హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: కొండలా పెరిగిపోతున్న మొండి బకాయిలు ప్రభుత్వరంగ బ్యాంకులకు గుదిబండగా మారాయని, ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే తొలిసారిగా పీఎస్‌యూ బ్యాంకులు దివాళా తీసే పరిస్థితులు తలెత్తుతాయని ఆంధ్రప్రదేశ్ బ్యాంక్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ (ఏఐబీఈఏ) ఆందోళన వ్యక్తం చేసింది.
పీఎస్‌యూ బ్యాంకుల్లో మార్చి, 2013 నాటికి రూ.1.64 లక్షల కోట్లుగా ఉన్న ఎన్‌పీఏలు సెప్టెంబర్, 2013 నాటికి 2.36 లక్షల కోట్లకు చేరాయని, ఇప్పుడివి రూ.3.50 లక్షలు దాటినట్లు ప్రాథమిక అంచనాలను బట్టి తెలుస్తోందని ఏఐబీఈఏ ప్రధాన కార్యదర్శి బి.ఎస్.రాంబాబు తెలిపారు. రుణం తీసుకొని చెల్లించని వారిపై క్రిమినల్ కేసులు పెట్టి వారి ఆస్తులను జప్తు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. సోమవారం హైదరాబాద్‌లో జరిగిన ఒక కార్యక్రమంలో ఏఐబీఈఏ దేశంలో రుణాలు తీసుకొని చెల్లించని సంస్థలు, వ్యక్తుల జాబితాను విడుదల చేసింది.
రుణాలు ఎగ్గొట్టిన టాప్ 50 కంపెనీల్లో రాష్ట్రానికి చెందిన డెక్కన్ క్రానికల్ (రూ.700 కోట్లు), ఐసీఎస్‌ఏ ఇండియా (రూ.646 కోట్లు), ల్యాంకో హోస్టెక్ హైవే (రూ.533), ఎంబీఎస్ జ్యూయెలర్స్ (రూ.524 కోట్లు), రాజీవ్ స్వగృహ (రూ.385 కోట్లు), పోగ్రసివ్ కనస్ట్రక్షన్ (రూ.351 కోట్లు), సుజన యూనివర్సల్ (రూ.330 కోట్లు) ఉన్నాయి. ఈ సందర్భంగా రాంబాబు మాట్లాడుతూ బ్యాంకుల ఆడిట్ కమిటీలో ఉద్యోగ సంఘాలకు చోటు కల్పిస్తే రుణాల మంజూరులో పారదర్శకత పెరిగి మొండి బకాయిలు తగ్గుతాయన్నారు.
డిఫాల్టర్లపై క్రిమినల్ కేసులు పెట్టాలి
Published Tue, May 13 2014 1:40 AM | Last Updated on Sat, Sep 2 2017 7:16 AM
Advertisement
Advertisement