విజయ్ మాల్యా అడ్రస్ గల్లంతు!
సింగపూర్: వ్యాపార రంగంలో ప్రముఖంగా రాణించిన విలాసపురుషుడు, యూబీ గ్రూప్ చైర్మన్ విజయ్ మాల్యా ప్రస్తుత ఆర్థిక పరిస్థితి దారుణంగా ఉందనే విషయం తెలిసిందే. తాజాగా ప్రకటించిన 100 మందితో కూడిన భారత దేశ సంపన్న వ్యక్తుల ఫోర్బ్స్ జాబితా లో మాల్యా అడ్రస్ గల్లంతైంది. కింగ్ ఫిషర్ ఎయిర్ లైన్స్ అప్పుల ఊబిలో కూరుకుపోవడంతో మాల్యా ఉద్దేశ పూర్వక ఎగవేతదారుడి(డిఫాల్టర్)గా మారినట్టు బ్యాంకు ప్రకటించాయి.
2013లో ఫోర్బ్స్ విడుదల చేసిన జాబితాలో మాల్యా 800 మిలియన్ కోట్ల సంపదతో 84వ స్థానాన్ని ఆక్రమించారు. మాల్యాతోపాటు మరో 11 మంది సంపన్నులు ఈ జాబితాలో చోటు సంపాదించుకోలేకపోయారు. ఉద్దేశపూర్వకంగా రుణాల్ని ఎగవేసినందుకే జాబితాను తప్పించినట్టు ఫోర్బ్స్ వెల్లడించింది. మాల్యా మొత్తం 17 బ్యాంకులకు 7600 కోట్ల రూపాయలు బాకీ పడ్డారు.
ఇప్పటికే 200 కోట్ల విలువైన షేర్లను స్వాధీనం చేసుకోగా, మరికొన్ని ఆస్తులను స్వాధీనం చేసుకునే పనిలో ఉన్నారు. భూషణ్ స్టీల్ అధినే బ్రిజ్ భూషన్ సింఘల్ కుమారుడు ఓ కుంభకోణంలో అరెస్ట్ కావడంతో ఆయనను కూడా జాబితా నుంచి తప్పించామని ఫోర్బ్ తెలిపింది.