చెన్నై: ప్రభుత్వ రంగ బ్యాంకులకి మరింత మూలధనం సమకూర్చాలన్న కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని అఖిల భారత బ్యాంకు ఉద్యోగుల సంఘం ఏఐబీఈఏ స్వాగతించింది. అయితే, ఇది తాత్కాలిక ఊరట మాత్రమేనని... మొండిబాకీల సమస్య పరిష్కారానికి ఇదొక్కటే పరిష్కారం కాదని ఏఐబీఈఏ జనరల్ సెక్రటరీ సీహెచ్ వెంకటాచలం ఒక ప్రకటనలో తెలిపారు.
‘కొండలా పెరిగిపోతున్న మొండి బాకీలతో బ్యాంకులు సతమతమవుతున్నాయి. ఇప్పటిదాకా స్థూల మొండి బాకీలు రూ.8 లక్షల కోట్లుగా ఉన్నాయి. పునర్‌వ్యవస్థీకరించిన వాటిని కూడా కలిపితే మొత్తం రూ.15 లక్షల కోట్ల పైగా ఉంటుంది‘ అని ఆయన వివరించారు.
ఎన్‌పీఏలతో కుదేలవుతున్న ప్రభుత్వ రంగ బ్యాంకులకు రెండేళ్లలో రూ. 2.11 లక్షల కోట్ల మేర అదనపు మూలధనాన్ని సమకూర్చనున్నట్లు కేంద్రం మంగళవారం ప్రకటించిన సంగతి తెలిసిందే.
కార్పొరేట్లు.. ఎగవేతదారులదే పాపం..
కార్పొరేట్లు, ఉద్దేశపూర్వక ఎగవేతదారులే మొండి బాకీల్లో అత్యధిక భాగానికి కారణమని వెంకటాచలం చెప్పారు. దీనివల్ల ఆయా ఖాతాలకు బ్యాంకులు తప్పనిసరిగా తమ లాభాల్లో నుంచి భారీగా కేటాయింపులు జరపాల్సి వస్తోందన్నారు.
Comments
Please login to add a commentAdd a comment