సాక్షి,న్యూఢిల్లీ: భారీ పన్ను ఎగవేతదారుడు విజయమాల్యాకు మార్కెట్ రెగ్యులేటరీ సెబి మరోసారి భారీ షాక్ ఇచ్చింది. పెండింగ్ బకాయిల వసూళ్లలో భాగంగా మాల్యాకు చెందిన కీలక సంస్థ బ్యాంకు ఖాతాలను ఎటాచ్ చేసింది. ఈ మేరకు నవంబరు 13న విడుదల చేసిన అటాచ్‌మెంట్ నోటీసులో, మాల్యాకు ఎలాంటి చెల్లింపులు చేయరాదని సంబంధిత బ్యాంకులకు , సంస్థలకు ఆదేశాలు జారీ చేసింది.
మాల్యా ఆధ్వర్యంలోని యునైటెడ్ బ్రేవరీస్ (హోల్డింగ్స్) లిమిటెడ్‌కు చెందిన అన్ని బ్యాంకు ఖాతాలు, డీమాంట్ ఖాతాలు, షేర్లను, మ్యూచువల్ ఫండ్ ఖాతాలను స్వాధీనం చేసుకోవాలని ఆదేశించింది. రూ.18.5 లక్షల మొత్తాన్ని తిరిగి పొందేలా వీటిని ఎటాచ్ చేసింది. యూబీహెచ్‌ల్ పై విధించిన జరిమానా చెల్లించడంలో విఫలం కావడంతో సెబీ ఈ నిర్ణయం తీసుకుంది. రూ. 15 లక్షల ప్రారంభ జరిమానా, రూ.3.5 లక్షల వడ్డీ, ఖర్చులు వెయ్యి రూపాయలతో సహా మొత్తం బకాయి రూ. 18.5 లక్షలుగా నిర్ణయించింది.
కాగా 2015 లో, సెబీ కంపెనీ 15 లక్షల రూపాయల జరిమానా విధించింది. 2016 డిసెంబర్ నాటికి విజయ్ మాల్యాకు యునైటెడ్ బ్రూవరీస్ లో 7.91శాతం వ్యక్తిత వాటా ఉంది. వివిధ సంస్థల ద్వారా మొత్తంవాటా 52.34శాతం.
Comments
Please login to add a commentAdd a comment