సాక్షి, న్యూఢిల్లీ : ఇటీవల బ్యాంక్ యూనియన్ల సమ్మెకు తోడు వరుస సెలవలతో ఐదు రోజులు బ్యాంకింగ్ సేవలకు అంతరాయం ఏర్పడటంతో ఖాతాదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఈ సమ్మె కష్టాలు మరువక ముందే వచ్చే ఏడాది జనవరి 8, 9 తేదీల్లో మరోసారి బ్యాంకు ఉద్యోగ సంఘాలు సమ్మెకు సన్నద్ధమవుతున్నాయి. ప్రభుత్వ రంగ యునైటెడ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు వ్యతిరేకంగా అఖిల భారత బ్యాంక్ ఉద్యోగుల సంఘం (ఏఐబీఈఏ), బ్యాంక్ ఉద్యోగుల సమాఖ్య (బీఈఎఫ్‌ఐ)లు బ్యాంకింగ్ పరిశ్రమకు సంబంధించిన అంశాలపై రెండు రోజుల సమ్మెకు పిలుపు ఇచ్చాయని యునైటెడ్ బ్యాంక్ నోటిఫికేషన్‌లో పేర్కొంది.
సమ్మె నేపథ్యంలో బ్యాంకు సేవలకు విఘాతం కలగకుండా అన్ని చర్యలు చేపడతామని తెలిపింది. సమ్మె యునైటెడ్ బ్యాంక్ వరకే పరిమితమా అన్ని ప్రభుత్వ రంగ బ్యాంకులకు వర్తిస్తుందా అనే దానిపై ఇంకా స్పష్టత లేదని అధికారులు వెల్లడించారు. ఇటీవల బ్యాంక్ ఉద్యోగుల సమ్మెతో బ్యాంకింగ్ సేవలు, ఏటీఎం విత్‌డ్రాయల్స్‌పై ప్రభావం చూపడంతో ఖాతాదారులు ఇబ్బందులు ఎదుర్కొన్న క్రమంలో జనవరి 8, 9 తేదీల్లో సమ్మె పిలుపుతో బ్యాంకింగ్ పనులను ఈలోగా పూర్తిచేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment