UBHL
-
మాల్యాకు డీఆర్టీ మరో షాక్...
న్యూఢిల్లీ: బ్యాంకులకు వేల కోట్ల రూపాయల రుణాలు ఎగ్గొట్టి విదేశాలకు పారిపోయిన ఆర్థిక నేరస్తుడు, కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్ అధినేత విజయ్ మాల్యా యునైటెడ్ బ్రేవరీస్ హోల్డింగ్స్ (యూబీహెచ్ఎల్)కు చెందిన 74 లక్షల షేర్లను రూ. 1,008 కోట్లకు ఈడీ విక్రయించింది. ఈ మేరకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) బుధవారం మీడియాకు వెల్లడించింది. విజయ్ మాల్యాపై మనీ లాండరింగ్ విచారణలో భాగంగా ఈడీ ఈ షేర్లను అటాచ్ చేసిన సంగతి తెలిసిందే. ఈడీ అటాచ్‌లో ఉన్న ఈ షేర్లు డెబిట్ రికవరీ ట్రిబ్యునల్ (డీఆర్టీ)కు వెళ్లాయి. ఈ నెల తొలి వారంలోనే డీఆర్టీ ఆదేశించిన మేరకు యూబీహెచ్ఎల్కు చెందిన 74,04,932 షేర్లను విక్రయించింది. ఈడీ సమర్పించిన పత్రాలు, తీసుకున్న చర్యల ఆధారంగాను, ఎస్బీఐ కన్సార్టియంకు విజయ్ మాల్యా భారీమొత్తంలో రుణాలు బాకీ ఉన్న కారణంగాను ఈ షేర్లను అమ్మేందుకు అక్రమ నగదు రవాణా నిరోధక చట్టం (పీఎంఎల్ఏ) కోర్టు ఈనెల 26న అనుమతినిచ్చింది. దీంతో బుధవారం డీఆర్టీకి చెందిన రికవరీ అధికారి ఈ షేర్లను రూ. 1008 కోట్లకు విక్రయించారు. విజయ్ మాల్యా రుణాల రికవరీ ప్రక్రియలో ఇది తొలి ఘట్టమేనని, మరికొద్ది రోజుల్లో మిగిలినవి కూడా విక్రయిస్తామని డీఆర్టీ అధికారులు తెలిపారు. -

ఎట్టకేలకు నోరిప్పిన మాల్యా, ట్వీట్ల వర్షం
న్యూఢిల్లీ : కేంద్ర ప్రభుత్వం, బ్యాంకులు, దర్యాప్తు ఏజెన్సీలు తనపై ఎగవేతదారు ముద్ర వేశాయని తీవ్ర ఆరోపణలు గుప్పించిన లిక్కర్ కింగ్ విజయ్ మాల్యా.. తనకున్న ఆస్తులను అమ్ముకోనైనా బ్యాంకులకు బకాయిలు చెల్లించేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నానంటూ మంగళవారం చెప్పుకొచ్చారు. బ్యాంకులకు రుణపడిన రూ.13,900 కోట్ల బకాయిలను చెల్లించడానికి తన ఆస్తులను విక్రయించుకునేలా కోర్టు అనుమతి ఇవ్వాలని మంగళవారం కోరారు. అయితే ఇన్ని రోజులు బకాయిల చెల్లింపులపై ఎలాంటి ప్రకటన చేయకుండా స్తబ్ధుగా ఉన్న మాల్యా.. ఇప్పుడెందుకు నోరు విప్పాల్సి వచ్చిందో తెలుపుతూ బుధవారం మరో ట్వీట్ చేశారు. బుధవారం ఉదయం చేసిన ట్వీట్ లో ‘ఈ సమయంలోనే ప్రకటన చేయడానికి ఎందుకు ఎంచుకున్నారని చాలామంది అడుగుతున్నారు. నాకున్న సుమారు రూ.13,900 కోట్ల ఆస్తులను అమ్ముకునేందుకు 2018 జూన్ 22న కర్నాటక హైకోర్టు ముందు నేను, యూబీహెచ్ఎల్ కలిసి మా పిటిషన్ దాఖలు చేశాం. ఆ కారణంతోనే ఈ సమయంలో ప్రకటన చేస్తున్నా’ అని పేర్కొన్నారు. అదేవిధంగా తన మైక్రోబ్లాగింగ్ సైట్ ద్వారానే 2016లో ప్రధానికి, ఆర్థికమంత్రికి రాసిన లేఖను కూడా మాల్యా బహిర్గతం చేశారు. ఈ లేఖలో తాను ఉద్దేశ్యపూర్వక ఎగవేతదారుని కాదని పేర్కొన్నారు. బ్యాంకులకు బాకీ పడిన రుణాలను తిరిగి చెల్లించడానికి తనకు, యూబీహెచ్ఎల్కు అనుమతి ఇవ్వాలంటూ మాల్యా బుధవారం పలు ట్వీట్లు చేశారు. ఒకవేళ ఈడీ ఆస్తులను అమ్ముకోవడానికి నిరాకరిస్తే, తనకు వ్యతిరేకంగా ఏదో కుట్ర జరుగుతుందని తాను నమ్ముతానని అన్నారు. బ్యాంకులతో సెటిల్ చేసుకోవడానికి శతవిథాలా ప్రయత్నిస్తున్నానని తెలిపారు. రాజకీయ అంశాలను ఈ కేసులో తలదూర్చితే, అప్పుడు తానేం చేయలేనని కూడా చెప్పుకొచ్చారు. ఇలా బుధవారం మరోసారి మాల్యా తన మైక్రోబ్లాగింగ్ సైట్లో ట్వీట్ల వర్షం కురిపించారు. -
మాల్యాకు భారీషాక్: ఆ ఖాతాలన్నీ స్వాధీనం
సాక్షి,న్యూఢిల్లీ: భారీ పన్ను ఎగవేతదారుడు విజయమాల్యాకు మార్కెట్ రెగ్యులేటరీ సెబి మరోసారి భారీ షాక్ ఇచ్చింది. పెండింగ్ బకాయిల వసూళ్లలో భాగంగా మాల్యాకు చెందిన కీలక సంస్థ బ్యాంకు ఖాతాలను ఎటాచ్ చేసింది. ఈ మేరకు నవంబరు 13న విడుదల చేసిన అటాచ్మెంట్ నోటీసులో, మాల్యాకు ఎలాంటి చెల్లింపులు చేయరాదని సంబంధిత బ్యాంకులకు , సంస్థలకు ఆదేశాలు జారీ చేసింది. మాల్యా ఆధ్వర్యంలోని యునైటెడ్ బ్రేవరీస్ (హోల్డింగ్స్) లిమిటెడ్‌కు చెందిన అన్ని బ్యాంకు ఖాతాలు, డీమాంట్ ఖాతాలు, షేర్లను, మ్యూచువల్ ఫండ్ ఖాతాలను స్వాధీనం చేసుకోవాలని ఆదేశించింది. రూ.18.5 లక్షల మొత్తాన్ని తిరిగి పొందేలా వీటిని ఎటాచ్ చేసింది. యూబీహెచ్ల్ పై విధించిన జరిమానా చెల్లించడంలో విఫలం కావడంతో సెబీ ఈ నిర్ణయం తీసుకుంది. రూ. 15 లక్షల ప్రారంభ జరిమానా, రూ.3.5 లక్షల వడ్డీ, ఖర్చులు వెయ్యి రూపాయలతో సహా మొత్తం బకాయి రూ. 18.5 లక్షలుగా నిర్ణయించింది. కాగా 2015 లో, సెబీ కంపెనీ 15 లక్షల రూపాయల జరిమానా విధించింది. 2016 డిసెంబర్ నాటికి విజయ్ మాల్యాకు యునైటెడ్ బ్రూవరీస్ లో 7.91శాతం వ్యక్తిత వాటా ఉంది. వివిధ సంస్థల ద్వారా మొత్తంవాటా 52.34శాతం. -
ఫలితాలు ఇప్పుడే విడుదల చేయలేం
న్యూఢిల్లీ : ఓ వైపు యజమాని బ్యాంకులకు వేల కోట్ల రూపాయలను ఎగొట్టి తప్పించుకుని తిరుగుతున్నారు. మరోవైపు యూనిటైడ్ బేవరీస్ హోల్డింగ్ లిమిటెడ్(యూబీహెచ్ఎల్) ఆర్థిక సంవత్సర ఫలితాల విడుదల చేయలేమంటోంది. తమ గ్రూపు చైర్మన్ విజయ్ మాల్యా కేసుల నేపథ్యంలో ఫలితాల విడుదలకు తమకు జూలై వరకు గడువు కావాలని కోరుతోంది. అయితే 2015-16 ఆర్థిక సంవత్సరానికి చెందిన ఆడిటడ్ ఫలితాలను మే 31న విడుదలచేయాల్సి ఉంది. యూబీహెచ్ఎల్ గ్రూప్ లో ఒకటైన కింగ్ ఫిషర్ ఎయిర్ లైన్స్ వివిధ బ్యాంకులకు వేల కోట్ల రూపాయల రుణాన్ని ఎగొట్టిన సంగతి తెలిసిందే. వీటికి చైర్మన్ గా ఉన్న విజయ్ మాల్యా తప్పించుకుని విదేశాల్లో తిరుగుతున్నారు. అయితే కన్సార్టియం అధినేతగా ఉన్న ఎస్ బీఐకు సెటిల్ మెంట్ ఆఫర్ ను విజయ్ మాల్యా ప్రకటించి, సుప్రీంకోర్టు ముందు ఉంచినట్టు తన లేఖలో పేర్కొంది. వాయిదాల రూపంలో రుణాలను చెల్లిస్తామని ప్రకటించిన ఈ సెటిల్ మెంట్ ఆఫర్ ను ఎస్ బీఐ తిరస్కరించింది. మొత్తం రుణాలను వెంటనే చెల్లించాల్సిందేనని పేర్కొంది. దీనిపై ఏప్రిల్ 26న విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు, బెంగళూరు రుణ రికవరీ ట్రిబ్యూనల్ కు ఈ కేసును బదలాయించింది. రెండు నెలల్లో ఈ సెటిల్ మెంట్ ఆఫర్ పై ట్రిబ్యునల్ తీర్పు ప్రకటించింది. దీనిపై మొదటి విచారణ జూన్ 2న జరుగనుంది. ఈ అసాధారణ పరిస్థితుల్లో ఆర్థిక సంవత్సర ఫలితాలను విడుదలచేయలేమని, 60రోజుల వ్యవధిలో ఫలితాలు ప్రకటిస్తామని యూబీహెచ్ఎల్ అభ్యర్థిస్తోంది. అయితే సెబీ నిబంధనల మేరకు ప్రతి కంపెనీ ఆర్థికసంవత్సరం(మార్చి30కి) ముగిసిన 60రోజుల వ్యవధిలోనే వాటి ఫలితాలను సమర్పించాల్సి ఉంటుంది. -
విజయ్ మాల్యా పాస్‌పోర్ట్‌తో కోర్టుకు రావాలి
సాక్షి, బెంగళూరు: యూబీ హోల్డింగ్స్ లిమిటెడ్(యూబీహెచ్ఎల్) రుణదాతలు దాఖలు చేసిన పలు పిటిషన్లకు సంబంధించి కర్ణాటక హైకోర్టు సోమవారం యూబీ గ్రూపు సంస్థల అధిపతి విజయ్ మాల్యాకు హెచ్చరికలు జారీ చేసింది. మంగళవారం పాస్‌పోర్ట్‌తో కోర్టుకు హాజరు కావాలని ఆదేశించింది. లేనట్లయితే పాస్‌పోర్ట్‌ను స్వాధీనం చేసుకుంటామని హెచ్చరించారు. మాల్యా సారథ్యంలోని యూబీ హోల్డింగ్స్ లిమిటెడ్ నుంచి రూ.600 కోట్ల వరకు బకాయిలను రాబట్టుకోవడానికి రుణదాతలు అనేక పిటిషన్లను దాఖలు చేశారు. గతంలో వాటా విక్రయాలకు సంబంధించి మే 24లోగా ఆడిట్ నివేదికను కోర్టుకు సమర్పించాలన్న ఆదేశాలను మాల్యా పట్టించుకోకపోవడం... కోర్టు ధిక్కరణ కిందకు వస్తుందని రుణదాత సంస్థలు ప్రత్యేకంగా దాఖలు చేసిన అర్జీపై న్యాయమూర్తి విచారణ చేపట్టారు