇండస్ట్రీ సింబల్ మాదిరిగా ప్రజాదరణ పొంది సాధారణ ప్రజల దగ్గర నుంచి గవర్నమెంట్ ఉద్యోగుల వరకు విరివిగా ఉపయోగించిన కార్లలో అంబాసిడర్ ఒకటి. ఇప్పటికి కూడా అక్కడక్కడా కనిపించే ఈ కార్లు ఒకప్పుడు తిరుగులేని అమ్మకాలను పొందాయి. డిజైన్, ఫీచర్స్ పరంగా ఉత్తమంగా ఉండే ఈ కారు ఇండియన్ రోడ్ కండిషన్‌కి అనుకూలంగా ఉండేది. అయితే కాలక్రమంలో ఏర్పడిన పోటీ, ఆధునికతను తట్టుకోలేక 2014లో వీటి ఉత్పత్తి కూడా నిలిచిపోయింది.
(ఇదీ చదవండి: ఒక ఒప్పందం.. వేల కోట్లు ఇన్వెస్ట్ - గోగోరో ప్లాన్ ఏంటంటే?)
కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్ (Kingfisher Airlines)
భారతదేశంలో అతి తక్కువ కాలంలోనే తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపుని పొందగలిగిన కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్ విజయ్ మాల్యా ద్వారా 2005లో ముంబై హెడ్ క్వార్టర్‌గా ప్రారంభమైంది. ప్రయాణికులకు సౌకర్యవంతమైన సదుపాయాలను అందిస్తూ ముందుకు సాగిన ఈ కంపెనీ ఎయిర్‌లైన్స్‌లో ఒక రికార్డ్ సృష్టించింది. ఆ తరువాత ఆర్థిక పరమైన ఇబ్బందులను ఎదుర్కొలేకే 2012లో తన కార్య కలాపాలను నిలిపివేసింది. ఆ తరువాత 2013లో కంపెనీ పూర్తిగా దివాళా తీసినట్లు ప్రకటించింది.
Comments
Please login to add a commentAdd a comment