విజయ్ మాల్యా పాస్‌పోర్ట్‌తో కోర్టుకు రావాలి
విజయ్ మాల్యా పాస్‌పోర్ట్‌తో కోర్టుకు రావాలి
Published Tue, Sep 17 2013 4:13 AM | Last Updated on Fri, Sep 1 2017 10:46 PM
సాక్షి, బెంగళూరు: యూబీ హోల్డింగ్స్ లిమిటెడ్(యూబీహెచ్‌ఎల్) రుణదాతలు దాఖలు చేసిన పలు పిటిషన్లకు సంబంధించి కర్ణాటక హైకోర్టు సోమవారం యూబీ గ్రూపు సంస్థల అధిపతి విజయ్ మాల్యాకు హెచ్చరికలు జారీ చేసింది. మంగళవారం పాస్‌పోర్ట్‌తో కోర్టుకు హాజరు కావాలని ఆదేశించింది. లేనట్లయితే పాస్‌పోర్ట్‌ను స్వాధీనం చేసుకుంటామని హెచ్చరించారు. మాల్యా సారథ్యంలోని యూబీ హోల్డింగ్స్ లిమిటెడ్ నుంచి రూ.600 కోట్ల వరకు బకాయిలను రాబట్టుకోవడానికి రుణదాతలు అనేక పిటిషన్లను దాఖలు చేశారు. గతంలో వాటా విక్రయాలకు సంబంధించి మే 24లోగా ఆడిట్ నివేదికను కోర్టుకు సమర్పించాలన్న ఆదేశాలను మాల్యా పట్టించుకోకపోవడం... కోర్టు ధిక్కరణ కిందకు వస్తుందని రుణదాత సంస్థలు ప్రత్యేకంగా దాఖలు చేసిన అర్జీపై న్యాయమూర్తి విచారణ చేపట్టారు
Advertisement