Bank Strike
-
బ్యాంకు కస్టమర్లకు అలర్ట్: మోగనున్న సమ్మె సైరన్
సాక్షి,ముంబై: దేశవ్యాప్తంగా బ్యాంకు ఉద్యోగులు మరోసారి సమ్మె బాట పట్టనున్నారు. తమ వివిధ డిమాండ్ల సాధన కోసం జనవరి 30 నుంచి రెండు రోజుల పాటు సమ్మె చేయాలని పలు బ్యాంకు యూనియన్ల గొడుగు సంస్థ యునైటెడ్ ఫోరమ్ ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ (యూఎఫ్‌బీయూ) గురువారం నిర్ణయించినట్లు ఆల్ ఇండియా బ్యాంక్ ఎంప్లాయీస్ అసోసియేషన్ (ఏఐబీఈఏ) వెల్లడించింది, గురువారం ముంబైలో జరిగిన యూఎఫ్‌బీయూ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. తతమ డిమాండ్లపై ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ (ఐబిఎ) లేఖలు రాసినా స్పందన రాకపోవడంతో, తమ ఆందోళనను పునరుద్ధరించాలని భావించామని, జనవరి 30, 31 తేదీల్లో ( సోమ, మంగళవారం) సమ్మెకు పిలుపు నివ్వాలని నిర్ణయించామని ఏఐబీఈఏ ప్రధాన కార్యదర్శి సీహెచ్ వెంకటాచలం ఐఏఎన్ఎస్కు తెలిపారు. ముఖ్యంగా ఐదు రోజుల వర్కింగ్ డేస్, పెన్షన్ అప్డేట్, నేషనల్ పెన్షన్ సిస్టమ్ (ఎన్‌పిఎస్) రద్దు, వేతన సవరణ డిమాండ్ల చార్టర్‌పై తక్షణ చర్చలు, అన్ని విభాగాల్లో తగిన నియామకాలు తదితర డిమాండ్స్‌తో ఈ సమ్మెకు దిగుతున్నట్టు వెల్లడించారు. -
కస్టమర్లకు అలర్ట్ : ఉద్యోగుల స్ట్రైక్..ఆ రోజు పని చేయని బ్యాంకులు
బ్యాంకు ఖాతాదారులకు ముఖ్య గమనిక. ఇటీవల బ్యాంకు ఉద్యోగులపై పెరిగిపోతున్న దాడుల్ని నిరసిస్తూ ప్రభుత్వరంగ బ్యాంకింగ్ ఉద్యోగులు సమ్మె చేయనున్నారు. వచ్చే నెల 19న ఆల్ ఇండియా బ్యాంక్ ఎంప్లాయిస్ అసోసియేషన్(ఏఐబీఈఏ) ఆధ్వర్యంలో స్ట్రైక్ జరగనుంది. ఆ రోజు బ్యాంకుల్లో కార్యకలాపాలకు విఘాతం కలగనుంది. ఏఐబీఈఏ జనరల్ సెక్రటరీ సీహెచ్.వెంకటాచలం తెలిపిన వివరాల మేరకు..ఏఐబీఈఏ యూనియన్‌లో యాక్టీవ్‌గా ఉన్నారనే కారణంగా బ్యాంకు ఉద్యోగులపై వేధింపులు కొనసాగుతున్నాయని అన్నారు. అందుకే ఈ నిరసన వ్యక్తం చేస్తున్నట్లు తెలిపారు. అందుకు ఊతం ఇచ్చేలా ఏఐబీఏ యూనియన్ నాయకులను సోనాలి బ్యాంక్, ఎంయూఎఫ్‌జీ బ్యాంక్, ఫెడరల్ బ్యాంక్, స్టాండర్డ్ చార్టర్డ్ బ్యాంక్ సర్వీస్ నుండి తొలగించాయి. బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర వంటి ప్రభుత్వ బ్యాంకులు ట్రేడ్ యూనియన్ హక్కులను నిరాకరిస్తున్నాయని, కెనరా బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ బరోడా, ఐడిబిఐ బ్యాంకులు అనేక బ్యాంకింగ్ కార్యకలాపాలను ఔట్ సోర్సింగ్ చేయడాన్ని ఆయన తీవ్రంగా వ్యతిరేకించారు. సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యాజమాన్యం ఉద్యోగుల్ని విచక్షణారహితంగా బదిలీ చేస్తుందన్నారు. ద్వైపాక్షిక సెటిల్మెంట్, బ్యాంక్ లెవల్ సెటిల్మెంట్ను ఉల్లంఘిస్తూ 3,300 మందికి పైగా క్లరికల్ సిబ్బందిని ఒక స్టేషన్ నుండి మరో స్టేషన్‌కు బదిలీ చేశారన్నారని అన్నారు. పై వాటన్నింటిని తిప్పికొట్టడం లేదా ప్రతిఘటించాలనే ఉద్దేశంతో ప్రత్యేక కార్యాచరణ రూపొందిస్తున్నట్లు ఏఐబీఈఏ జనరల్ సెక్రటరీ సీహెచ్ వెంకటాచలం చెప్పారు. చదవండి👉 హెచ్డీఎఫ్సీ కస్టమర్లకు అదిరిపోయే శుభవార్త -
ఎస్బీఐ ఖాతాదారులకు అలర్ట్, డబ్బులు ఇప్పుడే డ్రా చేసుకోండి!
బ్యాంక్ ఖాతాదారులకు గమనిక. పలు బ్యాంక్ యూనియన్ల పిలుపు మేరకు మార్చి28, మార్చి 29 బ్యాంక్‌ల బంద్ జరగనుంది. దీంతో ఎస్బీఐ బ్యాంకులు, ఏటీఎం సెంటర్ల కార్యకలాపాలలో అంతరాయం ఏర్పడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అందుకే బ్యాంక్ ఖాతాదారులు ముందస్తుగానే అవసరానికి కావాల్సిన డబ్బుల్ని డ్రా చేసుకోవాలని బ్యాంక్ అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు. దేశ వ్యాప్తంగా బంద్ ప్రభుత్వ రంగ బ్యాంకులు రెండింటిని ప్రయివేటైజ్ చేసేందుకు వీలుగా ఆర్థిక శాఖ రానున్న రోజుల్లో కేబినెట్ అనుమతి కోరే అవకాశముంది. ఇందుకు అనుగుణంగా బ్యాంకింగ్ నియంత్రణ చట్టం 1949కు సవరణలు ప్రతిపాదిస్తోంది. ఈ నేపథ్యంలో బ్యాంకుల ప్రైవేటీకరణ బిల్లు (బ్యాంకింగ్ లాస్ సవరణ బిల్లు, 2021)ను వ్యతిరేకిస్తూ యూనియన్ ఫోరమ్ ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ స్ట్రైక్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. బ్యాంక్ సేవలకు విఘాతం ఎస్బీఐ వివరాల ప్రకారం.. ఇండియన్ బ్యాంక్ అసోసియేషన్, ఆల్ ఇండియా బ్యాంక్ ఎంప్లాయిస్ అసోసియేషన్, బ్యాంక్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా, ఆల్ ఇండియా బ్యాంక్ ఆఫీసర్స్ అసోసియేషన్ లు నేషనల్ వైడ్ స్ట్రైక్‌కు పిలుపునిచ్చినట్లు తెలిపింది. ఈ బందు కారణంగా ఎస్బీఐ బ్యాంక్ ఏటీఎం కార్యకలాపాలకు విఘాతం కలగనున్నట్లు తెలుస్తోంది. అందుకే ఖాతాదారులు అప్రమత్తంగా ఉండాలని ఎస్బీఐ అధికారులు చెబుతున్నారు. -
అలెర్ట్: బ్యాంకుల్లో మోగనున్న సమ్మె సైరన్?..లావాదేవీలు ఉంటే ఇప్పుడే చూసుకోండి!
బ్యాంక్ ఖాతాదారులకు గమనిక. బ్యాంకులకు 11రోజుల పాటు సెలవులు ఉన్నాయి. మొబైల్,ఇంటర్నెట్లో బ్యాంకింగ్ కార్యకలాపాలు అంతరాయం లేకుండా కొనసాగుతున్నప్పటికీ, బ్యాంక్ సెలవులతో పాటు బ్యాంకింగ్ అసోసియేషన్ల సమ్మె కారణంగా అనేక బ్యాంకుల కార్యకలాపాలు మొత్తం 11రోజుల పాటు బ్యాంకులు పనిచేయవు. బ్యాంక్ యూనియన్లు ఫిబ్రవరి 23, ఫిబ్రవరి 24న రెండు రోజుల సమ్మెకు పిలుపునిచ్చాయి. అయితే దేశంలోని అన్నీ రాష్ట్రాల్లో బ్యాంక్ స్ట్రైక్లతోపాటు పబ్లిక్ హాలిడేస్ల కారణంగా మొత్తం 11రోజులు బ్యాంకులు పనిచేయవనే విషయాన్ని ఖాతాదారులు గుర్తించాలని బ్యాంక్ సంబంధిత అధికారులు చెబుతున్నారు. ఏఏ రోజుల్లో బ్యాంకులు పనిచేయవంటే? ఫిబ్రవరి 12- నెలలో రెండవ శనివారం 13 ఫిబ్రవరి-ఆదివారం 15 ఫిబ్రవరి-హజ్రత్ అలీ జయంతి/లూయిస్-నగై-ని (ఉత్తరప్రదేశ్, మణిపూర్లలో బ్యాంకులు పనిచేయవు) 16 ఫిబ్రవరి-గురు రవిదాస్ జయంతి (చండీగఢ్, హిమాచల్, హర్యానా,పంజాబ్‌లలో బ్యాంకులు పనిచేయవు) ఫిబ్రవరి 18-దోల్ యాత్ర (పశ్చిమ బెంగాల్లో బ్యాంకులు పనిచేయవు) ఫిబ్రవరి 19-ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి (మహారాష్ట్రలో బ్యాంకులు పనిచేయవు) ఫిబ్రవరి 20-ఆదివారం ఫిబ్రవరి 23 - బ్యాంకు సమ్మె ఫిబ్రవరి 24 - బ్యాంకు సమ్మె 26 ఫిబ్రవరి-నెలలో నాలుగవ శనివారం ఫిబ్రవరి 27-ఆదివారం -
సమ్మెతో బ్యాంకింగ్ సేవలకు అంతరాయం
న్యూఢిల్లీ: దేశ వ్యాప్తంగా దాదాపు తొమ్మిది లక్షల మంది ఉద్యోగులు సమ్మె ప్రారంభించడంతో బ్యాంకింగ్ కార్యకలాపాలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. బ్యాంకుల ప్రైవేటీకరణను నిరసిస్తూ, తొమ్మిది యూనియన్లకు ప్రాతినిధ్యం వహిస్తున్న యునైటెడ్ ఫోరమ్ ఆఫ్ బ్యాంక్ యూనియన్ ఈ సమ్మె పిలుపు ఇచ్చింది. ఎస్బీఐ, పీఎన్బీ, బ్యాంక్ ఆఫ్ ఇండియా వంటి పలు ప్రభుత్వ రంగ బ్యాంకుల ఉద్యోగులు గురువారం విధులు బహిష్కరించారు. సమ్మె రెండవరోజూ కొనసాగుతున్న నేపథ్యంలో శుక్రవారం కూడా బ్యాంకింగ్ సేవలకు తీవ్ర అంతరాయం కలిగింది. ప్రభుత్వం మొండి విధానం వల్లే... ఆల్ ఇండియా బ్యాంక్ ఎంప్లాయీస్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ సీహెచ్ వెంకటాచలం చేసిన ప్రకటన ప్రకారం, గురువారం దాదాపు రూ.18,600 కోట్ల విలువైన 20.4 లక్షల చెక్కుల లావాదేవీలు జరగలేదు. ప్రభుత్వం అనుసరిస్తున్న మొండి విధానం వల్ల దేశ వ్యాప్తంగా లక్షకు పైగా బ్యాంకింగ్, ప్రాంతీయ గ్రామీణ బ్యాంకు బ్రాంచీల కార్యకలాపాలు నిలిచిపోయినట్లు ఆయన పేర్కొన్నారు. కాంగ్రెస్, డీఎంకే. సీపీఐ, సీపీఎం, టీఎంసీ, ఎన్సీపీ, శివసేనసహా పలు రాజకీయ పార్టీలు సమ్మెకు మద్దతు నిచ్చినట్లు తెలిపారు. కాగా, ఇంటర్ బ్యాంక్ చెక్ క్లియరెన్స్ ఇబ్బందులు మినహా హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, కోటక్ మహీంద్రా బ్యాంక్ వంటి ప్రైవేటు బ్యాంకులు యథాపూర్వం విధులు నిర్వహించాయి. చదవండి:యూజర్లకు ఎల్ఐసీ హెచ్చరిక! పర్మిషన్ లేకుండా అలా చేస్తే.. -
Bank Strike: బ్యాంకులు బంద్.. సేవలకు విఘాతం
Bank Unions Strike: సమ్మె నోటీసుకు అనుగుణంగా బ్యాంకు ఉద్యోగులు ఇవాళ, రేపు బంద్ పాటించనున్నారు. అడిషనల్ చీఫ్ లేబర్ కమిషనర్‌తో బుధవారం జరిగిన చర్చలు విఫలం అయ్యాయని ఆల్ ఇండియా బ్యాంక్ ఆఫీసర్స్ కన్ఫెడరేషన్ జనరల్ సెక్రటరీ సౌమ్య దత్త ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే చివరి నిమిషం వరకు ఉత్కంఠ కొనసాగగా.. గురువారం ఉదయం సానుకూల నిర్ణయం ప్రభుత్వం నుంచి వెలువడకపోవడంతో బుధవారం ఉదయం నుంచి సమ్మెలోకి దిగాయి బ్యాంక్ యూనియన్లు. దాదాపు 10 లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగులు గురు, శుక్రవారాల్లో (డిసెంబర్ 16, 17 తేదీలు) బ్యాంకుల సమ్మెలో పాల్గొననున్నారు. సమ్మె నేపథ్యంలో వినియోగదారులు తమ ఆర్థిక లావాదేవీల విషయంలో ముందస్తు చర్యలు తీసుకోవాలని బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాసహా పలు బ్యాంకులు విజ్ఞప్తి చేసిన విషయం తెలిసిందే. మాకోసం కాదు.. రెండు ప్రభుత్వ రంగ బ్యాంకుల ప్రైవేటీకరణను నిరసిస్తూ తొమ్మిది యూనియన్ల ప్రాతినిధ్య వేదిక– యునైటెడ్ ఫోరమ్ ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ (యూఎఫ్‌బీయూ) ఈ సమ్మె పిలుపు ఇచ్చింది. బ్యాంకుల ప్రైవేటీకరణ బిల్లు (బ్యాంకింగ్ లాస్ సవరణ బిల్లు, 2021)ను ప్రస్తుత పార్లమెంటు సమావేశాల్లో ప్రవేశపెట్టడానికి కూడా కేంద్రం సిద్ధమవుతోంది. అయితే ఈ బిల్లును ప్రవేశపెట్టబోమని ప్రభుత్వం స్పష్టమైన హామీ ఇస్తేనే సమ్మె విరమణ ఉంటుందని యూనియన్లు స్పష్టం చేస్తుండగా, అటువంటి హామీ ప్రభుత్వం నుంచి రావట్లేదు. #BankStrike #16December pic.twitter.com/XB9tUOszGH — Rajesh Sinha (देवघर,झारखंड) (@theRajeshSinha) December 16, 2021 ప్రభుత్వ రంగం బ్యాంకుల్లో రెండింటిని.. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ప్రైవేటీకరించాలని ప్రభుత్వం బడ్జెట్ 2021-22లో కేంద్రం నిర్ణయించడం.. ఆ దిశగా ప్రక్రియను కూడా ప్రారంభించిన నేపథ్యంలో.. బ్యాంకుల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తున్నాయి సంఘాలు. దీనిపై ముందుగానే సమ్మె నోటీసు కూడా ఇచ్చాయి. ఈ సమ్మె తమ కోసం కాదని, బ్యాంకులను ప్రైవేట్‌పరం చేస్తే బలహీన వర్గాలకు రుణాల లభ్యత తగ్గుతుందని.. కోట్లాది మంది డిపాజిట్లు రిస్క్‌లో పడతాయని హెచ్చరిస్తోంది Union Forum Of Bank. మొత్తం తొమ్మిది యూనియన్లు యూఎఫ్‌బీయూ నేతృత్వంలో ఈ సమ్మెలో పాల్గొనబోతున్నారు. కుట్ర జరుగుతోంది ప్రైవేటీకరణ బిల్లును ఉపసంహరించుకోవడంతో పాటు ప్రభుత్వ రంగ బ్యాంకులను బలోపేతం చేయాలని కోరుతోంది. ఈ దేశంలో సామాన్యులకు సేవలందించడానికి ప్రభుత్వ రంగ బ్యాంకులు వుండడం చాలా అవసరమని పేర్కొంది. 1969లో బ్యాంకులను జాతీయకరణ చేసిన తర్వాతనే పేదలు, అవసరంలో వున్నవారికి బ్యాంకుల సేవలు అందాయన్న విషయం గుర్తుంచుకోవాలని సూచిస్తోంది. 1969లో 8 వేలుగా వున్న ప్రభుత్వ రంగ శాఖలు ప్రస్తుతం 1.18 లక్షలకు చేరాయంటేనే ఎంతగా అభివృద్ధి చెందాయో తెలుస్తోందని. కానీ, ప్రభుత్వ రంగ బ్యాంకులు సమర్ధవంతంగా పనిచేయడం లేదని, నష్టాల్లో నడుస్తున్నాయని చిత్రీకరించేందుకు కుట్రలు జరుగుతున్నాయని మండిపడుతున్నారు. మరోవైపు.. బ్యాంకు ఉద్యోగుల, అధికారుల సమ్మెకు రైల్వే యూనియన్ సహా ఇతర సంఘాలు కూడా మద్దతు ప్రకటిస్తున్నాయి. #BankStrike #BankPrivatisation #stoprivatisationofbank pic.twitter.com/5Gg1BNf9J8 — Singh Rashmi🇮🇳 (@rsrashmi9) December 16, 2021 ఈ సమ్మెతో స్టేట్ బ్యాంక్ఆఫ్ ఇండియా, పంజాబ్ నేషనల్ బ్యాంక్, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇండియన్ బ్యాంక్, యూసీవో బ్యాంక్ సహా పలు ప్రైవేట్‌రంగ బ్యాంకుల సేవలకు విఘాతం కలగనుంది. బ్యాంకింగ్ సేవలతో పాటు ఏటీఎం, ఇతర సేవలపైనా ప్రభావం పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. రెండు బ్యాంకుల ప్రైవేటీకరణ.. నిర్మలా సీతారామన్ ఏం చెప్పారంటే.. -
బ్యాంకు సమ్మె: 10 లక్షల మంది, 80 వేల శాఖలు
సాక్షి,చెన్నై: రేపటి నుంచి (జనవరి 31) రెండు రోజులపాటు బ్యాంకింగ్ కార్యకలాపాలకు ఆటంకం కలగనుంది. బ్యాంకు ఉద్యోగ సంఘాలు తలపెట్టిన దేశవ్యాప్త సమ్మెలో పెద్ద ఎత్తున ఉద్యోగులు పాల్గొననున్నారు. ప్రభుత్వ, ప్రైవేటు రంగంలో సుమారు 10 లక్షల మంది ఉద్యోగులు ఈ సమ్మెలో పాల్గొంటారని అఖిల భారత బ్యాంక్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఒక ప్రకటనలో తెలిపింది. దీంతో జనవరి 31- ఫిబ్రవరి 1 తేదీల్లో వివిధ బ్యాంకు సేవలు ప్రభావితం కానున్నాయి. బ్యాంకింగ్ రంగంలో తొమ్మిది యూనియన్లతో కూడిన యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ (యుఎఫ్‌బియు) ఈ సమ్మెకు నాయకత్వం వహించనుంది. మరోవైపు జనవరి 31 న ఆర్థిక సర్వేను సమర్పించనున్నారు. అలాగే ఫిబ్రవరి 1న కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంటులో యూనియన్ బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. ఈ నేపథ్యంలో రెండు రోజుల దేశవ్యాప్త సమ్మెకు పిలుపునివ్వడం గమనార్హం. ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ (ఐబిఎ) తో చర్చలు విఫలమైన అనంతరం రెండు రోజుల సమ్మెకు నిర్ణయించామని అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి సిహెచ్ వెంకటాచలం చెప్పారు. సమ్మెకాలంలో 80వేల బ్యాంక్ శాఖల్లో ఎక్కువ భాగం మూత పడతాయని తెలిపారు. అలాగే మార్చి 11 నుండి మూడు రోజుల పాటు మరోసారి సమ్మెను చేపట్టనున్నామని తెలిపారు. తమ డిమాండ్ల పరిష్కారం కోసం ఏప్రిల్ 1 నుండి నిరవధిక సమ్మె జరుగుతుందని యుఎఫ్‌బియు ఇంతకుముందే ప్రకటించిన సంగతి విదితమే. -
బ్యాంకు సమ్మె, ఎస్బీఐ అలర్ట్
సాక్షి, ముంబై: బ్యాంకు యూనియన్లు సమ్మెకు పిలుపునిచ్చిన నేపథ్యంలో స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) తన ఖాతాదారులను అప్రమత్తం చేసింది. జనవరి 31, ఫిబ్రవరి 1 తేదీల్లో రెండు రోజుల దేశవ్యాప్త బ్యాంకు సమ్మె నేపథ్యంలో తమ బ్యాంకింగ్ సేవలు ప్రభావితం కావచ్చంటూ ఒక అధికారిక నోటిఫికేషన్‌ను శుక్రవారం విడుదల చేసింది. కానీ తన శాఖలు, కార్యాలయాల్లో బ్యాంకింగ్ కార్యకలాపాలు సజావుగా పనిచేసేలా అన్ని ఏర్పాట్లు చేసినట్లు ఎస్బీఐ తెలిపింది. భారత బ్యాంక్ అసోసియేషన్ (ఐబిఎ)తో వేతన సవరణపై చర్చలు విఫలమైన తరువాత యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ (యుఎఫ్‌బియు) దేశవ్యాప్తంగా సమ్మె చేపట్టాలని నిర్ణయించింది. బ్యాంకుల వినీనం, తదితర డిమాండ్లతో పాటు 20 శాతం వేతన సవరణ, 5 రోజుల పనిదినాలు, పెన్షన్ల నవీకరణ, కుటుంబ పెన్షన్ల మెరుగుదల వంటివి డిమాండ్లను నెరవేర్చాలని యూనియన్లు కోరుతున్నాయి. తొమ్మిది సంఘాలు (ఆల్ ఇండియా ఎంప్లాయీస్ అసోసియేషన్, ఆల్ ఇండియా బ్యాంక్ ఆఫీసర్స్ కాన్ఫెడరేషన్ , నేషనల్ కాన్ఫెడరేషన్ ఆఫ్ బ్యాంక్ ఎంప్లాయీస్ , ఆల్ ఇండియా బ్యాంక్ ఆఫీసర్స్ అసోసియేషన్, బ్యాంక్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా, ఇండియన్ నేషనల్ బ్యాంక్ ఎంప్లాయీస్ ఫెడరేషన్, ఇండియన్ నేషనల్ బ్యాంక్ ఆఫీసర్స్ కాంగ్రెస్, నేషనల్ ఆర్గనైజేషన్ ఆఫ్ బ్యాంక్ వర్కర్స్ నేషనల్ ఆర్గనైజేషన్ ఆఫ్ బ్యాంక్ ఆఫీసర్స్) ఇందులో ఉన్నాయి. -
మరోసారి మోగనున్న బ్యాంకుల సమ్మె సైరన్
సాక్షి, ముంబై: ప్రభుత్వ రంగ బ్యాంకుల మెగా విలీనంతో సహా పలు సమస్యల పరిష్కారాన్ని కోరుతో బ్యాంక్ ఉద్యోగుల సంఘాలు సమ్మెకు పిలుపు నిచ్చాయి. అక్టోబర్ 22, మంగళవారం నిర్వహించనున్న ఈ సమ్మె కారణంగా తమ బ్యాంకింగ్‌కార్యకలాపాలు ప్రభావితం కానున్నాయి. అక్టోబర్ 22న ట్రేడ్ యూనియన్ సంస్థలు ప్రతిపాదించిన సమ్మె కారణంగా బ్యాంక్ కార్యకలాపాలు తీవ్రంగా ప్రభావితమవుతాయని బ్యాంక్ ఆఫ్ బరోడా ఇప్పటికే హెచ్చరించింది. తమ శాఖల పనితీరు ప్రభావితం కావచ్చు లేదా స్తంభించిపోవచ్చు అని ని బ్యాంక్ ఆఫ్ బరోడా ఒక ప్రకటనలో తెలిపింది. అయితే కార్యకలాపాలు సజావుగా పనిచేయడానికి అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు బ్యాంక్ హామీ ఇచ్చింది. ప్రధానంగా పీఎస్‌యూ బ్యాంకులు ఎక్కువగా ప్రభావితమయ్యే అవకాశం ఉందని పేర్కొంది. ఆల్ ఇండియా బ్యాంక్ ఎంప్లాయీస్ అసోసియేషన్ (ఏఐబీఈఏ), బ్యాంక్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (బీఎఫ్ఐ) సంయుక్తంగా అక్టోబర్ 22 న అఖిల భారత బ్యాంకుల సమ్మెకు పిలుపునిచ్చాయి. ఈ సమ్మెకు అఖిల భారత ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్ (ఎఐటియుసి) మద్దతు లభించిందని అసోసియేషన్ ప్రకటించింది. ఇటీవల 10 ప్రభుత్వ రంగ బ్యాంకులను విలీనం చేసి నాలుగు బ్యాంకులుగా ఏర్పరిచేందుకు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా ఈ నిర్ణయం తీసుకున్నాయి. బ్యాంక్ విలీనాలపై ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం చాలా దురదృష్టకరమని విమర్శిస్తున్నాయి. గత నెలలో కూడా నాలుగు బ్యాంక్ యూనియన్లు, ఆల్ ఇండియా బ్యాంక్ ఆఫీసర్స్ కాన్ఫెడరేషన్ (ఏఐబీవోసీ) ఆల్ ఇండియా బ్యాంక్ ఆఫీసర్స్ అసోసియేషన్ (ఏఐబీవోఏ)ఇండియన్ నేషనల్ బ్యాంక్ ఆఫీసర్స్ కాంగ్రెస్ (ఐఎన్బీవోసీ) నేషనల్ ఆర్గనైజేషన్ ఆఫ్ బ్యాంక్ ఆఫీసర్స్ (ఎన్వోబీవో) , ఇలాంటి సమస్యలపై సమ్మెకు పిలుపునిచ్చారు. తరువాత, కేంద్ర ఆర్థిక కార్యదర్శి రాజీవ్ కుమార్ తమ డిమాండ్లను పరిశీలిస్తామని యూనియన్లకు హామీ ఇవ్వడంతో సెప్టెంబర్ 26-27 నిర్వహిచ తలపెట్టిన 48 గంటల సమ్మె వాయిదా పడిన సంగతి తెలిసిందే. -
మళ్లీ సమ్మె బాటలో బ్యాంక్ సిబ్బంది
సాక్షి, న్యూఢిల్లీ : ఇటీవల బ్యాంక్ యూనియన్ల సమ్మెకు తోడు వరుస సెలవలతో ఐదు రోజులు బ్యాంకింగ్ సేవలకు అంతరాయం ఏర్పడటంతో ఖాతాదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఈ సమ్మె కష్టాలు మరువక ముందే వచ్చే ఏడాది జనవరి 8, 9 తేదీల్లో మరోసారి బ్యాంకు ఉద్యోగ సంఘాలు సమ్మెకు సన్నద్ధమవుతున్నాయి. ప్రభుత్వ రంగ యునైటెడ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు వ్యతిరేకంగా అఖిల భారత బ్యాంక్ ఉద్యోగుల సంఘం (ఏఐబీఈఏ), బ్యాంక్ ఉద్యోగుల సమాఖ్య (బీఈఎఫ్ఐ)లు బ్యాంకింగ్ పరిశ్రమకు సంబంధించిన అంశాలపై రెండు రోజుల సమ్మెకు పిలుపు ఇచ్చాయని యునైటెడ్ బ్యాంక్ నోటిఫికేషన్లో పేర్కొంది. సమ్మె నేపథ్యంలో బ్యాంకు సేవలకు విఘాతం కలగకుండా అన్ని చర్యలు చేపడతామని తెలిపింది. సమ్మె యునైటెడ్ బ్యాంక్ వరకే పరిమితమా అన్ని ప్రభుత్వ రంగ బ్యాంకులకు వర్తిస్తుందా అనే దానిపై ఇంకా స్పష్టత లేదని అధికారులు వెల్లడించారు. ఇటీవల బ్యాంక్ ఉద్యోగుల సమ్మెతో బ్యాంకింగ్ సేవలు, ఏటీఎం విత్డ్రాయల్స్పై ప్రభావం చూపడంతో ఖాతాదారులు ఇబ్బందులు ఎదుర్కొన్న క్రమంలో జనవరి 8, 9 తేదీల్లో సమ్మె పిలుపుతో బ్యాంకింగ్ పనులను ఈలోగా పూర్తిచేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. -
నేడు, రేపు.. బ్యాంకులు బంద్!!
న్యూఢిల్లీ: మెరుగైన వేతనాల పెంపు డిమాండ్‌తో బ్యాంకు ఉద్యోగులు సమ్మెకు దిగారు. దీంతో బుధ, గురువారాలు రెండు రోజుల పాటు బ్యాంకింగ్ సేవలకు విఘాతం కలగనుంది. వేతన సవరణపై చీఫ్ లేబర్ కమిషనర్ (సీఎల్సీ) ఆధ్వర్యంలో జరిగిన చర్చలు సఫలం కాకపోవడంతో సమ్మె అనివార్యమైనట్లు ఆలిండియా బ్యాంక్ ఆఫీసర్స్ కాన్ఫెడరేషన్ (ఏఐబీవోసీ) తెలియజేసింది. యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్స్‌లోని (యూఎఫ్‌బీయూ) 9 అసోసియేషన్స్‌కి చెందిన 10 లక్షల మంది పైచిలుకు ఉద్యోగులు ఈ సమ్మెలో పాల్గొంటున్నారు. మే 5న జరిగిన సమావేశంలో ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ (ఐబీఏ) రెండు శాతం వేతనాల పెంపును ప్రతిపాదించగా.. యూనియన్లు తిరస్కరించిన సంగతి తెలిసిందే. ‘మేము లేవనెత్తిన అంశాలన్నీ ఆమోదయోగ్యంగానే ఉన్నాయని చీఫ్ లేబర్ కమిషనర్ అభిప్రాయపడ్డారు. సానుకూలంగా స్పందించాలని ఐబీఏకి సూచించారు. నిర్వహణ లాభాలు మెరుగుపడటం, సిబ్బంది వ్యయాలు తగ్గడం, పెరుగుతున్న వ్యాపార పరిమాణం తదితర గణాంకాలన్నీ కూడా యూఎఫ్‌బీయూ లీడర్లు వివరించారు. ఇవన్నీ పరిగణించిన మీదట కష్టించి పనిచేసే అధికారులు, సిబ్బందికి లాభాల ఆధారంగా కాకుండా తగిన వేతనాల పెంపు ఉండాలని సీఎల్సీ సూచించారు. అయితే, ఐబీఏ మరో కొత్త ఆఫర్ ఏదీ చేయలేదు. చర్చలు కొనసాగిస్తామని మాత్రం పేర్కొంది‘ ఆలిండియా బ్యాంక్ ఎంప్లాయీస్ అసోసియేషన్ (ఏఐబీఈఏ) జనరల్ సెక్రటరీ సీహెచ్ వెంకటాచలం చెప్పారు. ప్రభుత్వ రంగ బ్యాంకులతో పాటు పాత తరం ప్రైవేట్ బ్యాంకులు, విదేశీ బ్యాంకుల ఉద్యోగులు ఈ సమ్మెలో పాల్గొంటారని నేషనల్ ఆర్గనైజేషన్ ఆఫ్ బ్యాంక్ వర్కర్స్ (ఎన్వోబీడబ్ల్యూ) వైస్ ప్రెసిడెంట్ అశ్విని రాణా తెలిపారు. స్తంభించనున్న బ్యాంకింగ్ లావాదేవీలు.. ఉద్యోగుల సమ్మెతో ప్రభుత్వ రంగ బ్యాంకుల శాఖల్లో విత్‌డ్రాయల్, డిపాజిట్ లావాదేవీలు స్తంభించనున్నాయి. ఇప్పటికే ఎస్బీఐ, పంజాబ్ నేషనల్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా మొదలైన బ్యాంకులు.. సమ్మె గురించి ఖాతాదారులకు సమాచారమిచ్చాయి. వీలైనంత వరకూ డిజిటల్ బ్యాంకింగ్ సేవలు వినియోగించుకోవాలని కోరాయి. అయితే, చెక్కుల క్లియరెన్స్‌లో కొంత జాప్యం మినహా ఐసీఐసీఐ, హెచ్డీఎఫ్సీ, యాక్సిస్, కోటక్ మహీంద్రా వంటి ప్రైవేట్ బ్యాంకుల కార్యకలాపాలు యథాప్రకారం కొనసాగనున్నాయి. దేశీయంగా ప్రభుత్వ రంగంలో 21 బ్యాంకులు కార్యకలాపాలు సాగిస్తున్నాయి. మొత్తం బ్యాంకింగ్ వ్యాపార పరిమాణంలో వీటి వాటా 75 శాతం మేర ఉంటుంది. -
బ్యాంకుల బంద్; సేవలు నిల్!
ముగిసిన పీఎస్‌యూ బ్యాంకు ఉద్యోగుల ఒకరోజు సమ్మె న్యూఢిల్లీ: ఉద్యోగుల సమ్మెతో మంగళవారం దేశవ్యాప్తంగా ప్రభుత్వరంగ బ్యాంకులు, పాత తరం ప్రైవేటు బ్యాంకుల్లో సేవలు నిలిచిపోయాయి. నగదు బదిలీలు, చెక్కుల క్లియరెన్స్, నగదు జమలు, ఉపంసహరణలు తదితర సేవలకు అంతరాయం కలిగింది. ముంబై, హైదరాబాద్, కోల్‌కతా, అహ్మాదాబాద్, బెంగళూరు, పాట్నా, చెన్నై, పుణె, జైపూర్ తదితర నగరాల్లో సమ్మె ప్రభావం పూర్తిగా కనిపించింది. ముఖ్యంగా ఏటీఎంలలో నగదు లేక జనం ఇబ్బందులు పడ్డారు. హెచ్డీఎఫ్సీ బ్యాంకు, ఐసీఐసీఐ బ్యాంకు, యాక్సిస్ బ్యాంకుల్లో మాత్రం సేవలు యథావిధిగా కొనసాగాయి. బ్యాంకుల విలీనాలు సహా పలు అంశాలపై వివిధ బ్యాంకు ఉద్యోగుల ఉమ్మడి సంఘమైన యునైటెడ్ ఫోరమ్ ఆఫ్ బ్యాంకు యూనియన్స్ (యూఎఫ్‌బీయూ) ఈ సమ్మెకు పిలుపునిచ్చింది. కాగా, అఖిల భారత బ్యాంకు ఉద్యోగుల సంఘం (ఏఐబీఈఏ) జనరల్ సెక్రటరీ సీహెచ్ వెంకటాచలం దీనిపై మాట్లాడుతూ... ‘‘మరింతగా బ్యాంకు సేవల అవసరం ఉన్న ఈ సమయంలో బ్యాంకుల స్థిరీకరణ, బ్యాంకుల విలీనాల గురించి ప్రభుత్వం మాట్లాడుతోంది. బ్యాంకుల విలీనాలతో బ్యాంకు శాఖలు మూతపడతాయి. అనుబంధ బ్యాంకులను విలీనం చేసుకున్న ఎస్బీఐ విషయంలో ఇప్పుడు అదే జరిగింది. విలీనాల ద్వారా పెద్ద బ్యాంకులను ఏర్పాటు చేయడం వల్ల రిస్క్ కూడా పెరుగుతుంది’’ అని ప్రభుత్వ తీరును విమర్శించారు. బ్యాంకు ఉద్యోగుల గ్రాట్యుటీని తక్షణమే రూ.20 లక్షలకు పెంచాలని ఆల్ ఇండియా బ్యాంకు అధికారుల కాన్ఫెడరేషన్ జనరల్ సెక్రటరీ ఫ్రాంకో డిమాండ్ చేశారు. -
సమ్మెకు దిగిన బ్యాంకు ఉద్యోగులు
-
బ్యాంక్ సమ్మె వాయిదా
న్యూఢిల్లీ: ఒక వర్గం ప్రభుత్వ రంగ బ్యాంక్ ఆఫీసర్లు తలపెట్టిన నేటి(సోమవారం) బ్యాంక్‌ల సమ్మె వాయిదాపడింది. అన్ని బ్యాంక్ బ్రాంచీలు సాధారణంగానే కార్యకలాపాలు నిర్వహిస్తాయని ఆల్ ఇండియా బ్యాంక్ ఆఫీసర్స్ కాన్ఫెడరేషన్(ఏఐబీఓసీ) జనరల్ సెక్రటరీ హవీందర్ సింగ్ పేర్కొన్నారు. ధనలక్ష్మి బ్యాంక్ ఆఫీసర్స్ ఆర్గనైజేషన్ జనరల్ సెక్రటరీ పి. వి. మోహన్‌ను తొలగించినందుకు నిరసనగా ఈ సమ్మె తలపెట్టామని సింగ్ వివరించారు. అయితే దనలక్ష్మి బ్యాంక్ యాజమాన్యం మోహన్‌ను తిరిగి విధుల్లో తీసుకునే విషయమై సానుకూలంగా స్పందించడంతో సమ్మె వాయిదా వేయాలని నిర్ణయించామని సింగ్ పేర్కొన్నారు. మోహన్ ఏఐబీఓసీ కేరళ రాష్ట్ర ప్రెసిడెంట్‌గా వ్యవహరిస్తున్నారు. కాగా రూ.100 కోట్లకు మించి బ్యాంకు రుణాలు ఎగవేసిన వారి పేర్లను ప్రచురించాలని ఆల్ ఇండియా బ్యాంక్ ఎంప్లాయిస్ అసోసియేషన్ కేంద్రాన్ని కోరింది. -
మరోసారి బ్యాంక్ ఉద్యోగుల సమ్మె
-
7న బ్యాంకు ఉద్యోగుల దేశవ్యాప్త సమ్మె
ఇటీవలే సమ్మె చేసిన బ్యాంకు ఉద్యోగులు మరోసారి సమ్మెబాట పట్టబోతున్నారు. వచ్చేనెల ఏడో తేదీ ఒకరోజు సమ్మెకు అఖిలభారత బ్యాంకు ఉద్యోగుల ఐక్యవేదిక పిలుపునిచ్చింది. అప్పటికీ ప్రభుత్వం స్పందించని పక్షంలో జనవరి 21వ తేదీ నుంచి 24వ తేదీ వరకు రెండోదఫా సమ్మె చేయనున్నట్లు ఉద్యోగుల సంఘ నాయకులు తెలిపారు. ఆ నాలుగు రోజుల సమ్మెకు సైతం స్పందించకపోతే మార్చి 16వ తేదీ నుంచి బ్యాంకు ఉద్యోగులు నిరవధిక సమ్మెలో వెళ్లబోతున్నారు. -
ఈ నెల 23న బ్యాంకుల సమ్మె నోటీసు
ముంబై: నాయక్ కమిటీ రికమండేషన్లకు వ్యతిరేకంగా బ్యాంక్ యూనియన్లు ఈ నెల 23న సమ్మె నోటీసు ఇవ్వనున్నాయి. ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో కార్పొరేట్ గవర్నెన్స్ విషయమై యాక్సిస్ బ్యాంక్ మాజీ చైర్మన్ పి. జె. నాయక్ అధ్యక్షతన ఒక కమిటీని ఆర్బీఐ నియమించింది. ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో ప్రభుత్వ వాటాను 50 శాతానికి తగ్గించుకోవాలని, ప్రభుత్వ రంగ బ్యాంకులను విలీనం చేయాలని, బ్యాంకులను కూడా కంపెనీల చట్టం పరిధిలోకి తేవాలని, ఇంకా కొన్ని ఇతర అంశాలను ఈ నాయక్ సూచించింది. ప్రభుత్వ బ్యాంకులను ప్రైవేటీకరణ చేసే ఇలాంటి రికమండేషన్లను, ఇతర ఏ ప్రయత్నాలనైనా తాము వ్యతిరేకిస్తామని బ్యాంక్ యూనియన్లు పేర్కొన్నాయి. 10 లక్షల బ్యాంక్ ఉద్యోగులు, అధికారులకు ప్రాతినిధ్యం వహించే ఐదు జాతీయ స్థాయి బ్యాంక్ యూనియన్లు నాయక్ కమిటీ సూచనలను వ్యతిరేకిస్తున్నాయని మహారాష్ట్ర స్టేట్ బ్యాంక్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ సాధారణ కార్యదర్శి విశ్వాస్ ఉతాగి పేర్కొన్నారు. ఆల్ ఇండియా బ్యాంక్ ఎంప్లాయిస్ అసోసియేషన్(ఏఐబీఈఏ), ఆల్ ఇండియా బ్యాంక్ ఆఫీసర్స్ అసోసియేషన్(ఏఐబీఓఏ), బ్యాంక్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా(బీఈఎఫ్ఐ), ఇండియన్ నేషనల్ బ్యాంక్ ఎంప్లాయిస్ ఫెడరేషన్(ఐఎన్‌బీఈఎఫ్), ఇండియన్ నేషనల్ బ్యాంక్ ఆఫీసర్స్ కాంగ్రెస్(ఐఎన్‌బీఓసీ).. ఈ 5 బ్యాంక్ యూనియన్లు నాయక్ కమిటీ సూచనలను వ్యతిరేకిస్తూ ఈ నెల 23న దేశవ్యాప్తంగా నిరసన ప్రదర్శనలు జరుపనున్నాయి. -
ముగిసిన బ్యాంక్ ఉద్యోగుల సమ్మె
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: వేతనాలు పెంచాలని, బ్యాంకింగ్ సంస్కరణలను నిలిపేయాలని డిమాండ్ చేస్తూ రెండు రోజులు చేసిన సమ్మె విజయవంతమైనట్లు బ్యాంక్ యూనియన్లు ప్రకటించాయి. సమ్మె ముగియడంతో బుధవారం నుంచి బ్యాంకింగ్ కార్యకలాపాలు యధావిధిగా కొనసాగనున్నాయి. కొద్దిగా ఇబ్బం దులు ఎదుర్కొన్నప్పటికీ ఖాతాదారులు పూర్తి మద్దతు ఇవ్వడం, ఉద్యోగులు పెద్ద సంఖ్యలో పాల్గొనడంతో ఈ సమ్మె విజయవంతమైనట్లు ఆంధ్రప్రదేశ్ బ్యాంక్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ ప్రధాన కార్యదర్శి బి.ఎస్.రాంబాబు తెలిపారు. బ్యాంకులు ఆర్జిస్తున్న లాభాలన్నీ వేతనాలు కింద ఇమ్మనడం లేదని, న్యాయబద్ధంగా పెంచాల్సిన జీతాలను మాత్రమే అడుగుతున్నామని బ్యాంకు యూనియన్లు పేర్కొన్నాయి. ఈ రెండు రోజుల సమ్మెలో దేశవ్యాప్తంగా ఎనిమిది లక్షలమంది పాల్గొన్నారు. తదుపరి కార్యాచరణ కోసం గురువారం సమావేశం అవుతున్నట్లు రాంబాబు తెలిపారు. రెండు రోజుల సమ్మె వలన ప్రభుత్వ బ్యాంకింగ్ కార్యకలాపాలు పూర్తిగా స్తంభించిపోగా, కొన్ని చోట్ల నగదు లేక ఏటీఎం లావాదేవీలు ఆగిపోయాయి. -
10, 11 తేదీల్లో బ్యాంక్ ఉద్యోగుల సమ్మె
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ బ్యాంక్ ఉద్యోగులు ఈ నెల 10, 11 తేదీల్లో దేశవ్యాప్తంగా సమ్మె బాట పడుతున్నారు. వేతన సవరణపై బ్యాంక్ యూనియన్లు, యాజమాన్యం ఏకాభిప్రాయానికి రాలేకపోవడమే దీనికి కారణం. యూనియన్లు- ఇండియన్ బ్యాంక్ అసోసియేషన్ (ఐబీఏ) మధ్య చీఫ్ లేబర్ కమిషనర్ ముందు జరిగిన చర్చల్లో సమస్యపై తగిన పరిష్కారం కనుగొనలేకపోవడంతో సమ్మె అనివార్యం అయినట్లు బ్యాంక్ యూనియన్ల ఐక్య వేదిక (యూఎఫ్‌బీయూ) కన్వీనర్ ఎంవీ మురళీ పేర్కొన్నారు. బ్యాంక్ మేనేజ్మెంట్ ఆఫర్, పెరుగుతున్న ద్రవ్యోల్బణానికి అనుగుణంగా లేదని బ్యాంక్ ఉద్యోగుల జాతీయ సంఘం(ఎన్‌ఓబీడబ్ల్యూ) ప్రధాన కార్యదర్శి అశ్వనీ రాణా అన్నారు. డిసెంబర్ 14న వేతన సవరణపై జరిగిన చర్చలు విఫలం కావడంతో అదేనెల 18వ తేదీన ప్రభుత్వ రంగ బ్యాంక్ ఉద్యోగులు దేశవ్యాప్త సమ్మె నిర్వహించారు. 2012 నవంబర్ నుంచి ప్రభుత్వ రంగ బ్యాంకుల ఉద్యోగులకు వేతన సవరణ జరగాల్సి ఉంది. తొమ్మిది బ్యాంక్ ఉద్యోగ, అధికారుల యూనియన్లకు యూఎఫ్‌బీయూ నేతృత్వం వహిస్తోంది. దేశంలోని 27 ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో దాదాపు 8 లక్షల మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు.