![Bank staff to strike work on Jan 30 and 31 - Sakshi](/styles/webp/s3/article_images/2023/01/12/bank%20strike.jpg.webp?itok=qVh1vrJ_)
ఫైల్ ఫోటో
సాక్షి,ముంబై: దేశవ్యాప్తంగా బ్యాంకు ఉద్యోగులు మరోసారి సమ్మె బాట పట్టనున్నారు. తమ వివిధ డిమాండ్ల సాధన కోసం జనవరి 30 నుంచి రెండు రోజుల పాటు సమ్మె చేయాలని పలు బ్యాంకు యూనియన్ల గొడుగు సంస్థ యునైటెడ్ ఫోరమ్ ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ (యూఎఫ్‌బీయూ) గురువారం నిర్ణయించినట్లు ఆల్ ఇండియా బ్యాంక్ ఎంప్లాయీస్ అసోసియేషన్ (ఏఐబీఈఏ) వెల్లడించింది,
గురువారం ముంబైలో జరిగిన యూఎఫ్‌బీయూ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. తతమ డిమాండ్‌లపై ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ (ఐబిఎ) లేఖలు రాసినా స్పందన రాకపోవడంతో, తమ ఆందోళనను పునరుద్ధరించాలని భావించామని, జనవరి 30, 31 తేదీల్లో ( సోమ, మంగళవారం) సమ్మెకు పిలుపు నివ్వాలని నిర్ణయించామని ఏఐబీఈఏ ప్రధాన కార్యదర్శి సీహెచ్ వెంకటాచలం ఐఏఎన్‌ఎస్‌కు తెలిపారు. ముఖ్యంగా ఐదు రోజుల వర్కింగ్ డేస్, పెన్షన్ అప్‌డేట్, నేషనల్ పెన్షన్ సిస్టమ్ (ఎన్‌పిఎస్) రద్దు, వేతన సవరణ డిమాండ్‌ల చార్టర్‌పై తక్షణ చర్చలు, అన్ని విభాగాల్లో తగిన నియామకాలు తదితర డిమాండ్స్‌తో ఈ సమ్మెకు దిగుతున్నట్టు వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment