న్యూఢిల్లీ: జీఎస్‌టీ కింద నమోదైన 18,000 కంపెనీలు 25,000 కోట్ల పన్ను ఎగవేత వ్యవహారం వెలుగు చూసింది. ఇటీవలే జీఎస్‌టీ అధికారులు దేశవ్యాప్తంగా నిర్వహించిన తనిఖీల్లో ఇది తెలిసింది.
కేవలం ఇన్‌పుట్ ట్యాక్స్ క్రెడిట్ (ఐటీసీ) కోసమే 73,000 కంపెనీలు ఏర్పాటైనట్టు పన్ను అధికారులు అనుమానిస్తున్నారు. ‘‘ఎందుకంటే ఈ సంస్థలకు ఎలాంటి అమ్మకాలు లేకపోవడం గమనార్హం. వీటిల్లో 18వేల కంపెనీలు మనుగడలో లేవు. అవి రూ.24,550 కోట్ల పన్ను ఎగవేతకు పాల్పడ్డాయి’’అని ఓ పన్ను అధికారి తెలిపారు. గతేడాది నిర్వహించిన తొలి డ్రైవ్‌లోనూ.. 21,791 కంపెనీలు రూ.24,010 కోట్లు ఎగవేసినట్టు గుర్తించడం గమనార్హం.
Comments
Please login to add a commentAdd a comment