
బ్యాంక్ ఖాతాదారులకు గమనిక. పలు బ్యాంక్ యూనియన్ల పిలుపు మేరకు మార్చి28, మార్చి 29 బ్యాంక్‌ల బంద్ జరగనుంది. దీంతో ఎస్‌బీఐ బ్యాంకులు, ఏటీఎం సెంటర్ల కార్యకలాపాలలో అంతరాయం ఏర్పడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అందుకే బ్యాంక్ ఖాతాదారులు ముందస్తుగానే అవసరానికి కావాల్సిన డబ్బుల్ని డ్రా చేసుకోవాలని బ్యాంక్ అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు.
దేశ వ్యాప్తంగా బంద్
ప్రభుత్వ రంగ బ్యాంకులు రెండింటిని ప్రయివేటైజ్ చేసేందుకు వీలుగా ఆర్థిక శాఖ రానున్న రోజుల్లో కేబినెట్ అనుమతి కోరే అవకాశముంది. ఇందుకు అనుగుణంగా బ్యాంకింగ్ నియంత్రణ చట్టం 1949కు సవరణలు ప్రతిపాదిస్తోంది. ఈ నేపథ్యంలో బ్యాంకుల ప్రైవేటీకరణ బిల్లు (బ్యాంకింగ్ లాస్ సవరణ బిల్లు, 2021)ను వ్యతిరేకిస్తూ యూనియన్ ఫోరమ్ ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ స్ట్రైక్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
బ్యాంక్ సేవలకు విఘాతం
ఎస్‌బీఐ వివరాల ప్రకారం.. ఇండియన్ బ్యాంక్ అసోసియేషన్, ఆల్ ఇండియా బ్యాంక్ ఎంప్లాయిస్ అసోసియేషన్, బ్యాంక్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా, ఆల్ ఇండియా బ్యాంక్ ఆఫీసర్స్ అసోసియేషన్ లు నేషనల్ వైడ్ స్ట్రైక్‌కు పిలుపునిచ్చినట్లు తెలిపింది. ఈ బందు కారణంగా ఎస్‌బీఐ బ్యాంక్ ఏటీఎం కార్యకలాపాలకు విఘాతం కలగనున్నట్లు తెలుస్తోంది. అందుకే ఖాతాదారులు అప్రమత్తంగా ఉండాలని ఎస్‌బీఐ అధికారులు చెబుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment