CH Venkatachalam
-
కస్టమర్లకు గమనిక: జనవరి 30, 31 తేదీల్లో యథావిధిగా బ్యాంకు సేవలు
సాక్షి,ముంబై: జనవరి 30, 31 తేదీల్లో బ్యాంకు ఉద్యోగులు తలపెట్టిన సమ్మెను తాత్కాలికంగా విరమించుకున్నారు. యునైటెడ్ ఫోరమ్ ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ (UFBU) ముంబైలో జరిగిన సమావేశంలో కుదిరిన అవగాహన మేరకు జనవరి 30-31 తేదీలలో రెండు రోజుల దేశవ్యాప్త బ్యాంకు సమ్మెను వాయిదా వేసినట్లు ఆల్ ఇండియా బ్యాంక్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి సిహెచ్ వెంకటాచలం తెలిపారు. సమ్మె వాయిదా పడడంతో సంబంధిత తేదీల్లో బ్యాంకులు యథావిధిగా పనిచేయనున్నాయి. (అదానీకి మరో ఎదురుదెబ్బ: సెబీ కన్ను, మరింత లోతుగా పరిశీలన) ఐదు రోజుల పనిదినాలు, ఎన్పీఎస్ రద్దు, వేతన పెంపు సవరణపై చర్చలకు ఆహ్వానించడం, ఖాళీగా ఉన్న విభాగాల్లో నియామకాలు తదితర డిమాండ్స్‌తో బ్యాంకు యూనియన్లు జనవరి 30, 31 తేదీల్లో రెండు రోజుల పాటు దేశవ్యాప్తంగా సమ్మెకు దిగుతున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే తమ నిర్ణయాన్ని ప్రస్తుతానికి వాయిదా వేస్తున్నట్లు యూఎఫ్‌బీయూ శనివారం వెల్లడించింది. (అదానీ సెగ: ఎల్ఐసీలో రెండు రోజుల్లో వేల కోట్లు సంపద ఆవిరి) ఉద్యోగుల డిమాండ్లపై చర్చ నిమిత్తం జనవరి 31న బ్యాంకు యూనియన్లతో సమావేశమయ్యేందుకు ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ అంగీకరించడంతో సమ్మెను వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకున్నారు. మిగిలిన సమస్యలపై సంబంధిత అధికారులు, కార్మిక సంఘాలతో విడివిడిగా చర్చించనున్నారు. -
భారీ మూలధనం తాత్కాలిక ఊరటే!!
చెన్నై: ప్రభుత్వ రంగ బ్యాంకులకి మరింత మూలధనం సమకూర్చాలన్న కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని అఖిల భారత బ్యాంకు ఉద్యోగుల సంఘం ఏఐబీఈఏ స్వాగతించింది. అయితే, ఇది తాత్కాలిక ఊరట మాత్రమేనని... మొండిబాకీల సమస్య పరిష్కారానికి ఇదొక్కటే పరిష్కారం కాదని ఏఐబీఈఏ జనరల్ సెక్రటరీ సీహెచ్ వెంకటాచలం ఒక ప్రకటనలో తెలిపారు. ‘కొండలా పెరిగిపోతున్న మొండి బాకీలతో బ్యాంకులు సతమతమవుతున్నాయి. ఇప్పటిదాకా స్థూల మొండి బాకీలు రూ.8 లక్షల కోట్లుగా ఉన్నాయి. పునర్వ్యవస్థీకరించిన వాటిని కూడా కలిపితే మొత్తం రూ.15 లక్షల కోట్ల పైగా ఉంటుంది‘ అని ఆయన వివరించారు. ఎన్పీఏలతో కుదేలవుతున్న ప్రభుత్వ రంగ బ్యాంకులకు రెండేళ్లలో రూ. 2.11 లక్షల కోట్ల మేర అదనపు మూలధనాన్ని సమకూర్చనున్నట్లు కేంద్రం మంగళవారం ప్రకటించిన సంగతి తెలిసిందే. కార్పొరేట్లు.. ఎగవేతదారులదే పాపం.. కార్పొరేట్లు, ఉద్దేశపూర్వక ఎగవేతదారులే మొండి బాకీల్లో అత్యధిక భాగానికి కారణమని వెంకటాచలం చెప్పారు. దీనివల్ల ఆయా ఖాతాలకు బ్యాంకులు తప్పనిసరిగా తమ లాభాల్లో నుంచి భారీగా కేటాయింపులు జరపాల్సి వస్తోందన్నారు. -
డిఫాల్టర్లపై క్రిమినల్ కేసులు పెట్టాలి
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: కొండలా పెరిగిపోతున్న మొండి బకాయిలు ప్రభుత్వరంగ బ్యాంకులకు గుదిబండగా మారాయని, ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే తొలిసారిగా పీఎస్‌యూ బ్యాంకులు దివాళా తీసే పరిస్థితులు తలెత్తుతాయని ఆంధ్రప్రదేశ్ బ్యాంక్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ (ఏఐబీఈఏ) ఆందోళన వ్యక్తం చేసింది. పీఎస్‌యూ బ్యాంకుల్లో మార్చి, 2013 నాటికి రూ.1.64 లక్షల కోట్లుగా ఉన్న ఎన్పీఏలు సెప్టెంబర్, 2013 నాటికి 2.36 లక్షల కోట్లకు చేరాయని, ఇప్పుడివి రూ.3.50 లక్షలు దాటినట్లు ప్రాథమిక అంచనాలను బట్టి తెలుస్తోందని ఏఐబీఈఏ ప్రధాన కార్యదర్శి బి.ఎస్.రాంబాబు తెలిపారు. రుణం తీసుకొని చెల్లించని వారిపై క్రిమినల్ కేసులు పెట్టి వారి ఆస్తులను జప్తు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. సోమవారం హైదరాబాద్‌లో జరిగిన ఒక కార్యక్రమంలో ఏఐబీఈఏ దేశంలో రుణాలు తీసుకొని చెల్లించని సంస్థలు, వ్యక్తుల జాబితాను విడుదల చేసింది. రుణాలు ఎగ్గొట్టిన టాప్ 50 కంపెనీల్లో రాష్ట్రానికి చెందిన డెక్కన్ క్రానికల్ (రూ.700 కోట్లు), ఐసీఎస్ఏ ఇండియా (రూ.646 కోట్లు), ల్యాంకో హోస్టెక్ హైవే (రూ.533), ఎంబీఎస్ జ్యూయెలర్స్ (రూ.524 కోట్లు), రాజీవ్ స్వగృహ (రూ.385 కోట్లు), పోగ్రసివ్ కనస్ట్రక్షన్ (రూ.351 కోట్లు), సుజన యూనివర్సల్ (రూ.330 కోట్లు) ఉన్నాయి. ఈ సందర్భంగా రాంబాబు మాట్లాడుతూ బ్యాంకుల ఆడిట్ కమిటీలో ఉద్యోగ సంఘాలకు చోటు కల్పిస్తే రుణాల మంజూరులో పారదర్శకత పెరిగి మొండి బకాయిలు తగ్గుతాయన్నారు.