
బ్యాంక్ సమ్మె వాయిదా
న్యూఢిల్లీ: ఒక వర్గం ప్రభుత్వ రంగ బ్యాంక్ ఆఫీసర్లు తలపెట్టిన నేటి(సోమవారం) బ్యాంక్‌ల సమ్మె వాయిదాపడింది. అన్ని బ్యాంక్ బ్రాంచీలు సాధారణంగానే కార్యకలాపాలు నిర్వహిస్తాయని ఆల్ ఇండియా బ్యాంక్ ఆఫీసర్స్ కాన్ఫెడరేషన్(ఏఐబీఓసీ) జనరల్ సెక్రటరీ హవీందర్ సింగ్ పేర్కొన్నారు. ధనలక్ష్మి బ్యాంక్ ఆఫీసర్స్ ఆర్గనైజేషన్ జనరల్ సెక్రటరీ పి. వి. మోహన్‌ను తొలగించినందుకు నిరసనగా ఈ సమ్మె తలపెట్టామని సింగ్ వివరించారు.
అయితే దనలక్ష్మి బ్యాంక్ యాజమాన్యం మోహన్‌ను తిరిగి విధుల్లో తీసుకునే విషయమై సానుకూలంగా స్పందించడంతో సమ్మె వాయిదా వేయాలని నిర్ణయించామని సింగ్ పేర్కొన్నారు. మోహన్ ఏఐబీఓసీ కేరళ రాష్ట్ర ప్రెసిడెంట్‌గా వ్యవహరిస్తున్నారు. కాగా రూ.100 కోట్లకు మించి బ్యాంకు రుణాలు ఎగవేసిన వారి పేర్లను ప్రచురించాలని ఆల్ ఇండియా బ్యాంక్ ఎంప్లాయిస్ అసోసియేషన్ కేంద్రాన్ని కోరింది.