విజయ్ మాల్యాపై సీబీఐ దాడులు | CBI raids Vijay Mallya's defunct Kingfisher Airlines | Sakshi
Sakshi News home page

విజయ్ మాల్యాపై సీబీఐ దాడులు

Published Sat, Oct 10 2015 4:33 PM | Last Updated on Thu, Jul 18 2019 2:26 PM

విజయ్ మాల్యాపై సీబీఐ దాడులు - Sakshi

విజయ్ మాల్యాపై సీబీఐ దాడులు

న్యూఢిల్లీ: లిక్కర్ కింగ్ విజయ్ మాల్యా ఇళ్లు, ఆయనకు చెందిన దివాళా తీసిన కింగ్ఫిషర్ ఎయిర్లైన్స్ సంస్థపై కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) శనివారం దాడులు జరిపింది. కింగ్ఫిషర్ ఎయిర్లైన్స్కు నెగెటివ్ క్రెడిట్ రేటింగ్స్ ఉన్నా.. ఆ సంస్థకు ఐడీబీఐ బ్యాంకు నుంచి భారీమొత్తం రూ. 950 కోట్ల రుణం ఇచ్చిన వ్యవహారంపై సీబీఐ దర్యాప్తు జరుపుతున్నది. గత ఏడాది వెలుగులోకి వచ్చిన ఈ ఎన్పీఏ మోసంపై సీబీఐ విచారణ జరుపుతున్నది.

పలు ప్రైవేటు కంపెనీలకు ప్రభుత్వ రంగం బ్యాంకులు భారీమొత్తంలో రుణాలు ఇవ్వడంలో అవకతవకలను వెలికితీయడానికి ప్రయత్నిస్తున్న సీబీఐ బృందాలు ఇందులో భాగంగానే మాల్యా నివాసాలు, కార్యాలయాల్లో సోదాలు నిర్వహించాయి. రుణమోసం వ్యవహారంపై ఇప్పటికే ఎఫ్ఐఆర్ నమోదుచేసిన సీబీఐ త్వరలోనే విజయ్ మాల్యాను కూడా ప్రశ్నించే అవకాశముందని తెలుస్తున్నది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement